బ్యాక్‌గ్రౌండ్ ప్లే పని చేయడం లేదు

బ్యాక్‌గ్రౌండ్ ప్లే కేవలం YouTube మొబైల్ యాప్‌లలో మాత్రమే పని చేస్తుంది, దానికి YouTube Premium మెంబర్‌షిప్ అవసరం అవుతుంది. మీకు ఛానెల్ మెంబర్‌షిప్ ఉన్నప్పటికీ కొన్ని వీడియోలు బ్యాక్‌గ్రౌండ్ ప్లేతో ప్లే చేయడానికి లేదా ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడానికి అందుబాటులో ఉండవు. మీ సమస్యను పరిష్కరించడంలో సహాయం కోసం, దిగువనున్న దశలను రివ్యూ చేయండి.

తరచుగా వచ్చే సమస్యలకు సంబంధించిన పరిష్కార ప్రక్రియ దశలు

 YouTube యాప్‌ను రీస్టార్ట్ చేయండి లేదా మీ పరికరాన్ని రీబూట్ చేయండి

YouTube యాప్ లేదా మీ మొబైల్ పరికరం కొంత సమయం నుండి రన్ అవుతూ ఉంటే, బ్యాక్‌గ్రౌండ్ ప్లే సజావుగా పని చేయడానికి తగినన్ని రిసోర్స్‌లు ఉండకపోవచ్చు. YouTube యాప్‌ను మూసివేయడానికి లేదా మీ ఫోన్‌ను రీబూట్ చేయడానికి ట్రై చేయండి.

మీ మెంబర్‌షిప్ గడువు ముగిసిందా, లేదా అని చెక్ చేయండి

మీ YouTube Premium మెంబర్‌షిప్ గడువు ముగియలేదని నిర్ధారించుకోండి. YouTube యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత పెయిడ్ మెంబర్‌షిప్‌లను ట్యాప్ చేసి, మేనేజ్ చేయండికి కిందకు స్క్రోల్ చేయండి.

మీరు ఇటీవల YouTube Premiumకు యాక్సెస్‌ను కోల్పోయి, ఆపై తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకొని ఉంటే, మీరు తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకొన్న తర్వాత సేవ్ చేసిన వీడియోలు అందుబాటులోకి రావడానికి కొన్ని గంటల సమయం పడుతుందని గమనించండి. మీరు వెంటనే వీడియోను చూడాలనుకుంటే, మరిన్ని ''ని ట్యాప్ చేసి, డౌన్‌లోడ్ చేయడానికి మళ్లీ ట్రై చేయండిని ఎంచుకోండి.

YouTube Premiumకు తిరిగి సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి

మీ YouTube Premium మెంబర్‌షిప్‌తో అనుబంధించబడి ఉన్న అదే ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.

  • YouTube Premiumతో అనుబంధించబడిన అదే ఖాతాకు సైన్ అవుట్ చేసి, తిరిగి సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి.
  • YouTubeలో మీకు YouTube Premium లోగో (YouTube లోగోకు బదులుగా) కనిపిస్తోందో, లేదో చెక్ చేయండి.

YouTube Premium మీ లొకేషన్‌లో అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి

YouTube Premium ప్రయోజనాలు YouTube Premium అందుబాటులో ఉన్న దేశాల్లో మాత్రమే పని చేస్తాయి. మీరు YouTube Premium లాంచ్ చేయబడిన లొకేషన్‌లో ఉన్నారో లేదో చెక్ చేయండి.

మీ బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్ సెట్టింగ్‌లను చెక్ చేయండి

YouTube యాప్‌లో మీ బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్ సెట్టింగ్‌లను చెక్ చేసి, సెట్టింగ్‌ను మీరు డిజేబుల్ చేయలేదని నిర్ధారించుకోండి.

మీ YouTube యాప్‌ను అప్‌డేట్ చేయండి

మీరు YouTube యాప్ యొక్క తాజా వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. మీ యాప్ స్టోర్‌కు వెళ్లి, మీరు YouTube యాప్‌నకు సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉన్న అప్‌డేట్‌లను కలిగి ఉన్నారేమో చెక్ చేయండి.

మీ ఫోన్ కొత్తది అయినా లేదా మీరు ఇటీవల మీ ఫోన్‌ను రీస్టోర్ చేసినా, దానిలో YouTube యాప్ యొక్క పాత వెర్షన్‌ను ఉండవచ్చు (ఉదా., 12.0 కంటే తక్కువ వెర్షన్‌లు పాతవిగా పరిగణించబడతాయి).

