వాయిస్ సెర్చ్‌తో వీడియోలను కనుగొనండి

వీడియోలను కనుగొనడానికి వాయిస్ సెర్చ్‌ను ఉపయోగించండి.

YouTube వాయిస్ సెర్చ్ ద్వారా వచ్చే ఆడియో రికార్డింగ్‌లను మేనేజ్ చేయండి

ముఖ్య గమనిక: ఇతర సెట్టింగ్‌లను బట్టి, ఆడియో రికార్డింగ్‌లు ఇతర స్థలాలలో సేవ్ అవ్వవచ్చు.

మీరు YouTube వాయిస్ సెర్చ్‌తో మాట్లాడినప్పుడు, Google సర్వీస్, Google మీ ఆడియోను ప్రాసెస్ చేయడానికి, అలాగే మీకు ప్రతిస్పందించడానికి దాని ఆడియో గుర్తింపు టెక్నాలజీలను ఉపయోగిస్తుంది.

YouTube ఆడియో రికార్డింగ్‌ల సెట్టింగ్, మీ YouTube వాయిస్ సెర్చ్ ఇంటరాక్షన్‌ల ద్వారా వచ్చే ఆడియో రికార్డింగ్‌లను మీ Google ఖాతాలో మీ YouTube హిస్టరీతో సేవ్ చేస్తుంది. ఈ కింద వివరించబడిన విధంగా, Google ఆడియో గుర్తింపు టెక్నాలజీలను మెరుగుపరచడానికి, Google మీ YouTube హిస్టరీని ఉపయోగించవచ్చు. ఈ ఆడియో రికార్డింగ్ సెట్టింగ్ అనేది, మీరు ఆన్ చేస్తే తప్ప ఆఫ్‌లోనే ఉంటుంది.

ఆడియో రికార్డింగ్‌లు ఎలా ఉపయోగించబడతాయి

మీరు మీ YouTube హిస్టరీతో ఆడియో రికార్డింగ్‌లను సేవ్ చేయాలని ఎంచుకుంటే, Google, దాని ఆడియో గుర్తింపు టెక్నాలజీలను, అలాగే YouTube వాయిస్ సెర్చ్ వంటి వాటిని ఉపయోగించే Google సర్వీస్‌లను అభివృద్ధి చేయడానికి, అలాగే మెరుగుపరచడానికి ఈ ఆడియోను ఉపయోగిస్తుంది.

కొన్ని ఆడియో టెక్నాలజీ మెరుగుదలల కోసం, సేవ్ చేయబడిన ఆడియో శాంపిల్స్‌ను శిక్షణ పొందిన రివ్యూవర్‌లు వినడం, మాటలను టైప్ చేయడం, అదనపు గమనికలను చేర్చడం వంటివి చేస్తారు, తద్వారా Google సర్వీస్‌లు ఆడియోను మెరుగ్గా విశ్లేషించగలవు. మీ గోప్యతను కాపాడటానికి Google తగిన చర్యలను తీసుకుంటుంది, మీ ఆడియోను రివ్యూవర్‌లు విశ్లేషించేటప్పుడు, దాన్ని మీ ఖాతా నుండి వేరు చేయడం వంటి చర్యలు ఈ కోవకు చెందుతాయి.

ఆడియో రికార్డింగ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. డేటా, గోప్యతను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌ల" కింద, YouTube హిస్టరీని క్లిక్ చేయండి.
  4. సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, "ఆడియో రికార్డింగ్‌లను చేర్చండి"కి పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి లేదా ఆ బాక్స్‌కు ఉన్న ఎంపికను తీసివేయండి.

ఆడియో రికార్డింగ్‌ల సెట్టింగ్ ఆన్‌లో ఉండి, మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ అయ్యి ఉన్న సమయంలో, YouTubeలో వాయిస్ సెర్చ్‌ను ఆన్ చేసినప్పుడు, Google, ఆడియో రికార్డింగ్‌లను మీ Google ఖాతాలో మీ YouTube హిస్టరీతో సేవ్ చేస్తుంది. మీరు YouTubeను సెర్చ్ చేయడానికి Google Search లేదా Assistantను ఉపయోగించినప్పుడు, ఈ సెట్టింగ్ ఆడియోను సేవ్ చేయదు.

మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మీ పరికరాన్ని ఉపయోగిస్తుంటే, మీరు తిరిగి ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఆడియో మీ ఖాతాలో సేవ్ అవ్వవచ్చు.

