YouTube సొంత సర్టిఫికేషన్ ఓవర్‌వ్యూ

మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ ఆధారంగా మీ రేటింగ్‌లలో మేము పదే పదే తీవ్రమైన తప్పులను గమనిస్తే, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంచాలా లేదా అనే విషయంలో మీ ఛానెల్‌ను రివ్యూ చేయడం జరుగుతుంది.

YouTube సొంత సర్టిఫికేషన్ ప్రోగ్రామ్

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

సొంత సర్టిఫికేషన్ ఎందుకు అవసరం?

మానిటైజేషన్‌కు సంబంధించిన నిర్ణయాలను మరింత వేగంగా, ఇంకా మరింత ఖచ్చితత్వంతో తీసుకోవడంలో మీ అభిప్రాయం మాకు సహాయపడగలదు. సొంత సర్టిఫికేషన్ ద్వారా:

  1. మీ వీడియోలో ఏమి ఉందో మీరు మాకు చెప్పవచ్చు.
  2. ఆ తర్వాత మా ఆటోమేటిక్ సిస్టమ్‌లు చెక్ చేసి, నిర్ణయిస్తాయి.
  3. మా ఆటోమేటిక్ సిస్టమ్‌ల నిర్ణయంతో మీరు ఏకీభవించకపోతే, మీరు మాన్యువల్ రివ్యూను రిక్వెస్ట్ చేయవచ్చు.
  4. రివ్యూవర్ మీ వీడియోను చెక్ చేసి, ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తారు. ఆ వీడియోలోని కంటెంట్ విషయంలో మీకు, అలాగే రివ్యూవర్‌కు ఎక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయో (ఉదాహరణకు, "అనుచితమైన భాష" లేదా "సున్నితమైన సమస్యలు") మీరు చూడవచ్చు.

మీరు క్రమం తప్పకుండా మీ వీడియోలకు సరైన రేటింగ్‌ను ఇస్తున్నట్లయితే, మా ఆటోమేటిక్ సిస్టమ్‌లపై కాకుండా మేము మీ అభిప్రాయంపై ఆధారపడతాము. మానిటైజ్ చేసే క్రియేటర్‌లకు సంబంధించిన మొత్తం కమ్యూనిటీకి ఉపయోగపడేలా మా సిస్టమ్‌లను మెరుగుపరచడానికి కూడా మీ ఇన్‌పుట్‌ను ఉపయోగిస్తారు.

పిల్లల కోసం రూపొందించినది” అని మార్క్ చేయబడిన కంటెంట్ కోసం సొంత సర్టిఫికేషన్ అందుబాటులో ఉంది. పిల్లలు, ఫ్యామిలీ కంటెంట్‌కు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసుల గురించి, అలాగే ప్రత్యేకంగా పిల్లల కంటెంట్ కోసం రూపొందించిన మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ గురించి మరింత తెలుసుకోండి.

మీరు చేయవలసినది ఏమిటి

సొంత సర్టిఫికేషన్‌తో, మీరు ఈ కింద పేర్కొన్న వాటిని రేట్ చేయాలి:

  • మీరు యాడ్‌లను ఆన్ చేసిన కొత్త వీడియోలన్నింటినీ.
  • మీరు ఇప్పుడు యాడ్‌లను ఆన్ చేయాలనుకుంటున్న, గతంలోనే అప్‌లోడ్ చేసిన వీడియోలను.

ఇప్పటికే ఉన్న ఏవైనా వీడియోలకు యాడ్‌లు ఆన్ చేసి ఉంటే, వాటిని మీరు రేట్ చేయాల్సిన అవసరం లేదు.

