నేను వీడియోలను డౌన్‌లోడ్ చేయలేకపోతున్నాను

గమనిక: మీకు YouTube Premium లేకపోయినా లేదా మీకు డౌన్‌లోడ్ చేసే సదుపాయం అందుబాటులో లేకపోయినా, పిల్లల కోసం రూపొందించిన వీడియోలలో డౌన్‌లోడ్ బటన్ అందుబాటులో ఉండదు, అది లేత బూడిద రంగులో చూపబడుతుంది. మీ YouTube Premium మెంబర్‌షిప్ గడువు ముగిస్తే, డౌన్‌లోడ్ చేసిన వీడియోలకు మీకు ఇకపై యాక్సెస్ ఉండదు.

మీరు YouTube Premiumకే సైన్ ఇన్ చేసి ఉన్నారని చెక్ చేసుకోండి

మీ YouTube Premium మెంబర్‌షిప్‌తో అనుబంధించబడిన Google ఖాతాకే మీరు సైన్ ఇన్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి:
  • సైన్ అవుట్ చేసి, మళ్లీ YouTube Premiumకు అనుబంధించబడిన ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి.
  • మీకు YouTube Premium లోగో కనిపిస్తోందని చెక్ చేయండి (YouTube లోగో కాకుండా). YouTube మొబైల్ యాప్‌లో లేదా మీ కంప్యూటర్‌లో, మీకు YouTube Premium లోగో, మీ యాప్ లేదా బ్రౌజర్‌లో ఎగువ ఎడమ వైపు మూలన కనిపిస్తుంది.
స్మార్ట్ టీవీలో YouTubeను ఉపయోగిస్తున్నారా?
  • మీరు మీ టీవీలో YouTube Premium మెంబర్‌షిప్‌తో అనుబంధించబడిన ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  • మీరు టీవీలో ప్రసారం చేస్తున్నట్లయితే, మీరు టీవీ, కంప్యూటర్ లేదా మీరు ఉపయోగిస్తున్న పరికరం రెండింటిలోనూ సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి. 
  • మీరు Google Homeను ఉపయోగిస్తున్నట్లయితే, Google Home యాప్‌లో సరైన ఖాతాకే సైన్ ఇన్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి.

మీ మెంబర్‌షిప్ గడువు ముగియలేదని చెక్ చేయండి

మీ YouTube Premium మెంబర్‌షిప్ గడువు ముగియలేదని నిర్ధారించుకోండి.

YouTube యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

  • మీరు ఇటీవల YouTube Premiumకు యాక్సెస్‌ను కోల్పోయి ఉండి, దానికి తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకొని ఉంటే, తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకొన్న తర్వాత సేవ్ చేసిన వీడియోలు కనిపించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.
  • మీరు వెంటనే వీడియోను చూడాలనుకుంటే, మెనూ మూడు చుక్కల మెనూ వర్టికల్ను ట్యాప్ చేసి, డౌన్‌లోడ్‌ను మళ్లీ ట్రై చేయండిని ఎంచుకోండి.
  • మీ YouTube Premium మెంబర్‌షిప్ ముగిస్తే, డౌన్‌లోడ్ చేసిన వీడియోలకు మీకు ఇకపై యాక్సెస్ ఉండదు. మీ డౌన్‌లోడ్‌లకు యాక్సెస్‌ను తిరిగి పొందడానికి, Premium మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయండి.

మీ లొకేషన్‌లో YouTube Premium అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి

YouTube Premium ప్రయోజనాలు YouTube Premium అందుబాటులో ఉన్న దేశాలు/ప్రాంతాలలో మాత్రమే పని చేస్తాయి. మీరు YouTube Premium అందుబాటులో ఉన్న లొకేషన్‌లో ఉన్నారో లేదో చెక్ చేయండి.

మీ డౌన్‌లోడ్ సెట్టింగ్‌లను చెక్ చేసుకోండి

మీరు మొబైల్ డేటాను ఉపయోగిస్తున్నప్పుడు డౌన్‌లోడ్ చేయడానికి ట్రై చేసి, సాధ్యపడకపోతే, డౌన్‌లోడ్‌లు అనేవి 'Wi-Fiని ఉపయోగించేటప్పుడు మాత్రమే' అనే ఆప్షన్‌కు పరిమితం చేయబడలేదని నిర్ధారించుకోవడానికి యాప్‌లో మీ డౌన్‌లోడ్ సెట్టింగ్‌లను చెక్ చేయండి.

