మీ Premium మెంబర్‌షిప్‌ను రద్దు చేయండి

YouTube Premium, YouTube Music Premium సబ్‌స్క్రయిబర్‌లు వారి పెయిడ్ మెంబర్‌షిప్ సమయంలో ఎప్పుడైనా రద్దు చేయవచ్చు, పాజ్ చేయవచ్చు, లేదా కొనసాగించవచ్చు. మీరు వార్షిక ప్లాన్‌కు లేదా ఫ్యామిలీ ప్లాన్‌కు కూడా మారవచ్చు.

మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను చూడటానికి, అలాగే మేనేజ్ చేయడానికి కింద ఉన్న బటన్‌ను క్లిక్ చేయండి. ఆ తర్వాత, మీ YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్‌షిప్‌ను రద్దు చేయడానికి ఈ ఆర్టికల్‌లో ఉన్న దశలను ఫాలో అవ్వండి.

మీ iPhone లేదా iPadతో మీరు కొనుగోలు చేసి ఉంటే, లేదా Apple ద్వారా YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేసి ఉంటే, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి మీరు Apple సపోర్ట్‌ను సంప్రదించాలి. Apple రీఫండ్ పాలసీ వర్తిస్తుంది.

మీరు మెంబర్‌షిప్‌ను ట్రయల్ సమయంలో రద్దు చేయవచ్చు. మీరు రద్దు చేసుకోవడాన్ని ఎంచుకుంటే, ట్రయల్ చివరిలో మీ ట్రయల్ మెంబర్‌షిప్, పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌గా బదిలీ చేయబడదు. ట్రయల్ పీరియడ్ ముగిసే దాకా మీకు ఉన్న యాక్సెస్ అలాగే కొనసాగుతుంది.

మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయండి

 

మీరు Google Play Billingకు సైన్ అప్ చేసినట్లయితే, మీ మెంబర్‌షిప్‌ను ఎలా రద్దు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

  1. youtube.com/paid_memberships‌కు వెళ్లండి.
  2. మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.​
  3. డీయాక్టివేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. రద్దు చేయడానికి కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. రద్దు చేయడానికి గల మీ కారణాన్ని ఎంచుకుని, ఆపై తర్వాత అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. అవును, రద్దు చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇప్పుడే రద్దు చేయండి

How to cancel your YouTube Premium or YouTube Music Premium membership

రద్దు చేయడంలో సమస్యను ఎదుర్కొంటున్నారా?

కింది వాటిలో ఏదైనా మీకు వర్తిస్తుందో లేదో చెక్ చేయండి:
  1. మీకు Apple ద్వారా బిల్ చేయబడింది. మీరు YouTube iOS యాప్ నుండి చేరినట్లయితే, మీరు మీ Apple ఖాతా నుండి మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయవచ్చు.
  2. మీకు Google Play ద్వారా బిల్ చేయబడింది. మీకు Google Play సబ్‌స్క్రిప్షన్ ద్వారా YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌నకు యాక్సెస్ ఉంటే, మీ Google Play ఖాతా సెట్టింగ్‌లలోనే మీరు రద్దు చేయవచ్చు.
  3. మీరు ఇప్పటికే రద్దు చేశారు. youtube.com/paid_membershipsలో మీ ఖాతాకు సంబంధించిన పెయిడ్ మెంబర్‌షిప్‌లు అనే విభాగాన్ని చెక్ చేయడం ద్వారా మీరు నిర్ధారించవచ్చు.
గమనికలు:

మీరు YouTube పెయిడ్ మెంబర్ అయినప్పుడు, మీరు రద్దు చేసే వరకు, ప్రతి కొత్త బిల్లింగ్ కాల వ్యవధి ప్రారంభంలో, మీకు ఆటోమేటిక్‌గా మెంబర్‌షిప్ ధర ఛార్జ్ చేయబడుతుంది.

మీరు మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసినప్పుడు, మీరు మళ్లీ సబ్‌స్క్రయిబ్ చేసుకునేంత వరకు మీకు ఛార్జీ విధించబడదు. మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు బిల్లింగ్ వ్యవధి ముగిసే వరకు కొనసాగుతాయి.

Google Play Store రీఫండ్‌లు

Pixel Pass సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీరు YouTube Premiumను పొందినట్లయితే, మీ ఖాతాను ఎలా మేనేజ్ చేయాలో ఇక్కడ మరింత తెలుసుకోండి.
2022 నుండి, Androidలో సైన్ అప్ చేసిన కొత్త YouTube Premium, Music Premium సబ్‌స్క్రయిబర్‌లకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రయిబర్‌లు ఈ మార్పు వల్ల ప్రభావితం అవ్వరు. ఇటీవలి ఛార్జీలను చూడటానికి, అలాగే మీకు ఎలా బిల్ చేయబడుతుందో చెక్ చేయడానికి మీరు payments.google.com‌కు వెళ్లవచ్చు. Google Play కొనుగోలుకు సంబంధించిన రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, ఇక్కడ వివరించిన దశలను ఫాలో అవ్వండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2268985346186164928
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false