YouTube కోసం కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

కీబోర్డ్ షార్ట్‌కట్‌ల సహాయంతో, YouTubeలో నావిగేట్ చేయడానికి పట్టే సమయాన్ని ఆదా చేసుకోండి.

కీబోర్డ్ షార్ట్‌కట్‌ల లిస్ట్‌ను యాక్సెస్ చేయడానికి, మీ ప్రొఫైల్ ఫోటోProfile‌కు వెళ్లి, కీబోర్డ్ షార్ట్‌కట్‌లKeyboard‌ను ఎంచుకోండి. మీరు మీ కీబోర్డ్‌లో SHIFT+?ను ఎంటర్ చేసి కూడా కీబోర్డ్ షార్ట్‌కట్‌ల లిస్ట్‌ను యాక్సెస్ చేయవచ్చు. కొన్ని ప్లేయర్ బటన్‌ల మీద మీరు, మౌస్ కర్సర్‌ను ఉంచినప్పుడు, సంబంధిత కీబోర్డ్ షార్ట్‌కట్ కనబడుతుంది. ఉదాహరణకు మీరు, మౌస్ కర్సర్‌ను ఫుల్ స్క్రీన్ ఐకాన్ (చిహ్నం) మీద ఉంచినప్పుడు, 'ఫుల్ స్క్రీన్ (f)' కనబడుతుంది. వీడియోను ఫుల్ స్క్రీన్‌లో తెరవడానికి fను ఎంటర్ చేయవచ్చు అని దాని అర్థం.

కీబోర్డ్ షార్ట్‌కట్‌లు | YouTube సహాయం నుండి ప్రొఫెషనల్ చిట్కాలు

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

మీరు కొత్త కంప్యూటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడానికి ముందు, తప్పనిసరిగా వీడియో ప్లేయర్‌ను క్లిక్ చేయాలి. తిరిగి క్లాసిక్ కంప్యూటర్ ఎక్స్‌పీరియన్స్‌కు రావడానికి, ప్రొఫైల్ ఫోటో ‌కు వెళ్లి, పాత YouTubeను రీస్టోర్ చేయండిని క్లిక్ చేయండి.
కీబోర్డ్ షార్ట్‌కట్ ఫంక్షన్
స్పేస్‌బార్ (Spacebar) ప్రోగ్రెస్ బార్‌ను ఎంచుకొని ఉన్నప్పుడు ప్లే/పాజ్ చేస్తుంది. ఏదైనా బటన్ ఫోకస్‌లో ఉంటే, దాన్ని యాక్టివేట్ చేస్తుంది.
కీబోర్డ్‌లలోని ప్లే/పాజ్ మీడియా కీ ప్లే / పాజ్ చేస్తుంది.
k ప్లేయర్‌లో పాజ్/ప్లే చేస్తుంది.
m వీడియోను మ్యూట్/అన్‌మ్యూట్ చేస్తుంది.
కీబోర్డ్‌లలోని స్టాప్ మీడియా కీ ఆపివేస్తుంది.
కీబోర్డ్‌లలోని తదుపరి ట్రాక్ మీడియా కీ ప్లేలిస్ట్‌లోని తదుపరి ట్రాక్‌కు కొనసాగుతుంది.
ప్రోగ్రెస్ బార్‌లోని ఎడమ వైపు బాణం/కుడి వైపు బాణం 5 సెకన్లు వెనుకకు/ముందుకు తీసుకువెళ్తుంది.
j ప్లేయర్‌లో 10 సెకన్లు వెనుకకు తీసుకువెళ్తుంది.
l ప్లేయర్‌లో 10 సెకన్లు ముందుకు ఫార్వర్డ్ చేస్తుంది.
. వీడియో పాజ్ అయ్యి ఉన్నప్పుడు, తదుపరి ఫ్రేమ్‌కు స్కిప్ చేస్తుంది.
, వీడియో పాజ్ అయ్యి ఉన్నప్పుడు, తిరిగి మునుపటి ఫ్రేమ్‌కు తీసుకువెళ్తుంది.
> వీడియో ప్లేబ్యాక్ వేగాన్ని పెంచుతుంది.
< వీడియో ప్లేబ్యాక్ వేగాన్ని తగ్గిస్తుంది.
ప్రోగ్రెస్ బార్‌లోని Home/End వీడియోలోని ప్రారంభ/చివరి సెకన్లకు తీసుకువెళ్తుంది.
ప్రోగ్రెస్ బార్‌లోని పై వైపు బాణం/కింది వైపు బాణం వాల్యూమ్‌ను 5% పెంచుతుంది/తగ్గిస్తుంది.
1 నుండి 9 నంబర్‌లు వీడియోను 10% నుండి 90%కు తీసుకువెళ్తుంది.
నంబర్ 0 వీడియో ప్రారంభానికి తీసుకువెళ్తుంది.
/ సెర్చ్ బాక్స్‌కు తీసుకువెళ్తుంది.
f ఫుల్ స్క్రీన్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఫుల్ స్క్రీన్ మోడ్ ఎనేబుల్ చేయబడి ఉంటే, ఆ మోడ్ నుండి వైదొలగడానికి, మళ్లీ Fను యాక్టివేట్ చేయండి లేదా ఎస్కేప్ (escape)ను నొక్కండి.
c అందుబాటులో ఉంటే, క్యాప్షన్‌లను, సబ్‌టైటిళ్లను యాక్టివేట్ చేస్తుంది. క్యాప్షన్‌లను, సబ్‌టైటిళ్లను దాచడానికి, మళ్లీ Cని యాక్టివేట్ చేయండి.
Shift+N తదుపరి వీడియోను ప్లే చేస్తుంది (మీరు ప్లేలిస్ట్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, ఆ ప్లేలిస్ట్‌లోని తదుపరి వీడియోను ప్లే చేస్తుంది. ఒకవేళ ప్లేలిస్ట్‌ను ఉపయోగించనట్లయితే, YouTube సూచించిన తదుపరి వీడియోను ప్లే చేస్తుంది).
Shift+P మునుపటి వీడియోను ప్లే చేస్తుంది. ఈ షార్ట్‌కట్, మీరు ప్లేలిస్ట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే పని చేస్తుంది అనే విషయాన్ని గమనించండి.
i మినీ ప్లేయర్‌ను తెరుస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12748388266134985262
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false