మీ వీడియోలను రేట్ చేయడం ఎలా

మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా మీ వీడియోలను రేట్ చేయడానికి ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. YouTube Studioలో వీడియోను అప్‌లోడ్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి. మీ వీడియో అప్‌లోడ్ అవుతున్నప్పుడు, మానిటైజేషన్ డ్రాప్‌డౌన్‌ను ఎంచుకోండి ఆ తర్వాత ఆన్ చేయండిని ఎంచుకోండి ఆ తర్వాత పూర్తయిందిని క్లిక్ చేయండి ఆ తర్వాత తర్వాతను క్లిక్ చేయండి.
  2. అధునాతన సెట్టింగ్‌ల పేజీలో ఏవైనా సందర్భోచితంగా ఉండే ఫీచర్‌లను ఎంచుకోండి ఆ తర్వాత తర్వాత అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. యాడ్స్ ఔచిత్యం పేజీలో ప్రశ్నావళిని పూరించండి ఆ తర్వాత రేటింగ్‌ను సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత తర్వాత అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ప్రశ్నావళిలో లిస్ట్ చేసిన కంటెంట్ మీ వీడియోలో లేకపోతే, మీరు కిందికి స్క్రోల్ చేసి, "పైవేవీ కావు" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోవచ్చు.
  4. మీ వీడియోను మీరు రేట్ చేశాక, దాని యాడ్స్ ఔచిత్యాన్ని చెక్ చేయడానికి చెకప్ దశల పేజీ మా సిస్టమ్‌లను ఉపయోగిస్తుంది. ఈ పని అయిపోయాక ఆ తర్వాత తర్వాత అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీ వీడియోకు సంబంధించిన విజిబిలిటీ స్టేటస్‌ను ఎంచుకోండి.
  6. పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

'పిల్లల కోసం రూపొందించినది' కంటెంట్ కోసం మీరు సొంత రేటింగ్‌ను ఇస్తున్నారా? అలా అయితే, పిల్లలు, ఫ్యామిలీ కంటెంట్‌కు సంబంధించిన మా బెస్ట్ ప్రాక్టీసులను అర్థం చేసుకోండి. పిల్లల కోసం రూపొందించిన వీడియోలను మార్క్ చేయడానికి సంబంధించిన దశలను కనుగొనడానికి (Studioలో వాటికి సొంత సర్టిఫికేషన్ ఇవ్వగలగాలి), ఈ పేజీని సందర్శించండి.

మీ రేటింగ్ స్టేటస్‌ను అర్థం చేసుకోండి

మీరు ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు, మీకు రేటింగ్ ఖచ్చితత్వ పేజీ కనిపిస్తుంది.

  • మీ రేటింగ్ ఖచ్చితత్వాన్ని చెక్ చేసుకోండి.
  • రేటింగ్ విషయంలో మీకు, అలాగే YouTubeకు అభిప్రాయ భేదాలు ఎక్కడ వచ్చాయో చెక్ చేయండి.
  • రేటింగ్ ఇచ్చే మా వ్యక్తుల నుండి ఫీడ్‌బ్యాక్‌ను రిక్వెస్ట్ చేయండి లేదా వారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను చూడండి.

మా సిస్టమ్‌లు, అలాగే మానవ రివ్యూవర్‌లు ఇచ్చిన రేటింగ్‌లతో, మీ రేటింగ్‌లు ఎంత మేరకు మ్యాచ్ అవుతున్నాయో మీరు చూడవచ్చు. సాధారణంగా, మీరు 20 వీడియోలకు రేటింగ్‌ను ఇచ్చాక, మీరు ఎంత ఖచ్చితంగా రేట్ చేస్తున్నారో మేము ఒక అంచనాకు రాగలము. ఈ సమాచారం చాలా కీలకమైనది, ఎందుకంటే మీ రేటింగ్‌లు ఎంత ఖచ్చితంగా ఉంటే, మీ వీడియోలలో ఎలాంటి యాడ్‌లను ప్రదర్శించాలో నిర్ణయించడానికి వాటిని మేము అంత ఎక్కువగా ఉపయోగించగలము.

