మీ వాచ్‌లో Gmailను ఉపయోగించండి

మీ వాచ్‌లోని Gmail యాప్ నుండి, మీరు వీటిని చేయవచ్చు: 

  • మీ ఇన్‌బాక్స్‌ను చెక్ చేయవచ్చు
  • ఈమెయిల్స్‌ను చదవచ్చు
  • ఈమెయిల్స్‌ను ఆర్కైవ్ చేయవచ్చు
  • ఈమెయిల్స్‌ను తొలగించవచ్చు
  • ఈమెయిల్స్‌కు స్టార్ గుర్తును ఉంచవచ్చు
  • ఈమెయిల్స్‌ను చదివినవి లేదా చదవనివి అని మార్క్ చేయవచ్చు
  • ఈమెయిల్స్ పంపిన వారికి రిప్లయి ఇవ్వవచ్చు లేదా ఈమెయిల్స్‌లో మార్క్ చేసిన అందరికీ రిప్లయి ఇవ్వవచ్చు

మీ వాచ్‌లో కొన్ని Gmail ఫీచర్‌లు సపోర్ట్ చేయబడవు:

  • కొత్త ఈమెయిల్‌ను రాయడం
  • ఈమెయిల్‌లో ఇమేజ్‌లను లేదా లింక్‌లను చూడటం
  • HTML ఈమెయిల్స్‌ను చూడటం
  • అటాచ్‌మెంట్‌లను తెరవడం, డౌన్‌లోడ్ చేయడం
  • ఈమెయిల్స్ కోసం సెర్చ్ చేయడం
  • మీ స్పామ్ ఫోల్డర్‌ను చెక్ చేయడం

Gmailను పొందండి

మీ వాచ్‌లో Gmail యాప్‌ను ఎలా పొందాలో తెలుసుకోండి.

Gmailకు సైన్ ఇన్ చేయండి

ముఖ్య గమనిక: మీరు Wear OSలో Gmailకు వ్యక్తిగత @gmail.com ఖాతాలను మాత్రమే జోడించగలరు. వర్క్ ఖాతాలు, స్కూల్ ఖాతాలు సపోర్ట్ చేయబడవు.

  • మీ వాచ్‌లో మీకు ఒక ఖాతా ఉంటే, Gmail ఆటోమేటిక్‌గా ఆ Google ఖాతాకు సైన్ ఇన్ అవుతుంది.
  • మీ వాచ్‌లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే, మీరు యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోమని Gmail మిమ్మల్ని అడుగుతుంది.
  • యాక్టివ్ Gmail ఖాతాకు మారడానికి:
    1. మీ వాచ్‌లో, Gmail యాప్ ను తెరవండి.
    2. మెనూ ను ట్యాప్ చేయండి.
    3. మీ ఈమెయిల్ అడ్రస్‌ను ట్యాప్ చేయండి.
    4. మీరు మారాలనుకుంటున్న ఈమెయిల్ అడ్రస్ ఎంచుకొని ఆ తర్వాత స్విచ్ అవ్వండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: టైల్స్, కాంప్లికేషన్‌లు, Gmail యాప్‌లో యాక్టివ్‌గా ఉన్న ఖాతాను ఉపయోగిస్తాయి.

మీ వాచ్‌లో Gmail నోటిఫికేషన్‌లను చెక్ చేయండి

Gmail కాంప్లికేషన్‌లను జోడించండి

ముఖ్య గమనిక: ఈ దశల్లో కొన్ని మీ Wear OS వాచ్‌ను బట్టి మారవచ్చు.

మీ వాచ్ లుక్‌లో అందుబాటులో ఉన్న కొత్త ఈమెయిల్స్ సంఖ్యను కనుగొనడానికి, కాంప్లికేషన్‌ను జోడించండి. ఈ నంబర్‌లో మీరు మీ ఇన్‌బాక్స్‌ను చివరిగా తెరిచిన తర్వాత వచ్చిన కొత్త ఈమెయిల్స్ కూడా ఉంటాయి.

  1. మీ వాచ్ లుక్ పైన, స్క్రీన్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. ఎడిట్ చేయండి editని ట్యాప్ చేయండి.
  3. కాంప్లికేషన్ ఎడిట్ స్క్రీన్‌కు స్వైప్ చేయండి.
  4. మీరు మార్చాలనుకుంటున్న కాంప్లికేషన్‌ను ట్యాప్ చేయండి.

Gmail టైల్స్‌ను జోడించండి

ముఖ్య గమనిక: ఈ దశల్లో కొన్ని మీ Wear OS వాచ్‌ను బట్టి మారవచ్చు.

టైల్‌లో మీ తాజా 2 ఈమెయిల్స్ డిస్‌ప్లే చేయబడతాయి. దిగువున, అందుబాటులో ఉన్న కొత్త ఈమెయిల్స్ సంఖ్యను మీరు కనుగొనవచ్చు. టైల్స్‌ను ఎలా జోడించాలో తెలుసుకోండి.

  1. మీ వాచ్ లుక్‌లో, టైల్‌కు వెళ్లడానికి ఎడమ వైపునకు లేదా కుడి వైపునకు స్వైప్ చేయండి.
  2. టైల్‌ను నొక్కి, పట్టుకోండి.
  3. దిగువున జోడించండి addని ట్యాప్ చేయండి.
  4. "స్క్రోల్ బార్‌కు జోడించండి," అనే ఆప్షన్‌కు దిగువున ఉన్న, Gmail టైల్‌ను ఎంచుకోండి.

