Studio కంటెంట్ మేనేజర్‌లో రిపోర్ట్‌లను డౌన్‌లోడ్ చేయండి

ఈ ఫీచర్‌లు YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించే పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యాక్సెస్ పొందడానికి మీ YouTube పార్ట్‌నర్ మేనేజర్‌ను సంప్రదించండి.
మీరు Studio కంటెంట్ మేనేజర్ నుండి మీ తుది ఆదాయానికి, పనితీరు డేటాకు సంబంధించిన .CSV ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవచ్చు. ఈ రిపోర్ట్‌లు ఆటోమేటిక్‌గా జెనరేట్ అవుతాయి, అలాగే ఇవి 60 రోజుల వరకు అందుబాటులో ఉంటాయి. డేటా నిల్వ కొనసాగింపు పాలసీలకు అనుగుణంగా రిపోర్ట్‌లు 60 రోజుల తర్వాత తొలగించబడతాయి.

మీ రిపోర్ట్‌లను డౌన్‌లోడ్ చేయండి

Studio కంటెంట్ మేనేజర్‌లో మీ రిపోర్ట్‌లను కనుగొని, డౌన్‌లోడ్ చేయడానికి:

  1. Studio కంటెంట్ మేనేజర్‌కు సైన్ ఇన్ చేయండి
  2. ఎడమ వైపు మెనూ నుండి, రిపోర్ట్‌లు ను ఎంచుకోండి.
  3. పేజీ ఎగువున, మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న రిపోర్ట్ రకాన్ని ఎంచుకోండి. రిపోర్ట్ రకాల గురించి మరింత తెలుసుకోండి.
  4. “వీక్షణ” పక్కన ఉన్న, వారంవారీ లేదా నెలవారీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • వారంవారీ రిపోర్ట్‌లు అనేవి ఆటోమేటిక్‌గా గత 2 నెలల రిపోర్ట్‌లను చూపిస్తాయి. 2 నెలల కంటే పాతవైన రిపోర్ట్‌లు మా డేటాబేస్ నుండి తీసివేయబడతాయి.
    • ఆదాయాన్ని కలిగి ఉన్న నెలవారీ రిపోర్ట్‌లు ఆటోమేటిక్‌గా గత 2 నెలల రిపోర్ట్‌లను చూపిస్తాయి. వీక్షణను విస్తరించడం ద్వారా మీరు మునుపటి నెలలకు సంబంధించిన మొత్తం మొత్తాలను చూడగలరు.
  5. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న రిపోర్ట్ వెర్షన్‌ను (ఉదా. వెర్షన్ 1.0, వెర్షన్ 1.1) డౌన్‌లోడ్ చేయండి.
  6. డౌన్‌లోడ్ చేయడానికి రిపోర్ట్ పేరును క్లిక్ చేయండి.
Macintosh విషయంలో Microsoft Excel అనేది UTF-8 ఎన్‌కోడింగ్‌ను సపోర్ట్ చేయదు. మీ మెటాడేటాలో లాటిన్ అక్షరాలు కాకుండా వేరే అక్షరాలు ఏవైనా ఉంటే, Google Sheets వంటి వేరొక స్ప్రెడ్‌షీట్ అప్లికేషన్‌ను ఉపయోగించండి.

అందుబాటులో ఉన్న రిపోర్ట్‌లు

ఆర్థిక సారాంశం

“ఆర్థిక సారాంశం” ట్యాబ్ పేమెంట్ సారాంశ రిపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ రిపోర్ట్ మీ ఆదాయం, సర్దుబాట్ల ఓవర్‌వ్యూను అందిస్తుంది. సాధారణంగా ఇది ప్రతి నెలా 17 తర్వాత పబ్లిష్ అవుతుంది.

పేమెంట్ సారాంశ రిపోర్ట్
రిపోర్ట్ పేరు వివరణ
పేమెంట్ సారాంశం పేమెంట్ సారాంశ రిపోర్ట్‌లో ఆదాయ రకం (ఉదాహరణకు, యాడ్‌లు, సబ్‌స్క్రిప్షన్, లావాదేవీల ద్వారా వచ్చేది) ఆధారంగా విభజించబడిన మీ మొత్తం ఆదాయం ఉంటుంది. ఈ రిపోర్ట్‌లో సర్దుబాట్లు కూడా ఉంటాయి. మొత్తం ఆదాయం, USDతో పాటు మీ పేమెంట్ కరెన్సీలో కూడా రిపోర్ట్ చేయబడుతుంది.

ఆర్థిక రిపోర్ట్‌లు

ఈ రిపోర్ట్‌లలో తుది ఆదాయ డేటా ఉంటుంది, అలాగే ఇవి సాధారణంగా ప్రతి నెలలోని 10, 14 తేదీల మధ్య పబ్లిష్ అవుతాయి.

