మీ Google ఖాతాలోని సమాచారాన్ని కనుగొనండి, కంట్రోల్ చేయండి, అలాగే తొలగించండి

మీ Google ఖాతా సమాచారాన్ని, యాక్టివిటీని మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి. Google సర్వీస్‌ల అంతటా మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, మీ ఖాతాలో ఏ రకమైన యాక్టివిటీ సేవ్ చేయబడుతుంది అలాగే ఏ రకమైన యాక్టివిటీ ఉపయోగించబడుతుంది అనేది మీరు ఎంచుకోవచ్చు.

మీ గోప్యతా సెట్టింగ్‌లను రివ్యూ చేయండి

గోప్యతా చెకప్‌తో కింద వివరించిన సెట్టింగ్‌లలో చాలా వాటిని మీరు త్వరగా కనుగొనవచ్చు, మార్చవచ్చు.

ఏ యాక్టివిటీని సేవ్ చేయాలి అనే దాన్ని కంట్రోల్ చేయండి

మీ ఖాతాలో ఎటువంటి యాక్టివిటీ సేవ్ అవుతుందనేది ఎంచుకోవడానికి యాక్టీవిటీ కంట్రోల్స్‌ను ఉపయోగించండి. యాక్టివిటీకి సంబంధించిన ఉదాహరణలు:

  • మీరు చేసే సెర్చ్‌లు
  • మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు
  • మీరు చూసే వీడియోలు
  • మీరు వెళ్లే స్థలాలు

యాక్టివిటీ డేటా అనేది మరింత వేగవంతమైన సెర్చ్ ద్వారా మీకు మరింత మెరుగైన అనుభవాన్ని, అలాగే Google ప్రోడక్ట్‌లలో మీకు మరింత అనుకూలమైన అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది.

మీ ఖాతాలో ఏ యాక్టివిటీ సేవ్ అవుతుందనేది కంట్రోల్ చేయడం ఎలా అనేదాని గురించి మరింత తెలుసుకోండి.

మీ సమాచారాన్ని ట్రాక్ చేయండి & తొలగించండి

మీ Google ఖాతాలో సేవ్ అయిన యాక్టివిటీని రివ్యూ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఈ రిసోర్స్‌లు మీకు సహాయపడతాయి.

మీ డేటాకు సంబంధించిన ఓవర్‌వ్యూను కనుగొనండి

Gmail, Drive, Calendar వంటి విభిన్న Google సర్వీస్‌లకు సంబంధించి మీ డేటా సారాంశాన్ని చూడటానికి మీ Google Dashboard‌ను సందర్శించండి.

మీ యాక్టివిటీని, ఫైళ్లను కనుగొనండి, అలాగే తొలగించండి

మీ యాక్టివిటీ

మీరు చేసిన సెర్చ్‌లు, మీరు సందర్శించిన వెబ్‌సైట్‌ల వంటి యాక్టివిటీని నా యాక్టివిటీలో కనుగొనండి, అలాగే తొలగించండి.

మీ యాక్టివిటీని తొలగించడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

చిట్కా: మరింత సెక్యూరిటీని జోడించడానికి, మీకు 'నా యాక్టివిటీ'లో మీ పూర్తి హిస్టరీని చూడటానికి, ఒక అదనపు వెరిఫికేషన్ దశ అవసరం కావచ్చు.

మీ ఫైళ్లు

కింద పేర్కొన్న సంబంధిత Google ప్రోడక్ట్‌లను సందర్శించి, మీ ఫోటోలను, ఈమెయిల్స్‌ను, డాక్యుమెంట్‌లను, ఇంకా ఇతర ఫైళ్లను మీరు కనుగొనవచ్చు, అలాగే తొలగించవచ్చు:

మీరు సందర్శించిన స్థలాలను కనుగొనండి, అలాగే తొలగించండి

లొకేషన్ హిస్టరీ అనేది Google ఖాతా సెట్టింగ్, ఇది టైమ్‌లైన్‌ను, వ్యక్తిగత మ్యాప్‌ను క్రియేట్ చేస్తుంది, తద్వారా ఇది మీరు సందర్శించిన స్థలాలు, మీరు ఉపయోగించే మార్గాలు మీరు వెళ్లే ట్రిప్‌లను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. మీరు లొకేషన్ హిస్టరీను ఆన్ చేసినప్పుడు, మీరు Google యాప్‌లను ఉపయోగించనప్పటికీ, మీ పరికరం దాని ఖచ్చితమైన లొకేషన్‌ను మీ పరికరాలు, అలాగే Google సర్వర్‌లలో క్రమం తప్పకుండా సేవ్ చేస్తుంది. మీ లొకేషన్ హిస్టరీను కేవలం మీరు మాత్రమే యాక్సెస్ చేయగలరు.

మీ లొకేషన్ హిస్టరీను మేనేజ్ చేయడం లేదా తొలగించడం ఎలా అనేదాని గురించి మరింత తెలుసుకోండి.

