డెస్క్‌టాప్ Google Driveను ఉపయోగించండి

మీ పరికరాలన్నింటిలో, క్లౌడ్‌లో కంటెంట్‌ను సులభంగా మేనేజ్ చేయడానికి, షేర్ చేయడానికి, Google‌కు చెందిన డెస్క్‌టాప్ సింక్ క్లయింట్ అయిన డెస్క్‌టాప్ Driveను ఉపయోగించండి.

Windows File Explorer లేదా macOS Finderతో మీ కంప్యూటర్‌లో మీ Drive ఫైళ్లను, ఫోల్డర్‌లను కనుగొనడానికి డెస్క్‌టాప్ Driveను ఉపయోగించండి.

మీరు క్లౌడ్‌లో ఫైల్‌ను ఎడిట్ చేసినా, తొలగించినా, లేదా తరలించినా, మీ కంప్యూటర్, పరికరాలలో సదరు మార్పు ప్రతిబింబిస్తుంది, అలాగే మీ కంప్యూటర్, పరికరాలలో ఫైల్‌ను ఎడిట్ చేసినా, తొలగించినా, లేదా తరలించినా సదరు మార్పు క్లౌడ్‌లో కూడా ప్రతిబింబిస్తుంది. ఆ రకంగా, మీ ఫైల్స్ అప్‌డేట్ అయ్యి ఉంటూ, ఏ పరికరం నుండి అయినా యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంటాయి.

డెస్క్‌టాప్ Drive ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి

మీరు కింద పేర్కొన్న పనులు చేయడానికి డెస్క్‌టాప్ Driveను ఉపయోగించవచ్చు:

  • క్లౌడ్‌లో స్టోర్ చేసిన ఫైళ్లను నేరుగా మీ కంప్యూటర్‌లో తెరవవచ్చు.
  • స్టోరేజ్ స్పేస్ ఉపయోగించకుండానే మీ కంప్యూటర్ ఫైల్ సిస్టమ్‌లో మీ ఫైళ్లను చూడవచ్చు, ఆర్గనైజ్ చేయవచ్చు.
  • మీ కంప్యూటర్ నుండి Google Driveకు ఫోల్డర్‌లను సింక్ చేయవచ్చు.
    • మీరు సింక్ చేసినప్పుడు, మీ ఫైళ్లు క్లౌడ్ నుండి డౌన్‌లోడ్ చేయబడతాయి, మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ నుండి అప్‌లోడ్ చేయబడతాయి.
    • మీరు సింక్ చేసిన తర్వాత, మీ కంప్యూటర్ ఫైళ్లు క్లౌడ్‌లో ఉన్న వాటితో మ్యాచ్ చేయబడతాయి.
    • మీ ఫైళ్లు అప్‌డేట్ అయ్యి ఉంటాయి, అలాగే యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంటాయి, మీరు చేసే ఏదైనా మార్పు అన్ని పరికరాలలోని ఫైళ్లకు వర్తింపజేయబడుతుంది.
  • ఆఫ్‌లైన్ వినియోగం కోసం ఫైళ్లను, ఫోల్డర్‌లను సేవ్ చేయవచ్చు. ఇందులో షేర్ చేసిన డ్రైవ్‌లకు సంబంధించిన ఫైళ్లు ఉంటాయి.
  • రియల్ టైమ్‌లో Microsoft Office ఫైళ్లలో కలిసి పని చేయవచ్చు.
  • మీరు వర్క్ లేదా స్కూల్ ఖాతాతో Windowsలో Outlookను ఉపయోగిస్తుంటే, Microsoft Outlookతో ఫైళ్లను పంపవచ్చు, సేవ్ చేయవచ్చు.

డెస్క్‌టాప్ Driveను ఇన్‌స్టాల్ చేసి, సెటప్ చేయండి

Windows కోసం డెస్క్‌టాప్ Driveను ఇన్‌స్టాల్ చేసి, సెటప్ చేయండి

ముఖ్య గమనిక: మీరు ప్రారంభించడానికి ముందు, మీ ఆపరేటింగ్ సిస్టమ్ డెస్క్‌టాప్ Driveకు అనుకూలంగా ఉందో లేదో చెక్ చేయండి.