ఆర్థిక రిపోర్ట్‌లు
రిపోర్ట్ పేరు వివరణ
యాడ్స్ నికర ఆదాయం

యాడ్స్ ఆదాయ రిపోర్ట్‌లో అడ్వర్టయిజింగ్‌కు సపోర్ట్ ఉన్న వీడియోలకు సంబంధించిన ఆదాయం, ఇంకా వీక్షణలు ఉంటాయి.

సబ్‌స్క్రిప్షన్‌ల ఆదాయం సబ్‌స్క్రిప్షన్‌ల ఆదాయం రిపోర్ట్‌లో YouTube Music, Google Play Music, ఇంకా YouTube Premium నుండి వచ్చే ఆదాయం ఉంటుంది.
లావాదేవీల ఆదాయం 

లావాదేవీల రాబడి రిపోర్ట్‌లో, సినిమా కొనుగోళ్లు (EST), ఇంకా వీడియో రెంటల్స్ (VOD) నుండి వచ్చే ఆదాయం ఉంటుంది.

లావాదేవీల రాబడి రిపోర్ట్ కేవలం సినిమా, ఇంకా TV పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఆడియో టయర్ ఆదాయం ఆడియో టయర్ రాబడి రిపోర్ట్‌లో, ఈ కింది వాటికి అనుగుణంగా ఉన్న యూజర్‌ల నుండి వచ్చే YouTube Music ఆదాయం ఉంటుంది:
  • డిమాండ్ లేని రేడియో లాంటి అనుభవాన్ని ఉపయోగిస్తున్న వారి నుండి వచ్చే ఆదాయం
  • Google Assistantను ఉపయోగించే స్క్రీన్ లేని పరికరాలను ఉపయోగిస్తున్న వారు అయ్యుండాలి (ఉదాహరణకు, Google Home)
యాడ్‌ల సర్దుబాట్ల ఆదాయం

యాడ్‌ల సర్దుబాట్ల ఆదాయం రిపోర్ట్ అనేది యాడ్‌ల ఆదాయ సర్దుబాట్లను తెలుపుతుంది. వివాదంలో ఉన్న మానిటైజేషన్ నుండి వచ్చే ఆదాయం, అలాగే అస్సెట్ వైరుధ్య పరిష్కారం నుండి వచ్చే ఆదాయం ఇందులో ఉండవచ్చు.

సంబంధిత నెలలో సర్దుబాట్లు జరిగినప్పుడు మాత్రమే ఈ రిపోర్ట్‌ను పబ్లిష్ చేయడం జరుగుతుంది.

ఛానెల్ స్థాయి సర్దుబాటు

మా YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలను ఉల్లంఘించిన ఛానెల్స్‌కు సంబంధించిన డిడక్షన్‌లను, తిరిగి పొందిన ఆదాయాన్ని ఛానెల్ స్థాయి సర్దుబాటు రిపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ రిపోర్ట్ ఛానెల్, దాని కరెన్సీ కోడ్ ఆధారంగా విభజించబడుతుంది, డిడక్షన్‌లకు కారణాన్ని కలిగి ఉంటుంది.


ఈ రిపోర్ట్ మ్యూజిక్‌తో సంబంధం లేని CMS పార్ట్‌నర్‌లకు, MCN-A పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

సబ్‌స్క్రిప్షన్‌ల సర్దుబాట్ల ఆదాయం

సబ్‌స్క్రిప్షన్‌ల సర్దుబాట్ల ఆదాయం రిపోర్ట్ అనేది సబ్‌స్క్రిప్షన్‌ల ఆదాయ సర్దుబాట్లను తెలుపుతుంది.

సంబంధిత నెలలో సర్దుబాట్లు జరిగినప్పుడు మాత్రమే ఈ రిపోర్ట్‌ను పబ్లిష్ చేయడం జరుగుతుంది.

పెయిడ్ ఫీచర్‌లు పెయిడ్ ఫీచర్‌ల రిపోర్ట్‌లో ఈ కింది వాటి నుండి వచ్చే ఆదాయం ఉంటుంది:
  • సూపర్ చాట్ కొనుగోళ్లు (SCT)
  • మెంబర్‌షిప్‌లు (SPT)
  • సూపర్ స్టిక్కర్స్ (SST)
  • BrandConnect (YTBC)
ఇతర రిపోర్ట్‌లు అనుకూల రిపోర్ట్‌లు (యూజర్‌లందరికీ అందుబాటులో ఉండవు).