ఆడియో రికార్డింగ్‌ల సెట్టింగ్ ఆఫ్‌లో ఉండి, మీరు YouTubeలో వాయిస్ సెర్చ్‌ను యాక్టివేట్ చేసినప్పుడు, మీరు సైన్ ఇన్ అయ్యి ఉన్నా కూడా, Google, ఆడియో రికార్డింగ్‌లను మీ Google ఖాతాలో మీ YouTube హిస్టరీతో సేవ్ చేయదు. మీరు Google సర్వీస్‌లతో మాట్లాడినప్పుడు, మీకు ప్రతిస్పందించడంలో మాకు సహాయపడటానికి, Google మీ ఆడియోను ప్రాసెస్ చేయడం కొనసాగిస్తుంది.

మీరు మీ వాయిస్‌ను ఉపయోగించి Google Search, Assistant వంటి ఇతర Google సర్వీస్‌లలో YouTube వీడియోల కోసం సెర్చ్ చేయవచ్చు, అలాంటి Google సర్వీస్‌ల ద్వారా సేవ్ చేయబడే, అలాగే మేనేజ్ చేయబడే ఆడియోపై ఈ YouTube వాయిస్ సెర్చ్ ఆడియో సెట్టింగ్ ప్రభావం చూపదు. Google Search, Assistant, ఇంకా Maps నుండి వచ్చే ఆడియో, మీ వెబ్ & యాప్ యాక్టివిటీతో సేవ్ అవ్వాలా లేదా అనేది మీరు activity.google.com లింక్‌లో కంట్రోల్ చేయవచ్చు.

మీరు ఆడియో రికార్డింగ్‌లను ఆఫ్ చేసినా కూడా, గతంలో సేవ్ చేయబడిన ఆడియో తొలగించబడదు. మీరు ఎప్పుడైనా మీ ఆడియో రికార్డింగ్‌లను తొలగించవచ్చు.

చిట్కా: మీ పరికరం యాక్టివేషన్‌ను తప్పుగా గుర్తించినట్లయితే, Google ఆడియోను సేవ్ చేయవచ్చు. మా సిస్టమ్‌లను మరింత మెరుగుపరచడానికి, అనవసరమైన యాక్టివేషన్‌లను తగ్గించడానికి మేము నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము.

మీ ఆడియో రికార్డింగ్‌లను కనుగొనండి లేదా తొలగించండి

మీ ఆడియో రికార్డింగ్‌లను కనుగొనండి

మీ Google ఖాతా సెట్టింగ్‌లను బట్టి, ఆడియో రికార్డింగ్‌లు ఇతర స్థలాలలో సేవ్ అవ్వవచ్చు.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపు ఉండే సైడ్‌బార్‌లో, డేటా, గోప్యతను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌ల" కింద, YouTube హిస్టరీ ఆ తర్వాత హిస్టరీని మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి. మీరు వీటిని చేయవచ్చు:
    • మీ గత యాక్టివిటీల లిస్ట్‌ను రివ్యూ చేయవచ్చు. ఆడియో ఉన్న ఐటెమ్‌లలో రికార్డింగ్ ఉంటుంది.
    • రికార్డింగ్‌ను ప్లే చేయండి. ఆడియో కు పక్కన, వివరాలు ఆ తర్వాత రికార్డింగ్‌ను చూడండి ఆ తర్వాత ప్లే చేయండి Playని క్లిక్ చేయండి.
  4. మీరు తొలగించాలనుకునే ఐటెమ్ పక్కన, మరిన్ని మరిన్ని ఆ తర్వాత తొలగించండిని క్లిక్ చేయండి.

ముఖ్య గమనిక: మీకు "టైప్ చేసిన మాటల ఫైల్ అందుబాటులో లేదు" అనే మెసేజ్ వచ్చినట్లయితే, రికార్డింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ మరీ ఎక్కువగా ఉండవచ్చు.

చిట్కా: మరింత సెక్యూరిటీని జోడించడానికి మీరు, మీ పూర్తి హిస్టరీని చూసేందుకు, ఒక అదనపు వెరిఫికేషన్ దశ అవసరం కావచ్చు.