మీ YouTube యాప్ వెర్షన్‌ను చెక్ చేయండి

మీరు YouTube యాప్ యొక్క తాజా వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. మీ యాప్ స్టోర్‌కు వెళ్లి, మీరు YouTube యాప్‌నకు సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉన్న అప్‌డేట్‌లను కలిగి ఉన్నారేమో చెక్ చేయండి.

మీ ఫోన్ కొత్తది అయినా లేదా మీరు ఇటీవల మీ ఫోన్‌ను రీస్టోర్ చేసినా, దానిలో YouTube యాప్ యొక్క పాత వెర్షన్‌ను ఉండవచ్చు (ఉదా., 12.0 కంటే తక్కువ వెర్షన్‌లు పాతవిగా పరిగణించబడతాయి).

ట్రై చేయడానికి అందుబాటులో ఉన్న అదనపు పరిష్కార ప్రక్రియ దశలు

మీ ఇంటర్నెట్ కనెక్షన్ సామర్థ్యాన్ని చెక్ చేయండి

వీడియో డౌన్‌లోడ్‌లకు ఉత్తమమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. మీ పరికరం 3mbps లేదా అంత కంటే వేగవంతమైన Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యి ఉందని, లేదా 3G, 4G, లేదా LTE వేగాలను సపోర్ట్ చేసేటటువంటి డేటా ప్లాన్ ఉన్న మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి. మీ ప్రస్తుత ఇంటర్నెట్ వేగం ఎంత అనేది మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీరు ఆన్‌లైన్‌లో మీ వేగాన్ని టెస్ట్ చేసుకోవచ్చు.

మీరు ఎన్ని పరికరాలలో డౌన్‌లోడ్ చేశారో చెక్ చేసుకోండి

మీరు చాలా పరికరాల్లో వీడియోలను డౌన్‌లోడ్ చేశారా? మీరు వీడియోలను ఎన్ని పరికరాలకు డౌన్‌లోడ్ చేయవచ్చనే దానికి పరిమితి ఉంది. మీరు ఆ పరిమితిని చేరుకున్నాక, "ఈ వీడియోను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయడానికి సాధ్యపడదు" అనే ఎర్రర్ మెసేజ్‌ను మీరు పొందుతారు. మీరు ఇప్పటికే ఉపయోగించిన పరికరాలలో ఇప్పటికీ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. YouTube Premiumకు సంబంధించిన పరికర పరిమితుల గురించి మరింత తెలుసుకోండి.

మీ ఫోన్ మొబైల్ డేటా సెట్టింగ్‌లను చెక్ చేయండి

మీరు YouTube కోసం బ్యాక్‌గ్రౌండ్ డేటాను ఎనేబుల్ చేశారని నిర్ధారించుకోవడానికి మీ మొబైల్ పరికరంలోని సెట్టింగ్‌లను చెక్ చేయండి.

సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి, అలాగే ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించండి

మీరు ఇప్పటికీ సమస్యను ఎదుర్కొంటుంటే, సపోర్ట్‌ను సంప్రదించండి. సపోర్ట్‌ను సంప్రదించేటప్పుడు, వీటిని పేర్కొనండి:

  • మీకు ఏదైనా ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోందా?
  • ఆ మెసేజ్ ఎక్కడ కనిపిస్తోంది, అందులో సరిగ్గా ఏమి టెక్స్ట్ ప్రదర్శించబడింది? కుదిరితే, ఒక స్క్రీన్‌షాట్‌ను చేర్చండి.
YouTubeకు ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను పంపండి:
  • మీ సమస్యపై మీరు ఫీడ్‌బ్యాక్‌ను కూడా సమర్పించవచ్చు. మీకు ప్రతిస్పందన లభించదు, కానీ మీ ఫీడ్‌బ్యాక్ YouTubeతో షేర్ చేయబడుతుంది.
  • ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను పంపడానికి, YouTubeలో, మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత ఫీడ్‌బ్యాక్‌ను పంపండి Feedbackని ఎంచుకోండి.
  • మీ సమస్యను మరింత బాగా అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడటానికి, "సిస్టమ్ లాగ్స్"‌కు సంబంధించిన బాక్స్‌ను ఎంచుకొనేలా చూసుకోండి.

 

తిరిగి YouTube Premium మెంబర్ ప్రయోజనాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండికి వెళ్లండి 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5919371938400564953
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false