నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

చెక్కు ద్వారా పేమెంట్స్ అందుకోవడం

మీ లొకేషన్‌ను బట్టి, మీరు మీ AdSense పేమెంట్‌లను చెక్కు ద్వారా అందుకోవచ్చు. చెక్కులు ఎలా పంపించబడతాయి, చెక్కుల ద్వారా నగదు పొందడం ఎలా అనే విషయాలను గురించి కింద మరింత తెలుసుకోండి.

ఈ పేజీలో ఇవి ఉన్నాయి

నేను నా చెక్కు ద్వారా నగదును ఎక్కడ పొందగలను?

ఒక బ్యాంక్ పాలసీ మరియు మరొక బ్యాంక్ పాలసీ మధ్య తేడా ఉంటుంది, కనుక నిర్దిష్ట బ్యాంక్ మీ AdSense చెక్కులను ఆమోదిస్తుందో లేదో మేము ఖచ్చితంగా చెప్పలేము. చెక్కు పేమెంట్స్ అన్నీ Citibank ద్వారా జారీ చేయబడతాయి. మీకు చెక్కులు U.S. డాలర్‌లలో అంది ఉంటే, దయచేసి Citibankతో ప్రాతినిధ్య సంబంధం ఉందో లేదో మీ బ్యాంక్‌ను అడగండి. మా U.S. డాలర్ చెక్కులను ప్రాసెస్ చేయడానికి ఈ సంబంధం అవసరం. Google AdSense చెక్కులు కేవలం డిపాజిట్ కోసం మాత్రమేనని, వాటి నుండి నగదు పొందడం సాధ్యం కాదని దయచేసి గమనించండి.

అదనంగా, ఏదైనా చెక్కును క్లియర్ చేయడానికి వివిధ బ్యాంకులు తరచుగా వేర్వేరు సమయాన్ని తీసుకుంటాయని దయచేసి గుర్తుంచుకోండి. మరింత సమాచారం కోసం నేరుగా మీ బ్యాంక్‌ను సంప్రదించాల్సిందిగా మేము సూచిస్తున్నాము.

డెలివరీ ఆప్షన్‌లు

అన్ని చెక్కులు స్టాండర్డ్ డెలివరీ ద్వారా పంపబడతాయి. సాధారణంగా మెయిల్ చేసిన తేదీ తర్వాత దాదాపు 2-4 వారాలకు పబ్లిషర్‌లు వారి చెక్కులను అందుకుంటారు. అయితే, మీ లొకేషన్ ఆధారంగా తపాలా సేవ వారు ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు.

దిగువ లిస్ట్ చేయబడిన దేశాలకు పంపిన స్టాండర్డ్ డెలివరీ పేమెంట్స్ లోకల్ కొరియర్ సర్వీస్ ద్వారా మెయిల్ చేయబడతాయి. ఈ పద్ధతిలో పంపిన మెయిలింగ్ పేమెంట్స్‌కు ఛార్జీ విధించబడదు, చెక్కు తేదీ నుండి 10-30 రోజులలోపు పేమెంట్స్ వస్తాయని మేము అంచనా వేస్తున్నాము.

  • అర్జెంటీనా
  • బొలీవియా
  • చిలీ
  • కొలంబియా
  • ఈక్వెడార్
  • మెక్సికో
  • పరాగ్వే
  • ఉరుగ్వే
  • వెనిజులా

లాటిన్ అమెరికాలోని ఎంపిక చేసిన (పైన లిస్ట్ చేయబడినవి) దేశాలలో AdSense పబ్లిషర్‌లు పేమెంట్స్‌ను అదనపు ఛార్జీ లేకుండా లోకల్ కొరియర్ సర్వీస్ Ocasaలో స్టాండర్డ్ డెలివరీ ద్వారా అందుకుంటారు. Ocasa చెక్కు పేమెంట్స్ కోసం ట్రాకింగ్ నంబర్‌లు అందుబాటులో లేవు.

గమనిక: మీ చెక్కు డెెలివరీ అడ్రస్ అనేది తప్పనిసరిగా మీ పేమెంట్ సెట్టింగ్‌లలో ఉన్న అడ్రస్‌లోని దేశంలోనే ఉండాలి. వివిధ దేశాలలో చెక్కులను డెలివరీ చేయడం సాధ్యపడదు.

చెక్కును నగదుగా మార్చుకోవడానికి గడువు తేదీ

మీరు 60 రోజుల తర్వాత మీ చెక్కును అందుకోకుంటే, మీరు మీ AdSense ఖాతా నుండి నేరుగా కొత్త చెక్కును మళ్లీ జారీ చేయవచ్చు. ఒరిజినల్ పేమెంట్ తేదీ, ప్రస్తుత స్టేటస్‌ను చూడటానికి మీ "లావాదేవీలు" పేజీకి వెళ్లండి. 60 రోజుల తర్వాత కూడా మీ చెక్కు నుండి నగదును పొందకుంటే, మీ "లావాదేవీలు" పేజీలో మీ చెక్కు స్టేటస్ పక్కన "పేమెంట్‌ను మళ్లీ జారీ చేయండి" లింక్ కనిపిస్తుంది. పేమెంట్‌ను మళ్లీ జారీ చేయండి లింక్‌ను క్లిక్ చేయండి, కొద్దిసేపటి తర్వాత చెక్కు ఆపివేయబడిందని, మీ రీఫండ్ ప్రోగ్రెస్‌లో ఉందని చూపించే కొత్త లైన్ ఐటెమ్ కనిపిస్తుంది.

మీరు చెక్కును జారీ చేసినప్పటి నుండి 60 రోజుల కంటే ఎక్కువ కాలం గడిచినట్లయితే మాత్రమే దాన్ని మళ్లీ జారీ చేయగలరు.

మీరు మీ చెక్కును జారీ చేసిన తర్వాత 12 నెలలలోపు దాన్ని డిపాజిట్ చేయకుంటే, మీ ఆదాయం తిరిగి మీ ఖాతాలో క్రెడిట్ చేయబడుతుంది, మీ పేమెంట్స్ హోల్డ్‌లో ఉంచబడతాయి.

గడువు ముగిసిన చెక్కుకు సంబంధించి మీ పేమెంట్స్ హోల్డ్‌లో ఉన్నాయి

గడువు ముగిసిన చెక్కుకు సంబంధించి మీ పేమెంట్స్ హోల్డ్‌లో ఉంచిన తర్వాత, మీ పేమెంట్ సెట్టింగ్‌లకు వెళ్లి, మీ చెక్కు డెలివరీ అడ్రస్‌ను అప్‌డేట్ చేయండి. మీరు మీ డెలివరీ అడ్రస్‌ను అప్‌డేట్ చేసినా చేయకపోయినా, మీరు పేమెంట్ విడ్జెట్ చెక్కు ఫారమ్‌లోని 'రీ-ఎనేబుల్' బటన్‌ను క్లిక్ చేయాలి (లేదా కొత్త పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి). మీరు మీ పేమెంట్ ఆప్షన్‌ను ఎడిట్ చేసిన తర్వాత మరియు/లేదా రీ-ఎనేబుల్ చేసిన తర్వాత, మీ పేమెంట్ హోల్డ్ తీసివేయబడుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
ఎదగగల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

విలువైన AdSense గణాంకాలను మిస్ చేసుకోకండి. మీ నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగల పనితీరు రిపోర్ట్‌లను, వ్యక్తిగతీకరించిన చిట్కాలను, వెబినార్ ఆహ్వానాలను అందుకోవడానికి సమ్మతించండి

సమ్మతించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5286735741731472719
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false