అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీసులు

మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగం అయ్యుండి, మీకు యాడ్‌ల ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, మీ కంటెంట్ మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. 

కంటెంట్ మొత్తం గైడ్‌లైన్స్‌ను తప్పక ఫాలో అవ్వాలి

మీ కంటెంట్‌కు సంబంధించిన అంశాలన్నింటినీ మేము పరిగణనలోకి తీసుకుంటాము. కంటెంట్ అంటే, మీ:

  • వీడియో, షార్ట్, లేదా లైవ్ స్ట్రీమ్ కంటెంట్
  • టైటిల్
  • థంబ్‌నెయిల్
  • వివరణ
  • ట్యాగ్‌లు

యాడ్‌లకు అనుకూలంగా ఉండాలంటే, మీ కంటెంట్ అంతా మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండాలి.

మీ వీడియోలకు సందర్భాన్ని జోడించండి

సందర్భమనేది చాలా కీలకమైనది. విద్యాపరమైన, డాక్యుమెంటరీ, శాస్త్రీయ, లేదా కళాత్మక విలువ ఉంటే, అది అడ్వర్టయిజర్‌లకు మీ వీడియో అనుకూలతను మార్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, "మత్తు" పొందడానికి కొకెయిన్‌ను ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని మీరు చూపుతున్నట్లయితే, అది యాడ్‌లకు తగినది కాదు, కాబట్టి మీరు ఆ వీడియోకు యాడ్‌లను ఆన్ చేయకూడదు. కానీ, ఏదైనా వైద్య విధానంలో భాగంగా కొకెయిన్‌ను ఉపయోగిస్తుండటాన్ని మీ వీడియో చూపుతున్నట్లయితే, అది కొందరు అడ్వర్టయిజర్‌లకు సమ్మతం కావచ్చు. 

సరైన మానిటైజేషన్ నిర్ణయం తీసుకోవడంలో కూడా సందర్భాన్ని జోడించడం అనేది మాకు సహాయపడుతుంది. మా సిస్టమ్‌లు తీసుకొనే నిర్ణయాలన్నీ సరైనవి కాకపోవచ్చు. మీ వీడియో అడ్వర్టయిజర్‌లందరికీ అనుకూలంగా లేదని మా సిస్టమ్‌లు మార్క్ చేస్తే, మీరు హ్యూమన్ రివ్యూ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. మానిటైజేషన్ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి, మా రివ్యూవర్‌లు, మీ కంటెంట్‌ను, అలాగే సందర్భాన్ని అంచనా వేస్తారు. 

మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌ను ఉపయోగించి కంటెంట్‌ను రివ్యూవర్‌లు ఎలా అంచనా వేస్తారు అనే దాని గురించి మరింత తెలుసుకోండి. 

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కాని కంటెంట్‌కు యాడ్‌లను ఆఫ్ చేయండి

మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వని కంటెంట్‌ను మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటే, మీరు విడివిడిగా ఒక్కో వీడియోకు యాడ్‌లను ఆఫ్ చేయాలి. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంటూనే, అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కాని వీడియోలకు మానిటైజేషన్‌ను నిలిపివేసే వెసులుబాటును మీకు ఈ ఆప్షన్ అందిస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13075170680725516292
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false