నేను డౌన్‌లోడ్ చేసిన వీడియోను చూడలేకపోతున్నాను

వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకొని, మీ సమస్య పరిష్కారం కోసం దిగువనున్న దశలను రివ్యూ చేయండి.

మొదటి దశగా YouTube యాప్‌ను లేదా బ్రౌజర్ విండోను మూసివేసి, దాన్ని మళ్లీ తెరవండి, ఇలా చేయడం వలన సాధారణంగా ఉండే చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. తర్వాత, మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయడాన్ని ప్రారంభించండి.

సరికొత్త పరికరాలలో వీడియోలను తిరిగి డౌన్‌లోడ్ చేయండి

మీరు ఇటీవలే కొత్త పరికరాన్ని ఉపయోగించడం మొదలుపెట్టి ఉంటే, మీరు చూడాలనుకుంటున్న వీడియోలను మళ్లీ డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకే ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉన్నా కూడా, వీడియోలు ఇతర పరికరాలకు బదిలీ అవ్వవు. వీడియో డౌన్‌లోడ్‌లు అనేవి డౌన్‌లోడ్ చేసిన నిర్దిష్ట పరికరానికి మాత్రమే పరిమితం అయ్యి ఉంటాయి.

మీ మెంబర్‌షిప్ గడువు ముగిసిందో లేదో చెక్ చేయండి

మీ YouTube Premium మెంబర్‌షిప్ గడువు ముగియలేదని నిర్ధారించుకోండి.

YouTube యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

  • మీరు ఇటీవల YouTube Premiumకు యాక్సెస్‌ను కోల్పోయి ఉండి, దానికి తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకొని ఉంటే, తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకొన్న తర్వాత సేవ్ చేసిన వీడియోలు కనిపించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.
  • మీరు వెంటనే వీడియోను చూడాలనుకుంటే, మెనూ మూడు చుక్కల మెనూ వర్టికల్ను ట్యాప్ చేసి, డౌన్‌లోడ్‌ను మళ్లీ ట్రై చేయండిని ఎంచుకోండి.
  • మీ YouTube Premium మెంబర్‌షిప్ ముగిస్తే, డౌన్‌లోడ్ చేసిన వీడియోలకు మీకు ఇకపై యాక్సెస్ ఉండదు. మీ డౌన్‌లోడ్‌లకు యాక్సెస్‌ను తిరిగి పొందడానికి, Premium మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయండి.

మీరు YouTube Premiumకు సైన్ ఇన్ చేశారో లేదో చెక్ చేసుకోండి

మీ YouTube Premium మెంబర్‌షిప్‌తో అనుబంధించబడిన Google ఖాతాకే మీరు సైన్ ఇన్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి:

  • సైన్ అవుట్ చేసి, మళ్లీ YouTube Premiumకు అనుబంధించబడిన ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి.
  • మీకు YouTube Premium లోగో కనిపిస్తోందని చెక్ చేయండి (YouTube లోగో కాకుండా). YouTube మొబైల్ యాప్‌లో లేదా మీ కంప్యూటర్‌లో, మీకు YouTube Premium లోగో, మీ యాప్ లేదా బ్రౌజర్‌లో ఎగువ ఎడమ వైపు మూలన కనిపిస్తుంది.
స్మార్ట్ టీవీలో YouTubeను ఉపయోగిస్తున్నారా?
  • మీరు మీ టీవీలో YouTube Premium మెంబర్‌షిప్‌తో అనుబంధించబడిన ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  • మీరు టీవీలో ప్రసారం చేస్తున్నట్లయితే, మీరు టీవీ, కంప్యూటర్ లేదా మీరు ఉపయోగిస్తున్న పరికరం రెండింటిలోనూ సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి. 
  • మీరు Google Homeను ఉపయోగిస్తున్నట్లయితే, Google Home యాప్‌లో సరైన ఖాతాకే సైన్ ఇన్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి.

సపోర్ట్‌ను సంప్రదించండి, అలాగే ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించండి

మీరు ఇప్పటికీ సమస్యను ఎదుర్కొంటుంటే, సపోర్ట్‌ను సంప్రదించండి. సపోర్ట్‌ను సంప్రదించేటప్పుడు, వీటిని పేర్కొనండి:

  • మీకు ఏదైనా ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోందా?
  • ఆ మెసేజ్ ఎక్కడ కనిపిస్తోంది, అందులో సరిగ్గా ఏమి టెక్స్ట్ ప్రదర్శించబడింది? కుదిరితే, ఒక స్క్రీన్‌షాట్‌ను చేర్చండి.
YouTubeకు ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను పంపండి:
  • మీ సమస్యపై మీరు ఫీడ్‌బ్యాక్‌ను కూడా సమర్పించవచ్చు. మీకు ప్రతిస్పందన లభించదు, కానీ మీ ఫీడ్‌బ్యాక్ YouTubeతో షేర్ చేయబడుతుంది.
  • ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను పంపడానికి, YouTubeలో, మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత ఫీడ్‌బ్యాక్‌ను పంపండి Feedbackని ఎంచుకోండి.
  • మీ సమస్యను మరింత బాగా అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడటానికి, "సిస్టమ్ లాగ్స్"‌కు సంబంధించిన బాక్స్‌ను ఎంచుకొనేలా చూసుకోండి.

తిరిగి YouTube Premium మెంబర్ ప్రయోజనాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండికి వెళ్లండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6292807177224222878
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false