వీడియో చాప్టర్‌లు

వీడియో చాప్టర్‌లు ఒక వీడియోను భాగాలుగా విభజిస్తాయి, ప్రతి భాగమూ ప్రత్యేకంగా ఒక ప్రివ్యూను కలిగి ఉంటుంది. వీడియోలోని ప్రతి భాగానికి వీడియో చాప్టర్‌లు సమాచారాన్ని, అలాగే సందర్భాన్ని జోడిస్తాయి, తద్వారా వీడియోలోని వివిధ భాగాలను మీరు సులభంగా మళ్లీ చూడవచ్చు. అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియోకు క్రియేటర్‌లు వారి స్వంత వీడియో చాప్టర్‌లను జోడించవచ్చు లేదా అటోమేటిక్ వీడియో చాప్టర్‌లను ఉపయోగించవచ్చు. టైప్ చేసిన మాటల ఫైల్‌లో చాప్టర్‌లు కనిపించవచ్చు. క్రియేటర్‌లు తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, YouTube Studioలో ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లకు సమ్మతిని నిలిపివేయవచ్చు.

గమనిక: వీడియోలన్నింటికీ ఆటోమేటిక్ చాప్టర్‌లకు అర్హత ఉండదు, అలాగే అర్హత ఉన్న వీడియోలన్నింటిలో ఆటోమేటిక్ చాప్టర్‌లు ఉండకపోవచ్చు. ఛానెల్‌కు యాక్టివ్ స్ట్రయిక్‌లు ఏవైనా ఉంటే, లేదా కంటెంట్ కొంత మంది వీక్షకులకు అనుచితంగా అనిపించే అవకాశముంటే, వీడియో చాప్టర్‌ల ఫీచర్ అందుబాటులో ఉండదు.

How to Add Chapters to Your Videos Using Timestamps

మీ స్వంత వీడియో చాప్టర్‌లను జోడించడానికి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్ చేయండి.
  4. వివరణలో, టైమ్ స్టాంప్‌ల లిస్ట్‌ను, ఇంకా టైటిళ్ల లిస్ట్‌ను జోడించండి.
    • లిస్ట్‌లో మొదటి టైమ్ స్టాంప్ 00:00గా ఉండేలా చూసుకోండి. 
    • మీరు కనీసం మూడు టైమ్ స్టాంప్‌లను ఆరోహణ క్రమంలో కలిగి ఉండాలి.
    • వీడియో చాప్టర్‌ల నిడివి కనీసం 10 సెకన్లు ఉండాలి.

 5. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

గమనిక: ఈ ఆప్షన్ ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లను ఓవర్‌రైడ్ చేస్తుంది.

ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లను ఉపయోగించడానికి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్ చేయండి.
  4. మరిన్నింటిని చూపించు అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఆటోమేటిక్ చాప్టర్‌ల కింద ఉన్న “ఆటోమేటిక్ చాప్టర్‌లను అనుమతించండి (అందుబాటులో ఉన్నప్పుడు, అర్హత ఉన్నప్పుడు)” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆటోమేటిక్‌గా, ఈ బాక్స్ అన్ని కొత్త అప్‌లోడ్‌ల కోసం ఎంచుకోబడి ఉంటుంది. మీరు ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లను బల్క్‌లో కూడా అనుమతించవచ్చు.
  5. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: అన్ని వీడియోలు ఆటోమేటిక్ చాప్టర్‌లకు అర్హతను కలిగి ఉండవు, అలాగే అన్ని అర్హత ఉన్న వీడియోలు ఆటోమేటిక్ చాప్టర్‌లను కలిగి ఉండవు. ఛానెల్‌కు యాక్టివ్ స్ట్రయిక్‌లు ఏవైనా ఉంటే, లేదా కంటెంట్ కొంత మంది వీక్షకులకు అనుచితంగా అనిపించే అవకాశముంటే, వీడియో చాప్టర్‌ల ఫీచర్ అందుబాటులో ఉండదు.

ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లను ఎడిట్ చేయడానికి:

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్ చేయండి.
  4. అందుబాటులో ఉన్న చాప్టర్‌లు ఆ తర్వాత చాప్టర్‌లను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి, ఎడిట్ చేయడానికి మీ ఆటోమేటిక్ చాప్టర్‌లు మీ వివరణలో కనిపిస్తాయి. మీ వీడియో నుండి ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లను తీసివేయడానికి మీరు తొలగించండి  అనే ఆప్షన్‌ను క్లిక్ చేయవచ్చు.
  5. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లను ఉపయోగించడాన్ని నిలిపివేయడానికి:

ఒక నిర్దిష్ట వీడియోకు సంబంధించి ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లను నిలిపివేయడానికి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్ చేయండి.
  4. మరిన్నింటిని చూపించు అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఆటోమేటిక్ చాప్టర్‌ల కింద ఉన్న “ఆటోమేటిక్ చాప్టర్‌లను అనుమతించండి (అందుబాటులో ఉన్నప్పుడు, అర్హత ఉన్నప్పుడు)” అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: మీరు ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లను బల్క్‌ లో కూడా నిలిపివేయవచ్చు.

ఒక నిర్దిష్ట వీడియోకు సంబంధించి ఆటోమేటిక్ వీడియో చాప్టర్‌లను నిలిపివేయడానికి:

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  3. ఆటోమేటిక్ అప్‌లోడ్ సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. అధునాతన సెట్టింగ్‌లు, అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, "ఆటోమేటిక్ చాప్టర్‌లను అనుమతించండి (అందుబాటులో ఉన్నప్పుడు, అలాగే అర్హత ఉన్నప్పుడు)" ఆప్షన్ ఎంపికను తీసివేయండి.
  5. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16739259365689146769
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false