Google Chat నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి

మీరు ఇటీవల ఉపయోగించిన పరికరాలలో నోటిఫికేషన్‌లు కనిపిస్తాయి. మీరు Chatలో యాక్టివ్‌గా లేకపోతే, మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాలలో నోటిఫికేషన్‌లు కనిపిస్తాయి.

మీరు మెసేజ్‌ను క్రియేట్ చేసినప్పుడు లేదా దానికి సమాధానం ఇచ్చినప్పుడు లేదా మిమ్మల్ని @తో పేర్కొన్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్‌లు వస్తాయి.

ఆటోమేటిక్ నోటిఫికేషన్‌లను మీరు ఆఫ్ చేయవచ్చు లేదా కింది వాటి ప్రకారం మీ నోటిఫికేషన్‌లను అనుకూలంగా మార్చవచ్చు:

  • పరికరం
  • సంభాషణ
  • స్పేస్
  • థ్రెడ్

Google Chat లేదా Gmail వంటి, మీరు ఉపయోగించే ప్రోడక్ట్ లోపల మీరు నోటిఫికేషన్‌లను అనుకూలంగా మార్చవచ్చు. 12 గంటల కంటే ఎక్కువ సమయం ముందు వచ్చిన మీరు చదవని మెసేజ్‌ల కోసం ఈమెయిల్ రిమైండర్‌లను సెటప్ చేయవచ్చు.

చిట్కా: మీకు పలు Google ఖాతాలు ఉంటే, ప్రతి ఖాతాకు మీరు వేర్వేరు నోటిఫికేషన్ సెట్టింగ్‌లను సెటప్ చేయవచ్చు. 

Google Chat నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి 

నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి

Google Chatలో నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు వెళ్లండి.  
  2. ఎగువున కుడివైపు ఉన్న సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. Google Chat మెసేజ్‌ల కోసం నోటిఫికేషన్‌లను ఆన్ చేయడానికి, "డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లు" ఆప్షన్ కింద, "చాట్ నోటిఫికేషన్‌లను అనుమతించండి" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
చిట్కా: చదవని మెసేజ్‌ల కోసం ఈమెయిల్ నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, “ఈమెయిల్ నోటిఫికేషన్‌లు” కింద, @ప్రస్తావనలు & డైరెక్ట్ మెసేజ్‌లు మాత్రమే అనే ఆప్షన్‌ను, లేదా ఆఫ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

నోటిఫికేషన్‌లు ఆన్‌లో ఉన్నాయో లేదో చెక్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు వెళ్లండి.  
  2. పై భాగంలో కుడి వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  3. "డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లు" కింద, ఒక ఉదాహరణ చూపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఉదాహరణ నోటిఫికేషన్ కనిపించకపోతే:

Gmailలో నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmail‌ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువున, Chat, Meet ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "Chat నోటిఫికేషన్‌ల సెట్టింగ్‌లు" అనే ఆప్షన్ కింద, చాట్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. Google Chat మెసేజ్‌ల కోసం నోటిఫికేషన్‌లను ఆన్ చేయడానికి, "డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లు" ఆప్షన్ కింద, "చాట్ నోటిఫికేషన్‌లను అనుమతించండి" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.

నోటిఫికేషన్‌లు ఆన్‌లో ఉన్నాయో లేదో చెక్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు  ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువున, Chat, Meet ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "Chat నోటిఫికేషన్‌ల సెట్టింగ్‌లు" పక్కన, చాట్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. "డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లు" కింద, ఒక ఉదాహరణ చూపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. ఉదాహరణ నోటిఫికేషన్ కనిపించకపోతే:

నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి

Google Chatలో నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు వెళ్లండి.
  2. పై భాగంలో కుడి వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. Google Chat మెసేజ్‌ల కోసం నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడానికి, "డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లు" ఆప్షన్ కింద, "చాట్ నోటిఫికేషన్‌లను అనుమతించండి" పక్కన ఉన్న బాక్స్ ఎంపికను తీసివేయండి.
చిట్కా: నోటిఫికేషన్‌లను తాత్కాలికంగా మ్యూట్ చేయడానికి, మీ స్టేటస్‌ను “అంతరాయం కలిగించవద్దు”కు సెట్ చేయండి.

Gmailలో Google Chat నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు  ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువున, Chat, Meet ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "Chat నోటిఫికేషన్‌ల సెట్టింగ్‌లు" పక్కన, చాట్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. Google Chat మెసేజ్‌ల కోసం నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడానికి, "డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లు" ఆప్షన్ కింద, "చాట్ నోటిఫికేషన్‌లను అనుమతించండి" పక్కన ఉన్న బాక్స్ ఎంపికను తీసివేయండి.
చిట్కా: నోటిఫికేషన్‌లను తాత్కాలికంగా మ్యూట్ చేయడానికి, మీ స్టేటస్‌ను “అంతరాయం కలిగించవద్దు”కు సెట్ చేయండి.

