బ్రాండ్ ఖాతా యూజర్ యాక్సెస్ నుండి ఛానెల్ అనుమతులకు తరలించండి (మైగ్రేట్ చేయండి)

బ్రాండ్ ఖాతా అనేది మీ బిజినెస్‌కు లేదా బ్రాండ్‌కు సంబంధించి కొన్ని Google సర్వీస్‌ల కోసం అందుబాటులో ఉన్న Google ఖాతా. మీ YouTube ఛానెల్, బ్రాండ్ ఖాతాకు లింక్ అయితే, పలువురు వారి Google ఖాతాల నుండి చానెల్‌ను మేనేజ్ చేయగలరు. 

నిర్దిష్ట రోల్స్ ద్వారా ఇతర యూజర్లకు మీ ఛానెల్ యాక్సెస్‌ను అందించే సామర్థ్యాన్ని ఛానెల్ అనుమతులు మీకు అందిస్తాయి. రోల్స్‌ను నియమించడం (అసైన్ చేయడం) అనేది సరైన స్థాయి యాక్సెస్‌ను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పాస్‌వర్డ్ షేరింగ్ వంటి సెక్యూరిటీ రిస్క్‌లను నివారించడానికి, గోప్యతకు సంబంధించిన ఆందోళనలను తగ్గించడానికి ఛానెల్ అనుమతులకు తరలించండి (మైగ్రేట్ చేయండి).

బ్రాండ్ ఖాతాతో YouTube Studioలో ఛానెల్ అనుమతులను ఉపయోగించండి

 ఛానెల్ అనుమతులకు వెళ్లడానికి ముందు గుర్తుంచుకోవాల్సినవి:

ఛానెల్ అనుమతులకు సమ్మతి తెలియజేయండి (ఆప్ట్-ఇన్ చేయండి)

బ్రాండ్ ఖాతా ప్రధాన ఓనర్, YouTube Studioలో లేదా నేరుగా YouTubeలో ఛానెల్ అనుమతులను ఉపయోగించాలని నిర్ణయించుకోవచ్చు.

కొనసాగించడానికి ముందు, మీకు ఇప్పటికే బ్రాండ్ ఖాతా ఉందో లేదో నిర్ధారించుకోండి.

  1. studio.youtube.comకు వెళ్లండి. అనుమతులను ఎంచుకోవడానికి మీరు తప్పనిసరిగా బ్రాండ్ ఖాతా యొక్క ప్రధాన ఓనర్‌గా సైన్ ఇన్ చేయాలి.
  2. ఎడమ వైపున, సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. అనుమతులు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. అనుమతులను తరలించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీ బ్రాండ్ ఖాతాతో అనుబంధించబడిన ప్రతి యూజర్ కోసం ఒక రోల్‌ను ఎంచుకోండి.
  6. నిరాకరణను (డిస్‌క్లోజర్‌ను) ధృవీకరించి, ఆహ్వానంపై క్లిక్ చేయండి.
  7. ఆహ్వానించబడిన ప్రతి యూజర్, ఆహ్వానాన్ని ఆమోదించడానికి ఒక ఈమెయిల్‌ను అందుకుంటారు.
  8. ప్రతి కొత్త యూజర్ ఇప్పుడు Studio అనుమతుల్లో చూపబడతారు.

ఛానెల్ అనుమతులకు సమ్మతిని నిలిపివేయండి (ఆప్ట్-అవుట్ చేయండి)

మీరు ఛానెల్ బదిలీని పూర్తి చేయాలంటే మాత్రమే ఛానెల్ అనుమతులను నిలిపివేయండి (ఆప్ట్-అవుట్ చేయండి).

సమ్మతిని నిలిపివేయడానికి, YouTube Studioలో సెట్టింగ్‌లు ఆ తర్వాత అనుమతులు కింద “YouTube Studioలో అనుమతులను నిలిపివేయండి”ని ఎంచుకోండి.

గమనిక: ఛానెల్ ఓనర్ OACకి డెలిగేట్ యాక్సెస్‌ను ఉపసంహరించుకుంటే, యాక్సెస్ మార్పులకు సంబంధించి మీరు ఈమెయిల్ అలర్ట్‌ను పొందుతారు.

సపోర్ట్ ఉన్న ఫీచర్‌లు

ఛానెల్ అనుమతులు బ్రాండ్ ఖాతా రోల్స్ లాగా కాకుండా వివరణాత్మక స్థాయిల యాక్సెస్‌ను అనుమతిస్తాయి.

