YouTube పార్ట్ నర్ ప్రోగ్రామ్ నుండి తాత్కాలిక నిలిపివేతను లేదా దరఖాస్తు తిరస్కరణను అప్పీల్ చేయండి

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) నుండి మీ ఛానెల్ పొరపాటున సస్పెండ్ చేయబడిందని మీరు భావిస్తే, YPPలో చేరడానికి మీరు చేసిన దరఖాస్తు పొరపాటున తిరస్కరించబడిందని మీరు భావిస్తే, మీకు అప్పీల్ చేసే ఆప్షన్ ఉంటుంది. మీరు వీడియో అప్పీల్‌ను క్రియేట్ చేసి, ఆ వీడియో అప్పీల్‌ను సమర్పించడం ద్వారా లేదా YouTube Studioలో క్రియేటర్ సపోర్ట్‌ను సంప్రదించడం ద్వారా అప్పీల్ చేయవచ్చు. 

మీరు అప్పీల్‌ను సబ్మిట్ చేసిన తర్వాత, 14 రోజుల్లో ఒక నిర్ణయంతో మా టీమ్‌లు ప్రతిస్పందిస్తాయి. మీ అప్పీల్ విజయవంతమైతే, మేము YPP కోసం మీ ఛానెల్‌ను తిరిగి ఆమోదిస్తాము లేదా 30 రోజుల్లోపు మానిటైజేషన్‌ను తిరిగి ఆన్ చేస్తాము. మీ అప్పీల్ తిరస్కరించబడితే, తాత్కాలికంగా నిలిపివేసిన తేదీ నుండి లేదా మీ దరఖాస్తు తిరస్కరించబడిన తేదీ నుండి 90 రోజుల తర్వాత మీరు YPPకి మళ్లీ దరఖాస్తు చేయవచ్చు. 

మేము మీ అప్పీల్‌ను రివ్యూ చేసేటప్పుడు, మీ ఛానెల్ ప్రస్తుత స్టేటస్ ఆధారంగా దాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అంటే మీ అప్పీల్‌ను సమర్పించడానికి ముందు మీరు వీడియోలను తొలగించకూడదు.

ముఖ్య గమనిక: సస్పెండ్ చేయబడిన తర్వాత నుండి 21 రోజులలోపు మీరు తప్పనిసరిగా అప్పీల్‌ను సమర్పించాలి. YouTube Studioలో అప్పీల్‌ను ప్రారంభించండి బటన్ పక్కన, మీ ఛానెల్ మానిటైజేషన్ ఓవర్‌వ్యూలో కూడా ఈ తేదీ చూపబడుతుంది.

వీడియో ఆధారంగా అప్పీల్ చేయండి

వీడియో ఆధారంగా అప్పీల్ చేయడానికి అర్హత ఉంటే, మీ వీడియోను క్రియేట్ చేస్తున్నప్పుడు, ఈ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వండి:

ఫార్మాట్ తప్పనిసరిగా కింద పేర్కొన్న విధంగా ఉండాలి

  • వీడియో మాత్రమే అయి ఉండాలి (మీరు వివరణలో ఎటువంటి అప్పీల్ సమాచారాన్ని చేర్చకూడదు)
  • 5 నిమిషాల కంటే తక్కువ నిడివి ఉండాలి
  • అన్‌లిస్టెడ్ అయి ఉండాలి
  • మీరు అప్పీల్ చేస్తున్న ఛానెల్‌కు అప్‌లోడ్ చేయబడి ఉండాలి, మీ ఖాతా నుండి సమర్పించబడి ఉండాలి
  • సపోర్ట్ ఉన్న భాషలో వ్యాఖ్యానించబడి ఉండాలి (లేదా ఆటోమేటిక్‌గా జెనరేట్ చేయబడని ఇంగ్లీష్ సబ్‌టైటి‌ళ్లను ఫీచర్ చేయాలి):
    • అరబిక్, బెంగాలీ, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, ఇండోనేషియన్, జపనీస్, కొరియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, థాయ్, టర్కిష్, వియత్నామీస్

