మీ ఖాతాలోని యాక్సెస్ & కంట్రోల్ యాక్టివిటీ

మీరు Google సైట్‌లు, యాప్‌లు, సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు, మీ యాక్టివిటీలో కొంత భాగం మీ Google ఖాతాలో సేవ్ అవుతుంది. 'నా యాక్టివిటీ'లో మీరు ఈ యాక్టివిటీని కనుగొనవచ్చు, తొలగించవచ్చు, అలాగే మీరు ఏ సమయంలో అయినా చాలా వరకు యాక్టివిటీని సేవ్ చేయడం ఆపివేయవచ్చు.

'నా యాక్టివిటీ' గురించి

'నా యాక్టివిటీ' అనేది మీరు చేసిన సెర్చ్‌లు, మీరు సందర్శించిన వెబ్‌సైట్‌లు, అలాగే మీరు చూసిన వీడియోల వంటి యాక్టివిటీలను చూడటానికి ఇంకా మేనేజ్ చేయడానికి ఒక కేంద్ర స్థలం.

యాక్టివిటీ ఎలా పని చేస్తుంది

మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, Search, YouTube, లేదా Chrome వంటి నిర్దిష్ట Google సర్వీస్‌లలో మీ యాక్టివిటీని మీ ఖాతాలో డేటాగా సేవ్ చేయవచ్చు. ఈ యాక్టివిటీ Googleలో మీ అనుభవాన్ని వేగంగా అలాగే మరింత ఉపయోగకరంగా చేయడంలో సహాయపడుతుంది.

'నా యాక్టివిటీ'లో కనిపించే యాక్టివిటీ రకాలలో లొకేషన్ వంటి అనుబంధిత సమాచారం ఉండవచ్చు, అలాగే మీరు ఏ Google ప్రోడక్ట్‌లను ఉపయోగిస్తున్నారు, ఇంకా ఏ యాక్టీవిటీ కంట్రోల్స్ ఆన్ చేయబడ్డాయి అనే దానిపై ఆధారపడవచ్చు.

యాక్టివిటీ మీ ఖాతాలో ఎప్పుడు సేవ్ అవుతుంది

మీరు మీ Google ఖాతాలోకి సైన్ ఇన్ చేసినప్పుడు యాక్టివిటీ సేవ్ అవుతుంది.

మీ ఖాతాలో సేవ్ చేయబడిన చాలా వరకు యాక్టివిటీని మీ యాక్టీవిటీ కంట్రోల్స్ కంట్రోల్ చేస్తాయి.

యాక్టివిటీని కనుగొనండి & చూడండి

మీ అత్యంత ఇటీవలి యాక్టివిటీతో మొదలుకుని, ఒక్కొక్క ఐటెమ్‌గా మీ యాక్టివిటీ లిస్ట్ చేయబడుతుంది.

యాక్టివిటీని కనుగొనండి​

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ నావిగేషన్ ప్యానెల్‌లో, డేటా, గోప్యతను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌లు" కింద, నా యాక్టివిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ యాక్టివిటీని యాక్సెస్ చేయడానికి:
    • తేదీ అలాగే సమయం వారీగా ఆర్గనైజ్ చేయబడిన మీ యాక్టివిటీని బ్రౌజ్ చేయండి.
    • నిర్దిష్ట యాక్టివిటీని కొనుగొనడానికి, పైన ఉన్న, సెర్చ్ బార్ అలాగే ఫిల్టర్‌లను ఉపయోగించండి.

యాక్టివిటీ గురించి వివరాలను పొందండి

ఐటెమ్ గురించి వివరాలను చూడటానికి: ఐటెమ్ కింద ఉన్న, వివరాలను ఎంచుకోండి. యాక్టివిటీకి సంబంధించిన తేదీ, సమయం అలాగే అది ఎందుకు సేవ్ చేయబడింది అనేదాన్ని మీరు కనుగొంటారు. మీరు లొకేషన్, పరికరం, అలాగే యాప్ సమాచారాన్ని కూడా పొందవచ్చు.

యాక్టివిటీని తొలగించండి

'నా యాక్టివిటీ'లో గతంలో చేసిన సెర్చ్‌లు, బ్రౌజింగ్ హిస్టరీ, అలాగే ఇతర యాక్టివిటీని తొలగించడం ఎలాగో తెలుసుకోండి. మీరు పాత యాక్టివిటీని తొలగించడానికి ఆటోమేటిక్ తొలగింపును కూడా సెటప్ చేయవచ్చు.

