ఖాతా యాక్సెస్ కలిగిన పరికరాలను చూడండి

మీరు Google ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న లేదా ఇటీవల ఉపయోగించిన కంప్యూటర్‌లు, ఫోన్‌లు, అలాగే ఇతర పరికరాలను మీరు చూడవచ్చు. మీ ఖాతాకు ఇతరులు ఎవరూ సైన్ ఇన్ చేయలేదని నిర్ధారించుకోవడానికి మీరు google.com/devices ను చెక్ చేయవచ్చు.

పరికరాలను రివ్యూ చేయండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున్న నావిగేషన్ ప్యానెల్‌లో, సెక్యూరిటీని ఎంచుకోండి.
  3. మీ పరికరాల ప్యానెల్‌లో, అన్ని పరికరాలను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు ప్రస్తుతం, లేదా గత కొన్ని వారాల్లో ఏయే పరికరాలలో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేశారో, అవి మీకు కనబడతాయి. మరిన్ని వివరాల కోసం, ఒక పరికరాన్ని లేదా సెషన్‌ను ఎంచుకోండి.
  5. మీరు సైన్ అవుట్ చేసిన పరికరాలు లేదా సెషన్‌లు "సైన్ అవుట్ చేశారు" అనే ఇండికేషన్‌ను కలిగి ఉంటాయి.
  6. ఒకే పరికరం రకానికి సంబంధించి పలు సెషన్‌లు కనిపిస్తే, అవి అన్నీ ఒక పరికరం లేదా పలు పరికరాల్లోవి అయి ఉంటాయి. వాటి వివరాలను రివ్యూ చేయండి, ఆ సెషన్‌లు మీ పరికరాల్లోవి కాకపోతే, వాటి నుండి సైన్ అవుట్ చేయండి.

సెషన్ అంటే ఏమిటి?

కొన్ని సందర్భాల్లో మీకు వ్యక్తిగత పరికరాలకు బదులుగా సెషన్‌లు కనిపించవచ్చు. బ్రౌజర్, యాప్, లేదా పరికరంలోని సర్వీస్‌లో, మీరు ఎంత వ్యవధి పాటు అయితే మన Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉంటారో, ఆ వ్యవధినే సెషన్ అని అంటారు. ఒకే పరికరంలో ఒకటి కంటే ఎక్కువ సెషన్‌లు ఉండడం సాధారణమైన విషయమే. 

ఈ సందర్భాల్లో ఒక ప్రత్యేక సెషన్ క్రియేట్ అవుతుంది:

  • మీరు ఒక కొత్త పరికరంలో సైన్ ఇన్ చేసినప్పుడు
  • మీరేనని వెరిఫై చేయడానికి మీరు మీ పాస్‌వర్డ్‌‌ను మళ్లీ ఎంటర్ చేసినప్పుడు
  • మీరు కొత్త బ్రౌజర్ యాప్ లేదా సర్వీస్‌లో సైన్ ఇన్ చేసినప్పుడు
  • మీ ఖాతా డేటా యాక్సెస్‌ను మీరు ఒక యాప్‌నకు ఇచ్చినప్పుడు
  • మీరు అజ్ఞాత లేదా ప్రైవేట్ బ్రౌజర్ విండోలో సైన్ ఇన్ చేసినప్పుడు

మీ సెక్యూరిటీ కోసం, ప్రతి సెషన్ వివరాలను రివ్యూ చేసేందుకు, ఆ సెషన్ మీదేనని మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు దాని నుండి సైన్ అవుట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతించడానికి పేజీ ఒక్కో దాన్ని ప్రదర్శిస్తుంది.

చూపిన సమయం అంటే ఏమిటి

పేజీలో పేర్కొన్న సమయాలు ప్రతి లొకేషన్‌లో పరికరం లేదా సెషన్, అలాగే Google సిస్టమ్‌ల మధ్య చివరి సారి జరిగిన కమ్యూనికేషన్‌ను సూచిస్తాయి.

ఈ కమ్యూనికేషన్‌లో ఇవి ఉండవచ్చు:

  • మీరు Google ఖాతా లేదా Google యాప్‌లను ఉపయోగించడం వంటి యూజర్ చర్యలు
  • సర్వీస్, అలాగే Google మధ్య బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఆటోమేటిక్ సింకింగ్

కాబట్టి, పరికరాన్ని మీరు చివరిసారిగా ఉపయోగించిన దాని కంటే, అత్యంత తాజా సమయం మీకు కనిపించవచ్చు.

