లింక్ అయి ఉన్న మీ 'YouTube కోసం AdSense ఖాతా'ను మార్చడం

మీరు ఇప్పటికే YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ కోసం ఆమోదం పొందితే, మీ YouTube ఛానెల్‌తో లింక్ అయి ఉన్న 'YouTube కోసం AdSense ఖాతా'ను మార్చుకోవచ్చు. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు అర్హతను కలిగి ఉండాలంటే, యాక్టివ్‌గా ఉన్న ఒక 'YouTube కోసం AdSense ఖాతా'ను నిర్వహిస్తూ, దానిని మీ ఛానెల్‌ను లింక్ చేయాలి.

లింక్ చేయబడిన మీ 'YouTube కోసం AdSense' ఖాతాను మీరు ప్రతి 32 రోజులకు ఒకసారి మాత్రమే మార్చగలరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో సంపాదించండి విభాగాన్ని ఎంచుకోండి.
  3. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఆప్షన్‌ల కింద, ప్రస్తుతం మీ YouTube ఛానెల్‌తో లింక్ చేయబడిన మీ 'YouTube కోసం AdSense ఖాతా'కు సంబంధించిన వివరాలు మీకు కనిపిస్తాయి. 
  4. మార్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీరు 'YouTube కోసం AdSense ఖాతా'కు మళ్లించబడతారు. మీరు ఎంచుకున్న పద్ధతిని ఉపయోగించి, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి, అలాగే తిరిగి ప్రామాణీకరించాలి. మీ YouTube ఖాతాను ఎలా తిరిగి ప్రామాణీకరించాలో తెలుసుకోండి.
  5. ఇప్పటికే ఉన్న మీ ఖాతాను లింక్ చేయడానికి లేదా కొత్త దానిని క్రియేట్ చేయడానికి మీరు 'YouTube కోసం AdSense ఖాతా'కు మళ్లించబడతారు. 
    • ఇప్పటికే ఉన్న ఖాతా: మీకు ఇప్పటికే AdSense లేదా 'YouTube కోసం AdSense ఖాతా' ఉంటే, ఇప్పటికే ఉన్న మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగించే Google ఖాతాతో సైన్ ఇన్ చేయవలసి ఉంటుంది. మీరు YouTubeకు లాగిన్ అయ్యేందుకు ఉపయోగించే లాగిన్ ఆధారాలకు ఇది భిన్నంగా ఉండవచ్చని గుర్తుంచుకోండి. 
    • కొత్త ఖాతా: మీరు కొత్త 'YouTube కోసం AdSense ఖాతా'ను క్రియేట్ చేస్తుంటే, ఒక్కొక్క యూజర్‌కు ఒక్క ఖాతాను మాత్రమే మేము అనుమతిస్తామని దయచేసి గుర్తుంచుకోండి. 
  6. మీరు ఎంచుకున్న ఖాతా స్క్రీన్‌లో పైన ఉంటుంది, అలాగే మీ YouTube ఛానెల్ URL "మీ వెబ్‌సైట్" కింద ఉంటుంది. ఈ సమాచారం సరైనది అయినట్లయితే, అనుబంధాన్ని ఆమోదించు ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు తిరిగి YouTubeకు మళ్లించబడతారు (ఒకవేళ మీరు మళ్లించబడకపోతే, మళ్లింపును ఎంచుకోండి.
  7. మీరు 'YouTube కోసం AdSense ఖాతా'ను సెటప్ చేయడం పూర్తి చేశారు! మీ మానిటైజేషన్ ప్రాధాన్యతలను సెట్ చేయడానికి, స్క్రీన్‌పై ఉన్న తర్వాతి దశలను ఫాలో అవ్వండి.

మీరు 'YouTube కోసం AdSense ఖాతా'ను మీ YouTube ఛానెల్‌కు లింక్ చేసిన తర్వాత, లింక్ అయిందని చూపడానికి మా సిస్టమ్‌లకు 24 గంటల వరకు సమయం పట్టవచ్చు.

గమనిక: ఇప్పటికే ఉన్న మరొక AdSenseకు లేదా 'YouTube కోసం AdSense ఖాతా'కు అనుబంధించడానికి సాధారణంగా కొన్ని నిమిషాలు పడుతుంది. కొత్త 'YouTube కోసం AdSense ఖాతా'ను క్రియేట్ చేశాక, ఆమోదించడానికి, అనుబంధించడానికి సాధారణంగా చాలా రోజులు పడుతుంది, కానీ కొన్నిసార్లు 2-3 వారాలు పట్టవచ్చు. అనుబంధించడం పూర్తయిన తర్వాత మానిటైజేషన్ ప్రారంభమవుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4116641788945115291
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false