Google మీకు టెక్స్ట్ పంపించినప్పుడు

Google నుండి టెక్స్ట్‌ను (SMS) పొందడానికి కారణం కాగల కొన్ని అంశాలు

మీరు మీ ఖాతాకు లాగిన్ కాలేక పోయారు, మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలనుకుంటున్నారు

మీ ఖాతాకు రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించినప్పుడు, Google మీకు కోడ్‌ను టెక్స్ట్ చేయవచ్చు. ఈ కోడ్ మీరు మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసి, తిరిగి సైన్ ఇన్ అవ్వడంలో సహాయపడుతుంది. మీ ఫోన్‌ను రికవరీ ఆప్షన్‌గా ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.

మీరు 2-దశల వెరిఫికేషన్ కోసం సైన్ అప్ చేశారు

మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఉపయోగిస్తే, మీరు సైన్ ఇన్ చేసినప్పుడు వెరిఫికేషన్ కోడ్‌ను పొందడాన్ని ఎంపికచేసుకున్నారు. ఈ కోడ్ మీ ఖాతాకు అదనపు సెక్యూరిటీ లేయర్‌ను జోడిస్తుంది. 2-దశల వెరిఫికేషన్‌ను గురించి మరింత తెలుసుకోండి.

మీరు ఖాతాను క్రియేట్ చేస్తున్నారు, మీరు రోబోట్ కాదని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాము

మీరు Google ఖాతాను క్రియేట్ చేస్తున్నట్లయితే, మేము మీ ఫోన్‌కు పంపిన వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయమని కోరవచ్చు. మీ ఖాతాను టెక్స్ట్ మెసేజ్ ద్వారా వెరిఫై చేయడం గురించి మరింత తెలుసుకోండి.

మీరు సైన్ ఇన్ చేస్తున్నారు, అది మీరేనని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాము

మేము కొన్ని సార్లు మిమ్మల్ని ఒక అదనపు సైన్ ఇన్ దశను పూర్తి చేయమని ఇలాంటి సందర్భాలలో అడుగుతాము:

  • మీరు సాధారణంగా సైన్ ఇన్ చేయని స్థలం నుంచి సైన్ ఇన్ చేసినప్పుడు.
  • ఇంతకు ముందెప్పుడూ ఉపయోగించని పరికరాన్ని మీరు ఉపయోగించినప్పుడు.

మీ ఫోన్‌కు టెక్స్ట్ చేయబడిన వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయడం, అదనపు దశలో భాగంగా ఉండవచ్చు. అసాధారణ సైన్ ఇన్‌ల గురించి మరింత తెలుసుకోండి.

మీరు మీ ఖాతాకు మార్పులు చేశారు

మీ ఖాతాపై సెక్యూరిటీ సంబంధిత చర్య తీసుకొన్నప్పుడు మీకు ఇమెయిల్ వస్తుంది (ఉదాహరణకు, పాస్‌వర్డ్ మార్పు). అయినప్పటికీ, మీరు ఈ నోటిఫికేషన్‌లను టెక్స్ట్ ద్వారా కూడా పొందవచ్చు. సెక్యూరిటీ నోటిఫికేషన్‌ల గురించి మరింత తెలుసుకోండి.

మీరు టెక్స్ట్ (SMS) ద్వారా కోడ్‌ను అందుకున్నారు, దీన్ని పంపమని మీరు రిక్వెస్ట్ చేయలేదు

మీరు అందుకున్న టెక్స్ట్ కోడ్‌ను విస్మరించవచ్చు, అలాగే తొలగించవచ్చు. అందుకున్న కోడ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దు. మీ Google ఖాతాను సురక్షితంగా ఉంచడానికి, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు, ఇంకా మార్గదర్శకాల కోసం, క్రమం తప్పకుండా సెక్యూరిటీ చెకప్ చేయండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10034504278915546089
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false