మీరు మెసేజ్‌లు బిల్డ్ చేస్తున్నప్పుడు లేదా తర్వాత ఎప్పుడైనా వాటి టెక్స్ట్, ఫార్మాట్ ఎలిమెంట్స్‌ను మార్చవచ్చు. మెసేజ్ ఫార్మాట్‌ను అనుకూలీకరించండి, తద్వారా మెసేజ్‌లు మీ సైట్‌ల రూపానికి, అనుభూతికి సరిపోతాయి.
మెసేజ్ టెక్స్ట్‌ను ఎడిట్ చేయడం
మెసేజ్‌లోని ఆటోమేటిక్ సెట్టింగ్ టెక్స్ట్ ప్రధానంగా మీ సైట్ లేదా యాప్ పేరు మీద ఆధారపడి ఉంటుంది. టెక్స్ట్‌లో అధిక భాగాన్ని ఎడిట్ చేయవచ్చు.
- గోప్యత & మెసేజింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- గోప్యత & మెసేజింగ్ పేజీలో మెసేజ్ రకం కార్డ్‌లలో ఒక దానికి సంబంధించిన మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మెసేజ్‌ల లిస్ట్‌లో, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న మెసేజ్ అడ్డు వరుసలో ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న మెసేజ్ స్క్రీన్‌ను ఎంచుకోండి.
- మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్‌ను క్లిక్ చేయండి (ఉదాహరణకు, బాడీ టెక్స్ట్ లేదా బటన్ టెక్స్ట్) అలాగే కావలసిన మార్పులు చేయండి.
-
సైట్ పేరు కోసం ప్లేస్‌హోల్డర్‌గా (ఆప్షనల్) సైట్ పేరు మ్యాక్రో స్ట్రింగ్‌ను (
%%SITE_NAME%%
ఇన్‌సర్ట్ చేయండి). ఒక మెసేజ్ పలు సైట్‌లలో ప్రదర్శించబడేలా కాన్ఫిగర్ చేయబడినప్పుడు, సైట్ పేరు మ్యాక్రో స్ట్రింగ్ అనేది ప్రస్తుతం మెసేజ్‌ను చూస్తున్న సైట్ పేరుతో లేదా సైట్ పేరు సెట్ చేయనట్లయితే సైట్ URLతో రీప్లెస్ చేయబడుతుంది.మీరు మెసేజ్‌ను ఎడిట్ చేస్తున్నప్పుడు సైట్ పేరును జోడించడానికి లేదా మార్చడానికి:
- "మీ సైట్‌ల" లిస్ట్ కింద కింది వైపు బాణం గుర్తును క్లిక్ చేయండి. "మీ సైట్‌లను ఎంచుకోండి" పేజీ తెరుచుకుంటుంది.
- సైట్ పేరును ఎడిట్ చేయడానికి క్లిక్ చేయండి, లేదా మునుపు పేరు లేని సైట్‌కు పేరును జోడించడానికి సైట్ పేరును జోడించండి క్లిక్ చేయండి.
- సేవ్ చేయండి నిర్ధారించండి క్లిక్ చేయండి.
మెసేజ్ డిస్‌ప్లే అయినప్పుడు సైట్ పేరు మ్యాక్రో స్ట్రింగ్‌ను రీప్లేస్ చేయడానికి కొత్త సైట్ పేరు ఉపయోగించబడుతుంది.
- ఈ మెసేజ్ కోసం ఉపయోగించడానికి ఆటోమేటిక్ సెట్టింగ్ భాషను ఎంచుకోండి. మీ యూజర్ పరికర భాషను మేము నిర్ణయించలేకపోతే, లేదా యూజర్ పరికరం పేర్కొన్న భాషలో ఈ మెసేజ్ అందుబాటులో లేకపోతే, మెసేజ్ ఆటోమేటిక్ సెట్టింగ్ భాషలో ప్రదర్శించబడుతుంది.
- (ఆప్షనల్) అదనపు భాషలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి, మీరు మీ మెసేజ్‌ను ప్రదర్శించాలనుకుంటున్న ఏవైనా అదనపు భాషలను ఎంచుకోండి.
