2-దశల వెరిఫికేషన్‌తో మీ వ్యక్తిగత సమాచారాన్ని సంరక్షించడం

Google చాలా ఖాతాలకు త్వరలో 2-దశల వెరిఫికేషన్‌ను ప్రారంభిస్తుంది. సైన్ ఇన్ చేయడానికి రెండవ దశను ఉపయోగించడం అనేది వేగవంతంగా, సులభంగా ఉంటుంది, అలాగే ఇది మీ Google ఖాతాను మరింత సురక్షితంగా చేస్తుంది.

2-దశల వెరిఫికేషన్ ఆన్ అయిన తర్వాత ఎలా పని చేస్తుంది

సైన్ ఇన్ చేసేటప్పుడు, మీ ఫోన్‌ను సమీపంలోనే ఉంచుకోండి. 

మీ పాస్‌వర్డ్‌ను మీరు ఎంటర్ చేసిన తర్వాత, సాధారణంగా మీ ఫోన్‌ను ఉపయోగించి మీరు రెండవ దశను పూర్తి చేస్తారు. Google మీ ఫోన్‌కు పంపే సైన్-ఇన్ ప్రాంప్ట్‌ను మీరు నొక్కవచ్చు, లేదా మీకు టెక్స్ట్ చేసిన కోడ్‌ను ఎంటర్ చేయవచ్చు. (మీ క్యారియర్ నుండి ఛార్జీలు వర్తించవచ్చు.) ఇది నిజంగా మీరే సైన్ ఇన్ చేస్తున్నారని నిర్ధారించుకోవడంలో Googleకు సహాయపడుతుంది. 

మీరు ఇప్పుడు చేస్తున్న దానికంటే ఎక్కువసార్లు సైన్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త పరికరాన్ని ఉపయోగించినప్పుడు లేదా ఇది నిజంగా మీరేనని Google నిర్ధారించుకోవలసినప్పుడు మాత్రమే మీరు సైన్ ఇన్ చేస్తారు.

2-దశల వెరిఫికేషన్ మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంలో ఎలా సహాయపడుతుంది

ఆన్‌లైన్ ఖాతాలలో వ్యక్తిగత సమాచారం హ్యాకర్‌లకు చాలా అమూల్యమైనది. పాస్‌వర్డ్‌ను చోరీ చేయడం అనేది ఖాతాలు రాజీపడే అత్యంత సాధారణమైన మార్గం. 

ఉదాహరణకు, మోసపూరిత మెసేజ్‌లు లేదా ఒకేలా కనిపించే సైట్‌లు తరచూ వ్యక్తులను ఏమార్చి వారి పాస్‌వర్డ్‌లను షేర్ చేసేలా చేస్తాయి. ఈ పాస్‌వర్డ్ దొంగిలించే స్కామ్‌లు సర్వసాధారణం, కొన్నిసార్లు నిపుణులు కూడా మోసపోతారు.

మీ ఫోన్‌లో పాస్‌వర్డ్, అలాగే రెండవ దశ రెండింటితో సైన్ ఇన్ చేయడం అనేది పాస్‌వర్డ్ దొంగిలించే స్కామ్‌ల నుండి రక్షిస్తుంది. ఎవరైనా ఆన్‌లైన్‌లో మీ పాస్‌వర్డ్‌ను పొందినప్పటికీ, వారి వద్ద మీ ఫోన్ కూడా ఉండదు.

2-దశల వెరిఫికేషన్ గురించి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు

2-దశల వెరిఫికేషన్ ఎప్పుడు ఆన్ అవుతుంది?

ఈ మార్పు జరగడానికి సుమారు 7 రోజుల ముందుగా మీరు ఇమెయిల్ లేదా నోటిఫికేషన్‌ను అందుకుంటారు.

2-దశల వెరిఫికేషన్‌తో సైన్ ఇన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

2-దశల వెరిఫికేషన్ మరొక దశను జోడిస్తుంది, కానీ ఇది సాధారణంగా వేగవంతంగా, అలాగే సులభంగా ఉంటుంది. 

మీ ఇతర ఆన్‌లైన్ ఖాతాలు కొన్నింటి కోసం 2-దశల వెరిఫికేషన్‌ను మీరు ఇప్పటికే ఉపయోగించి ఉంటారు.

సైన్ ఇన్ చేయడానికి ఇతర మార్గాలను జోడించమంటారా?

ఈ మార్గాల రకాలు 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేసిన తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటాయి.

బ్యాకప్ కోడ్‌లను స్టోర్ చేయండి లేదా ప్రింట్ చేయండి

మీరు మీ ఫోన్‌ను ఉపయోగించలేకపోతే, మీ ఖాతాలోకి ప్రవేశించడానికి బ్యాకప్ కోడ్‌లు మీకు సహాయపడగలవు. మీరు బ్యాకప్ కోడ్‌లను ఒక పరికరంలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా వాటిని ప్రింట్ చేసి ఒక సురక్షితమైన ప్రదేశంలో స్టోర్ చేసుకోవచ్చు.

యాప్ నుండి కోడ్‌లు పొందండి

మీకు టెక్స్ట్ మెసేజ్‌లు అందకపోయినప్పటికీ, మీరు మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడానికి కోడ్‌లను పొందవచ్చు. మీ ఫోన్‌లో కోడ్‌లు పొందడానికి Google ప్రామాణీకరణదారు యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సెక్యూరిటీ కీని సెటప్ చేయండి

మీరు మీ Google ఖాతాతో ఉపయోగించగల అత్యంత సురక్షితమైన రెండవ దశలలో సెక్యూరిటీ కీల ఆప్షన్ ఒకటి. సెక్యూరిటీ కీని ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.

నా ఫోన్ నా వద్ద లేకపోతే 2-దశల వెరిఫికేషన్ ఎలా పని చేస్తుంది?

మీరు మీ ఫోన్‌ను కోల్పోతే లేదా మీ వద్ద లేకపోతే, మీకు సైన్ ఇన్ చేయడంలో సహాయపడటానికి Google మీ రికవరీ ఇమెయిల్‌ను ఉపయోగించవచ్చు.

మీ రికవరీ సమాచారాన్ని పూర్తి చేశారని, అలాగే అది అప్‌డేట్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి.

2-దశల వెరిఫికేషన్‌ను నేను ఆఫ్ చేయవచ్చా?

ప్రస్తుతం, అది ఆటోమేటిక్‌గా ఆన్ అయిన తర్వాత మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఆఫ్ చేయవచ్చు, కానీ పాస్‌వర్డ్‌తో మాత్రమే సైన్ ఇన్ చేయడం వలన మీ ఖాతా చాలా తక్కువ సురక్షితంగా ఉంటుంది. 

త్వరలో, చాలా వరకు Google ఖాతాలకు 2-దశల వెరిఫికేషన్ అవసరం అవుతుంది.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3527276571454125286
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false