Google Chat నోటిఫికేషన్ సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చండి 

టాపిక్ లేదా గ్రూప్ సంభాషణ ద్వారా గ్రూప్ చేయబడ్డ స్పేస్ కోసం నోటిఫికేషన్‌లను అనుకూలంగా మార్చండి
  1. Google Chatకు లేదా మీ Gmailకు వెళ్లండి.
  2. సంభాషణలో పాల్గొనే వ్యక్తులను లేదా స్పేస్ పేరును ఎంచుకోండి.
  3. ఎగువున, సంభాషణలో పాల్గొనే వ్యక్తులు లేదా స్పేస్ పేరు పక్కన, కింది వైపు బాణం Down arrow icon లేదా మరిన్ని ఆప్షన్‌లు మరిన్ని ఆ తర్వాత నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • ఎల్లప్పుడూ నోటిఫికేషన్‌ను పొందండి: కొత్త మెసేజ్‌లు అన్నింటికీ పుష్ నోటిఫికేషన్‌లు, అలాగే నోటిఫికేషన్ డాట్‌ను పొందుతారు.
    • తక్కువగా నోటిఫికేషన్‌ను పొందండి: మిమ్మల్ని @ను ఉపయోగించి పేర్కొన్నప్పుడు, మీరు ఫాలో చేస్తున్న టాపిక్‌కు కొత్త మెసేజ్ వచ్చినప్పుడు, లేదా సంభాషణలో ఎవరైనా "@అందరూ"ను ఉపయోగించినప్పుడు మీరు పుష్ నోటిఫికేషన్‌లు, అలాగే నోటిఫికేషన్ డాట్‌ను పొందుతారు.
      • టాపిక్ ద్వారా గ్రూప్ చేయబడ్డ స్పేస్‌ల కోసం: ఎవరైనా కొత్త టాపిక్‌ను ప్రారంభించినప్పుడు నోటిఫికేషన్‌ను పొందటానికి, కొత్త టాపిక్‌లకు సంబంధించి మొదటి మెసేజ్ వచ్చినప్పుడు కూడా నోటిఫికేషన్‌ను పొందండి" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
    • నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి: మీకు పుష్ నోటిఫికేషన్‌లు ఏవీ రావు, కానీ @ప్రస్తావనలు, అలాగే '@అందరూ' కోసం నోటిఫికేషన్ డాట్ పొందడం కొనసాగుతుంది.

చిట్కా: మీరు నోటిఫికేషన్‌లను ఆఫ్ చేసినప్పటికీ, '@పేర్కొనడాల'కు, డైరెక్ట్ మెసేజ్‌లకు, మీరు ఎరుపు నోటిఫికేషన్ డాట్‌ను అందుకుంటారు. 

ఇన్-లైన్ థ్రెడింగ్‌తో ఉన్న స్పేస్ కోసం నోటిఫికేషన్‌లను అనుకూలంగా మార్చండి

మీరు ఒక థ్రెడ్‌ను ప్రారంభించిన తర్వాత, కొత్త మెసేజ్‌ల గురించి మీరు నోటిఫికేషన్‌లను ఎలా మరియు ఎప్పుడు పొందాలో సర్దుబాటు చేయవచ్చు. స్పేస్‌లో నోటిఫికేషన్‌లను అనుకూలంగా మార్చడం ఎలాగో తెలుసుకోండి.

ఇన్-లైన్ థ్రెడింగ్‌తో ఉన్న స్పేస్ కోసం నోటిఫికేషన్ సెట్టింగ్‌లను రివ్యూ చేయడం లేదా మార్చడం కోసం:

  1. స్పేస్ పేరు పక్కన, కింది వైపు బాణం గుర్తు డ్రాప్-డౌన్ బాణంను క్లిక్ చేయండి.
  2. నోటిఫికేషన్‌లను ఎంచుకోండి.
  3. నోటిఫికేషన్‌ల కోసం ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • అన్నీ: మీరు ఫాలో చేసే థ్రెడ్‌లకు వచ్చే కొత్త మెసేజ్‌లు, రిప్లయిలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు. 
      • చిట్కా: ఇది ఆటోమేటిక్ సెట్టింగ్.
    • ఫాలోయింగ్: మీరు ఫాలో చేసే, @పేర్కొనే రిప్లయిలు, థ్రెడ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్‌లు. 
    • ఏమీ లేదు: నోటిఫికేషన్‌లు రావు, మిమ్మల్ని @పేర్కొంటే నోటిఫికేషన్ డాట్‌ను చూస్తారు.

చిట్కా: మీరు స్పేస్‌లో థ్రెడ్‌ను ఫాలో చేస్తే, ఆ థ్రెడ్‌లో యాక్టివిటీ ఉన్నప్పుడు మీకు ఎరుపు డాట్‌తో నోటిఫికేషన్ వస్తుంది. స్పేస్‌లో ఒక్కో థ్రెడ్ పక్కన చదవని మెసేజ్‌ల సంఖ్యను మీరు చూడవచ్చు.

