YouTubeలో మ్యూజిక్ హక్కుల నిర్వహణ

యాజమాన్య హక్కును క్లెయిమ్ చేయడం

దశాబ్దాల క్రితం అభిమానులు మిక్స్‌టేప్స్‌లో తమకు ఇష్టమైన పాటలు లేదా ప్రదర్శనలను షేర్ చేశారు. నేడు, అలా షేర్ చేయడం, ప్రశంసించడం అన్నది ఆన్‌లైన్ ద్వారా జరుగుతోంది. అభిమానులు అప్‌లోడ్ చేసిన వీడియోలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే నిర్ణయం తామే తీసుకునేలా, వాటి నుండి ఆదాయాన్ని పొందేలా వేలాది లేబుల్స్, అలాగే హక్కుదారులు YouTubeతో లైసెన్స్ ఒప్పందాలను కలిగి ఉన్నారు. సంగీత కచేరీ ఫుటేజ్, అలాగే రీమిక్స్‌లను అప్‌లోడ్ చేయడం ద్వారా తమ అభిమాన ఆర్టిస్ట్‌పై తమకు ఉన్న ప్రేమను అభిమానులు చాటుకోవడమన్నది వేడుక చేసుకునే అంశమని వారు అంగీకరిస్తారు. అలాగే అభిమానులు అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను వారు ఎక్స్‌పోజర్‌ను మెరుగుపరిచే, అమ్మకాలను పెంచే సాధనంగా చూస్తారు.

కంటెంట్ ID హక్కుల నిర్వహణను ఆటోమేట్ చేస్తుంది కాబట్టి ఇదంతా సాధ్యమవుతుంది. ఒక అభిమాని YouTubeకు ఒక వీడియోను అప్‌లోడ్ చేసినప్పుడు, కంటెంట్ ఓనర్‌లు అందించిన కంటెంట్ డేటాబేస్‌తో దాన్ని సరిపోల్చడం జరుగుతుంది. అది మ్యాచ్‌ను కనుగొన్నప్పుడు, కంటెంట్ ఓనర్ తరఫున అది ఆ వీడియోపై క్లెయిమ్ చేస్తుంది, అలాగే ఆ వీడియోకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు వారికి అవకాశం కల్పిస్తుంది. మ్యూజిక్ క్లెయిమ్‌లన్నింటిలో కేవలం 0.5 శాతం మాత్రమే మాన్యువల్‌గా జారీ చేయబడతాయి; మిగతా 99.5 శాతాన్ని మేము 99.7 శాతం ఖచ్చితత్వంతో మేనేజ్ చేస్తాము. నేడు, అభిమానులు అప్‌లోడ్ చేసిన కంటెంట్ ద్వారా వచ్చే ఆదాయం YouTubeలో మ్యూజిక్ ఇండస్ట్రీ ఆదాయంలో 50 శాతం వరకు ఉంటుంది. 

మ్యూజిక్ ఇండస్ట్రీకి వందల కోట్ల డాలర్లను పేమెంట్ చేసేలా కంటెంట్ ID ద్వారా YouTubeకు వీలు కలిగింది, ఈ సంఖ్య ఏడాదికేడాది చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతోంది. అందుకనే, YouTube "లైసెన్స్ లేని " మ్యూజిక్‌ను వరదలా తమ ప్లాట్‌ఫామ్‌కు అప్‌లోడ్ అయ్యేలా అనుమతించి, ఆర్టిస్ట్‌ల ఆదాయానికి గండి కొట్టేలా చేస్తుందని కొన్ని లేబుల్స్, కొంత మంది ఆర్టిస్ట్‌లు చేసే వాదన విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. వాస్తవం ఏమిటంటే, కాపీరైట్ నిర్వహణను YouTube చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుంది, అలాగే హక్కుదారుల మ్యూజిక్‌ను ఎవరు అప్‌లోడ్ చేసినా కూడా ఆదాయం ఆ హక్కుదారులకే వచ్చేలా చేయడానికి మేము తీవ్రంగా శ్రమిస్తాము. కంటెంట్ ఎలాంటిదైనా, చిన్నదైనా, పెద్దదైనా, మిగతా ఏ ప్లాట్‌ఫామ్ కూడా క్రియేటర్‌లకు ఇంత ఆదాయం వచ్చేలా చేయదు.

మ్యూజిక్ లైసెన్స్ నిర్వహణ

YouTubeలో ఒక పాటను ప్లే చేయడానికి వివిధ రకాల హక్కులు అవసరం అవుతాయి, ఈ హక్కుల్లో ప్రతి ఒక్కదాన్ని వివిధ పక్షాలు పర్యవేక్షిస్తాయి. ఒక పాటను ఉపయోగించిన ప్రతిసారి YouTube పేమెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పదుల సంఖ్యలోని హక్కుదారులకు ఆదాయాన్ని పంచుతుంది, ఈ హక్కుదారులందరూ దీని నుండి వాటా పొందుతారు. 

ఆర్టిస్ట్‌లకు సంబంధించి మ్యూజిక్ ఇండస్ట్రీ అనుకూలంగా ఉండేలా చేయడంలో పారదర్శకత అన్నది చాలా కీలకమని మేము నమ్ముతాము, కాబట్టి ఈ హక్కులు, హక్కుదారుల గురించి తెలుసుకుందాం పదండి.

