నోటిఫికేషన్‌లు: సౌండ్‌లు, వైబ్రేషన్‌లను ఆఫ్ చేయండి

సౌండ్‌లు, వైబ్రేషన్‌లను ఆఫ్ చేయడం వలన, ప్రతి రోజూ ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో YouTube యాప్ నుండి నోటిఫికేషన్‌లు నిశ్శబ్దంగా మీ ఫోన్‌కు పంపబడతాయి.

ఆటోమేటిక్‌గా, 10 PM నుండి 8 AM మధ్యలో, సౌండ్‌లు, వైబ్రేషన్‌లన్నీ ఆఫ్ చేయబడి ఉంటాయి, కానీ మీరు ప్రారంభ, ముగింపు సమయాలను మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్, మొబైల్ ఫోన్స్‌లోని YouTube యాప్ 13.16+ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది.  

నోటిఫికేషన్ సౌండ్‌లను & వైబ్రేషన్‌లను ఆన్/ఆఫ్ చేయడానికి, అనుకూలంగా మార్చడానికి: 
  1. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి. 
  2. సెట్టింగ్‌లు  అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
  4. సౌండ్‌లను, వైబ్రేషన్‌లను డిజేబుల్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
  5. మీకు కావలసిన ప్రారంభ సమయాన్ని, ముగింపు సమయాన్ని ఎంచుకోవడానికి సౌండ్‌లను, వైబ్రేషన్‌లను డిజేబుల్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
గమనిక: సౌండ్‌లను, వైబ్రేషన్‌లను ఆఫ్ చేసినప్పటికీ, మీరు ఇప్పటికీ YouTube నోటిఫికేషన్‌లన్నింటినీ పొందుతారు. అన్ని వీడియో అప్‌లోడ్ నోటిఫికేషన్‌లు ఆటోమేటిక్‌గా నిశ్శబ్ద మోడ్‌లో పంపబడతాయి. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10494703704027545677
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false