మీ రేటింగ్ ఖచ్చితత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి
మీరు ఎక్కువ వీడియోలను రేట్ చేసే కొద్దీ, మా ఆటోమేటిక్ సిస్టమ్‌లు, ఇంకా మానవ రివ్యూవర్‌లు ఇచ్చిన రేటింగ్‌లతో మీ రేటింగ్‌లు ఎంత మేరకు మ్యాచ్ అవుతున్నాయో మీరు తెలుసుకోవచ్చు.

మీ రేటింగ్ స్టేటస్ పేజీకి వెళ్లడం

  1. సొంత సర్టిఫికేషన్‌లో భాగంగా ఉన్న మీ ఛానెల్‌ను ఉపయోగించి YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. https://studio.youtube.com/channel/UC/videos/contentratings కు వెళ్లండి.
  3. మీకు స్టేటస్ రేటింగ్‌ల పేజీ కనిపిస్తుంది.

మీ రేటింగ్ స్టేటస్ పేజీలో ఉండే ఒక్కో నిలువు వరుసకు అర్థం ఏమిటో ఈ కింద అందించబడింది

  • వీడియో: రేట్ చేయబడుతున్న వీడియో.
  • రేట్ చేసిన తేదీ: మీ వీడియోను మీరు రేట్ చేసిన తేదీ.
  • మీ రేటింగ్: మీ వీడియోను మీరు ఎలా రేట్ చేశారు అనే దాన్ని బట్టి, మా సిస్టమ్‌లు అంచనా వేసిన మీ వీడియో మానిటైజేషన్ స్టేటస్.
  • YouTube రేటింగ్: YouTube సిస్టమ్‌లు లేదా మా మానవ రివ్యూవర్‌లు ఈ వీడియోకు ఏ మానిటైజేషన్ స్టేటస్ అయితే ఉండాలని భావిస్తున్నారో, ఆ స్టేటస్.
  • YouTube రివ్యూ రకం: మీకు రెండు వేర్వేరు చిహ్నాలు కనిపిస్తాయి. ఒకటి మీ వీడియోను మా ఆటోమేటిక్ సిస్టమ్‌లు రివ్యూ చేశాయని చూపుతుంది, ఇంకొకటి దాన్ని ఒక పాలసీ స్పెషలిస్ట్ రివ్యూ చేశారని చూపుతుంది.
    • కంప్యూటర్: మానిటైజేషన్ విషయంలో నిర్ణయాన్ని మా ఆటోమేటిక్ సిస్టమ్‌లు తీసుకున్నాయని ఈ చిహ్నం సూచిస్తుంది.
    • మానవ చిహ్నం: వీడియోను రివ్యూ చేసింది ఒక పాలసీ స్పెషలిస్ట్ -- ఒక నిజమైన వ్యక్తి -- అని ఈ చిహ్నం సూచిస్తుంది.
  • చర్య: మానిటైజేషన్‌కు సంబంధించిన నిర్ణయం విషయంలో మీరు ఏమి చేయగలరో ఈ నిలువు వరుస మీకు తెలుపుతుంది.
    • రివ్యూను రిక్వెస్ట్ చేయండి: మీ వీడియోను మా ఆటోమేటిక్ సిస్టమ్‌లు రివ్యూ చేశాయి. మా ఆటోమేటిక్ సిస్టమ్‌లు తీసుకొనే నిర్ణయాలన్నీ సరైనవి కాకపోవచ్చు. తుది మానిటైజేషన్ నిర్ణయాన్ని మా పాలసీ స్పెషలిస్ట్‌ల చేతిలో పెట్టడానికి, మీరు రివ్యూను రిక్వెస్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయవచ్చు.
    • ఫీడ్‌బ్యాక్‌ను చూడండి: ఒక పాలసీ స్పెషలిస్ట్ మీ వీడియోను రివ్యూ చేసి, తుది నిర్ణయం తీసుకున్నారు. మానవ రివ్యూవర్ నిర్ణయించిన తర్వాత, మానిటైజేషన్ స్టేటస్‌ను మార్చడం సాధ్యపడదు. మీరు ఫీడ్‌బ్యాక్‌ను చూడండిని క్లిక్ చేస్తే, మీరు వీడియోను రేట్ చేసిన దానికి, అలాగే మా పాలసీ స్పెషలిస్ట్‌లు రేట్ చేసిన దానికి మధ్య ఉన్న తేడాలు మీకు కనిపిస్తాయి. అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ మానిటైజేషన్ రివ్యూలు ఎలా పని చేస్తాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మీ ఛానెల్‌పై మీ రేటింగ్ ఎలా ప్రభావం చూపుతుంది
మీ వీడియో మానిటైజేషన్ స్టేటస్‌కు మీరు ఇచ్చిన రేటింగ్‌లతో మా మానిటైజేషన్ నిర్ణయాలు ఎంత తరచుగా మ్యాచ్ అవుతాయి అనే దాని ఆధారంగా మీకు ఒక రేటింగ్ స్టేటస్‌ను ఇవ్వడం జరుగుతుంది.
మీ ఖచ్చితత్వం అధికంగా ఉన్నట్లయితే: అంటే, మీ వీడియోలలో ఏ యాడ్‌లను ప్రదర్శించాలో నిర్ణయించడంలో సహాయం కోసం మేము మీ అభిప్రాయాన్ని ఉపయోగిస్తామని అర్థం.
మీ రేటింగ్ ఖచ్చితత్వం తక్కువగా ఉంటే, తెలియకపోతే, లేదా మీరు ఎక్కువ వీడియోలను రేట్ చేసి ఉండకపోతే: అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ ఎలా పని చేస్తాయో మరింత బాగా అర్థం చేసుకోవడానికి మీరు మా పాలసీ స్పెషలిస్ట్ ఫీడ్‌బ్యాక్‌ను రివ్యూ చేయాల్సి రావచ్చు, లేదా ఎక్కువ వీడియోలను రేట్ చేయాల్సి రావచ్చు. మీ రేటింగ్ ఖచ్చితత్వం మెరుగయ్యాక, మీ వీడియోలలో ఏ యాడ్‌లను ప్రదర్శించవచ్చో నిర్ణయించడంలో సహాయం కోసం మీ అభిప్రాయాన్ని మేము మరింత తరచుగా ఉపయోగిస్తాము.
మీ రేటింగ్ ఖచ్చితత్వం, సమయం గడిచే కొద్దీ మారే అవకాశం ఉంది.