మీరు తరచుగా సందర్శించే స్థలాల ఆధారంగా సిఫార్సుల వంటి Google అంతటా లొకేషన్ హిస్టరీ మీకు మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందిస్తుంది.

ఇతర లొకేషన్ డేటాను మేనేజ్ చేయండి

మీరు వెబ్ & యాప్ యాక్టివిటీ వంటి ఇతర సెట్టింగ్‌లను ఆన్ చేసి, లొకేషన్ హిస్టరీని పాజ్ చేసినా లేదా లొకేషన్ హిస్టరీ నుండి లొకేషన్ డేటాను తొలగించినా, ఇతర Google సైట్‌లు, యాప్‌లు, సర్వీస్‌లకు సంబంధించి మీ వినియోగంలో భాగంగా, ఇప్పటికీ మీ Google ఖాతాలో లొకేషన్ డేటా సేవ్ చేయబడి ఉండవచ్చు. వెబ్ & యాప్ యాక్టివిటీలో మీ పరికరం జనరల్ ఏరియా, IP అడ్రస్‌ల నుండి మీ లొకేషన్ ను గురించిన సమాచారం కూడా ఉండవచ్చు.

ఉదాహరణకు, మీ వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు ఉన్న జనరల్ ఏరియా, Search అలాగే Mapsలో యాక్టివిటీలో భాగంగా సేవ్ చేయబడవచ్చు. మీ కెమెరా యాప్ సెట్టింగ్‌లను బట్టి, మీ ఫోటోలతో పాటు మీ ఖచ్చితమైన లొకేషన్, ఇంకా ఇతర లొకేషన్‌లు కూడా సేవ్ చేయబడవచ్చు.

Chrome, అలాగే ఇతర బ్రౌజర్‌ల నుండి హిస్టరీని, కుక్కీలను తొలగించండి

హిస్టరీ అలాగే కుక్కీల డేటా, అడ్రస్ బార్‌లో మీకు మెరుగైన సూచనలు అందించడంలో సహాయపడవచ్చు. ఆ విధంగా, మీరు వెతుకుతున్న వాటిని మరింత వేగంగా కనుగొనవచ్చు.

ఇతర Google యాక్టివిటీని చూడండి

మీరు ఇతర Google యాక్టివిటీని కంట్రోల్ కూడా చేయవచ్చు.

Google సర్వీస్‌లలో మీకు అందే ఫలితాలను, సూచనలను మెరుగుపరచడానికి ఈ సమాచారం ఉపయోగపడవచ్చు.

మీ ఖాతా నుండి ఒక పరికరాన్ని తీసివేయండి
ఇటీవల మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేసిన పరికరాలను మీరు రివ్యూ చేయవచ్చు. మీరు నిర్దిష్ట పరికరాన్ని గుర్తించకపోతే లేదా అది మీది కాకపోతే, దాన్ని మీ ఖాతా నుండి తీసివేయండి.
ఏదైనా ప్రోడక్ట్ లేదా మీ ఖాతాను తొలగించండి
మీరు ఎప్పుడైనా మీ Google ఖాతాను కూడా తొలగించవచ్చు. ఖాతాను తొలగించిన తర్వాత, మీరు దాన్ని తిరిగి పొందలేకపోవచ్చు.

వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయండి

మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయడానికి, అలాగే దాన్ని ఎవరెవరు చూడవచ్చనేది ఎడిట్ చేయడానికి, నా గురించి విభాగాన్ని సందర్శించండి. Gmail వంటి Google సర్వీస్‌లలో వ్యక్తులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి లేదా మీ మధ్య ఉన్న సారూప్య విషయాలను కనుగొనడానికి ఈ సమాచారం సహాయపడవచ్చు.

మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

యాడ్ సెట్టింగ్‌లను మార్చండి

మీకు యాడ్‌లను చూపడానికి Google ఉపయోగించే సమాచారాన్ని మీరు యాడ్ సెట్టింగ్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

మీరు చూసే యాడ్‌లు మీ ఆసక్తులకు మరింత సంబంధితంగా ఉండేలా చేయడానికి ఈ డేటా సహాయపడుతుంది.

Google యాడ్‌లు అలాగే యాడ్ సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

మీ Google డేటాను డౌన్‌లోడ్ చేయండి

మీరు ఎప్పుడైనా ఫోటోలు, ఇమెయిల్‌లు, డాక్యుమెంట్‌లు అలాగే కాంటాక్ట్‌ల వంటి డేటాను డౌన్‌లోడ్ చేయవచ్చు లేదా బదిలీ చేయవచ్చు. ఆ విధంగా, మీరు Google సర్వీస్‌లను ఉపయోగించడం ఆపివేసినా లేదా మీ Google ఖాతాను తొలగించినా కూడా, మీరు క్రియేట్ చేసిన కంటెంట్‌ను మీ వద్ద ఉంచుకోవచ్చు.

మీ డేటాను డౌన్‌లోడ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2725840627179872249
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false