నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

గోప్యత, భద్రత

యూజర్ రూపొందించిన కంటెంట్‌ను మేనేజ్ చేయడానికి ఉత్తమ వ్యూహాలు

యూజర్ రూపొందించిన కంటెంట్ అనేది ప్రపంచంలో ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా రావచ్చు. మీ సైట్ లేదా యాప్‌నకు వచ్చే సందర్శకులు పెరుగుతున్న కొద్దీ, ఏ ఒక్క వ్యక్తి అయినా రివ్యూ చేయగల దానికంటే ఎక్కువ మోతాదులో యూజర్ రూపొందించిన కంటెంట్‌ను సబ్‌మిట్ చేయడం మీరు గమనించవచ్చు.

మేము సూచించే కొన్ని వ్యూహాలను, పరిష్కారాలను ఇక్కడ అందించాము:

కంటెంట్ పాలసీని పబ్లిష్ చేయండి: మీ యూజర్‌ల నుండి మీరు ఏమి ఆశిస్తున్నారో వారికి తెలియజేయండి
కంటెంట్ పాలసీని రాసి, పబ్లిష్ చేయండి, తద్వారా ఏది అనుమతించబడుతుంది, ఏది అనుమతించబడదు అనేది మీ యూజర్‌లకు తెలుస్తుంది.
యూజర్ రూపొందించిన కంటెంట్ ఉన్న ఏదైనా పేజీని మానిటైజ్ చేసే ముందు, రిస్క్‌ను జాగ్రత్తగా అంచనా వేయండి
మీ సైట్ లేదా యాప్‌లో, యూజర్ రూపొందించిన కంటెంట్ ఎక్కడ కనిపించవచ్చు, అలాగే యూజర్ రూపొందించిన హానికరమైన కంటెంట్ వల్ల మీ సైట్ లేదా యాప్ ప్రతిష్టకు ఎలాంటి రిస్క్‌లు ఏర్పడతాయి అనే వాటిని పరిగణించండి. యూజర్ రూపొందించిన కంటెంట్ కనిపించేలా ఎనేబుల్ చేసే ముందు, మీరు ఆ రిస్క్‌లను తగ్గించేలా చూసుకోండి.
యూజర్ రూపొందించిన కంటెంట్ ఉన్న మీ ప్రముఖ పేజీలను తరచుగా రివ్యూ చేయండి
యూజర్ రూపొందించిన కంటెంట్ ఉన్న మీ ప్రముఖ పేజీలను క్రమం తప్పకుండా రివ్యూ చేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి. మీకు కనిపించే కంటెంట్ అంతా మా ప్రోగ్రామ్ పాలసీలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.
యూజర్ రూపొందించిన కంటెంట్‌కు "ఉల్లంఘనను రిపోర్ట్ చేయండి" అనే లింక్‌ను జోడించడం ద్వారా మీ యూజర్‌ల సహాయాన్ని కోరండి
యూజర్ రూపొందించిన కంటెంట్‌లోని ప్రతి ఎలిమెంట్ పక్కన, "ఫ్లాగ్ చేయండి" లేదా "ఉల్లంఘనను రిపోర్ట్ చేయండి" అనే లింక్‌ను జోడించండి, మీ యూజర్‌లు దానిని ఉపయోగించి, సమస్యాత్మకంగా మారే అవకాశమున్న కంటెంట్‌ను మీకు రిపోర్ట్ చేయవచ్చు. మీరు ఆ రిపోర్ట్‌లను క్రమం తప్పకుండా రివ్యూ చేసి, చర్యలు తీసుకునేలా చూసుకోండి.
బాట్‌లను అడ్డుకోవడానికి, కంటెంట్‌ను సబ్‌మిట్ చేయడంలో భాగంగా క్యాప్చాను ఉపయోగించండి
యూజర్‌లు కంటెంట్‌ను సబ్‌మిట్ చేసే ముందు, క్యాప్చాను ఉపయోగించడం ద్వారా, వారు బాట్‌లు కాదని, మనుషులేనని నిర్ధారించుకోండి. Google reCAPTCHA అనేది ఒక ప్రముఖ సిస్టమ్.
విశ్వసనీయ యూజర్‌లకు సంబంధించి వివిధ స్థాయిలను క్రియేట్ చేయండి
సైట్ లేదా యాప్‌లో ముందెన్నడూ కంటెంట్‌ను సబ్‌మిట్ చేయని కొత్త యూజర్‌ల విషయంలో, వారు సబ్‌మిట్ చేసిన కంటెంట్‌ను అనుమతించే ముందు దానిని రివ్యూ చేయండి. యూజర్‌లు, వారి విశ్వసనీయతను రుజువు చేసిన కొద్దీ, వారి పోస్ట్‌లు కనిపించడానికి అనుమతించి, మీకు వారి పట్ల ఉన్న నమ్మకాన్ని పెంచుకోండి.