పనితీరు రిపోర్ట్‌లు

పనితీరు రిపోర్ట్‌లు సాధారణంగా వారంవారీగా పబ్లిష్ అవుతాయి. కొన్ని రిపోర్ట్‌లు మరింత తరచుగా పబ్లిష్ అవ్వవచ్చు. కింద పేర్కొన్న పనితీరు రిపోర్ట్‌లు అందుబాటులో ఉన్నాయి:

  • వీడియోల రిపోర్ట్
  • అస్సెట్‌ల రిపోర్ట్
  • రెఫరెన్స్‌ల రిపోర్ట్
  • క్లెయిమ్‌ల రిపోర్ట్
  • క్యాంపెయిన్ పనితీరు రిపోర్ట్
పనితీరు రిపోర్ట్‌లు
రిపోర్ట్ పేరు వివరణ
వీడియోలు వీడియోల రిపోర్ట్‌లో ఇవి ఉంటాయి:
  • వీడియో స్టేటస్
  • యాడ్‌లు ఎనేబుల్ చేసి ఉన్నాయా లేదా అనే స్టేటస్
  • వీక్షణల సంఖ్య
  • అస్సెట్ ID
  • పాలసీ

వీడియోల రిపోర్ట్ వారానికి 3 సార్లు అందుబాటులో ఉంటుంది. దీనిలో ఆదాయ డేటా ఉండదు.  

ఏదైనా ఒక వీడియోను ఒకటి కంటే ఎక్కువ అస్సెట్‌లను క్లెయిమ్ చేస్తే, అస్సెట్ ID నిలువు వరుసలో ఒకటి కంటే ఎక్కువ అస్సెట్ IDలు ఉంటాయి, కానీ అస్సెట్ మెటాడేటా మాత్రం ఒక్కటే సెట్ ఉంటుంది.

అస్సెట్‌లు అస్సెట్‌ల రిపోర్ట్‌లో మీ అస్సెట్‌ల గురించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. 3 అస్సెట్‌ల రిపోర్ట్‌లు అందుబాటులో ఉన్నాయి: 
  • అస్సెట్ రిపోర్ట్
  • అస్సెట్ వైరుధ్యాల రిపోర్ట్
  • అస్సెట్‌ల (షేర్‌లు) రిపోర్ట్
ఈ రిపోర్ట్‌లో, ఇతర రిపోర్ట్‌లలో కనుగొనలేని కింద పేర్కొన్న సమాచారం ఉంది:
  • యాజమాన్య హక్కు ప్రాంతాలు
  • అస్సెట్ రకం
  • కాన్‌స్టిట్యుయెంట్ అస్సెట్ ID
  • యాక్టివ్, ఇన్‌యాక్టివ్ రెఫరెన్స్‌లు
  • మ్యాచ్ పాలసీ
ఈ కింద ఉన్న పనులను చేయాలనుకునే పార్ట్‌నర్‌లకు ఈ డాక్యుమెంట్ ఉపయోగకరంగా ఉంటుంది:
  • యాజమాన్య హక్కుకు సంబంధించిన సమాచారం సరిగ్గానే ఉందని నిర్ధారించుకోవడానికి అస్సెట్‌ల సెట్‌ను చేయాలనుకునే వారికి
  • కాన్‌స్టిట్యుయెంట్ అస్సెట్ IDలను సింథసైజ్డ్ అస్సెట్ IDలకు మ్యాప్ చేయాలనుకొనే వారికి
  • ఒక నిర్దిష్ట మ్యాచ్ పాలసీతో ఉన్న అస్సెట్‌లన్నింటినీ చూడాలనుకునే వారికి
ఈ రిపోర్ట్‌లు ప్రతి రోజూ పబ్లిష్ చేయబడతాయి (ఒకవేళ అందుబాటులో ఉన్నట్లయితే). 
రెఫరెన్స్‌లు

రెఫరెన్స్‌ల రిపోర్ట్ అనేది అన్ని యాక్టివ్ రెఫరెన్స్ ఫైళ్ల ఓవర్‌వ్యూను, అలాగే అనుబంధిత మ్యాచ్‌ల ఓవర్‌వ్యూను అందిస్తుంది.

క్లెయిమ్‌లు

క్లెయిమ్‌ల రిపోర్ట్‌లో ఖాతాతో అనుబంధితమైన ప్రతి క్లెయిమ్ అట్రిబ్యూట్స్, సెట్టింగ్‌లతో సహా అన్ని యాక్టివ్ క్లెయిమ్‌ల పూర్తి లిస్ట్ ఉంటుంది. 

క్యాంపెయిన్‌లు

క్యాంపెయిన్ పనితీరు రిపోర్ట్ అనేది అర్హత ఉన్న వీడియోలకు సంబంధించిన క్యాంపెయిన్ కార్డ్‌లు ఎంత తరచుగా క్లిక్ చేయబడుతున్నాయో మీకు తెలియజేస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11368381712242180862
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false