ఫైల్‌ను కనుగొనండి లేదా రికవర్ చేయండి

మీరు Google Driveలో ఫైళ్లను కనుగొనలేకపోతే, మీరు వాటిని తిరిగి పొందడానికి ఈ చిట్కాలను ఉపయోగించవచ్చు. మీ Google Driveను ఎవరైనా వ్యక్తి మీ అనుమతి లేకుండా యాక్సెస్ చేసినట్లు భావిస్తే, మీ ఖాతాను మరింత సురక్షితం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము.

మీరు తొలగించిన ఫైల్‌లను రీస్టోర్ చేయడం

ఒకవేళ మీరు ఇటీవల Google Drive లేదా Google Drive డెస్క్‌టాప్ యాప్‌ను ఉపయోగించి ఏవైనా తొలగించినట్లయితే, ఆ ఫైల్‌ను మీరే స్వయంగా రీస్టోర్ చేసుకోవచ్చు.

మీ ట్రాష్ నుండి పునరుద్ధరించండి

  1. కంప్యూటర్‌లో, drive.google.com/drive/trash లింక్‌కు వెళ్లండి.
    • చిట్కా: ట్రాష్ చేయబడిన పాతవి లేదా కొత్త ఫైళ్లను కనుగొనడానికి, మీరు మీ ట్రాష్ చేసిన ఫైళ్లను ట్రాష్ చేసిన తేదీ ద్వారా క్రమపద్ధతిలో అమర్చవచ్చు.
  2. మీరు రికవర్ చేయాలనుకుంటున్న ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి.
  3. రీస్టోర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు రీస్టోర్ చేసిన ఫైళ్లను వాటి ఒరిజినల్ లొకేషన్‌లో కనుగొనవచ్చు.
    • ఒరిజినల్ లొకేషన్ లేకపోతే, "నా డ్రైవ్"లో చెక్ చేయండి.
మీరు తొలగించలేదని అనుకుంటున్న ఫైల్‌ను కనుగొనండి

Google Driveలో ఫైల్‌ను కనుగొనడానికి లేదా రికవర్ చేయడానికి దశలు

ఈ సూచనలను ట్రై చేయండి

యాక్టివిటీ ప్యానెల్‌ను చెక్ చేయండి

  1. కంప్యూటర్‌లో, drive.google.com కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, సమాచారం సమాచారం అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. యాక్టివిటీ ప్యానెల్‌ను చెక్ చేయడానికి "యాక్టివిటీ"ని క్లిక్ చేయండి.
  4. కిందికి స్క్రోల్ చేసి, మీ ఫైల్ కోసం వెతకండి.

అధునాతన సెర్చ్‌ను ఉపయోగించండి

  1. కంప్యూటర్‌లో, drive.google.com కు వెళ్లండి.
  2. సెర్చ్ బార్‌లో, కుడి వైపున దూరంగా ఉన్న చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. మీ ఫైల్‌ను కనుగొనడానికి అధునాతన సెర్చ్ ఆప్షన్‌లను ఉపయోగించండి. ఉదాహరణకు, స్ప్రెడ్‌షీట్‌లను కనుగొనడానికి, 'రకం' పక్కన ఉన్న, కింది వైపు బాణం గుర్తును క్లిక్ చేసి, తర్వాత ‘స్ప్రెడ్‌షీట్‌లు’ క్లిక్ చేయండి.

Google Driveలో సెర్చ్ ఆపరేటర్‌లతో సెర్చ్ ఫీల్డ్‌ను ఉపయోగించడం.

ఫైళ్లు ఎందుకు మిస్ అవుతున్నాయో తెలుసుకోండి

మీరు ఫైల్‌ను సృష్టించి ఉంటే

ఒకవేళ Driveలో మీరు క్రియేట్ చేసిన ఫైల్‌ను కనుగొనలేకపోయినట్లయితే, ఆ ఫైల్, అది ఉన్న ఫోల్డర్‌ను కోల్పోయి ఉండవచ్చు. ఫైల్ ఇప్పటికీ ఉంటుంది, కానీ కనుగొనడం కష్టంగా ఉండవచ్చు.