మరొక విధంగా, మీరు విశ్వసించని యూజర్‌లు సబ్‌మిట్ చేయగల కంటెంట్ రకాలను పరిమితం చేయండి; ఉదా., టెక్స్ట్‌ను అనుమతించండి, కానీ ఇమేజ్‌లను, లింక్‌లను అనుమతించవద్దు.

యూజర్-మోడరేటర్‌లను నియమించండి
మీ సైట్ లేదా యాప్‌నకు వచ్చే సందర్శకులు పెరుగుతున్న కొద్దీ, దాని చుట్టూ ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. ఈ కమ్యూనిటీలోని యూజర్‌లు మీ సైట్ లేదా యాప్‌ను ఉపయోగిస్తారు కాబట్టి, వారు మీ సైట్ లేదా యాప్ అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. కంటెంట్‌ను రివ్యూ చేయడానికి, అలాగే కమ్యూనిటీ సంభాషణల విషయంలో ఉన్నత స్టాండర్డ్‌లను నిర్వహించడంలో మీకు సహాయపడేందుకు యూజర్-మోడరేటర్‌లను నియమించుకోండి.

మీ సైట్ లేదా యాప్‌లోని 'యూజర్ రూపొందించిన కంటెంట్‌ను' రివ్యూ చేయడానికి, మీరు మానవ కంటెంట్ రివ్యూవర్‌లను లేదా మోడరేటర్‌లను కూడా నియమించవచ్చు.

పోస్ట్‌ను రివ్యూ చేసేంత వరకు యాడ్‌లను అందించడాన్ని డిజేబుల్ చేయండి
ఏదైనా పోస్ట్‌ను ఇంకా రివ్యూ చేసి, ఆమోదించి ఉండకపోతే, అది కనిపించడానికి అనుమతిని ఇవ్వండి, అయితే, ఆ పేజీలో యాడ్‌లను అందించడాన్ని డిజేబుల్ చేయండి. ఏదైనా పోస్ట్ మా ప్రోగ్రామ్ పాలసీలకు అనుగుణంగా ఉందని మీరు నిర్ధారించినప్పుడు మాత్రమే యాడ్‌లను అందించడాన్ని ఎనేబుల్ చేయండి.
ఆటోమేటిక్ కంటెంట్ ఫిల్టరింగ్ సిస్టమ్‌ను బిల్డ్ చేయండి లేదా ఉపయోగించండి
మీ సైట్ లేదా యాప్‌లో తరచుగా ఎటువంటి కంటెంట్ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయో మీరు తెలుసుకునే కొద్దీ, ఆ ఉల్లంఘనలను ఆటోమేటిక్‌గా గుర్తించి, అటువంటి కంటెంట్‌లో యాడ్‌లను అందించడాన్ని డిజేబుల్ చేయడానికి మీరు కంటెంట్ ఫిల్టరింగ్ సిస్టమ్‌ను రూపొందించవచ్చు. కంటెంట్ ఫిల్టరింగ్ గురించి మరింత తెలుసుకోండి.
కామెంట్ చేయడానికి థర్డ్-పార్టీ టూల్స్ లేదా ప్లగ్-ఇన్‌లను ఉపయోగించండి
మీ స్వంతంగా ఇన్-హౌస్ కామెంట్ చేసే సిస్టమ్‌ను బిల్డ్ చేయడానికి బదులుగా, మీ కోసం కామెంటింగ్‌ను రన్ చేయడానికి మీరు ప్రముఖ థర్డ్-పార్టీ టూల్స్ లేదా ప్లగ్-ఇన్‌లను ఉపయోగించవచ్చు. వీటిలో చాలా సిస్టమ్‌లు పటిష్టమైన మోడరేషన్ అలాగే కంటెంట్ ఫిల్టరింగ్ విధానాలను కలిగి ఉంటాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
ఎదగగల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

విలువైన AdSense గణాంకాలను మిస్ చేసుకోకండి. మీ నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగల పనితీరు రిపోర్ట్‌లను, వ్యక్తిగతీకరించిన చిట్కాలను, వెబినార్ ఆహ్వానాలను అందుకోవడానికి సమ్మతించండి

సమ్మతించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9214977794389929848
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false