మీ YouTube హిస్టరీ నుండి రికార్డింగ్‌లను తొలగించండి

ఒక్కోసారి ఒక్కో ఐటెమ్‌ను తొలగించండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. డేటా, గోప్యతను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌ల" కింద, YouTube హిస్టరీ ఆ తర్వాత హిస్టరీని మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
    • మీ గత యాక్టివిటీల లిస్ట్ మీకు కనిపిస్తుంది.
    • ఆడియో ఉన్న ఐటెమ్‌లలో రికార్డింగ్ ఉంటుంది.
  4. తీసివేయండి Removeని క్లిక్ చేయండి.
  5. "ఈ యాక్టివిటీని మీరు తొలగించాలనుకుంటున్నారని నిర్ధారించండి" అనే ప్రాంప్ట్ మీకు వచ్చినప్పుడు, తొలగించండిని క్లిక్ చేయండి.

ఒక్కోసారి ఒక్కో ఐటెమ్‌ను తొలగించండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. డేటా, గోప్యతను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌ల" కింద, YouTube హిస్టరీ ఆ తర్వాత హిస్టరీని మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
    • మీ గత యాక్టివిటీల లిస్ట్ మీకు కనిపిస్తుంది.
    • ఆడియో ఉన్న ఐటెమ్‌లలో రికార్డింగ్ ఉంటుంది.
  4. తీసివేయండి Removeని క్లిక్ చేయండి.
  5. "ఈ యాక్టివిటీని మీరు తొలగించాలనుకుంటున్నారని నిర్ధారించండి" అనే ప్రాంప్ట్ మీకు వచ్చినప్పుడు, తొలగించండిని క్లిక్ చేయండి.

అన్ని ఐటెమ్‌లనూ ఒకేసారి తొలగించండి

ఈ దశలు, రికార్డింగ్ ఉన్న ఐటెమ్‌లను మాత్రమే కాకుండా, మీ YouTube హిస్టరీ ఐటెమ్‌లన్నింటినీ తొలగిస్తాయి.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున, డేటా, గోప్యతను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌ల" కింద, YouTube హిస్టరీ ఆ తర్వాత హిస్టరీని మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
    • మీ గత యాక్టివిటీల లిస్ట్ మీకు కనిపిస్తుంది.
    • ఆడియో ఉన్న ఐటెమ్‌లలో రికార్డింగ్ ఉంటుంది.
  4. మీ YouTube హిస్టరీలో ఉన్న ఐటెమ్‌లన్నింటినీ తొలగించడానికి, తొలగించండి ఆ తర్వాత మొత్తం యాక్టివిటీని తొలగించండిని క్లిక్ చేయండి.
  5. తొలగించబోయే YouTube యాక్టివిటీని రివ్యూ చేయండి.
  6. తొలగింపును నిర్ధారించండి.

మీ ఆడియో రికార్డింగ్‌లను ఆటోమేటిక్‌గా తొలగించండి

ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్, ఆడియో రికార్డింగ్ ఉన్న ఐటెమ్‌లను మాత్రమే కాకుండా, మీ YouTube హిస్టరీ ఐటెమ్‌లన్నింటినీ తీసివేస్తుంది.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున, డేటా, గోప్యతను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌ల" కింద YouTube హిస్టరీ ఆ తర్వాత ఆటోమేటిక్‌గా తొలగించండిని క్లిక్ చేయండి.
  4. మీ YouTube హిస్టరీ కోసం ఒక ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. ఇంత సమయం కన్నా పాత యాక్టివిటీని ఆటోమేటిక్‌గా తొలగించండిని క్లిక్ చేయండి.
  6. మీ యాక్టివిటీని మీరు ఎంత కాలం పాటు ఉంచుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  7. తర్వాతను క్లిక్ చేయండి.
  8. నిర్ధారించండిని క్లిక్ చేయండి.

చిట్కా: ఇతర సెట్టింగ్‌లను బట్టి, ఆడియో రికార్డింగ్‌లు ఇతర స్థలాలలో సేవ్ అవ్వవచ్చు.

అభివృద్ధికి, అలాగే మెరుగుదలకు ఆడియో అవసరం లేనప్పుడు, ఆ ఆడియోను Google త్వరగా తొలగించే అవకాశం ఉంది. ఉదాహరణకు, కొన్ని భాషలకు కాలానుగతంగా తక్కువ ఆడియో అవసరం కావచ్చు.