  1. డెస్క్‌టాప్ Driveను డౌన్‌లోడ్ చేయండి:

    WINDOWS కోసం డౌన్‌లోడ్ చేయండి

  2. "GoogleDriveSetup.exe" ఫైల్‌ను తెరవండి.
  3. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

చిట్కా: మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తుంటే, మీరు డెస్క్‌టాప్ Driveను ఉపయోగించలేకపోవచ్చు లేదా మీ సంస్థ మీ కోసం దాన్ని ఇన్‌స్టాల్ చేయాల్సి రావచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీ అడ్మినిస్ట్రేటర్‌ను అడగండి.

డెస్క్‌టాప్ Driveలో, సిస్టమ్ ట్రేలోని దిగువున కుడి వైపున, మీరు డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ను కనుగొంటారు.

చిట్కా: ”దాచబడిన చిహ్నాలను చూడటానికి,” బాణం గుర్తును క్లిక్ చేయండి.

డెస్క్‌టాప్ Drive మూసివేయబడినప్పుడు, దాన్ని కనుగొనడాన్ని సులభతరం చేయడానికి, మీరు దాన్ని పిన్ చేయవచ్చు.

  • Driveను ప్రారంభ మెనూకు జోడించడానికి: మీ ప్రారంభ మెనూలో, Driveపై కుడి క్లిక్ చేసి ఆ తర్వాత ప్రారంభ మెనూకు పిన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • టాస్క్‌బార్‌కు Driveను జోడించడానికి: మీ ప్రారంభ మెనూలో, Driveపై కుడి క్లిక్ చేసి ఆ తర్వాత టాస్క్‌బార్‌కు పిన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
MacOS కోసం డెస్క్‌టాప్ Driveను ఇన్‌స్టాల్ చేసి, సెటప్ చేయండి

ముఖ్య గమనిక: మీరు ప్రారంభించడానికి ముందు, మీ ఆపరేటింగ్ సిస్టమ్ డెస్క్‌టాప్ Driveకు అనుకూలంగా ఉందో లేదో చెక్ చేయండి.

  1. డెస్క్‌టాప్ Driveను డౌన్‌లోడ్ చేయండి:

    MAC కోసం డౌన్‌లోడ్ చేయండి

  2. “GoogleDrive.dmg”ని తెరవండి.
  3. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

చిట్కా: మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు డెస్క్‌టాప్ Driveను ఉపయోగించలేకపోవచ్చు. మీ సంస్థ, మీ కోసం దాన్ని తప్పకుండా ఇన్‌స్టాల్ చేయాలి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీ అడ్మినిస్ట్రేటర్‌ను అడగండి.

డెస్క్‌టాప్ Driveలో మెనూ బార్‌లోని ఎగువ కుడి వైపున ఉన్న, మెనూ బార్‌లో డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ను కనుగొనవచ్చు.

డెస్క్‌టాప్ Drive మూసివేయబడినప్పుడు, దాన్ని కనుగొనడాన్ని సులభతరం చేయడానికి, మీరు దాన్ని పిన్ చేయవచ్చు.

  • Driveను మీ డాక్‌కు జోడించడానికి: “అప్లికేషన్‌లు” అనే ఫోల్డర్‌లో, ఇటీవల ఉపయోగించిన యాప్‌లను వేరు చేసే లైన్ ఎడమ వైపునకు Drive యాప్‌ను లాగండి.

డెస్క్‌టాప్ Google Driveను ఉపయోగించడం ప్రారంభించండి

డెస్క్‌టాప్ Driveకు సైన్ ఇన్ చేయండి

Get started with Drive for Desktop

మీరు మొదటిసారి డెస్క్‌టాప్ Driveను తెరిచినప్పుడు, లేదా మీ ఖాతా డిస్‌కనెక్ట్ అయిన తర్వాత, లాగిన్ చేయడానికి ఈ విధంగా చేయండి:

  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ను తెరవండి.
  2. బ్రౌజర్‌తో సైన్ ఇన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. డెస్క్‌టాప్ Driveను మీరు ఏ ఖాతాతో ఉపయోగించాలనుకుంటున్నారో ఆ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

చిట్కా: డెస్క్‌టాప్ Driveతో మీరు గరిష్ఠంగా ఒకేసారి 4 ఖాతాలు ఉపయోగించవచ్చు. ఒకే సమయంలో మల్టిపుల్ ఖాతాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

Google Driveకు, Google Photosకు సింక్ చేయండి

ఫోటోలను, వీడియోలను బ్యాకప్ చేయండి

మీరు photos.google.com‌లో బ్యాకప్‌ను ఆన్ చేసినప్పుడు, మీరు మీ ఫోటోలను, వీడియోలను ఆటోమేటిక్‌గా మీ Google ఖాతాకు సేవ్ చేయవచ్చు.

