మీ Gmail టూల్‌బార్‌లో బటన్‌లు

మీ కంప్యూటర్‌లో, మీరు మెసేజ్‌ను ఎంచుకున్నప్పుడు, Gmailలోని సెర్చ్ బాక్స్ కింద బటన్‌లు కనిపిస్తాయి. మెసేజ్‌ను తొలగించడం లేదా స్పామ్‌గా రిపోర్ట్ చేయడం వంటి చర్య తీసుకోవడానికి మీరు బటన్‌లను ఉపయోగించవచ్చు.

ప్రతి బటన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి

ఆర్కైవ్ బటన్  : మెసేజ్‌ను ఆర్కైవ్ చేయండి.

స్పామ్ రిపోర్ట్ బటన్  : మెసేజ్‌ను స్పామ్‌గా రిపోర్ట్ చేయండి.

తొలగించండి బటన్  : మెసేజ్‌ను తొలగించండి.

చదవనివిగా మార్క్ చేయండి బటన్  : మెసేజ్‌ను చదవనిదిగా మార్క్ చేయండి.

చదివినదిగా మార్క్ చేయండి బటన్  : మెసేజ్‌ను చదివినదిగా మార్క్ చేయండి.

'తాత్కాలికంగా వాయిదా వేయి' బటన్  : మెసేజ్‌ను తాత్కాలికంగా వాయిదా చేయండి.

టాస్క్‌లకు జోడించండి బటన్  : Google Tasks లో మెసేజ్ ఆధారంగా టాస్క్‌ను క్రియేట్ చేయండి.

లేబుల్‌కు తరలించండి బటన్  : మెసేజ్‌ను లేబుల్‌కు తరలించండి.

ఇన్‌బాక్స్‌కు తరలించండి బటన్ : మెసేజ్‌ను మీ ఇన్‌బాక్స్‌కు తరలించండి.

లేబుల్స్ బటన్  : లేబుల్‌ను జోడించండి లేదా తీసివేయండి.

మరిన్ని ఆప్షన్‌లు బటన్ : మీ మెసేజ్‌లను మేనేజ్ చేయడానికి మరిన్ని ఆప్షన్‌లను కనుగొనండి.

ముఖ్యమైనదిగా మార్క్ చేయండి బటన్ : మెసేజ్‌కు ప్రాముఖ్యత మార్కర్‌ను జోడించండి.

ముఖ్యమైనది కానిదిగా మార్క్ చేయండి బటన్ : మెసేజ్‌కు ప్రాముఖ్యత మార్కర్‌ను తీసివేయండి.

స్టార్‌ను జోడించండి బటన్ : మెసేజ్‌కు స్టార్ గుర్తు జోడించండి.

స్టార్‌ను తీసివేయండి బటన్ : మెసేజ్ నుండి స్టార్‌ను తీసివేయండి.

దీనిని ఉపయోగించి మెసేజ్‌లను ఫిల్టర్ చేయండి బటన్ : పంపినవారి నుండి మెసేజ్‌లను ఫిల్టర్ చేయడం కోసం కొత్త ఫిల్టర్‌ను క్రియేట్ చేయండి.

మ్యూట్ బటన్   : మెసేజ్‌ను మ్యూట్ చేయండి.

అటాచ్‌మెంట్‌గా ఫార్వర్డ్ చేయండి బటన్  Attach : మెసేజ్‌ను అటాచ్‌మెంట్‌గా ఫార్వర్డ్ చేయండి.

అదనపు బటన్ చర్యలు

మీరు మెసేజ్ మీద కుడి క్లిక్ చేసినప్పుడు, మీరు ఈ చర్యలను చేయవచ్చు:

  • రిప్లయి బటన్ : మెసేజ్‌కు రిప్లయి ఇవ్వండి.
  • అందరికీ రిప్లయి బటన్ : మెసేజ్‌ను అందుకున్న స్వీకర్తలకు అందరికీ రిప్లయి ఇవ్వండి.
  • ఫార్వర్డ్ చేయండి బటన్ : మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయండి.
  • ఇన్‌బాక్స్‌లోని ఈమెయిల్స్‌ను కనుగొనండి బటన్ : పంపిన వారి నుండి మీ ఇన్‌బాక్స్‌లో ఈమెయిల్స్ కోసం సెర్చ్ చేయండి.

బటన్‌లను టెక్స్ట్‌గా మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. కింద ఉన్న "బటన్ లేబుల్స్" విభాగానికి స్క్రోల్ చేయండి.
  4. టెక్స్ట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. పేజీ దిగువున ఉన్న, మార్పులను సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మౌస్ కర్సర్ ఉంచడం చర్యలను ఆఫ్ చేయండి

మౌస్ కర్సర్ ఉంచడం చర్యలతో, మీరు మెసేజ్‌కు కుడి వైపున కర్సర్ ఉంచినప్పుడు, మీరు మెసేజ్‌ను ఆర్కైవ్ చేయవచ్చు, తొలగించవచ్చు, తాత్కాలికంగా ఆపివేయవచ్చు లేదా చదివినట్లుగా మెసేజ్‌ను మార్క్ చేయవచ్చు. మీరు మౌస్ కర్సర్ ఉంచడం చర్యలను ఆఫ్ చేయవచ్చు. 
  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. కింద ఉన్న "మౌస్ కర్సర్ ఉంచడం చర్యలు" విభాగానికి స్క్రోల్ చేయండి.
  4. మౌస్ కర్సర్ ఉంచడం చర్యలను డిజేబుల్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. పేజీ దిగువున ఉన్న, మార్పులను సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8995742974420406275
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false