'నా యాక్టివిటీ'లో మీ పూర్తి హిస్టరీని చూడటానికి, ఒక అదనపు దశ అవసరమయ్యేలా చేయండి.

షేర్ చేసిన పరికరాలలో మీ గోప్యతను బలోపేతం చేయడానికి, 'నా యాక్టివిటీ'లో మీ పూర్తి హిస్టరీని చూడటానికి ఒక అదనపు వెరిఫికేషన్ దశ అవసరమయ్యేలా మీరు ఎంచుకోవచ్చు.

  1. activity.google.com కు వెళ్లండి.
  2. మీ యాక్టివిటీకి పైన, నా యాక్టివిటీ వెరిఫికేషన్‌ను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. అదనపు వెరిఫికేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

యాక్టివిటీని ఆఫ్ చేయండి & తొలగించండి

'నా యాక్టివిటీ'లోని చాలా వరకు సమాచారాన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న, డేటా & గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌లు" ఆప్షన్ కింద, మీరు సేవ్ చేయకూడదనుకునే యాక్టివిటీ లేదా హిస్టరీ సెట్టింగ్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు సేవ్ చేయకూడదనుకునే సెట్టింగ్ కింద, ఆఫ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. సెట్టింగ్‌ను ఆఫ్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి, లేదా ఆఫ్ చేయండి లేదా యాక్టివిటీని ఆఫ్ చేసి, తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • యాక్టివిటీని ఆఫ్ చేసి, తొలగించండి ఆప్షన్‌ను మీరు ఎంచుకుంటే, ఏ యాక్టివిటీని తొలగించాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి అలాగే నిర్ధారించడానికి దశలను ఫాలో అవ్వండి.

చిట్కా: కొంత యాక్టివిటీ నా యాక్టివిటీలో చేర్చబడి ఉండదు.

యాక్టివిటీను సేవ్ చేయడం తాత్కాలికంగా ఆపివేయండి

మీరు వెబ్‌ను ప్రైవేట్‌గా సెర్చ్ చేయవచ్చు, బ్రౌజ్ చేయవచ్చు.

చిట్కా: మీరు మీ Google ఖాతాకు ప్రైవేట్ బ్రౌజింగ్ విండోలో సైన్ ఇన్ చేసినట్లయితే, మీ సెర్చ్ యాక్టివిటీ ఆ ఖాతాలో స్టోర్ చేయబడవచ్చు.

సమస్యలను పరిష్కరించండి

మీ యాక్టివిటీ కనిపించకపోవడం

ఒకవేళ 'నా యాక్టివిటీ'లో మీ సెర్చ్‌లు, మీరు సందర్శించిన వెబ్‌సైట్‌లు, లేదా మీ ఇతర యాక్టివిటీ కనిపించకపోతే, వీటిని నిర్ధారించండి:

  • మీరు సైన్ ఇన్ చేశారని. మీ Google ఖాతాలోకి మీరు సైన్ ఇన్ చేసినప్పుడు మాత్రమే యాక్టివిటీ సేవ్ అవుతుంది.
  • మీ పరికరం ఆన్‌లైన్‌లో ఉందని. ఏదైనా ఆఫ్‌లైన్ యాక్టివిటీ, మీ పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యే వరకు 'నా యాక్టివిటీ'లో కనిపించదు.
  • సరైన సెట్టింగ్‌లు ఆన్ చేయబడి ఉన్నాయని. మీరు చేయాలనుకుంటున్న యాక్టివిటీ రకాలను సేవ్ చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి, మీ యాక్టీవిటీ కంట్రోల్స్‌ను రివ్యూ చేయండి.
  • మీరు ఒక్క ఖాతాకు మాత్రమే సైన్ ఇన్ చేశారని. ఒకే సమయంలో అదే బ్రౌజర్ లేదా పరికరంలో పలు ఖాతాలతో సైన్ ఇన్ చేసినట్లయితే, మీ యాక్టివిటీ ఆటోమేటిక్ ఖాతాలో సేవ్ చేయబడవచ్చు.

గమనిక: కొన్ని Google సర్వీస్‌లు మీ ఖాతాలో యాక్టివిటీని సేవ్ చేయడాన్ని సపోర్ట్ చేయవు.

మీరు గుర్తించని యాక్టివిటీ మీకు కనిపించడం

'నా యాక్టివిటీ'లో ఈ రకమైన తెలియని యాక్టివిటీ మీకు కనిపించవచ్చు.