ఫైల్‌లు ఎలా వాటి ఫోల్డర్‌ను కోల్పోతాయి

  • వేరొకరికి చెందిన ఫోల్డర్‌లో మీరు ఫైల్ క్రియేట్ చేసి ఉండవచ్చు, వారు ఆ ఫోల్డర్‌ను తొలగించి ఉండవచ్చు. ఈ ఫైల్ తొలగించబడలేదు. అది ఆటోమేటిక్‌గా మీకు సంబంధించిన 'నా డ్రైవ్'కు తరలించబడుతుంది.
    ముఖ్య గమనిక: మీకు చెందిన ఫైళ్లను కేవలం మీరు మాత్రమే తొలగించగలరు.
  • ఫోల్డర్‌ను మీరు వేరొకరితో షేర్ చేస్తే, వారు మీ ఫైల్‌ను ఫోల్డర్ నుండి తీసివేసి ఉండవచ్చు. ఫైల్ తొలగించబడలేదు, అది ఆటోమేటిక్‌గా మీకు సంబంధించిన 'నా డ్రైవ్'కు తరలించబడుతుంది.

క్రమబద్దీకరించని ఫైళ్లను కనుగొనడం

  1. కంప్యూటర్‌లో, drive.google.comకు వెళ్లండి.
  2. సెర్చ్ బార్‌లో, ఇలా ఎంటర్ చేయండి: is:unorganized owner:me
  3. మీరు ఫైల్‌ను కనుగొన్నప్పుడు, దానిని 'నా డ్రైవ్'లోని ఫోల్డర్‌లోకి తరలించండి, దీని వలన మీరు తర్వాతిసారి కనుగొనడం సులభతరం అవుతుంది.

ఇప్పుడే వెతుకు

వేరెవరైనా ఫైల్‌ను సృష్టించి ఉంటే

ఎవరైనా ఫైల్‌ను సృష్టించినప్పుడు, వారు దానిని తొలగించగలరు, పేరు మార్చగలరు, పునరుద్ధరించగలరు. ఫైల్‌ను క్రియేట్ చేసిన వ్యక్తిని కాంటాక్ట్ చేసి, ఆ ఫైల్‌ను రీస్టోర్ చేయమని లేదా మీకు మళ్లీ షేర్ చేయమని అడగండి.

ఒకవేళ అది మరెవరైనా క్రియేట్ చేసిన ఫోల్డర్‌లో ఉంటే

ఎవరైనా ఆ ఫోల్డర్‌ను తొలగించి ఉంటే, మీ Driveలో ఆ ఫోల్డర్ ఇకపై కనిపించదు.

తొలగించిన ఫోల్డర్‌లలో ఉన్న మీరు క్రియేట్ చేసిన ఫైల్‌లను కనుగొనడం

తొలగించిన ఫోల్డర్‌లలో ఉన్న అన్ని ఫైల్‌లను కనుగొనడం

భవిష్యత్తులో ఆ ఫైల్‌ను మరింత సులభంగా కనుగొనేలా చేయడానికి, దానిని "నా డ్రైవ్"లోని ఫోల్డర్‌కు తరలించండి.

ఫైళ్లను ఎలా కనుగొనాలనే దాని గురించి మరింత సమాచారం

అధునాతన సెర్చ్‌ను ట్రై చేయండి

Driveలో మీ సెర్చ్‌ను మెరుగుపరచడానికి, ఈ కింది ఆప్షన్‌లలో ఒకదానితో మీ కంప్యూటర్‌లో సెర్చ్ పదబంధాన్ని ఉపయోగించండి:

దీని కోసం వెతకండి ఉదాహరణ
ఖచ్చితమైన పదబంధం

"ఖచ్చితమైన పదబంధాన్ని కోట్‌ల మధ్యలో ఉంచండి"

ఒక పదాన్ని మినహాయించండి

నీరు, కానీ సరస్సులు కాదు:

నీరు -సరస్సులు

ఫైల్ ఓనర్

నాన్న కలిగి ఉన్న ఫైల్‌లు:

ఓనర్:dad@gmail.com

ఇతరులు షేర్ చేసిన ఫైల్‌లు

అమ్మ మీతో షేర్ చేసిన ఫైల్‌లు:

వీరి నుండి:mom@gmail.com

మీరు ఫైల్‌లను షేర్ చేశారు

అమ్మతో మీరు షేర్ చేసిన ఫైల్‌లు:

వీరికి:mom@gmail.com

నక్షత్రం ఉన్న అంశాలు

ఇవి:నక్షత్రం ఉన్నవి

తొలగించిన అంశాలు

ఇవి:ట్రాష్‌లో ఉన్నవి

ఫైల్ రకం

స్ప్రెడ్‌షీట్ ఫైల్ రకం:

రకం:స్ప్రెడ్‌షీట్

సమయ పరిధి

జనవరి 18, 2015 తేదికి ముందు లేదా ఆ తేదీ తర్వాత.

