మీ ఖాతా నుండి డేటాను తొలగించడంలో Google ఎలా సహాయపడుతుంది

మా గోప్యత, సెక్యూరిటీ టూల్స్ మీ డేటాను కంట్రోల్ చేయడానికి, దాన్ని రక్షించడానికి రూపొందించబడ్డాయి. మీ యాక్టివిటీ కంట్రోల్స్‌ను బట్టి, Search, Chrome, ఇంకా YouTube వంటి Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లలోని మీ యాక్టివిటీ మీ Google ఖాతాలో సేవ్ చేయబడవచ్చు. ఈ డేటాను చూడటానికి, అలాగే తొలగించడానికి మీరు నా యాక్టివిటీని ఉపయోగించవచ్చు.

యాక్టివిటీ తొలగింపు ఎలా పని చేస్తుంది

Google మీ ఖాతాలోని యాక్టివిటీ ఎలా తొలగిస్తుంది 

మీరు యాక్టివిటీని మాన్యువల్‌గా తొలగించాలని ఎంచుకున్నప్పుడు లేదా మీ ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్ ఆధారంగా ఆటోమేటిక్‌గా యాక్టీవిటీ తొలగించబడినప్పుడు, మేము వెంటనే ప్రోడక్ట్ నుండి, అలాగే మా సిస్టమ్‌ల నుండి దాన్ని తీసివేసే ప్రాసెస్‌ను ప్రారంభిస్తాము.

ముందుగా, మేము దాన్ని వెంటనే వీక్షణ నుండి తీసివేయడానికి ప్రయత్నిస్తాము, ఇకపై ఆ డేటా మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఉపయోగించబడకపోవచ్చు.

ఆ తర్వాత, మా స్టోరేజ్ సిస్టమ్‌ల నుండి డేటాను సురక్షితంగా, పూర్తిగా తొలగించడానికి రూపొందించబడిన ఒక ప్రాసెస్‌ను మేము ప్రారంభిస్తాము. 

డేటాను మాన్యువల్‌గా లేదా ఆటోమేటిక్‌గా తొలగించడంలో మీకు సహాయపడటంతో పాటు, ఇకపై మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడని కొన్ని రకాల యాక్టివిటీని Google త్వరగా తొలగించే అవకాశం ఉంది. 

మేము సేకరించే డేటాను Google ఎలా స్టోర్ చేసి ఉంచుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

పరిమిత ప్రయోజనాల కోసం స్టోర్ చేయబడే అవకాశం ఉన్న డేటా

మీరు 'నా యాక్టివిటీ' నుండి కొన్ని రకాల డేటాను తొలగించినప్పుడు, ఈ కింద పేర్కొనబడిన వాటితో పాటు నిర్దిష్ట ప్రయోజనాల కోసం, మీ Google ఖాతాతో అనుబంధించబడిన సమాచారాన్ని తొలగించకుండా స్టోర్ చేసి ఉంచాల్సిన అవసరం Googleకు ఉండవచ్చు: 

  • సెక్యూరిటీ, మోసం, అలాగే దుర్వినియోగాన్ని నివారించడం కోసం. ఉదాహరణకు, భవిష్యత్తులో దుర్వినియోగ ప్రవర్తనను బ్లాక్ చేయడంలో సహాయపడటానికి, దుర్వినియోగ ఖాతాలకు సంబంధించిన సమాచారం స్టోర్ చేయబడవచ్చు.
  • ఆర్థికపరమైన రికార్డ్‌లను భద్రపరచడం కోసం. ఉదాహరణకు, మీరు Google Play నుండి ఒక యాప్‌ను కొనుగోలు చేస్తే, అవసరమైన అకౌంటింగ్ ప్రయోజనాల కోసం, ఆ లావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని స్టోర్ చేసి ఉంచాల్సిన అవసరం Googleకు ఉండవచ్చు.
  • చట్టపరమైన లేదా రెగ్యులేటరీ అవసరాలను పాటించడం కోసం. ఉదాహరణకు, Googleకు చట్టబద్ధమైన సాక్షి సమను అందినట్లయితే, చట్టానికి అనుగుణంగా సమాచారాన్ని స్టోర్ చేయాల్సి రావచ్చు.
  • మా సర్వీస్‌లు నిర్విరామంగా పని చేస్తున్నాయి అని నిర్ధారించుకోవడం కోసం. ఉదాహరణకు, మీరు ఇతరులతో సమాచారాన్ని షేర్ చేస్తే (ఉదా., ఒకరికి మెసేజ్‌ను పంపడానికి Google Assistantను ఉపయోగించడం), మీ Google ఖాతా నుండి యాక్టివిటీని తొలగించడం వలన, మీరు పంపించిన మెసేజ్ తొలగించబడదు.
  • నేరుగా Googleతో కమ్యూనికేట్ చేయడం కోసం. ఉదాహరణకు, Google Mapsలో మీరు ఏదైనా ప్రదేశానికి ఎడిట్‌ను సూచించినట్లయితే.