ఆడియో రికార్డింగ్‌లను మేనేజ్ చేయండి

మీ YouTube హిస్టరీతో సేవ్ చేయబడిన ఆడియో రికార్డింగ్‌లను activity.google.com లింక్‌లో మేనేజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు ఈ కింద ఉన్న వాటిని చేయవచ్చు:

  • YouTube హిస్టరీ సెట్టింగ్‌లో, ఆడియో రికార్డింగ్‌ల సెట్టింగ్‌ను ఏ సమయంలోనైనా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.
  • మీ ఆడియోను వినవచ్చు.
  • ఒక ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు లేదా ఆడియోను మాన్యువల్‌గా తొలగించవచ్చు.
    • అభివృద్ధికి, అలాగే మెరుగుదలకు ఆడియో అవసరం లేనప్పుడు, ఆ ఆడియోను Google త్వరగా తొలగించే అవకాశం ఉంది. ఉదాహరణకు, కొన్ని భాషలకు కాలానుగతంగా తక్కువ ఆడియో అవసరం కావచ్చు.
  • మీ ఆడియోను takeout.google.com లింక్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Google సేవ్ చేసే ఇతర డేటా గురించి, అలాగే మా సర్వీస్‌లను మెరుగుపరచడానికి డేటా ఎందుకు, ఎలా ఉపయోగించబడుతుంది అనే దాని గురించి policies.google.com లింక్‌లో మీరు తెలుసుకోవచ్చు. ఇందులో, టెక్నాలజీలు మీ సమాచారాన్ని సురక్షితంగా ఎలా ఉంచుతాయి, అలాగే మా సర్వీస్‌లలో మీ గోప్యతను మేనేజ్ చేయడంలో కంట్రోల్స్ ఎలా సహాయపడతాయి అనే వాటికి సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది.

ఆడియో రికార్డింగ్‌లు సేవ్ అయ్యే అవకాశం ఉన్న ఇతర స్థలాలు

మీరు మీ వాయిస్‌ను ఉపయోగించి Google Search, Assistant వంటి ఇతర Google సర్వీస్‌లలో కూడా YouTube వీడియోల కోసం సెర్చ్ చేయవచ్చు, అలాంటి Google సర్వీస్‌ల ద్వారా సేవ్ చేయబడే, అలాగే మేనేజ్ చేయబడే ఆడియోపై YouTube వాయిస్ సెర్చ్ ఆడియో సెట్టింగ్ ప్రభావం చూపదు. Google Search, Assistant, ఇంకా Maps నుండి వచ్చే ఆడియో, మీ వెబ్, యాప్ యాక్టివిటీతో సేవ్ అవ్వాలా లేదా అనేది మీరు activity.google.com లింక్‌లో కంట్రోల్ చేయవచ్చు.

మీ వ్యక్తిగత వాయిస్ మ్యాచ్‌ను మీరు సెటప్ చేసుకుని, మెరుగుపరుచుకోవడం లేదా మీ పరికరంలో ఆడియో టెక్నాలజీలను వ్యక్తిగతీకరించడం వంటి ఇతర ప్రయోజనాల కోసం మీ పరికరంలో సేవ్ చేయబడిన ఆడియోపై కూడా ఈ సెట్టింగ్ ప్రభావం చూపదు.

ఫెడరేటెడ్ లెర్నింగ్ లేదా స్వల్పకాలిక లెర్నింగ్‌తో ఆడియో గుర్తింపు టెక్నాలజీలను మెరుగుపరచడానికి, ఈ సెట్టింగ్ ద్వారా కంట్రోల్ చేయబడని ఇతర మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్‌లను Google ఉపయోగించవచ్చు. ఉదాహరణకు:

  • Gboard మెరుగుదల సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, అందరికీ స్పీచ్ రికగ్నిషన్‌ను మెరుగుపరచడంలో సహాయపడటానికి, Gboard మీ పరికరంలో ఆడియోను సేవ్ చేసి, ప్రాసెస్ చేయవచ్చు. మీరు చెప్పిన దాన్ని అది సర్వర్‌కు పంపించదు. Gboard ఎలా మరింత మెరుగవుతుందో తెలుసుకోండి.
  • Google, స్వల్పకాలిక లెర్నింగ్‌ను ఉపయోగించే దాని ఆడియో గుర్తింపు టెక్నాలజీలను మెరుగుపరచడానికి, మీ ఆడియోను రియల్ టైంలో ప్రాసెస్ చేసి, విశ్లేషించవచ్చు. ఈ ప్రాసెస్, ఆడియోను మీ YouTube హిస్టరీతో సేవ్ చేయదు. yt.be/speechlearningmodels లింక్‌లో మరింత తెలుసుకోండి.
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14356373781304535477
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false