ప్రోగ్రామ్ FAQలు

మీ ఛానెల్‌పై మీ రేటింగ్ ఎలా ప్రభావం చూపుతుంది?

మీకు సొంత సర్టిఫికేషన్‌కు యాక్సెస్ ఉన్నప్పుడు, మీ వీడియోలను ఇప్పుడు మీరు రేట్ చేసుకోగలరు అని మీకు తెలియజేయడానికి YouTube Studioలో మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఇది సాధారణంగా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో చేరిన ఒక నెల లేదా రెండు నెలల తర్వాత జరుగుతుంది. 

నా వీడియోలను నేను రేట్ చేయడం ప్రారంభించానంటే, దాని అర్థం నా వీడియోలకు మానిటైజేషన్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుందనా?

మీ వీడియో అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేనప్పుడు, మీరు యాడ్‌లను ఆన్ చేయడానికి ట్రై చేసినప్పటికీ, మా పాలసీ స్పెషలిస్ట్‌లు మీ వీడియోను డీమానిటైజ్ చేస్తారు. ఇందులో మంచి విషయం ఏమిటంటే, మీ వీడియో విషయంలో మీరు క్రమం తప్పకుండా సరైన మానిటైజేషన్ నిర్ణయాలను తీసుకుంటే, కాలక్రమేణా మీకు తక్కువ పసుపు రంగు చిహ్నాలు కనిపించే అవకాశం ఉంది. మీ వీడియోలలో ఎలాంటి యాడ్‌లను ప్రదర్శించాలి అని నిర్ణయించడానికి, మేము మా ఆటోమేటిక్ సిస్టమ్‌లను కాకుండా మీ రేటింగ్‌లను ఉపయోగిస్తూ ఉండటమే ఈ మార్పునకు కారణం.