- (ఆప్షనల్) అదనపు మెసేజ్ ఆప్షన్‌లను ఎంచుకోండి:
- ఐరోపా నియంత్రణ చట్టాల మెసేజ్‌లు: యూజర్ సమ్మతి ఆప్షన్‌లను ఎంచుకోండి. ఇవి, మీ మెసేజ్ ప్రదర్శించబడినప్పుడు యూజర్‌లు ఎంచుకోగల ఆప్షన్‌లు. కింది ఆప్షన్‌ల కాంబినేషన్‌లు అందుబాటులో ఉన్నాయి:
- సమ్మతించండి లేదా ఆప్షన్‌లను మేనేజ్ చేయండి
- సమ్మతించండి, సమ్మతించవద్దు, లేదా ఆప్షన్‌లను మేనేజ్ చేయండి
- ఐరోపా నియంత్రణ చట్టాల మెసేజ్‌లు: యూజర్ సమ్మతి ఆప్షన్‌లను ఎంచుకోండి. ఇవి, మీ మెసేజ్ ప్రదర్శించబడినప్పుడు యూజర్‌లు ఎంచుకోగల ఆప్షన్‌లు. కింది ఆప్షన్‌ల కాంబినేషన్‌లు అందుబాటులో ఉన్నాయి:
- (ఆప్షనల్) మీ మెసేజ్‌కు మూసివేసే చిహ్నాన్ని జోడించడానికి మూసివేయండి (సమ్మతించవద్దు) చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి. యూజర్‌లు మీ యాడ్ పార్ట్‌నర్‌లకు, వారి ప్రయోజనాలకు సంబంధించిన మెసేజ్‌ను విస్మరించడానికి, సమ్మతించకుండా ఉండటానికి మూసివేత చిహ్నాన్ని క్లిక్ చేయవచ్చు.
- మెసేజ్‌ను అప్‌డేట్ చేయడానికి పబ్లిష్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మెసేజ్ ఎలిమెంట్‌లను ఫార్మాట్ చేయడం
మెసేజ్ ఎలిమెంట్‌కు సంబంధించిన ఫార్మాట్‌ను మార్చడానికి కింది దశలను పూర్తి చేయండి:
- మీ AdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- గోప్యత & మెసేజింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- గోప్యత & మెసేజింగ్ పేజీలో మెసేజ్ రకం కార్డ్‌లలో ఒక దానికి సంబంధించిన మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మెసేజ్‌ల లిస్ట్‌లో, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న మెసేజ్ అడ్డు వరుసలో ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీరు మెసేజ్ డైలాగ్‌లో లేదా సైడ్‌బార్ మెనూలో ఫార్మాట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్‌ను ఎంచుకోండి (ఉదాహరణకు, బాడీ). ఫార్మాటింగ్‌ను మార్చడానికి మెనూలోని సెట్టింగ్‌లను మార్చండి.
- మెసేజ్‌ను అప్‌డేట్ చేయడానికి పబ్లిష్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఫార్మాటింగ్ కంట్రోల్స్
మీరు ఫార్మాట్ చేసే మెసేజ్ ఎలిమెంట్‌ను బట్టి, కింది కంట్రోల్స్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అందుబాటులో ఉండవచ్చు.
- బాడీ: ఫాంట్ ఫ్యామిలీ
- ఫాంట్ సైజ్: ఫాంట్ సైజ్ "em" యూనిట్‌లలో ఉంటుంది, ఇది వీక్షకుల స్క్రీన్ సైజ్ లేదా బ్రౌజర్ సెట్టింగ్‌లకు అనుగుణంగా టెక్స్ట్‌ను స్కేల్ చేస్తుంది.
- ఫాంట్ రంగు: సేవ్ చేయండి చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ స్వంత Hex- లేదా RGB- నిర్వచిత రంగును ఎంటర్ చేయండి.
- స్టయిల్: బోల్డ్, ఇటాలిక్, లేదా అండర్‌లైన్ (ఐరోపా నియంత్రణ చట్టాలకు సంబంధించిన మెసేజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది)
- అమరిక: ఎడమ, కుడి, మధ్య (ఐరోపా నియంత్రణ చట్టాలకు సంబంధించిన మెసేజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది)
"గ్లోబల్" ఎలిమెంట్
- ప్రాథమిక రంగు: కింద ఇచ్చిన మెసేజ్ ఎలిమెంట్‌లకు వర్తిస్తుంది:
- ప్రాథమిక మెసేజ్ బటన్ బ్యాక్‌గ్రౌండ్ రంగు
- మూడవ మెసేజ్ బటన్ (దాన్ని చేర్చినప్పుడు) ఫాంట్ రంగు
- చిహ్నం బ్యాక్‌గ్రౌండ్‌లు
- టోగుల్స్
- వెండార్ ప్రాధాన్యతల లింక్ ఫాంట్ రంగు
- మెసేజ్ నుండి సూచించిన సహాయ డైలాగ్‌పై మూసివేయి బటన్
- ద్వితీయ రంగు: మెసేజ్‌లోని ద్వితీయ బటన్ బ్యాక్‌గ్రౌండ్ రంగుకు వర్తిస్తుంది.