Google సర్వీస్‌లను ఉపయోగించే వెబ్‌సైట్‌లు & యాప్‌ల నుండి యాక్టివిటీ

Search, Maps, లేదా Ads వంటి Google సర్వీస్‌లను కొన్ని వెబ్‌సైట్‌లు, అలాగే యాప్‌లు ఉపయోగిస్తాయి. మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు ఈ వెబ్‌సైట్‌లు అలాగే యాప్‌లను సందర్శించినట్లయితే, మీ యాక్టివిటీ 'నా యాక్టివిటీ'లో కనిపించవచ్చు. మీరు షేర్ చేసిన పరికరాన్ని ఉపయోగిస్తే లేదా పలు ఖాతాలతో సైన్ ఇన్ చేసినట్లయితే, సైన్ ఇన్ చేసిన మరొక ఖాతా నుండి మీరు యాక్టివిటీని కనుగొనవచ్చు.

కొన్ని వెబ్‌సైట్‌లు అలాగే యాప్‌లు నిర్దిష్ట యాక్టివిటీని Googleతో షేర్ చేయవచ్చు.

వెబ్ & యాప్ యాక్టివిటీ గురించి మరింత తెలుసుకోండి.

సూచించబడిన యాక్టివిటీ

కొన్నిసార్లు, మీరు తదుపరి చూడాలనుకుంటున్న దాన్ని Google ముందుగానే ఊహించి, ఈ కంటెంట్‌ను మీకు అందిస్తుంది.

  • ఉదాహరణకు, YouTube ఆటోప్లే ఆన్ చేసి ఉంటే, మీరు చూసిన వీడియోల ఆధారంగా ఆటోమేటిక్‌గా ప్లే చేయబడిన వీడియోలు 'నా యాక్టివిటీ'లో కనిపించవచ్చు.

ఇతర తెలియని యాక్టివిటీ

ఈ పరిస్థితులలో మీరు తెలియని యాక్టివిటీని కనుగొనవచ్చు:

  • మీరు ఒకే సమయంలో అదే బ్రౌజర్ లేదా పరికరంలో పలు ఖాతాలకు సైన్ ఇన్ చేసి ఉండటం.
    • సైన్ ఇన్ చేసిన మరొక ఖాతా నుండి యాక్టివిటీ, 'నా యాక్టివిటీ'లో సేవ్ చేయబడటం.
  • మీరు ఉద్దేశించని యాక్టివేషన్ ఉండటం అలాగే Google Assistant దాన్ని గుర్తించడం.
  • పబ్లిక్ కంప్యూటర్ వంటి షేర్ చేసిన పరికరం నుండి మీరు సైన్ అవుట్ చేయకపోవడం.
  • మీ పరికరం వేరే తేదీ అలాగే సమయానికి సెట్ చేయబడి ఉండటం.
    • ఈ పరికరం నుండి యాక్టివిటీ తప్పుగా ఉన్న తేదీతో కనిపించవచ్చు.
  • ఎవరైనా మీ అనుమతి లేకుండా మీ ఖాతాను యాక్సెస్ చేయడం.

మీ ఖాతాలోని యాక్టివిటీ వేరొకరి ద్వారా చేయబడిందని మీరు భావించినట్లయితే, మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి చర్యలు తీసుకోండి.

ఇతర యాక్టివిటీని చూడండి

మీ ఖాతాలో సేవ్ చేసిన మొత్తం డేటా, 'నా యాక్టివిటీ'లో కనిపించదు. ఉదాహరణకు, మీరు లొకేషన్ హిస్టరీని ఆన్ చేసి ఉంటే, ఆ డేటా 'నా యాక్టివిటీ'కి బదులుగా, మీ Maps టైమ్‌లైన్‌లో సేవ్ చేయబడుతుంది.

మీ ఖాతాలో సేవ్ చేయబడిన ఇతర రకాల యాక్టివిటీని కొనుగొనడానికి:

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున, డేటా, గోప్యతను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌ల"లో, నా యాక్టివిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ యాక్టివిటీకి పైన, సెర్చ్ బార్‌లో, మరిన్ని మరిన్నిఆ తర్వాత ఇతర Google యాక్టివిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీరు చూడాలనుకుంటున్న యాక్టివిటీ కింద, మీ ఆప్షన్‌ను ఎంచుకోండి.

మేము సేకరించే సమాచారం, అలాగే దాన్ని ఎందుకు సేకరిస్తాము అనేదాని గురించి మరింత తెలుసుకోండి.

ఇతర ఖాతా సమాచారాన్ని చూడడానికి, అలాగే కంట్రోల్ చేయడానికి, మీ Google ఖాతాను తెరవండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15729214317083022739
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false