ఈ తేదీకి ముందు:2015-01-18

ఈ తేదీ తర్వాత:2015-01-18

పేరు

పేరు:"పేరు ఇక్కడ అందించబడుతుంది"

యాప్

Google డ్రైవ్‌లో తెరిచిన ఫైల్‌లు:

యాప్:"Drive"

రికవర్ చేయబడిన ఫైల్ రకాలు

వ్యక్తిగత ఖాతాల విషయంలో, మీరు కింద పేర్కొన్న వాటిని ఉపయోగిస్తే ఇటీవల తొలగించిన ఫైళ్లను తొలగించిన తర్వాత పరిమిత సమయం వరకు వాటిని రికవరీ చేయవచ్చు:

  • కన్జ్యూమర్ ఖాతాతో ఉన్న Google Drive.
  • ఆఫీస్, పాఠశాల, లేదా ఇతర గ్రూప్ ద్వారా కాదు

కిందివాటిలో ఒకటి నిజం:

  • ఫైల్‌ను క్రియేట్ చేసింది మీరే అయ్యుండాలి.
  • మీరు ఫైల్‌ను Google డ్రైవ్‌లో అప్‌లోడ్ చేశారు.
  • మీరు వేరొకరి నుండి ఫైల్ యాజమాన్య హక్కును అంగీకరించి ఉండాలి.

మీ Google ఖాతా తొలగించబడితే, మీరు మీ ఫైళ్లను రికవర్ చేయడం సాధ్యపడకపోవచ్చు.

సెర్చ్ చిప్‌లను ఉపయోగించండి

Driveలోని ఫైళ్ల లిస్ట్‌ను తగ్గించడానికి, మీరు సెర్చ్ చిప్‌లను ఉపయోగించవచ్చు. మీరు వీటికి సంబంధించిన వాటిని సెర్చ్ చేసి, ఫిల్టర్ చేయవచ్చు:

  • రకం
  • వ్యక్తులు 
  • మార్చిన తేదీ

ఈ చిప్‌లు సెర్చ్ బార్ కింద కనిపిస్తాయి, సదరు వీక్షణలోని నా డ్రైవ్, ఇటీవలి, లేదా ట్రాష్ వంటి అన్ని ఫైళ్లను, ఫోల్డర్‌లను, సబ్‌ఫోల్డర్‌లను సెర్చ్ చేస్తాయి.

  • సెర్చ్ చిప్‌ను తీసివేయడానికి: చిప్‌నకు కుడి వైపున, ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • అన్ని సెర్చ్ చిప్‌లను తీసివేయడానికి: చిప్‌లకు చివరిలో, ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: సెర్చ్ చిప్‌లు ఆటోమేటిక్ సెట్టింగ్‌గా ఉంటాయి, వాటిని దాచడానికి, ఫిల్టర్ బటన్ ‌పై క్లిక్ చేయండి.

Gmail నుండి ఈమెయిళ్లను రికవరీ చేయండి

Gmail నుండి ఇమెయిల్‌లను రికవర్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మమ్మల్ని సంప్రదించడానికి, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

Drive మద్దతు అన్ని భాషలలో అందుబాటులో లేదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడేవారు అయితే, భాషను మార్చుకోవచ్చు మరియు Drive నిపుణులను సంప్రదించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Drive సహాయ కేంద్రానికి వెళ్లండి.
  2. పేజీ దిగువన, మీ భాషను క్లిక్ చేయండి.
  3. ఇంగ్లీష్‌ను ఎంచుకోండి.
  4. పైన ఎడమవైపున, మెనూ ఆ తర్వాత మమ్మల్ని సంప్రదించండిని క్లిక్ చేయండి.
  5. మీ సమస్యను, మీరు మమ్మల్ని సంప్రదించే విధానాన్ని ఎంచుకోండి.

గమనిక: మీరు పూర్తి చేసిన తర్వాత, మీ భాషను మీ ప్రాధాన్య భాషకు తిరిగి మార్చవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17296976529548406471
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false