నేను నా వీడియోను పబ్లిక్‌గా సెట్ చేయక ముందే, దాని మానిటైజేషన్ స్టేటస్‌ను చూడటానికి ఏదైనా మార్గం ఉందా?
వీడియోను పబ్లిక్‌గా సెట్ చేయక ముందే మీరు మానిటైజేషన్ స్టేటస్‌ను చెక్ చేయాలనుకుంటే, అప్‌లోడ్ ప్రాసెస్ సమయంలో జరిగే యాడ్స్ ఔచిత్యానికి సంబంధించిన చెకప్ దశలు పూర్తయ్యే దాకా మీరు వేచి ఉండవచ్చు.
నా రేటింగ్‌ల ఖచ్చితత్వాన్ని నేను ఎలా మెరుగుపరుచుకోగలను?
మీ వీడియోను సరైన విధంగా ఎలా రేట్ చేయాలో తెలుసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి:

అప్‌లోడ్ సమయంలో చెకప్ దశల పేజీని ఉపయోగించండి

మీ వీడియోను పబ్లిష్ చేయడానికి ముందు, దాని యాడ్‌ల ఔచిత్యాన్ని చెక్ చేయడానికి, అలాగే ఏవైనా కాపీరైట్ క్లెయిమ్‌ల కోసం చెక్ చేయడానికి, దాన్ని అప్‌లోడ్ చేసేటప్పుడు మీరు చెకప్ దశల పేజీని ఉపయోగించవచ్చు.
మా గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేయండి
మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా సొంతంగా రేట్ చేసుకోవడానికి మా గైడ్‌ను మీరు రెఫర్ చేయవచ్చు. అడ్వర్టయిజర్‌లందరికీ ఏవి అనుకూలంగా ఉంటాయో, అలాగే ఏవి అనుకూలంగా ఉండవో తెలుసుకోవడంలో ఈ రిసోర్స్ మీకు సహాయపడుతుంది. మీరు పిల్లల కోసం రూపొందించిన కంటెంట్‌కు సొంత రేటింగ్ ఇస్తే, పిల్లలు, ఫ్యామిలీ కంటెంట్‌కు సంబంధించిన మా బెస్ట్ ప్రాక్టీసులను అర్థం చేసుకోండి.
YouTube రివ్యూవర్‌ల నుండి ఫీడ్‌బ్యాక్ పొందండి
మీ వీడియోను రేట్ చేసే విషయంలో ఇంకా మీకు అయోమయంగా ఉంటే, మీరు:
  1. మీ వీడియోకు రేటింగ్ ఇవ్వండి.
  2. మాన్యువల్ రివ్యూను రిక్వెస్ట్ చేయండి.
    • మీ వీడియోను మీరు యాడ్‌లకు తగినది కాదు అని రేట్ చేసి, మాన్యువల్ రివ్యూ కోసం రిక్వెస్ట్ చేసినప్పుడు, మేము దాని రివ్యూ వేగంగా చేస్తాము.
  3. ఆ తర్వాత రేటింగ్ ఇచ్చే మా వ్యక్తులు, మీ వీడియోను రివ్యూ చేసి, మానిటైజేషన్ విషయంలో తుది నిర్ణయాన్ని అందిస్తారు.
  4. రేటింగ్ ఇచ్చే వ్యక్తి అందించిన ఫీడ్‌బ్యాక్‌ను రివ్యూ చేయండి.
నేను పొరబడి నా వీడియోలను తప్పుగా రేట్ చేస్తే ఏమి జరుగుతుంది?