"బటన్‌లు" ఎలిమెంట్
- ప్రాథమిక రంగు: ప్రాథమిక మెసేజ్ బటన్ ఫాంట్ రంగుకు వర్తిస్తుంది.
- ద్వితీయ రంగు: ద్వితీయ మెసేజ్ బటన్ ఫాంట్ రంగుకు వర్తిస్తుంది.
మీ మెసేజ్‌లలో డిస్‌ప్లే చేసే బటన్‌లు అదృశ్యంగా, అస్పష్టంగా లేదా డిజేబుల్ చేసినట్లుగా కనిపించకూడదు. బటన్‌లు ఒకేలా ఉండాల్సిన అవసరం లేనప్పటికీ, అవి స్పష్టంగా కనిపిస్తున్నాయని నిర్ధారించడానికి, వాటికి మ్యాచ్ అయ్యే టెక్స్ట్ ట్రీట్‌మెంట్ (ఫాంట్, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టయిల్) ఉండాలి, అలాగే ప్రతి టెక్స్ట్ కోసం కనీస కాంట్రాస్ట్ నిష్పత్తి 5 నుండి 1 వరకు ఉండాలి.
అంటే, మీ మెసేజ్‌లలో ప్రదర్శించే బటన్‌ల బ్యాక్‌గ్రౌండ్ రంగు, అలాగే ఫాంట్ రంగు సులభంగా చదవగలిగేంత భిన్నంగా ఉండాలి. మీరు బటన్ బ్యాక్‌గ్రౌండ్, అలాగే ఫాంట్ రంగులను సెట్ చేసినప్పుడు, రంగుల మధ్య తగినంత కాంట్రాస్ట్ ఉందో లేదో మేము కనుగొని, మీరు ఎంపిక చేసిన రంగులను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంటే మీకు తెలియజేస్తాము.
మెసేజ్ టార్గెటింగ్‌ను ఎంచుకోండి
మీ ప్రస్తుత US రాష్ట్రాల నియంత్రణ చట్టాల మెసేజ్‌ను ఏ యూజర్లు చూస్తారో గుర్తించడానికి భౌగోళిక టార్గెటింగ్‌ను ఉపయోగించండి. మీరు అన్ని సపోర్ట్ ఉన్న రాష్ట్రాల నుండి సందర్శకులకు మెసేజ్‌ను చూపించడానికి ఎంచుకోవచ్చు లేదా నిర్దిష్ట రాష్ట్రాల నుండి సందర్శకులకు మాత్రమే మెసేజ్‌ను చూపవచ్చు.
ఇప్పటికే ఉన్న US రాష్ట్ర నియంత్రణ చట్టాల మెసేజ్ కోసం భౌగోళిక టార్గెటింగ్‌ని ఎంచుకోవడానికి కింది దశలను పూర్తి చేయండి:
- మీ AdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- గోప్యత & మెసేజింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- గోప్యత & మెసేజింగ్ పేజీలో US రాష్ట్ర నియంత్రణ చట్టాల కార్డ్‌పై మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- In the list of messages, click the name of the message you want to edit.
- ను క్లిక్ చేసి, భౌగోళిక టార్గెటింగ్ ఆప్షన్‌లను ఎంచుకోండి.
అందుబాటులోనున్న భౌగోళిక టార్గెటింగ్ ఆప్షన్‌లు
US రాష్ట్ర నియంత్రణ చట్టాల మెసేజ్‌లు
US రాష్ట్రాలను ఎంచుకోండి. ఆ రాష్ట్రాల్లోని అర్హత కలిగిన సందర్శకులకు మెసేజ్ డిస్‌ప్లే చేయబడుతుంది.
- కాలిఫోర్నియా
- కొలరాడో
- కనెక్టికట్
- వర్జీనియా
- యూటా