మీ ఫోటోలను, వీడియోలను ఎలా బ్యాకప్ చేయాలో తెలుసుకోండి.

ముఖ్య గమనిక:

  • మీరు ఫోటోలను, వీడియోలను మాత్రమే స్టోర్ చేస్తే, Google Photosకు బ్యాకప్ చేయమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.
  • మీరు మీ ఫైల్స్‌ను ఫోటోలలో, వీడియోలలో స్టోర్ చేస్తే, అవి రెండుసార్లు అప్‌లోడ్ చేయబడతాయి, తద్వారా మీ Google స్టోరేజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తాయి.
  • నెట్‌వర్క్‌కు జోడించిన స్టోరేజ్ (NAS) Google Photos బ్యాకప్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

Driveకు ఫైల్స్‌ను సింక్ చేయండి

Sync files and folders to Drive for Desktop

మీరు మొదటగా డెస్క్‌టాప్ Driveను తెరిచినప్పుడు, "Google Drive సింక్ చేయడాన్ని ప్రారంభించాలనుకుంటుంది" అనే నోటిఫికేషన్‌ను మీరు అందుకుంటారు. సరే అని క్లిక్ చేయండి. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ను తెరవండి.

మీరు మీ కంప్యూటర్ నుండి Google Driveకు ఫైల్స్‌ను సింక్ చేయవచ్చు, Google Photosకు బ్యాకప్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Drive డిస్క్ ఫైల్ స్ట్రీమ్‌ ను తెరవండి.
  2. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున, మీ కంప్యూటర్‌లోని ఫోల్డర్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • Driveతో ఫోల్డర్‌లను సింక్ చేయండి: సింక్ చేసిన ఫోల్డర్‌లో మీరు మార్చే ఫైల్స్ Driveలో ప్రతిబింబిస్తాయి. Drive మార్పులు, మీ కంప్యూటర్‌లో ప్రతిబింబిస్తాయి. "కంప్యూటర్‌లు" విభాగంలో, సింక్ చేసిన ఫోల్డర్‌లు చూపబడతాయి.
    • Google Photosకు ఫోల్డర్‌లను బ్యాకప్ చేయండి: ఫోటోలు, వీడియోల అప్‌లోడ్ మాత్రమే అవుతుంది. మీరు ఒక చోట తొలగించే ఫోటోలు లేదా వీడియోలు మరొక చోట తొలగించబడవు. ఎడిట్ చేసినవి కొత్త ఇమేజ్‌ల లాగా అప్‌లోడ్ అవుతాయి. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా పరికరం నుండి Google Photos మొబైల్ యాప్‌లో మీ ఫోటోలను, వీడియోలను చూడవచ్చు.

మీ macOS ఫోటోల లైబ్రరీని బ్యాకప్ చేయండి

ముఖ్య గమనిక: మీరు మల్టిపుల్ Apple ఫోటోల లైబ్రరీలను కలిగి ఉన్నట్లయితే, సిస్టమ్ ఫోటో లైబ్రరీ మాత్రమే Google Photosకు సింక్ చేయబడుతుంది. మీరు అన్ని Apple ఫోటోల లైబ్రరీలను Driveలో సింక్ చేయవచ్చు.

మీరు Apple ఫోటోల లైబ్రరీని Driveతో సింక్ చేసినట్లయితే, అంతా సింక్ అవుతుంది.

మీ లైబ్రరీని కరప్ట్ చేసే అవకాశం ఉన్నందున ఈ ఫైల్స్‌ను మరొక కంప్యూటర్ నుండి లేదా క్లౌడ్‌లో మార్పులు చేయమని మేము మీకు సిఫార్సు చేయము.

మీ సిస్టమ్ ఫోటో లైబ్రరీ అనేది iCloud ఫోటోలు, షేర్ చేసిన ఆల్బమ్‌లు, అలాగే My Photo Streamతో పని చేయగల ఏకైక లైబ్రరీ.