మీరు ఇప్పుడు ఉపయోగించని పరికరం నుండి సైన్ అవుట్ చేయండి

మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, ఈ పరికరాల నుండి సైన్ అవుట్ చేయండి:

  • పోయినవి లేదా ఇప్పుడు మీకు చెందనివి
  • మీకు చెందనివి

ముఖ్య గమనిక: మీరు ఏదైనా ఒక పరికరాన్ని గుర్తించలేకపోయినా లేదా మీ ఖాతాలో తెలియని యాక్టివిటీ జరిగినా, మీ ఖాతాను సురక్షితం చేయడం కోసం ఈ దశలను ఫాలో అవ్వండి.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున్న నావిగేషన్ ప్యానెల్‌లో, సెక్యూరిటీని ఎంచుకోండి.
  3. మీ పరికరాల ప్యానెల్‌లో, అన్ని పరికరాలను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. పరికరం and then సైన్ అవుట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. ఒకే పరికరం పేరుతో పలు సెషన్‌లు కనిపిస్తే, అవి ఒకే పరికరం లేదా పలు పరికరాల నుండి వచ్చి ఉండవచ్చు. పరికరం నుండి ఖాతా యాక్సెస్ లేదని మీరు నిర్ధారించుకోవాలనుకుంటే, ఈ పరికరం పేరుతో ఉన్న సెషన్‌లన్నింటి నుండి సైన్ అవుట్ చేయండి.

ఒక తెలియని పరికరం మీకు కనిపించినప్పుడు, మీ ఖాతాను సురక్షితం చేసుకోండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున్న నావిగేషన్ ప్యానెల్‌లో, సెక్యూరిటీని ఎంచుకోండి.
  3. మీ పరికరాల ప్యానెల్‌లో, అన్ని పరికరాలను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ ఖాతాను వేరెవరో ఉపయోగిస్తున్నారని మీకు తెలిపే ఈ సంకేతాల కోసం మీరు చూడవచ్చు:

  • మీరు ఒక పరికరాన్ని గుర్తించలేకపోతున్నారు. యాక్టివిటీ చేసినది మీరే అయినా, దాన్ని మీరు ఇటువంటి సందర్భాలలో గుర్తించలేకపోవచ్చు:
    • మీరు కొత్త పరికరాన్ని ఉపయోగించడం మొదలుపెట్టినట్లయితే.
    • మీరు వేరే వారి పరికరాన్ని గానీ లేదా లైబ్రరీ వంటి ప్రదేశాలలో ఉండే పబ్లిక్ కంప్యూటర్‌ను గానీ ఉపయోగించినట్లయితే. మీకు ఇప్పుడు సమీపంలో లేనటువంటి పబ్లిక్ పరికరం నుండి సైన్ అవుట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
    • మీరు ఇటీవల మీ పరికరాన్ని ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు రీసెట్ చేసినట్లయితే. పరికరం ఇప్పటికీ కనిపించవచ్చు.
  • లిస్ట్‌లో ఉన్న సమయానికి మీరు లొకేషన్‌లో లేరు. మీరు ఆ లొకేషన్‌లో గడిపినప్పటికీ, దాన్ని మీరు ఇటువంటి సందర్భాలలో గుర్తించలేకపోవచ్చు:
  • నిర్దిష్ట తేదీకి, అలాగే సమయానికి మీ ఖాతాను ఉపయోగించినట్లు మీకు గుర్తు లేదు. మీ వద్ద Gmail లేదా Calendar వంటి మీ Google ఖాతాకు కనెక్ట్ చేసే యాప్‌లు ఉన్నట్లయితే, మీరు నిర్దిష్ట తేదీని, సమయాన్ని గుర్తించలేకపోవచ్చు, ఎందుకంటే అది మీకు గుర్తున్న దాని కంటే మరింత ఇటీవలి సమయం అయ్యుండవచ్చు.
  • మీరు సాధారణంగా ఉపయోగించే బ్రౌజర్ కాకుండా మీకు వేరే బ్రౌజర్ కనిపిస్తోంది (ఉదాహరణకు, Chrome లేదా Safari).

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15168549450414667298
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false