ఛానెల్‌లు బ్రాండ్ ఖాతాలకు తరలించబడ్డాయి

2014 కంటే ముందు క్రియేట్ చేయబడిన ఖాతాలకు మార్పులు

2014 కంటే ముందు క్రియేట్ చేయబడిన ఛానెళ్లకు, ఇప్పుడు కొత్త ఖాతాలకు అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్‌లకు యాక్సెస్ ఉండదు. అన్ని ఛానెళ్లూ ఒకే ఫీచర్‌లను కలిగి ఉండేలా చేయడానికి, మేము మీ ఛానెల్‌ను బ్రాండ్ ఖాతాకు కనెక్ట్ చేసి, అప్‌డేట్ చేశాము. మీ ఛానెల్‌కు మునుపటిలాగానే అదే పేరు, వీడియోలు, సబ్‌స్క్రయిబర్‌లు ఉంటారు, కానీ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గుర్తింపుతో మీ వ్యక్తిగత పేరు, ఈమెయిల్ అడ్రస్ పబ్లిక్‌గా కనిపించవు.

మీకు ఎలాంటి ఖాతా ఉందో మీకు తెలియకపోతే, మీరు YouTubeలో చెక్ చేయవచ్చు.

జరిగిన మార్పులు:

  • మీ YouTube ఛానెల్ ఇప్పుడు ఆటోమేటిక్‌గా బ్రాండ్ ఖాతాకు కనెక్ట్ చేయబడింది. మీ YouTube ఛానెల్ ఇప్పుడు మీ Google ఖాతాకు భిన్నంగా వేరే పేరును, ఫోటోను కలిగి ఉండగలదు.
  • మీకు ఇప్పుడు కామెంట్ చేయడానికి, మీ ఛానెల్ పేరును లేదా హ్యాండిల్‌ను, మార్చడానికి ఛానెల్ మేనేజర్‌లను జోడించడానికి పూర్తి యాక్సెస్ ఉంటుంది.
  • మీ ఛానెల్ సెట్టింగ్‌లు కొన్నింటిలో మీకు మీ ఈమెయిల్ అడ్రస్ కనిపించవచ్చు, కాని అది పబ్లిక్‌గా చూపబడదు. మీ YouTube ఛానెళ్లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
  • మీ ఛానెల్‌లో మునుపటి మాదిరిగానే కంటెంట్ ఉంటుంది. మీరు మీ ఛానెల్ లిస్ట్‌ను గానీ లేదా సబ్‌స్క్రిప్షన్‌ను గానీ కనుగొనలేకపోతే, ఖాతా మార్పు టూల్‌ను ఉపయోగించి ఖాతాలను మార్చడానికి ట్రై చేయండి.
గమనిక: మీరు బ్రాండ్ ఖాతాను ఉపయోగిస్తున్నప్పుడు, కొన్ని చోట్ల మీరు channel-name-1234@pages.plusgoogle.com వంటి అసాధారణ ఈమెయిల్ అడ్రస్‌లను కూడా పొందే అవకాశం ఉంది. ఇది అసలైన ఈమెయిల్ కాదు, ఇది బ్రాండ్ ఖాతాకు ఐడెంటిఫయర్ మాత్రమే. Google+ ఇకపై అందుబాటులో లేకపోయినా, మీరు బ్రాండ్ ఖాతాను కలిగి ఉండవచ్చు.
YouTube ఛానెల్‌కు సంబంధించిన ఈమెయిల్ నోటిఫికేషన్‌లు, బ్రాండ్ ఖాతాకు మీరు సెట్ చేసిన నోటిఫికేషన్ అడ్రస్‌కు వెళ్తతాయి. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13346848243077474263
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false