మీకు ఒకే ఫోటో లైబ్రరీ మాత్రమే ఉంటే, అది సిస్టమ్ ఫోటో లైబ్రరీ. లేకపోతే, మీరు Photosలో క్రియేట్ చేసే లేదా తెరిచే మొదటి ఫోటో లైబ్రరీ, మీ సిస్టమ్ ఫోటో లైబ్రరీ అవుతుంది.

మీరు మీ iCloud నుండి ఫోటోలను, వీడియోలను డౌన్‌లోడ్ చేసి, వాటిని Google Photosకు అప్‌లోడ్ చేసినప్పుడు, అది మీ హార్డ్ డ్రైవ్ స్పేస్‌ను తాత్కాలికంగా ఉపయోగిస్తుంది. ఫోటోలను, వీడియోలను బ్యాకప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

మీ ఫైల్స్ సింక్ అయినప్పుడు వాటిని యాక్సెస్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో, మీ పేరును క్లిక్ చేసి ఆ తర్వాత Google Drive అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీ Drive వినియోగాన్ని బట్టి మీరు వివిధ రకాల ఆప్షన్‌లను కనుగొనవచ్చు:
      • నా డ్రైవ్: మీ వ్యక్తిగత ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను కలిగి ఉంటుంది.
      • షేర్ చేసిన డ్రైవ్‌లు: ఇతరులు మీతో షేర్ చేసే ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను కలిగి ఉంటుంది.
      • ఇతర కంప్యూటర్‌లు: మీ Google ఖాతాకు కనెక్ట్ చేసిన ఇతర కంప్యూటర్‌ల నుండి సింక్ అయిన ఫైల్స్‌ను డిస్‌ప్లే చేస్తుంది.
    • మీరు తెరవాలనుకుంటున్న ఫైల్‌ను రెండు సార్లు క్లిక్ చేయండి.
      • Google Docs, Sheets, Slides, లేదా Forms ద్వారా క్రియేట్ చేసిన ఫైల్స్ మీ వెబ్ బ్రౌజర్‌లో తెరవబడతాయి.
      • Word డాక్స్ లేదా .pdf ఫైల్స్ వంటి ఇతర ఫైల్స్ మీ కంప్యూటర్‌లో వాటికి సంబంధించిన ఆటోమేటిక్ ప్రోగ్రామ్‌లలో తెరవబడతాయి.

చిట్కా: మీ Drive ఇంకా "నా డ్రైవ్" ఫోల్డర్ ఖాళీగా ఉంటే, మీరు "షేర్ చేసిన డ్రైవ్‌లు" లేదా "ఇతర కంప్యూటర్ల" వీక్షణలను కనుగొనలేరు.

డెస్క్‌టాప్ Drive‌లోని ఫీచర్‌ల గురించి తెలుసుకోండి

మీ డెస్క్‌టాప్ Drive సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చండి
అధునాతన సెట్టింగ్‌లతో, డెస్క్‌టాప్ Drive విషయంలో మీ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుచుకోండి. మీరు వీటిని చేయవచ్చు:
  • సింక్ ప్రాధాన్యతలను అనుకూలంగా మార్చుకోవచ్చు.
  • Microsoft Officeతో రియల్ టైమ్ ఎడిటింగ్ వీక్షణను ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు.
  • Google Photos సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చుకోవచ్చు.
  • ఆటోమేటిక్ లాంచ్, హాట్‌కీలు, ప్రాక్సీ సెట్టింగ్‌ల వంటి సాధారణ సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చుకోవచ్చు.
మీ డెస్క్‌టాప్ Drive సెట్టింగ్‌లను ఎలా అనుకూలంగా మార్చాలో తెలుసుకోండి.
ఆఫ్‌లైన్‌లో ఫైళ్లను, ఫోల్డర్‌లను తెరవండి

మీరు డెస్క్‌టాప్ Driveతో ఆఫ్‌లైన్ వినియోగం కోసం ఫైళ్లను, ఫోల్డర్‌లను సేవ్ చేయవచ్చు. డెస్క్‌టాప్ Driveతో ఫైళ్లను ఆఫ్‌లైన్‌లో ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

మీ Drive ఫైళ్ల కోసం సెర్చ్ చేయండి

Driveలో మీ ఫైళ్లను కనుగొనడానికి, డెస్క్‌టాప్ Driveలో సెర్చ్ చేయండి. మీరు Windows సెర్చ్‌లో లేదా macOS స్పాట్‌లైట్‌లో కాకుండా డెస్క్‌టాప్ Drive‌లో సెర్చ్ చేసినప్పుడు, మీ సెర్చ్‌లో Drive స్ట్రీమింగ్ లొకేషన్‌లోని అన్ని ఫైళ్లు ఉన్నాయని నిర్ధారిస్తుంది.