మాస్టర్ వినియోగ హక్కులు

సాధారణంగా, పాటను రికార్డ్ చేసిన రికార్డ్ లేబుల్ మాస్టర్ రికార్డింగ్‌ను ఉపయోగించే హక్కులను కలిగి ఉంటుంది. వీడియోలో మాస్టర్ రికార్డింగ్‌ను ఉపయోగించినప్పుడు, కేటలాగ్‌ను కంట్రోల్ చేసే రికార్డ్ లేబుల్ రికార్డింగ్‌కు సంబంధించి తమ యాజమాన్య హక్కు ఉన్న కారణంగా రాయల్టీలను పొందుతుంది, అది ఆ తర్వాత ఆర్టిస్ట్‌కు షేర్ చేస్తుంది. వివిధ ప్రాంతాల్లో హక్కులు కలిగి ఉన్న వివిధ లేబుల్స్‌తో కాపీరైట్ చేసిన సౌండ్ రికార్డింగ్‌లను మేనేజ్ చేయడానికి కొన్ని లేబుల్స్ కలిసి పని చేయడం అన్నది అసాధారణ విషయమేమీ కాదు. అయితే, లేబుల్‌లు తమ సొంతంగా కంటెంట్‌ను డెలివరీ చేసే లేదా మేనేజ్ చేసే రిసోర్స్‌లను కలిగి ఉండకపోవచ్చు. ఈ సందర్భాల్లో, వారు అగ్రిగేటర్ లేదా డిస్ట్రిబ్యూటర్‌తో కలిసి పని చేయడానికి ఎంచుకోవచ్చు.

పబ్లిక్ ప్రదర్శన హక్కులు

రికార్డ్ అయిన మ్యూజిక్ భాగాలన్నీ (మాస్టర్ రికార్డింగ్‌లు) అంతర్లీనంగా మ్యూజికల్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి, అలాగే ఈ అంతర్లీన కంటెంట్‌కు వివిధ రకాల హక్కులు వర్తిస్తాయి. YouTube అవసరాల కోసం ఈ హక్కులు రెండు విభాగాలుగా విభజించబడవచ్చు - మొదటివి పబ్లిక్‌లో ప్లే చేయగల హక్కులు, రెండోవి ఇతర హక్కులు.

పబ్లిక్ ప్రదర్శన లైసెన్స్‌లు తరచుగా ప్రదర్శన హక్కుల సంస్థల (PROలు) ద్వారా కంట్రోల్ చేయబడతాయి. బార్లు, రెస్టారెంట్లు, హోటల్ లాబీలు తదితర స్థలాల్లో మ్యూజిక్‌ను ప్రదర్శించినందున ఆ సంస్థలకు పేమెంట్ జరిగిందా, లేదా అన్నది PROలు నిర్ధారించుకుంటాయి. YouTubeలో పాట స్ట్రీమ్ అయినప్పుడు, కంపోజిషన్ పబ్లిక్ ప్రదర్శనకు ప్రతిగా ఈ సంస్థలు పాటల రచయితలకు, మ్యూజిక్ పబ్లిషర్‌లకు డబ్బు పంచడానికి రాయల్టీలను సేకరిస్తాయి. అనేక సార్లు, "రాయల్టీ వసూళ్ల సంఘాలు" అనబడే ఈ సంస్థలు ఇవే బాధ్యతలను ఇతర దేశాల్లోనూ నిర్వర్తించే బాధ్యతను కూడా తీసుకుంటాయి. ఈ సంస్థలు సాధారణ హక్కుల నిర్వహణ విధులను నిర్వహించడానికి నియమించబడ్డాయి, అలాగే తరచుగా బ్లాంకెట్ లైసెన్స్‌లను అందిస్తాయి, ఇవి లైసెన్స్ పొందిన వారు ప్రతి కంటెంట్ కోసం వ్యక్తిగత లైసెన్స్‌లను పొందడానికి బదులుగా, కొంత కాలం పాటు రాయల్టీ వసూళ్ల సంఘం మొత్తం కేటలాగ్‌ను ఉపయోగించడానికి అనుమతిస్తాయి.

ఇతర హక్కులు

సాధారణంగా కంపోజిషన్‌కు ఉండే ఇతర హక్కులను పబ్లిషర్‌లు కంట్రోల్ చేస్తారు. రికార్డ్ లేబుల్ మాదిరిగానే, కొంత మంది పబ్లిషర్‌లు తమ సొంతంగా ఈ హక్కులను మేనేజ్ చేసే రిసోర్స్‌లను కలిగి లేకపోవచ్చు, అలాగే తమ తరఫున హక్కులను మేనేజ్ చేసే పెద్ద సంస్థను వినియోగించడానికి ఎంచుకోవచ్చు. ఈ పక్షాలు తరచుగా అగ్రిగేటర్‌లు లేదా పంపిణీదారులుగా వ్యవహరిస్తాయి. అదే మాదిరిగా, కంటెంట్‌ను ఉపయోగించడానికి, అలాగే ఇతర దేశాల్లో రాయల్టీలను సేకరించి, పంపిణీ చేయడానికి రాయల్టీ వసూళ్ల సంఘం ప్రత్యేకంగా లైసెన్స్‌లను అమ్మడానికి బాధ్యత వహించవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15003063165774515197
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false