నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

రిపోర్ట్‌లు

మీ రిపోర్ట్ డేటాను ఫిల్టర్ చేయండి

కొలమానాలు అలాగే విభజనలతో పాటు ఫిల్టర్‌లు అనేవి మీ రిపోర్ట్‌లలో ఎటువంటి డేటా కనిపిస్తుందో నిర్ణయిస్తాయి. మీ రిపోర్టింగ్ డేటాను అర్థం చేసుకోవడానికి, ట్రెండ్‌లను కనుగొనడానికి, ఇంకా మీకు బాగా అవసరమైన సమాచారాన్ని పొందడానికి అవి మీకు సహాయపడతాయి. ఉదాహరణకు, పేర్కొన్న తేదీల పరిధిలో నిర్దిష్ట యాడ్ యూనిట్‌లను, దేశాలను, లేదా యాడ్ ఫార్మాట్‌లను చూడటానికి మీరు ఫిల్టర్‌లను ఉపయోగించవచ్చు. మీ డేటాను మరింత శుద్ధి చేయడానికి మీరు మీ రిపోర్ట్‌లకు పలు ఫిల్టర్‌లను జోడించవచ్చు.

ఫిల్టర్‌లు ఏమి చేస్తాయి?

ఫిల్టర్‌లు, మీ రిపోర్ట్‌ల నుండి అనవసరమైన లేదా అవాంఛిత డేటాను దాచిపెడతాయి. మీరు ఫిల్టర్‌ను జోడించినప్పుడు, మీరు మీ రిపోర్ట్‌లో ఏమి చూడాలనుకుంటున్నారో పేర్కొంటున్నారు, తద్వారా ఫిల్టర్‌లలోని ప్రమాణాలకు మ్యాచ్ కాని వాటన్నింటిని AdSense దాచిపెడుతుంది.

రిపోర్ట్‌లో ఫిల్టర్‌లు ఎక్కడ ఉంటాయి?

మీ రిపోర్ట్‌లో చార్ట్ పైన ఉన్న ఫిల్టర్ బాక్స్‌లో మీరు ఫిల్టర్‌లను జోడించవచ్చు, తీసివేయవచ్చు, అలాగే వాటిని సర్దుబాటు చేయవచ్చు. మీరు ఫిల్టర్‌ను జోడించినప్పుడు, అదే రిపోర్ట్‌లోని చార్ట్‌కు, టేబుల్‌కు అది వర్తింపజేయబడుతుంది.

మీ డేటా ఫీల్డ్‌ను సెర్చ్ లేదా ఫిల్టర్ చేయడానికి సంబంధించిన ఉదాహరణ.

ఫిల్టర్‌ను జోడించండి

  1. మీ రిపోర్ట్‌ను చూస్తున్నప్పుడు, 'ఫిల్టర్ ఫిల్టర్ చేయి'ను క్లిక్ చేయండి.
  2. డ్రాప్-డౌన్ లిస్ట్‌‌లో విభజనను క్లిక్ చేయండి.
  3. మీరు ఫిల్టర్ చేయాలనుకునే ఐటెమ్‌లను ఎంచుకోండి.
  4. 'వర్తింపజేయి' ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
చిట్కా: ఏదైనా ఐటెమ్‌తో ఫిల్టర్‌ను రూపొందించడానికి, ఫిల్టర్ బాక్స్‌లో ఆ ఐటెమ్ పేరును టైప్ చేసి మీరు దాని కోసం వెతకవచ్చు.

ఫిల్టర్‌ను మార్చండి

  1. మీ రిపోర్ట్‌ను చూస్తున్నప్పుడు, మీరు మార్చాలనుకుంటున్న ఫిల్టర్‌ను క్లిక్ చేయండి.
  2. మీ ఫిల్టర్‌కు జోడించాలనుకునే లేదా ఫిల్టర్ నుండి మీరు తీసివేయాలనుకునే ఐటెమ్‌లను ఎంచుకోండి.
  3. 'వర్తింపజేయి' ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఫిల్టర్‌ను తీసివేయండి

ఒక్క ఫిల్టర్‌ను తీసివేయడానికి, మీరు తీసివేయాలనుకునే ఫిల్టర్‌కు పక్కన 'తీసివేయి తీసివేయి' ఆప్షన్‌ను క్లిక్ చేయండి. రిపోర్ట్ నుండి అన్ని ఫిల్టర్‌లను తీసివేయడానికి, ఫిల్టర్ బాక్స్ చివర 'అన్ని ఫిల్టర్‌లను తీసివేయి తీసివేయండి' ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14760291136319497590
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false