అజ్ఞాతీకరించబడిన డేటా

కొన్ని సర్వీస్‌లను నడిపించడంలో సహాయపడటానికి, మీరు మీ డేటాను తొలగించిన తర్వాత, దాని తాలూకు అజ్ఞాతీకరించబడిన వెర్షన్ స్టోర్ చేయబడవచ్చు. అజ్ఞాతీకరించబడిన డేటా ఇకపై మీతో కానీ లేదా మీ ఖాతాతో కానీ అనుబంధించబడదు.

ఉదాహరణకు, మీరు 'నా యాక్టివిటీ' నుండి ఒక సెర్చ్‌ను తొలగించినట్లయితే, ప్రపంచవ్యాప్త సెర్చ్ ట్రెండ్‌లు వంటి ఫంక్షనాలిటీని క్రియేట్ చేయడానికి, మీరు దేని కోసం అయితే సెర్చ్ చేశారో, ఆ అంశం తాలూకు అజ్ఞాతీకరించబడిన వెర్షన్ స్టోర్ చేయబడవచ్చు.

Google సర్వీస్‌ల వినియోగం

డేటాను తొలగించినప్పుడు, Google సర్వీస్‌ల వినియోగానికి సంబంధించిన కొంత సమాచారం (ఉదాహరణకు, మీరు ఏయే Google సర్వీస్‌లను ఉపయోగిస్తారు, వాటిని ఎంత తరచుగా ఉపయోగిస్తారు), మీ Google ఖాతా తొలగించబడే దాకా అలాగే ఉంచబడుతుంది.

ఉదాహరణకు, మీరు Google Mapsలో సెర్చ్ చేసిన అడ్రస్‌ను మీరు తొలగించినట్లయితే, ఇప్పటికీ మీ ఖాతా మీరు దిశల ఫీచర్‌ను ఉపయోగించారనే విషయాన్ని స్టోర్ చేయవచ్చు. దీని వలన, భవిష్యత్తులో మీకు దిశల ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలనే దాని గురించి Google Maps సూచనలను చూపించకుండా ఉండగలదు.

Google మీ గోప్యతను ఎలా సంరక్షిస్తుంది

మీ యాక్టివిటీని మేనేజ్ చేయడం, అలాగే తొలగించడం ఎలా

మీ యాక్టివిటీని కనుగొని, తొలగించడానికి, activity.google.comకు వెళ్లండి. మీరు ఏ సమయంలో అయినా, మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇతర ప్రదేశాలలో సేవ్ అయిన డేటాను తొలగించండి

మీ ఖాతాలో ఏ యాక్టివిటీ సేవ్ చేయబడాలో ఎంచుకోండి

ఇకపై మీ Google ఖాతాలో ఏ యాక్టివిటీని సేవ్ చేయాలో ఎంచుకోవడంలో మీకు సహాయపడటానికి, మీరు మీ యాక్టివిటీ కంట్రోల్స్‌ను ఉపయోగించవచ్చు. మీరు యాక్టివిటీ కంట్రోల్స్‌ను ఆఫ్ చేసినప్పుడు, 'నా యాక్టివిటీ'లో సేవ్ అయిన డేటా తొలగించబడదు.
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7786182500686899475
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false