Google అడ్వర్టయిజింగ్, కొలమానం ప్రోడక్ట్‌ల కోసం అనేక ఒప్పందాలు, సర్వీస్ నియమాలు, పాలసీలు "వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం" (PII)ని సూచిస్తాయి. ఇది EU జనరల్ డేటా రక్షణ నియంత్రణ చట్టం (GDPR) "వ్యక్తిగత డేటా"గా రెఫర్ చేసే డేటా కాకుండా వేరే కేటగిరీకి చెందిన డేటా.
ఏదైనా డేటా PIIలో భాగం కాదని Google పరిగణించినప్పటికీ, అది GDPR ప్రకారం వ్యక్తిగత డేటాగా, లేదా వర్తించే US-రాష్ట్ర నివాసులకు వివిధ హక్కులను కల్పించే అనేక చట్టాలలో దేని ప్రకారం అయినా వ్యక్తిగత సమాచారంగా పరిగణించబడవచ్చని, అందువల్ల ఈ చట్టాలకు లోబడి ఉండవచ్చని దయచేసి గమనించండి.
మీ ప్రస్తుత ఒప్పందంలో లేదా వర్తించే ప్రోడక్ట్‌కు సంబంధించిన సర్వీస్ నియమాలలో లేదా పాలసీలలో PII నిర్వచించబడనప్పుడు, PII అనే పదాన్ని Google ఎలా అర్థం చేసుకుంటుందో ఈ ఆర్టికల్ వివరిస్తుంది. కస్టమర్‌లలో గందరగోళాన్ని తగ్గించడంతో పాటు GDPR, CPRA, ఇంకా ఇతర గోప్యతా చట్టాల ప్రకారం వ్యక్తిగత డేటా లేదా వ్యక్తిగత సమాచారం అనే కాన్సెప్ట్‌ల నుండి PIIని వేరు చేయడానికి ఇది ఉద్దేశించబడింది.
Googleకు సంబంధించినంత వరకు PII అంటే ఏమిటి
అదనపు ప్రాసెసింగ్ అవసరం లేకుండా ఏదైనా సమాచారం ద్వారా ఎవరైనా ఒక వ్యక్తిని నేరుగా గుర్తించడం, సంప్రదించడం లేదా ఖచ్చితంగా లొకేట్ చేయడం సాధ్యపడితే, అటువంటి సమాచారాన్ని PIIగా Google పరిగణిస్తుంది. అందులో ఇవి ఉంటాయి:
- ఈమెయిల్ అడ్రస్‌లు
- పోస్టల్ అడ్రస్‌లు
- ఫోన్ నంబర్‌లు
- ఖచ్చితమైన లొకేషన్‌లు (GPS నిరూపకాలు - కానీ కింది గమనికను చూడండి)
- పూర్తి పేర్లు లేదా యూజర్‌నేమ్‌లు
ఉదాహరణకు, మీరు ఒక పబ్లిషర్ అయ్యి ఉండి, Googleకు PIIని పంపడాన్ని నిషేధించే ఒప్పందంలో భాగమైనట్లయితే, మీ వెబ్‌సైట్‌లోని పేజీలలో Google ద్వారా యాడ్‌లు ప్రదర్శించబడే వాటికి చెందిన URLలలో తప్పనిసరిగా ఈమెయిల్ అడ్రస్‌లు ఉండకూడదు, ఎందుకంటే ఆ URLలు ఏదైనా యాడ్ రిక్వెస్ట్‌లో Googleకు పంపబడతాయి. Google తన PII నిషేధాన్ని చాలా కాలంగా ఈ విధంగా వివరించింది.
Google PII వివరణలో వీటిని మినహాయిస్తుంది, ఉదాహరణకు:
- మారు పేరు కుక్కీ IDలు
- మారు పేరు అడ్వర్టయిజింగ్ IDలు
- IP అడ్రస్‌లు
- ఇతర మారు పేరు ఎండ్ యూజర్ ఐడెంటిఫయర్‌లు
ఉదాహరణకు, ఏదైనా యాడ్ రిక్వెస్ట్‌తో పాటు IP అడ్రస్ పంపబడితే (ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ పర్యవసానంగా దాదాపు ఏ యాడ్ రిక్వెస్ట్‌ల విషయంలో అయినా ఇది జరుగుతుంది), ఆ బదిలీ, Googleకు PIIని పంపడానికి సంబంధించి ఎలాంటి నిషేధాన్నీ ఉల్లంఘించదు.
ఏదైనా డేటా PIIలో భాగం కాదని Google పరిగణించినప్పటికీ, అది GDPR, ఇంకా ఇతర గోప్యతా చట్టాల ప్రకారం వ్యక్తిగత డేటా లేదా వ్యక్తిగత సమాచారంగా పరిగణించబడవచ్చని గమనించండి. ఆ చట్టాల ప్రకారం వ్యక్తిగత డేటా లేదా వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఒప్పంద నిబంధనలను గానీ లేదా పాలసీలను గానీ ఈ ఆర్టికల్ ప్రభావితం చేయదు.