కేటగిరీ యాక్సెస్ లెవెల్ / పబ్లిక్ చర్యలు బ్రాండ్ ఖాతాలు ఛానెల్ అనుమతులు
కంప్యూటర్‌లో YT Studio YT Studio యాప్ YouTube
వివరణాత్మక అనుమతి కంట్రోల్ మేనేజర్ రోల్ అవును    
ఎడిటర్ రోల్ లేదు      
ఎడిటర్ (పరిమిత యాక్సెస్) రోల్ లేదు         
వీక్షకులు మాత్రమే రోల్ లేదు      
వీక్షకులు (పరిమిత యాక్సెస్) రోల్ లేదు
సబ్‌టైటిల్ ఎడిటర్ రోల్ లేదు
వీడియో మేనేజ్‌మెంట్ వీడియోలను / షార్ట్స్‌ను అప్‌లోడ్ చేయడం అవును    
షార్ట్స్‌ను క్రియేట్ చేయడం అవును   
ఆర్టిస్ట్‌ల లిస్ట్ వీక్షణలో ఉన్న దానితో సహా, YouTube ఎనలిటిక్స్‌లో లేదా ఆర్టిస్ట్ ఎనలిటిక్స్‌లో వీడియో పనితీరును అర్థం చేసుకోండి అవును            
వీడియోలను మేనేజ్ చేయడం (మెటాడేటా, మానిటైజేషన్, విజిబిలిటీ) అవును
ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయడం అవును  
ఇప్పటికే ఉన్న పబ్లిక్ ప్లేలిస్ట్‌కు వీడియోను జోడించడం అవును      
ప్లేలిస్ట్‌లను మేనేజ్ చేయడం అవును   
ఛానెల్‌గా లైవ్ స్ట్రీమ్ చేయడం అవును
క్యాప్షన్‌లు, ప్రైవేట్ వీడియో షేరింగ్ అవును
మొబైల్ అప్‌లోడ్‌లు అవును    
ఛానెల్ మేనేజ్‌మెంట్ ఛానెల్ హోమ్ పేజీని అనుకూలంగా మార్చడం / మేనేజ్ చేయడం అవును         
కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ పోస్ట్‌ను క్రియేట్ చేయడం అవును
కమ్యూనిటీ పోస్ట్‌లను పోస్ట్ చేయడం అవును  
కమ్యూనిటీ పోస్ట్‌లను తొలగించడం అవును [మేనేజర్ మాత్రమే] [మేనేజర్ మాత్రమే]
YouTube Studio నుండి ఛానెల్‌గా కామెంట్‌లకు రిప్లయి ఇవ్వడం అవును
మరొక ఛానెల్‌కు సంబంధించిన వీడియోలపై ఛానెల్‌గా కామెంట్ చేయడం, అలాగే ఇంటరాక్ట్ అవ్వడం అవును
లైవ్ కంట్రోల్ పేజీ నుండి లైవ్ చాట్‌ను ఛానెల్‌గా ఉపయోగించడం అవును
ఆర్టిస్ట్‌లకు ప్రత్యేకమైనవి అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్ ఫీచర్‌లు (ఉదాహరణకు, సంగీత కచేరీలు) అవును

ఛానెల్ అనుమతులు & బ్రాండ్ ఖాతా డెలిగేషన్ (నియుక్త బృందం) పరిమితులు

ఛానెల్ అనుమతుల పరిమితులు

ఓనర్

  • పరిమితులేవీ లేవు. ఛానెల్‌ను తొలగించడంతో పాటు లైవ్ స్ట్రీమ్‌లను, లైవ్ చాట్‌ను మేనేజ్ చేయడం వంటి చర్యలు తీసుకోగలరు
  • యాజమాన్య హక్కును ఇతర యూజర్‌లకు బదిలీ చేయలేరు

మేనేజర్

  • ఛానెల్‌ను తొలగించలేరు, కానీ డ్రాఫ్ట్ వీడియోలను తొలగించగలరు

ఎడిటర్

  • షెడ్యూల్ చేయబడిన/లైవ్/పూర్తయిన స్ట్రీమ్‌లను తొలగించలేరు

ఎడిటర్ (పరిమిత యాక్సెస్)

  • ఎడిటర్‌కు ఏ అనుమతులు అయితే ఉన్నాయో అవే, కానీ ఆదాయ డేటాను (చాట్ ఆదాయాన్ని, వీక్షకుల యాక్టివిటీ ట్యాబ్‌తో సహా) యాక్సెస్ చేయలేరు

వీక్షకులు

  • 'స్ట్రీమ్ కీ'ని యాక్సెస్ చేయలేరు
  • స్ట్రీమ్ సెట్టింగ్‌లు/మెటాడేటాను ఎడిట్ చేయలేరు
  • లైవ్ చేయలేరు లేదా స్ట్రీమ్‌లను ముగించలేరు
  • షెడ్యూల్ చేయబడిన/లైవ్/పూర్తయిన స్ట్రీమ్‌లను తొలగించలేరు
  • లైవ్ కంట్రోల్ పేజీలో చాట్ చేయలేరు లేదా చాట్‌ను మోడరేట్ చేయలేరు

వీక్షకులు (పరిమిత యాక్సెస్)

  • వీక్షకులకు ఏ అనుమతులు అయితే ఉన్నాయో అవే, కానీ ఆదాయ డేటాను (చాట్ ఆదాయాన్ని, వీక్షకుల యాక్టివిటీ ట్యాబ్‌తో సహా) యాక్సెస్ చేయలేరు

 బ్రాండ్ ఖాతా పరిమితులు

ప్రధాన ఓనర్

  • పరిమితులేవీ లేవు
ఓనర్
  • పరిమితులేవీ లేవు

మేనేజర్

  • MCNలో చేరలేరు లేదా దాని నుండి నిష్క్రమించలేరు
  • ఇతర యూజర్‌లను ఆహ్వానించలేరు
  • ఛానెల్‌ను బదిలీ చేయలేరు, లేదా (ప్రధాన ఓనర్ ద్వారా మినహా) ఛానెల్‌ను బదిలీ చేయించుకోలేరు.
  • ఛానెల్‌ను తొలగించలేరు
  • కొనుగోలు చేయలేరు
కమ్యూనికేషన్‌ల మేనేజర్
  • YouTubeలో ఎలాంటి చర్యలు తీసుకోలేరు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13519711299878658994
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false