 

డైరెక్ట్ మెసేజ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో, Google Chatను తెరవండి.
  2. డైరెక్ట్ మెసేజ్‌కు పక్కన ఉన్న, మరిన్ని ఆప్షన్‌లు మరిన్ని ఆ తర్వాత నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. అన్నీ లేదా ఏదీ వద్దు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. ఆప్షనల్: సంభాషణను బోల్డ్ చేయకుండా, అలాగే మీ సంభాషణ లిస్ట్‌లో అది ఎగువునకు తరలించబడకుండా నివారించడానికి, "సంభాషణను మ్యూట్ చేయండి" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.

Google Chatలో నోటిఫికేషన్ సౌండ్‌లను అనుకూలీకరించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు వెళ్లండి.
  2. పై భాగంలో కుడి వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "నోటిఫికేషన్‌ల సౌండ్‌లు" కింద, నోటిఫికేషన్‌ల కోసం ఉపయోగించడానికి సౌండ్‌ను ఎంచుకోండి.

Gmailలో Google Chat నోటిఫికేషన్ సౌండ్‌లను అనుకూలీకరించండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు  ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువున, Chat, Meet ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "Chat నోటిఫికేషన్‌ల సెట్టింగ్‌లు" పక్కన, చాట్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. "నోటిఫికేషన్‌ల సౌండ్‌లు" అనే ఆప్షన్ కింద, నోటిఫికేషన్‌ల కోసం ఉపయోగించడానికి సౌండ్‌ను ఎంచుకోండి.
Gmailలో ఇన్‌యాక్టివ్‌గా ఉండటాన్ని గుర్తించినప్పుడు నోటిఫికేషన్‌లను అనుకూలీకరించండి
మీరు మీ కంప్యూటర్‌లోని Gmail లేదా Google Chatలో ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, Google Chat నోటిఫికేషన్‌లు మీ కంప్యూటర్‌కు బదులుగా మీ మొబైల్ పరికరానికి పంపబడతాయి. మీరు మీ వెబ్ బ్రౌజర్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, మీ కంప్యూటర్‌లోని Gmail లేదా Google Chatలో 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, ఆటోమేటిక్‌గా మీరు మీ కంప్యూటర్‌లో ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు పరిగణించబడతారు.
మీరు Chrome బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటే, మీరు Chromeలో యాక్టివ్‌గా లేనప్పుడు మాత్రమే మీ మొబైల్ పరికరంలో చాట్ నోటిఫికేషన్‌లను పొందే విధంగా ఈ సెట్టింగ్‌ను మార్చవచ్చు.
"మీరు ఈ పరికరంలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు మొబైల్ నోటిఫికేషన్‌లను పాజ్ చేయండి" అనే బ్యానర్ కనిపిస్తుంది. ఇన్‌యాక్టివ్ నోటిఫికేషన్‌లను ఆన్ చేయడానికి, కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: బ్యానర్ కనిపించకపోతే, మీ Chrome సెట్టింగ్‌లకు వెళ్లి, 'ఇన్‌యాక్టివ్‌గా ఉండటాన్ని గుర్తించడం' అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి:

  1. chrome://settings/content/idleDetection‌కు వెళ్లండి.
  2. "మీరు మీ పరికరాన్ని ఎప్పుడు యాక్టివ్‌గా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి సైట్‌లు మిమ్మల్ని అడగవచ్చు" అనే ఆప్షన్‌కు పక్కన ఉన్న బాక్స్‌ను చెక్ చేయండి.
  3. "అనుకూలంగా మార్చిన ప్రవర్తనలు" కింద, మీరు మీ పరికరాన్ని యాక్టివ్‌గా ఉపయోగించినప్పుడు తెలుసుకోవడానికి మీరు అనుమతించే సైట్‌ల లిస్ట్‌లో mail.google.com‌ ను లేదా chat.google.com ను జోడించండి.
    • మీరు అనుమతించాలనుకుంటున్న సైట్‌లను జోడించడానికి, జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

నోటిఫికేషన్‌లు ఎక్కడ కనిపిస్తాయి 

Google Chat మొబైల్ యాప్ తెరిచి ఉన్నప్పుడు, అక్కడ నోటిఫికేషన్‌లు కనిపిస్తాయి. నోటిఫికేషన్‌లు కనిపించవు:

  • chat.google.com లో ఆన్‌లైన్‌లో
  • Chat డెస్క్‌టాప్ యాప్‌లో
  • Gmailలో Chatలో

Chat యాప్ తెరిచి ఉన్నప్పుడు, "మీరు Chat నోటిఫికేషన్‌లను ఇక్కడ పొందుతారు" అనే మెసేజ్ కనిపిస్తుంది. Chat స్వతంత్ర యాప్ గురించి మరింత తెలుసుకోండి.

ముఖ్యమైనది: అందుకునే వారు, iPhone లేదా iPadను ఉపయోగిస్తుంటే మీ నుండి వచ్చే ఇన్‌కమింగ్ చాట్ మెసేజ్‌ల నోటిఫికేషన్‌లలో మీ ప్రొఫైల్ ఫోటో కనిపించవచ్చు. మీ ప్రొఫైల్ ఫోటోను ఎలా మార్చాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు


Google, Google Workspace, and related marks and logos are trademarks of Google LLC. All other company and product names are trademarks of the companies with which they are associated.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2118142585024308487
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false