  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive డిస్క్ ఫైల్ స్ట్రీమ్ను తెరవండి.
  2. సెర్చ్ చేయండి Searchని క్లిక్ చేయండి.
  3. మీ సెర్చ్ క్వెరీలను ఎంటర్ చేయండి.
  4. మీ ఫైల్‌ను తెరవండి. ఫైల్ మీ కంప్యూటర్‌లో ఉంటే, అది అనుబంధిత అప్లికేషన్‌తో తెరవబడుతుంది. లేకపోతే, అది Drive వెబ్‌లో తెరుచుకుంటుంది.

చిట్కా: సెర్చ్ విండోను తెరవడానికి మీరు సెర్చ్ హాట్‌కీ కాంబినేషన్‌ను కూడా ఉపయోగించవచ్చు.

MS Outlook, Office ఫైళ్లలో పని చేయండి

మీరు డెస్క్‌టాప్ Driveను ఉపయోగించినప్పుడు Office ఫైళ్లలో రియల్ టైమ్ ఎడిటింగ్ వీక్షణతో పని చేయవచ్చు. వర్క్ లేదా స్కూల్ ఖాతా ఉన్న Windows యూజర్‌ల కోసం, మీరు Microsoft Outlookతో ఫైళ్లను కూడా పంపవచ్చు, అలాగే సేవ్ చేయవచ్చు. డెస్క్‌టాప్ Driveతో Microsoft Office ఫైళ్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

macOSతో డెస్క్‌టాప్ Driveను ఉపయోగించండి
నా డ్రైవ్‌ను మిర్రరింగ్ చేయడం

మిర్రరింగ్, స్ట్రీమింగ్ అనేవి మీ ఫైళ్లను సింక్ చేయడానికి రెండు మార్గాలు.

  • మీ కంప్యూటర్‌లోని ఫోల్డర్‌లు మిర్రర్ మాత్రమే చేయబడతాయి.
  • షేర్ చేసిన డ్రైవ్‌లు, ఇతర కంప్యూటర్‌లు మాత్రమే స్ట్రీమ్ చేయబడతాయి.
  • నా డ్రైవ్‌ను మిర్రర్ చేయవచ్చు లేదా స్ట్రీమ్ చేయవచ్చు.
  • డెస్క్‌టాప్ Drive ఇన్‌స్టాల్ చేయబడినప్పుడు, “నా డ్రైవ్” ఫోల్డర్ స్ట్రీమ్ చేయబడుతుంది. ఇన్‌స్టాలేషన్ తర్వాత మీరు మీ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయవచ్చు, అలాగే నా డ్రైవ్‌ను మిర్రర్ లేదా స్ట్రీమ్ చేయడాన్ని ఎంచుకోవచ్చు.

డెస్క్‌టాప్ Driveతో స్ట్రీమింగ్, మిర్రరింగ్ చేయడానికి సంబంధించిన ఆప్షన్‌ల గురించి తెలుసుకోండి.

ఎర్రర్‌లను పరిష్కరించండి
డెస్క్‌టాప్ Driveలో, “యాక్టివిటీ” అనే విభాగంలో, “కొన్ని ఎర్రర్‌లు ఏర్పడ్డాయి” బ్యానర్ డిస్‌ప్లే అవుతుంది. ఎర్రర్‌ల లిస్ట్‌ను డిస్‌ప్లే చేయడానికి, మీరు కింద పేర్కొన్న వాటిలో ఏదైనా ఒకటి చేయవచ్చు:
  • బ్యానర్‌లోని లింక్‌పై క్లిక్ చేయండి.
  • సెట్టింగ్‌లు ఆ తర్వాత ఎర్రర్ లిస్ట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఎర్రర్‌లను ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11689078945738257024
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false