స్టేటస్ తప్పనిసరిగా ఈ కింద ఉన్న వాటిలో ఒకటి అయ్యుండాలి

  • అన్‌లిస్టెడ్
  • కొత్త అప్‌లోడ్

ఏమేమి చేర్చాలి

మీరు మీ కంటెంట్‌ను ఎలా క్రియేట్ చేస్తున్నారో, అలాగే మీ ప్రాసెస్ వెనుక ఏమి జరుగుతుందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ వీడియో వీటిని కలిగి ఉండాలి:

  1. మీ వీడియోలోని మొదట 30 సెకన్ల‌లో మీ ఛానెల్ URLను చేర్చాలి.
  2. మా ప్రోగ్రామ్ పాలసీలను (మా YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలలో భాగమైనవి) చూడండి. మీరు పాలసీలోని నిర్దిష్ట అంశాలను ప్రస్తావించి, మీ ఛానెల్ మా గైడ్‌లైన్స్‌ను ఎలా ఫాలో అవుతుందో సూచించే ఉదాహరణలను అందించారని నిర్ధారించుకోండి.
  3. మా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండే ఒక్కొక్క వీడియోపై మాత్రమే కాకుండా, మొత్తం ఛానెల్‌పై దృష్టి పెట్టండి.
  4. మీ కంటెంట్ ఎలా క్రియేట్ చేయబడిందో చూపించే విజువల్ రూపంలోని ఉదాహరణలను అందించండి. మీరు కంటెంట్‌ను ఎలా ఎడిట్ చేశారో లేదా ఎలా ఫిల్మ్ చేశారో చూపించండి, మీ వీడియో అప్పీల్‌లో మీరు చూపించే దాన్ని మీ ఛానెల్‌లోని ఇతర కంటెంట్‌కు కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు వీటిని చేయవచ్చు:
    • మీరే వీడియోలో కనిపించవచ్చు, లేదా వాయిస్-ఓవర్‌ను అందించవచ్చు
    • మీ కంటెంట్ ఎలా ఫిల్మ్ చేయబడిందో చూపించవచ్చు 
    • మీ కంటెంట్ ఎలా ఎడిట్ చేయబడిందో చూపించవచ్చు
గమనిక: మీరు మ్యూజిక్ ఆర్టిస్ట్ అయితే, మీరు మీ మ్యూజిక్‌‌‌ను ఎలా క్రియేట్ చేస్తారో చూపండి, అలాగే, సందర్భోచితం అనిపిస్తే, మీరు మీ మ్యూజిక్ వీడియోను ఎలా క్రియేట్ చేస్తారో ఇతరులకు (అంటే, నిర్మాతలు, వీడియోగ్రాఫర్‌లు) వివరించండి.

మీ వీడియో అప్పీల్ సిద్ధమైన తర్వాత, అప్‌లోడ్ చేసి, సమర్పించడానికి ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి
  2. మీ అప్పీల్ వీడియోను అన్‌లిస్టెడ్‌గా అప్‌లోడ్ చేసి, URLను కాపీ చేయండి
  3. మీ ఛానెల్ మానిటైజేషన్ ఓవర్‌వ్యూ కోసం సంపాదించండి అనే ఆప్షన్‌కు వెళ్లండి
  4. క్లిక్ చేసి, అప్పీల్ ప్రాసెస్‌ను ప్రారంభించండి
  5. మీ అన్‌లిస్టెడ్ వీడియోకు సంబంధించిన URLను ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండిని క్లిక్ చేయండి

క్రియేటర్ సపోర్ట్‌తో అప్పీల్ చేయండి

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి
  2. మీ ఛానెల్ మానిటైజేషన్ ఓవర్‌వ్యూ కోసం సంపాదించండి అనే ఆప్షన్‌కు వెళ్లండి
  3. మేము పొరపాటు చేశామని మీరు భావిస్తే, అప్పీల్ చేయండి అనే ఆప్షన్‌ను చూడండి
  4. సూచనలు చూసి, అప్పీల్‌ను ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, కాంటాక్ట్ ప్రాసెస్‌ను ప్రారంభించండి

క్రియేటర్ సపోర్ట్‌తో అప్పీల్ చేసే ఆప్షన్ YouTube Studioలో అందుబాటులో లేకుంటే, మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3185947970027931058
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false