కంప్యూటర్ లేదా మొబైల్ పరికరంలో సినిమాలను, టీవీ షోలను ఎలా కొనుగోలు చేయాలి

YouTubeలో సినిమాలను, టీవీ షోలను కొనుగోలు చేయడానికి, మీరు తప్పనిసరిగా 18 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అయ్యుండి, సపోర్ట్ ఉన్న దేశంలో నివసిస్తుండాలి, అలాగే చెల్లుబాటు అయ్యే పేమెంట్ ఆప్షన్‌తో ఉన్న ఒక Google ఖాతా మీకు ఉండాలి.

గమనిక: YouTubeలో కొనుగోలు చేసిన సినిమాలు మీ Google Play ఫ్యామిలీ లైబ్రరీలో కనిపించవు. మరింత తెలుసుకోండి.

కంప్యూటర్‌లో సినిమాలను, టీవీ షోలను కొనుగోలు చేయడానికి, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి, కొనుగోలు చేయడానికి ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న లేదా అద్దెకు తీసుకోవాలనుకుంటున్న సినిమా లేదా టీవీ షో కోసం సినిమాలు & షోల పేజీకి వెళ్లండి లేదా YouTubeలో సెర్చ్ చేయండి
  2. కొనుగోలుకు ఎంత అవుతుందో లేదా అద్దెకు ఎంత అవుతుందో ధరను డిస్‌ప్లే చేసే బటన్‌ను క్లిక్ చేయండి. వేర్వేరు రిజల్యూషన్‌లకు వేర్వేరు ధరలు కూడా అందుబాటులో ఉండవచ్చు.
  3. రిడీమ్ చేయడానికి మీ దగ్గర కూపన్ ఉంటే, ప్రమోషనల్ కోడ్ ఫీల్డ్‌ను చూడటానికి 'ప్రమోషనల్ కోడ్‌ను ఎంటర్ చేయండి'ని క్లిక్ చేయండి. మీ కోడ్‌ను ఎంటర్ చేసి, బాణంపై క్లిక్ చేయండి, ఆపై కొనసాగించడానికి సంబంధిత కొనుగోలు బటన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ఉపయోగించాలనుకుంటున్న పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి, లేదా ఒక కొత్త పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి, ఆపై లావాదేవీని పూర్తి చేయడానికి కొనుగోలు చేయండిని క్లిక్ చేయండి.
  5. మీ పేమెంట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, కొనుగోలు పూర్తయింది అని సూచించే ఒక నిర్ధారణ మెసేజ్ మీకు అందుతుంది.
  6. మీ ఖాతాకు సైన్ ఇన్ అయి ఉన్నప్పుడు, https://www.youtube.com/purchases లింక్‌కు వెళ్లి, మీరు కొనుగోలు చేసిన వీడియోలన్నింటినీ చూడవచ్చు.
గమనించవలసిన విషయాలు:
  • అద్దెకు తీసుకొన్న సినిమాల విషయంలో, మీరు సినిమాను మొదటిసారి చూడటం ప్రారంభించిన తర్వాత, మీరు అద్దెకు తీసుకొన్న వ్యవధి కాలం అంతా అది అందుబాటులో ఉంటుంది. కొనుగోలు చేసిన వాటిని, మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడవచ్చు. మరింత సమాచారం కోసం, మా వినియోగ నియమాలను చూడండి
  • కొన్ని వీడియోల విషయంలో, వేర్వేరు రిజల్యూషన్‌లకు వేర్వేరు ధరలు కూడా అందుబాటులో ఉండవచ్చు. HD, UHD టైటిల్స్‌కు సంబంధించిన ప్లేబ్యాక్, సపోర్ట్ చేసే నిర్దిష్ట పరికరాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, అంతే కాకుండా దీనికి నిర్దిష్టమైన ఇంటర్నెట్ వేగం కూడా అవసరం అవుతుంది. మరింత సమాచారం కోసం, HD/UHD పరికర అవసరాలను చూడండి.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13317646309792599007
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false