YouTubeలో కొనుగోలు చేసిన సినిమాను లేదా షోను చూడండి

మీరు YouTubeలో సినిమాలను, టీవీ షోలను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడం చేసిన తర్వాత, వాటిని కంప్యూటర్‌లో, మొబైల్ పరికరంలో,  స్మార్ట్ టీవీలో, స్ట్రీమింగ్ పరికరంలో, లేదా గేమ్ కన్సోల్‌లో చూడవచ్చు. మీరు చేసిన కొనుగోళ్లను యాక్సెస్ చేయడానికి, మీ Google ఖాతాకు సైన్ ఇన్ అయి ఉన్నారని నిర్ధారించుకోండి. మీ రెంటల్స్ విషయానికి వస్తే, వాటిని మీరు మొదటిసారి చూడటం ప్రారంభించిన తర్వాత, అద్దె వ్యవధి చివరి దాకా అవి అందుబాటులో ఉంటాయి. కొనుగోళ్లు నిరవధికంగా అందుబాటులో ఉంటాయి. మరింత సమాచారం కోసం మా వినియోగ నియమాలను చూడండి.

యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వీక్షకుల విషయంలో: మీరు YouTubeలో ఏదైనా Primetime ఛానెల్‌కు సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తే, మీకు ప్రోగ్రామ్‌లు హోమ్ ట్యాబ్‌లోని సిఫార్సులలో, మీ YouTube సెర్చ్ ఫలితాలలో కనిపిస్తాయి. మీరు కొనుగోలు చేసిన సబ్‌స్క్రిప్షన్‌లను నేరుగా కూడా చూడవచ్చు.

గమనిక: వేరొక ధరకు కొన్ని వీడియోలు అదనపు క్వాలిటీలను అందిస్తాయి. HD, UHD టైటిల్స్‌కు సంబంధించిన ప్లేబ్యాక్, సపోర్ట్ చేసే నిర్దిష్ట పరికరాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, అంతే కాకుండా దీనికి నిర్దిష్టమైన ఇంటర్నెట్ వేగం కూడా అవసరం అవుతుంది. మరింత సమాచారం కోసం HD/UHD పరికర ఆవశ్యకతలను చూడండి.

కంప్యూటర్‌లో చూడండి

కొనుగోలు చేసిన సినిమాలను, టీవీ షోలను కంప్యూటర్‌లో యాక్సెస్ చేయడానికి, YouTubeకు సైన్ ఇన్ చేసి, ఎడమ వైపున ఉన్న మెనూలో “మీ సినిమాలు & TV” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ నుండి, మీరు కొనుగోలు చేసిన సినిమాలను, టీవీ షోలను చూడటానికి “కొనుగోలు చేసినవి” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీరు HTML5 ప్లేబ్యాక్‌కు సపోర్ట్ ఉన్న వెబ్ బ్రౌజర్‌లలో అద్దెకు తీసుకున్న లేదా కొనుగోలు చేసిన సినిమాలను, షోలను చూడవచ్చు. YouTubeలోని సినిమాలను, షోలను చూడటానికి ఏ వెబ్ బ్రౌజర్‌లు సపోర్ట్ చేస్తాయో చూడండి.

మొబైల్ పరికరంలో చూడండి

మీరు మీ పరికరంలోని YouTube మొబైల్ యాప్‌ను ఉపయోగించి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో అద్దెకు తీసుకున్న, కొనుగోలు చేసిన కంటెంట్‌ను చూడవచ్చు.
మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేసి, ఆపై "మీ సినిమాలు & TV" అనే ఆప్షన్‌కు వెళ్లడం ద్వారా మీరు కొనుగోలు చేసిన అన్ని వీడియోలను మీరు కనుగొనవచ్చు.
గమనిక:
  • ఎంచుకోబడిన లొకేషన్‌లలో మీ iOS పరికరంలో కంటెంట్‌ను మీరు కొనుగోలు చేయవచ్చు. మీ లొకేషన్‌లో iOS కొనుగోళ్లకు సపోర్ట్ ఉందో లేదో చూడటానికి, దయచేసి ఇక్కడ చెక్ చేయండి.
  • మీ లొకేషన్‌లో iOS కొనుగోలుకు సపోర్ట్ లేకపోతే, మీరు ఇప్పటికీ మరొక పరికరంలో సినిమాలను, టీవీ షోలను కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసిన తర్వాత, ఆ కంటెంట్‌ను మీ iOS పరికరంలో మీరు చూడవచ్చు.
  • YouTube Android యాప్‌లో కొనుగోలు చేసిన కొన్ని సినిమాలకు, షోలకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. ఇది రేట్‌పై కానీ, లేదా ధరపై కానీ ప్రభావం చూపదు. మీరు రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు కూడా.

