“పాస్‌వర్డ్ తప్పు” ఎర్రర్

మీరు కొన్ని సార్లు Apple Mail యాప్, Mozilla Thunderbird లేదా Microsoft Outlook వంటి థర్డ్-పార్టీ యాప్‌తో Googleకు సైన్ ఇన్ అయినప్పుడు "పాస్‌వర్డ్ తప్పు" ఎర్రర్‌ను చూస్తారు. మీరు పాస్‌వర్డ్‌ను సరిగా ఎంటర్ చేసినప్పటికీ, ఇంకా ఎర్రర్ వస్తుంటే, మీరు యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది లేదా మరింత సురక్షితమైన యాప్‌ను ఉపయోగించాలి.

మీ యాప్‌ను లేదా ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయండి

మీ పరికరంలో ఉన్న యాప్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ పాతదైతే, మీరు దానిని మీ Google ఖాతాకు కనెక్ట్ చేయలేకపోవచ్చు. యాప్‌ను లేదా మీ పరికరం ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయడానికి ట్రై చేయండి.

మరింత సురక్షితమైన యాప్‌ను ఉపయోగించండి

ఒకవేళ యాప్, మా సెక్యూరిటీ స్టాండర్డ్‌లకు అనుగుణంగా లేకపోతే, దాని నుండి ఎవరైనా మీ ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, వాళ్ళని Google బ్లాక్ చేయవచ్చు.

"Googleతో సైన్ ఇన్ చేయండి" ఆప్షన్‌తో ఉండే ఏదైనా థర్డ్-పార్టీ యాప్ నుండి మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయవచ్చు. మీరు Gmail వంటి అన్ని రకాల Google ప్రోడక్ట్‌లను ఉపయోగించి, మీ Google ఖాతాకు కూడా సైన్ ఇన్ చేయవచ్చు.

తక్కువ సురక్షిత యాప్‌లు, మీ Google ఖాతా గురించి మరింత తెలుసుకోండి.

యాప్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి

యాప్ పాస్‌వర్డ్ అనేది 16-అంకెల పాస్‌కోడ్, ఇది మీ Google ఖాతాను యాక్సెస్ చేయడానికి, Google యేతర యాప్ లేదా పరికరానికి అనుమతి ఇస్తుంది. యాప్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించి సైన్ ఇన్ చేయడం ఎలా అనేదాని గురించి మరింత తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5762888415349717285
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false