మీ ఫోన్ మొబైల్ డేటా సెట్టింగ్‌లను చెక్ చేయండి

మీరు YouTube కోసం బ్యాక్‌గ్రౌండ్ డేటాను ఎనేబుల్ చేశారని నిర్ధారించుకోవడానికి మీ మొబైల్ పరికరంలోని సెట్టింగ్‌లను చెక్ చేయండి.

అదనపు దశలను ట్రై చేయండి

ఇతర యాప్‌లు వేటిలోనూ ఆడియో ప్లే కావడం లేదని ధృవీకరించుకోండి

మీరు తెరిచిన యాప్‌లు ఏవైనా ఉంటే చెక్ చేసి, వేటిలోనూ ఆడియో ప్లే కావడం లేదని నిర్ధారించుకోండి. ఇతర యాప్‌లలో ఆడియో ప్లే అవుతున్నప్పుడు, బ్యాక్‌గ్రౌండ్ ప్లే పని చేయదు.

మీ ఇంటర్నెట్ కనెక్షన్ సామర్థ్యాన్ని చెక్ చేయండి

వీడియో డౌన్‌లోడ్‌లకు ఉత్తమమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. మీ పరికరం 3Mbps లేదా అంత కంటే వేగవంతమైన Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యి ఉందని, లేదా 3G, 4G, లేదా LTE వేగాలను సపోర్ట్ చేసేటటువంటి డేటా ప్లాన్ ఉన్న మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి. మీ ప్రస్తుత ఇంటర్నెట్ వేగం ఎంత అనేది మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీరు ఆన్‌లైన్‌లో మీ వేగాన్ని టెస్ట్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను చెక్ చేయండి

మీరు YouTube యాప్‌నకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్‌లను బ్లాక్ చేశారో, లేదో చెక్ చేయండి. మీరు దీనిని మీ పరికర సెట్టింగ్‌లలో నిర్ధారించుకోవచ్చు. మీరు నోటిఫికేషన్‌లను బ్లాక్ చేసినట్లయితే, YouTube యాప్ సాఫీగా రన్ అవ్వదు మరియు/లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయలేదు.

ఇలా జరిగితే, మీరు OS స్థాయిలో YouTube నోటిఫికేషన్‌లను తిరిగి ఎనేబుల్ చేయవలసి ఉంటుంది, ఇప్పుడు కూడా మీరు నోటిఫికేషన్‌లను అందుకోకూడదు అనుకుంటే, వాటిని మీరు YouTube యాప్ సెట్టింగ్‌లలో డిజేబుల్ చేయవచ్చు.

సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి, అలాగే ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను సబ్మిట్ చేయండి

మీరు ఇప్పటికీ సమస్యను ఎదుర్కొంటుంటే, సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి. సపోర్ట్ టీమ్‌ను సంప్రదించేటప్పుడు, దయచేసి వీటిని పేర్కొనండి:
  • మీరు యాప్ నుండి నిష్క్రమించిన వెంటనే సౌండ్ ఆగిపోతుందా, లేక కొంత సమయం ప్లే అయ్యి, ఆపై ఊహించని విధంగా ఆగిపోతుందా అని దయచేసి పేర్కొనండి.
  • మీరు యాప్‌నకు తిరిగి వచ్చినప్పుడు మీకు ఏవైనా ఎర్రర్ మెసేజ్‌లు కనిపిస్తే, దయచేసి వాటిని పేర్కొనండి.
  • దయచేసి యాప్‌లో ఫీడ్‌బ్యాక్‌ను సబ్మిట్ చేయండి.
YouTubeకు ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను పంపండి:
  • మీరు ప్రోడక్ట్‌లో కూడా ఫీడ్‌బ్యాక్‌ను సబ్మిట్ చేయవచ్చు. మీకు ప్రతిస్పందన లభించదు, కానీ మీ ఫీడ్‌బ్యాక్ YouTube ప్రోడక్ట్ టీమ్‌లతో షేర్ చేయబడుతుంది.
  • ఈ విధంగా చేయడానికి, మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత ఫీడ్‌బ్యాక్ Feedbackను ఎంచుకోండి.
  • "సిస్టమ్ లోగోల"కు సంబంధించిన బాక్స్‌ను ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. మీ సమస్యను బాగా అర్థం చేసుకోవడంలో ఇది మాకు సహాయపడుతుంది. 

 

తిరిగి YouTube Premium మెంబర్ ప్రయోజనాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండికి వెళ్లండి  

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13291711228697184138
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false