సరైన మానిటైజేషన్ నిర్ణయాలు తీసుకోవడంలో మేము మీ రేటింగ్‌లను ఉపయోగించాలనుకుంటున్నాం కనుక, మీకు సాధ్యమైనంత మేరకు మీ కంటెంట్‌ను మీరు సరైన విధంగా రేట్ చేయడం అనేది చాలా ముఖ్యం.

మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ ఆధారంగా మీ రేటింగ్‌లలో మేము పదే పదే తీవ్రమైన తప్పులను గమనిస్తే, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంచాలా లేదా అనే విషయంలో మీ ఛానెల్‌ను రివ్యూ చేయడం జరుగుతుంది.

పాలసీ టైమ్‌స్టాంప్‌లు అంటే ఏమిటి?

మీ వీడియో డెస్క్‌టాప్‌లో సొంత సర్టిఫికేషన్ ఫ్లోను ఉపయోగించినట్లయితే పసుపు రంగు చిహ్నం అప్పీళ్ల కోసం టైమ్‌స్టాంప్‌లను అందించవచ్చు. మా నిపుణులు మీ కంటెంట్‌లో పాలసీ ఉల్లంఘనలను ఎక్కడ కనుగొన్నారో బాగా అర్థం చేసుకోవడంలో ఈ ఉదాహరణలు మీకు సహాయపడతాయి. పాలసీ అంశాలలో, ప్రతి గైడ్‌లైన్‌లో చేర్చిన వాటిని గురించిన ఓవర్‌వ్యూ ఉంటుంది. ప్రతి గైడ్‌లైన్‌పై మరిన్ని వివరాల కోసం, ఇక్కడ 'అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్' మొత్తాన్ని రివ్యూ చేయండి.

గమనిక: టైమ్‌స్టాంప్‌లు ఎక్కడ ఎడిట్‌లు చేయాలో డైరెక్ట్ చేయవు, అవి పాలసీ ఉల్లంఘనలపై మరింత స్పష్టతను అందిస్తాయి. ఉల్లంఘించే కంటెంట్‌ను తీసివేయడానికి YouTube Studioతో ఎడిట్ చేసిన వీడియోలు, థంబ్‌నెయిల్స్, టైటిల్స్, వాటిని మళ్లీ రివ్యూ చేయడానికి అర్హత కలిగి ఉండవు.

YouTubeకు సంబంధించిన కంటెంట్ గైడ్‌లైన్స్, అలాగే TVకి సంబంధించిన కంటెంట్ గైడ్‌లైన్స్ ఎందుకు వేర్వేరుగా ఉంటాయి?
అడ్వర్టయిజర్‌లకు YouTube విషయంలో ఒక రకమైన అంచనాలు ఉంటే, TV విషయంలో వేరే రకమైన అంచనాలు ఉంటాయి. TV విషయానికి వస్తే, సాధారణంగా అడ్వర్టయిజర్‌లకు, కంటెంట్ తమకు అనుకూలమో కాదో నిర్ణయించడానికి, ప్రసారం కాక ముందే దాన్ని రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. YouTube విషయానికి వస్తే, అడ్వర్టయిజర్‌లు, వారి యాడ్‌లను చూపే ప్రతి వీడియోను రివ్యూ చేయలేరు. అడ్వర్టయిజర్‌లు తమ బ్రాండ్‌ను ఎలాంటి కంటెంట్‌తో అనుబంధించడానికి ఇష్టపడతారో మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ ప్రతిబింబిస్తాయి. అడ్వర్టయిజర్‌లు తమ వ్యక్తిగత అభిప్రాయాలను మార్చుకోవచ్చు, కానీ మా గైడ్‌లైన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్వర్టయిజర్‌లకు అనుకూలంగా ఉండే వాటికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6532146140195427929
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false