Hesabınızı doğrulama

దుర్వినియోగం నుండి రక్షించడంలో మీకు సహాయపడడం కోసం, మీరు మీ ఖాతాను క్రియేట్ చేయడానికి లేదా సైన్ ఇన్ చేయడానికి ముందు మీరు రోబోట్ కాదని నిరూపించమని మేము కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతాము. ఫోన్ ద్వారా జరిగే ఈ అదనపు నిర్ధారణ అనేది స్పామ్ చేసే వ్యక్తులు మా సిస్టమ్‌లను దుర్వినియోగం చేయకుండా ఉంచడంలో సహాయపడుతుంది.

చిట్కా: మీ ఖాతాను వెరిఫై చేయడానికి, మీకు మొబైల్ పరికరం అవసరమవుతుంది.

టెక్స్ట్ లేదా వాయిస్ వెరిఫికేషన్ ఖర్చు

మీ టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్‌ల ఖర్చు మీ ప్లాన్, అలాగే ప్రొవైడర్ మీద ఆధారపడి ఉంటుంది, అయితే సాధారణంగా స్టాండర్డ్ టెక్స్ట్ మెసేజ్, కాల్ ఛార్జీలు ఉంటాయి. మీరు వాయిస్ కాల్ ఆప్షన్‌ను ఎంచుకున్నప్పుడు, మీరు మీ ఇంటి ఫోన్ నంబర్‌లను కూడా ఉపయోగించవచ్చు.

మరిన్ని వివరాల కోసం, మీ మొబైల్ ఫోన్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

వెరిఫికేషన్ సమస్యలను పరిష్కరించండి

టెక్స్ట్ మెసేజ్‌ను అందుకోలేదు

మీరు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నా లేదా మీ క్యారియర్ కంపెనీ, తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సరిగా నిర్వహించకపోయినా, టెక్స్ట్ మెసేజ్ డెలివరీ ఆలస్యం కావచ్చు. మీరు కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు వేచి చూసినప్పటికీ మా టెక్స్ట్ మెసేజ్‌ను అందుకోలేకపోతే, వాయిస్ కాల్ ఆప్షన్‌ను ట్రై చేయండి.

"ఈ ఫోన్ నంబర్‌ను వెరిఫికేషన్ కోసం ఉపయోగించలేరు"

మీకు ఈ ఎర్రర్ మెసేజ్ కనిపించినట్లయితే, మీరు వేరే నంబర్‌ను ఉపయోగించాలి. దుర్వినియోగం నుండి మిమ్మల్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా, ప్రతి ఫోన్ నంబర్ క్రియేట్ చేయగలిగే ఖాతాల సంఖ్యపై మేము పరిమితి విధించాము.

Bu size yardımcı oldu mu?
Bunu nasıl iyileştirebiliriz?

Daha fazla yardıma mı ihtiyacınız var?

Bir sonraki adımları deneyin:

Arama
Aramayı temizle
Aramayı kapat
Google uygulamaları
Ana menü
Yardım Merkezinde Arayın
true
70975
false
false