వేరొక ఇమెయిల్ అడ్రస్‌తో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి

మీరు Google ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, మీరు ఆటోమేటిక్‌గా Gmail అడ్రస్‌ను పొందుతారు. మీరు సైన్ ఇన్ చేయడానికి వేరొక ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించాలనుకుంటే, మీరు Gmail యేతర ఇమెయిల్ అడ్రస్‌ను ఖాతాకు జోడించి, సైన్ ఇన్ చేయడానికి, మీ పాస్‌వర్డ్‌ను తిరిగి పొందటానికి, నోటిఫికేషన్‌లను పొందడానికి, అలాగే మరెన్నో చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు.

ప్రత్యామ్నాయ ఇమెయిల్‌ను ఎంచుకునేటప్పుడు, ఈ ఆవశ్యకాలను ఫాలో అవ్వండి:

  • మీరు Gmail అడ్రస్‌ను ఉపయోగించలేరు.
  • ఇప్పటికే వేరొక Google ఖాతాకు లింక్ చేయబడిన ఇమెయిల్ అడ్రస్‌ను మీరు ఉపయోగించలేరు.
  • ఈ ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేసేటప్పుడు మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి.

ముఖ్యమైనది: కింద ఉన్న దశలు ఇప్పటికే ఉన్న Google ఖాతాకు మాత్రమే వర్తిస్తాయి. ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌తో కొత్త Google ఖాతాను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌ను జోడించండి

  1. మీ Google ఖాతాను తెరవండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. వ్యక్తిగత సమాచారాన్ని ఎంచుకోండి.
  3. "కాంటాక్ట్ సమాచారం" కింద, ఇమెయిల్‌ను క్లిక్ చేయండి.
  4. "ప్రత్యామ్నాయ ఇమెయిల్‌ల" పక్కన, ప్రత్యామ్నాయ ఇమెయిల్‌ను జోడించండి లేదా ఇతర ఇమెయిల్‌ను జోడించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.  మీరు మళ్లీ సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  5. మీకు చెందిన ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి. జోడించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

మేము మీ ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌కు వెరిఫికేషన్ లింక్‌తో ఇమెయిల్‌ను పంపుతాము. ప్రత్యామ్నాయ అడ్రస్‌తో మీరు మీ అడ్రస్‌కు సైన్ ఇన్ చేయడానికి ముందు మీరు ఇమెయిల్‌ను తెరిచి, లింక్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు వెంటనే ఇమెయిల్ రాకపోవచ్చు.

మీరు మెసేజ్‌ను కనుగొనలేకపోతే, వెరిఫికేషన్ ఇమెయిల్‌ను కనుగొనడం లేదా కొత్త దాన్ని రిక్వెస్ట్ చేయడం కోసం మా చిట్కాలను చూడండి.

ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌లను తీసివేయండి

  1. మీ Google ఖాతాను తెరవండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. వ్యక్తిగత సమాచారాన్ని ఎంచుకోండి. 
  3. "కాంటాక్ట్ సమాచారం" కింద, ఇమెయిల్‌ను క్లిక్ చేయండి.
  4. ప్రత్యామ్నాయ ఇమెయిల్‌లను క్లిక్ చేయండి. మీరు మళ్లీ సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  5. మీరు తీసివేయాలనుకుంటున్న ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్ పక్కన, తీసివేయండి Removeను క్లిక్ చేయండి.

మీ Google ఖాతా నుండి మీరు ఏ యూజర్‌నేమ్‌లను తీసివేయవచ్చో చూడండి.

మీ ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌కు బదులుగా వ్యక్తులు మీ Gmail అడ్రస్‌ను చూడగలిగినప్పుడు

వ్యక్తులు మీ ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌తో అంశాలను షేర్ చేసినప్పుడు, బదులుగా వారికి కొన్ని సార్లు లిస్ట్ చేసిన మీ ప్రధాన Google ఖాతా ఇమెయిల్ (Gmail) అడ్రస్ కనిపిస్తుంది. కొన్ని ఉదాహరణలలో ఇవి ఉంటాయి:

  • Google Docs: ఎవరైనా మీ ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌తో డాక్యుమెంట్ వంటి కంటెంట్‌ను షేర్ చేసినప్పుడు, ప్రత్యామ్నాయ అడ్రస్‌కు బదులుగా మీ Gmail అడ్రస్ చూపబడుతుంది.
  • Google Sites: ఎవరైనా మీ ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌తో సైట్‌ను షేర్ చేసినప్పుడు, మీ ప్రత్యామ్నాయ అడ్రస్‌కు బదులుగా మీ Gmail అడ్రస్ చూపబడుతుంది.
  • Calendar: మీరు మీ ప్రత్యామ్నాయ అడ్రస్ నుండి ఫార్వర్డ్ చేసిన ఆహ్వానాలకు ప్రతస్పందించినప్పుడు, మీ Gmail అడ్రస్ నుండి వచ్చిన ప్రతిస్పందనలు ఈవెంట్ ఆర్గనైజర్‌కు కనిపిస్తాయి.
  • Google Keep: ఎవరైనా మీ ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌తో గమనికను షేర్ చేసినప్పుడు, మీ ప్రత్యామ్నాయ అడ్రస్‌కు బదులుగా మీ Gmail అడ్రస్ చూపబడుతుంది.
  • Google Groups: ఒకవేళ మీరు గ్రూప్‌లో భాగంగా ఉన్న ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌ను తీసివేస్తే, బదులుగా మీ Gmail అడ్రస్ కనిపించవచ్చు.
  • Google Ads: Google Ads ఖాతాను ఉపయోగించడానికి మీ ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్‌తో మీరు ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు, మీ Gmail అడ్రస్, అలాగే మీ ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్ అనేవి ఖాతా యాక్సెస్ పేజీలో చూపబడతాయి.
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5242830599268486097
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false