మానిటైజేషన్ FAQల విషయంలో నా ఛానెల్ తిరస్కరించబడింది

మానిటైజేషన్ విషయంలో నా ఛానెల్ ఎందుకు తిరస్కరించబడింది?

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) కోసం మీరు చేసిన దరఖాస్తు తిరస్కరించబడితే, మీ ఛానెల్‌లో గణనీయమైన భాగం మా పాలసీలకు, గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేదని మా హ్యూమన్ రివ్యూవర్‌లు కనుగొన్నారని అర్థం. తర్వాతి దశల గురించి తెలుసుకోవడానికి, ఈ ఆర్టికల్‌లో ఉన్న ఇతర ప్రశ్నలను చూడండి.

నేను మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చా?

చేసుకోవచ్చు. మిమ్మల్ని తిరస్కరించడం ఇదే మొదటిసారి అయితే, మీకు తిరస్కరణ ఈమెయిల్ వచ్చిన 30 రోజుల తర్వాత YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో చేరడానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. మిమ్మల్ని తిరస్కరించడం ఇదే మొదటిసారి కాకపోతే, లేదా గతంలో మీరు మళ్లీ దరఖాస్తు చేసుకుని ఉంటే, తిరస్కరణ ఈమెయిల్‌ను అందుకున్న 90 రోజుల తర్వాత మీరు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు మళ్లీ దరఖాస్తు చేసుకునే ముందు, మీ ఛానెల్‌లో పాలసీ ఉల్లంఘనలు ఏవైనా జరిగాయో లేదో ఒకసారి రివ్యూ చేసుకోండి.

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో చేరే విషయంలో మీ ఛానెల్ పొరపాటున తిరస్కరించబడిందని మీకు అనిపిస్తే, మీరు మళ్లీ ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నారనే దానితో సంబంధం లేకుండా, 21 రోజుల లోపు మీరు అప్పీల్ చేసుకోవచ్చు. 

నా దరఖాస్తు ఉత్తమంగా ఉండాలంటే నేను ఏమి చేయగలను?

మీ ఛానెల్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించిన తర్వాత, మీరు మానిటైజ్ చేయగలరని మేము హామీ ఇవ్వలేము. అయితే, మీ ఛానెల్‌ను ప్రోగ్రామ్‌కు అర్హత పొందేలా చేయడంలో మీకు సహాయపడటానికి మా దగ్గర కొన్ని సాధారణ గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయి.

  1. మీ తిరస్కరణ ఈమెయిల్‌ను చదవండి. మీ ఛానెల్ ఉల్లంఘించిన నిర్దిష్ట పాలసీలను ఇది మీకు తెలియజేస్తుంది.
  2. ఆ తర్వాత, మా YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలకు, మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా ఉన్న మీ కంటెంట్ (వీడియోలు, టైటిల్స్, వివరణలు, థంబ్‌నెయిల్స్, ట్యాగ్స్)ను రివ్యూ చేయండి.
  3. తర్వాతి దశలో, మా పాలసీలను ఉల్లంఘించే వీడియోలను ఎడిట్ చేయండి లేదా తొలగించండి

మీరు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే, మా రివ్యూ టీమ్ మీ కంటెంట్‌ను మళ్లీ జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ప్రాసెస్ పూర్తి అయ్యాక, ఆ విషయం తెలియజేయడానికి మేము మీకు ఈమెయిల్‌ను పంపుతాము (ప్రాసెస్ పూర్తి అవ్వడానికి దాదాపుగా ఒక నెల సమయం పడుతుంది). మీరు YouTube Studioకు సంబంధించిన సంపాదన విభాగంలో కూడా మీ దరఖాస్తు స్టేటస్‌ను చెక్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1617816309953393364
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false