Chromecastను ఉపయోగించి చూడండి

మీ వద్ద Chromecast ఉంటే, మీరు YouTubeలో అద్దెకు తీసుకున్న వాటిని, కొనుగోళ్లను మీ టీవీలో చూడటానికి దాన్ని ఉపయోగించవచ్చు. మీ మొబైల్ పరికరంలో YouTube యాప్‌ను తెరిచి, మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోవడం ద్వారా ప్రారంభించండి. మీరు ఆ పని చేసిన తర్వాత:
  1. మీరు చూడాలనుకుంటున్న YouTube వీడియోను ఎంచుకోండి.
  2. మీ టీవీకి వీడియోను ప్రసారం చేయడానికి, ప్రసారం చేయండి ని క్లిక్ చేయండి.
ఈ ఆర్టికల్‌లో లిస్ట్ చేయబడిన దశలను ఫాలో అవ్వడం ద్వారా మీరు మీ Chrome బ్రౌజర్ నుండి కూడా ప్రసారం చేయవచ్చు.
Chromecastను ఉపయోగించడం గురించి సందేహాలు ఉంటే, Chromecast సహాయ కేంద్రం లింక్‌ను సందర్శించండి.

స్మార్ట్ టీవీలు లేదా ఇతర స్ట్రీమింగ్ పరికరాలలో చూడండి

స్మార్ట్ టీవీలు, Apple TV, Android TV, Fire టీవీ, Rokuలోని YouTube యాప్‌లో కూడా మీరు కొనుగోలు చేసిన సినిమాలను, టీవీ షోలను యాక్సెస్ చేయవచ్చు.

YouTube యాప్‌నకు సైన్ ఇన్ చేయడం ద్వారా మీరు YouTubeలో కొనుగోలు చేసిన సినిమాలను, షోలను చూడండి. మీ మొత్తం కంటెంట్‌ను చూడడానికి, లైబ్రరీ ట్యాబ్‌లోని మీ సినిమాలు, షోలకు వెళ్లండి. మీ పరికరంలో YouTube యాప్ తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసి ఉందని నిర్ధారించుకోండి.

మీ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్‌లోని ప్రసారం చేయండి బటన్‌ను ఉపయోగించి, అద్దెకు తీసుకున్న వాటిని, కొనుగోళ్లను Android TVకి ప్రసారం చేయవచ్చు.

గేమ్ కన్సోల్స్‌లో చూడండి

YouTubeలో కొనుగోలు చేసిన సినిమాలను, టీవీ షోలను Xbox One, Xbox 360, Playstation 3, Playstation 4, Wii U, Nintendo Switch పరికరాలను ఉపయోగించి చూడవచ్చు.
మీరు కొనుగోలు చేసిన సినిమాను లేదా టీవీ షోను చూడటానికి, YouTube యాప్‌నకు సైన్ ఇన్ చేయండి, ఆ తర్వాత లైబ్రరీ ట్యాబ్  ఆ తర్వాత “మీ సినిమాలు & షోల"కు వెళ్లండి. అక్కడ నుండి, మీరు కొనుగోలు చేసిన సినిమాలను, టీవీ షోలను చూడటానికి “కొనుగోలు చేసినవి”ని ఎంచుకోండి.
మీరు గేమ్ కన్సోల్స్‌లో సినిమాలను లేదా టీవీ షోలను కొనుగోలు చేయలేరు. మీరు సినిమాను లేదా టీవీ షోను మరొక పరికరంలో కొనుగోలు చేసి, పైన పేర్కొన్న సూచనలను ఉపయోగించి దాన్ని మీ గేమ్ కన్సోల్‌లో చూడవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11932073459419152335
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false