మీ ఇన్‌బాక్స్‌ను మేనేజ్ చేయండి

ముఖ్య గమనిక: మీ ఇన్‌బాక్స్ లేఅవుట్, మీ ప్రస్తుత Gmail సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది. మీ ఇన్‌బాక్స్ లేఅవుట్‌ను మార్చడానికి, మీ Gmail సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి.

మీ అత్యంత ముఖ్యమైన ఈమెయిల్స్‌పై దృష్టి పెట్టడానికి, ప్రాథమిక ఇన్‌బాక్స్ నుండి అవసరం లేని ఈమెయిల్స్‌ను ఫిల్టర్ చేయండి.

  1. మీ వాచ్‌లో, Gmail యాప్ ను తెరవండి.
  2. మీరు మేనేజ్ చేయాలనుకుంటున్న ఈమెయిల్‌ను కనుగొనండి.
  3. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • స్టార్: ఈమెయిల్‌కు దిగువున కుడి వైపున ఉన్న, స్టార్ ను ట్యాప్ చేయండి.
    • ఆర్కైవ్: కుడి నుండి ఎడమ వైపునకు స్వైప్ చేయండి, ఆ తర్వాత ఆర్కైవ్ ను ట్యాప్ చేయండి. చర్యను రద్దు చేయడానికి, చర్యను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • తొలగించండి: కుడి నుండి ఎడమ వైపునకు స్వైప్ చేయండి, ఆ తర్వాత తొలగించండి ని ట్యాప్ చేయండి. చర్యను రద్దు చేయడానికి, చర్యను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీ ఆర్గనైజ్ చేయబడిన ఈమెయిల్స్‌ను కనుగొనడానికి, మీ ఇన్‌బాక్స్‌కు ఎగువున ఎడమ వైపున ఉన్న, మెనూ ను ట్యాప్ చేయండి.

మీ ఈమెయిల్స్‌ను చెక్ చేసుకోండి

  1. మీ వాచ్‌లో, Gmail యాప్ ను తెరవండి.
  2. ఈమెయిల్‌ను ట్యాప్ చేయండి.
  3. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • ఆర్కైవ్ : మీరు ఒక ఈమెయిల్‌ను ఆర్కైవ్ చేసినప్పుడు, మీ ఇన్‌బాక్స్ నుండి ఈమెయిల్స్‌ను వెలుపలికి తరలిస్తారు. ఆర్కైవ్ చేసిన ఈమెయిల్స్‌కు ఎవరైనా రిప్లయి ఇచ్చినప్పుడు, అవి మీ ఇన్‌బాక్స్‌కు తిరిగి వస్తాయి.
    • తొలగించండి : మీరు ఏదైనా ఈమెయిల్‌ను తొలగించినప్పుడు, వాటిని ట్రాష్‌కు తరలిస్తారు. తొలగించిన ఈమెయిల్స్, మీ ట్రాష్‌లో 30 రోజుల వరకు ఉంటాయి. ఆ సమయం ముగిసిన తర్వాత, అవి మీ ఖాతా నుండి శాశ్వతంగా తొలగించబడతాయి, అవి తిరిగి రికవర్ చేయబడవు.
    • స్టార్ : మీరు Gmailలోని ఈమెయిల్స్‌కు స్టార్ గుర్తు ఉంచినప్పుడు, వాటిని ముఖ్యమైనవిగా మార్క్ చేశారు అని అర్థం. ఈమెయిల్స్‌ను ముఖ్యమైనవిగా మార్క్ చేయడం ద్వారా తర్వాత మీరు వాటిని కనుగొనడంలో సహాయకరంగా ఉంటుంది.
    • చదవనివిగా మార్క్ చేయండి: మీరు ఈమెయిల్‌ను తర్వాత చదవడానికి వీలుగా గుర్తుంచుకోవాలనుకుంటే, మీరు దానిని చదవనిదిగా గుర్తు పెట్టవచ్చు.
    • ఫోన్‌లో తెరవండి: మీరు పెద్ద స్క్రీన్‌లో ఈమెయిల్‌ను చూడాలనుకున్నా లేదా సపోర్ట్ చేయబడని చర్యను నిర్వహించాలనుకున్నా, మీరు దాన్ని మీ ఫోన్‌లో తెరవచ్చు.
    • రిప్లయి ఇవ్వండి లేదా అందరికీ రిప్లయి ఇవ్వండి: మీరు ఎమోజీ, వాయిస్ డిక్టేషన్ లేదా టెక్స్ట్ రెస్పాన్స్‌తో, పంపిన వారికి లేదా ఈమెయిల్‌ను అందుకున్న ప్రతి ఒక్కరికి రిప్లయిని ఇవ్వవచ్చు.
      • ఎమోజీ: మీ రిప్లయికి సంబంధించి, ఎమోజీ మెనూను తెరవడానికి, ఎమోజీ ని ట్యాప్ చేయండి.
      • వాయిస్ డిక్టేషన్: వాయిస్ డిక్టేషన్‌తో కూడిన రిప్లయిని క్రియేట్ చేయడానికి, మైక్రోఫోన్ ను ట్యాప్ చేయండి.
      • టెక్స్ట్ రెస్పాన్స్: టెక్స్ట్ రెస్పాన్స్‌ను టైప్ చేయడానికి, కీబోర్డ్ ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9889046178078147901
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false