మీ వీడియోలను ట్రిమ్ చేయండి

మీరు కంప్యూటర్‌లో, మీ వీడియో ప్రారంభ భాగాన్ని, మధ్య భాగాన్ని లేదా ముగింపు భాగాన్ని తీసివేయవచ్చు. వీడియోను ట్రిమ్ చేయడానికి మీరు దాన్ని తిరిగి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో URL, వీక్షణ సంఖ్య, అలాగే కామెంట్‌లు మారవు. ఈ ఫీచర్ ఆరు గంటల కంటే తక్కువ నిడివి ఉన్న వీడియోలకు అందుబాటులో ఉంటుంది.

YouTube Studioలోని వీడియో ఎడిటర్‌తో మీ వీడియోలను ట్రిమ్ & కట్ చేయడం ఎలా

గమనిక: 100,000 వీక్షణలకు పైగా కలిగిన ఎడిట్ చేయని వీడియోకు, ముఖాలను బ్లర్ చేయడం మినహా మీరు ఎటువంటి మార్పులనూ చేయలేకపోవచ్చు. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్న ఛానెల్స్‌కు ఈ పరిమితి వర్తించదు.

మీ వీడియోలోని ఒక భాగాన్ని ట్రిమ్ చేయడానికి లేదా తొలగించడానికి వీడియో ఎడిటర్‌ను తెరవండి.

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియో టైటిల్ లేదా థంబ్‌నెయిల్‌ను క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపు మెనూ నుండి ఎడిటర్‌ను ఎంచుకోండి.

మీ వీడియో ప్రారంభ లేదా ముగింపులో ట్రిమ్ చేయండి

 

  1. ట్రిమ్ చేసి, కత్తిరించండి ని ఎంచుకోండి. ఎడిటర్‌లో ఒక నీలి రంగు బాక్స్ కనిపిస్తుంది.
  2. నీలి రంగు బాక్స్ సైడ్‌లను లాగండి. మీరు ఉంచాలనుకుంటున్న వీడియో భాగాన్ని బాక్స్ కవర్ చేస్తున్నప్పుడు ఆపివేయండి. బాక్స్‌లో లేనిది ఏదైనా వీడియో నుండి తీసివేయబడుతుంది.
  3. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ వీడియోలోని ఒక భాగాన్ని తొలగించండి

  1. ట్రిమ్ చేసి, కత్తిరించండిని ఎంచుకోండి , ఆపై కొత్త కత్తిరింపు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఎడిటర్‌లో ఒక ఎరుపు రంగు బాక్స్ కనిపిస్తుంది.
  2. ఎరుపు రంగు బాక్స్ సైడ్‌లను లాగండి. మీరు తీసివేయాలనుకుంటున్న వీడియోలోని భాగాన్ని ఎరుపు రంగు బాక్స్ కవర్ చేస్తున్నప్పుడు ఆపివేయండి. ఎరుపు రంగు బాక్స్‌లో లేనిది ఏదైనా వీడియోలో అలాగే  ఉంటుంది.
  3. మీ ఎడిట్‌లను నిర్ధారించడానికి, కత్తిరించండి ని ఎంచుకోండి.
  4. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు మీ వీడియోలోని నిర్దిష్ట సమయానికి సంబంధించిన భాగాన్ని ట్రిమ్ చేయాలనుకుంటే లేదా కత్తిరించాలనుకుంటే, మీరు బాక్స్‌లో సంబంధిత సమయాన్ని ఎంటర్ చేయవచ్చు. మీ ఎడిట్‌లను రివ్యూ చేయడానికి, ప్రివ్యూ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ విభాగానికి సంబంధించి మీరు చేసిన కత్తిరింపును రద్దు చేయడానికి, చర్యను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీరు చేసిన మార్పులను రద్దు చేయడానికి మీరు ఏ సమయంలోనైనా మార్పులను విస్మరించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయవచ్చు.

మరిన్ని ఆప్షన్‌లు

  • మీ డ్రాఫ్ట్‌కు మీరు చేసిన సేవ్ కాని మార్పులను తీసివేయడానికి, మరిన్ని '' ఆ తర్వాత ఒరిజినల్ స్థితికి మార్చండిని ఎంచుకోండి.
  • మీ ఎడిట్ చేసిన వీడియోను మీరు డౌన్‌లోడ్ చేయవచ్చు, అలాగే మీరు చేసిన మార్పులను పబ్లిష్ చేయడానికి దాన్ని మళ్లీ అప్‌లోడ్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12331112495221405775
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false