మీ బ్రాండ్ ఖాతాను మేనేజ్ చేయండి

మీరు మీ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా ఖాతాను సెటప్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు. ఆన్‌లైన్ సమాచారాన్ని క్రియేట్ చేయడానికి YouTube వంటి నిర్దిష్ట సర్వీస్‌లను మీరు ఉపయోగించవచ్చు. 

బ్రాండ్ ఖాతాలు ఎలా పని చేస్తాయి

సాధారణ Google ఖాతాల నుండి బ్రాండ్ ఖాతాలు ఎలా భిన్నంగా ఉంటాయి

మీ స్వంత Google ఖాతాల ద్వారా బ్రాండ్ ఖాతాను మీరు, ఇతరులు కలిసి మేనేజ్ చేయవచ్చు. మీకు ప్రత్యేక యూజర్‌నేమ్ లేదా పాస్‌వర్డ్ అవసరం లేదు. మీ ఖాతాలో అనేక ఓనర్‌లు, మేనేజర్‌లు ఉండవచ్చు.

  • ఓనర్‌లు ఎక్కువ చర్యలను తీసుకోగలరు, ఇంకా ఖాతాను ఎవరు మేనేజ్ చేయాలి అనే దాన్ని వారు కంట్రోల్ చేయగలరు. ఒక ఖాతాకు తప్పనిసరిగా ఒక ప్రధాన ఓనర్ ఉండాలి.
  • మేనేజర్‌లు ఏవి అయితే చేయగలరో, అవే కమ్యూనిటీ మేనేజర్‌లు చేయగలరు, కానీ వారు YouTubeను ఉపయోగించలేరు.
బ్రాండ్ ఖాతాలను సపోర్ట్ చేసే Google సర్వీస్‌లు

Google Photos లేదా YouTube వంటి నిర్దిష్ఠ సర్వీస్‌లను మీరు మీ ఖాతాతో ఉపయోగించవచ్చు. మీరు మీ బ్రాండ్ ఖాతాతో కస్టమర్‌లు, అభిమానులతో కమ్యూనికేట్ చేయగలరు, కనెక్ట్ అవ్వగలరు, ఇంకా సమాచారాన్ని షేర్ చేయగలరు.

మీ కంటెంట్‌ను ఎవరు చూడగలరు, ఎవరు ఇంటరాక్ట్ అవ్వగలరు అనే దాన్ని మేనేజ్ చేయడానికి, ప్రతి సర్వీస్ కోసం మీరు మీ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయవచ్చు.

బ్రాండ్ ఖాతాను క్రియేట్ చేయండి

కొన్ని Google సర్వీస్‌లలో మీ బిజినెస్ లేదా బ్రాండ్ కోసం మీరు ఖాతాను క్రియేట్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు YouTube ఛానెల్‌ను క్రియేట్ చేసినప్పుడు బ్రాండ్ ఖాతాను క్రియేట్ చేయవచ్చు.

మీ బ్రాండ్ ఖాతాలను కనుగొనండి

మీరు మీ అన్ని బ్రాండ్ ఖాతాలను కనుగొనవచ్చు, ఇంకా వాటి మధ్య మారవచ్చు.

మీ ఖాతాలను కనుగొనండి

  1. మీ కంప్యూటర్‌లో, Chrome లేదా Safari వంటి వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సంబంధించిన బ్రాండ్ ఖాతాల విభాగానికి వెళ్లండి.
  3. "మీ బ్రాండ్ ఖాతాలు" కింద, ఖాతాను ఎంచుకోండి.

ఖాతాల మధ్య మారండి

  1. మీ కంప్యూటర్‌లో, Chrome లేదా Safari వంటి వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీరు ఉపయోగించాలనుకుంటున్న Google సర్వీస్‌కు వెళ్లండి.
  3. పైన కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా పేరులోని మొదటి అక్షరం and then మీ అన్ని బ్రాండ్ ఖాతాలను ట్యాప్ చేయండి.
  4. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి. మీ ఖాతా కనిపించకపోతే, ఆ సర్వీస్ బ్రాండ్ ఖాతాలను సపోర్ట్ చేయకపోవచ్చు. 

మీ ఖాతాలలో మార్పులు చేయండి

ప్రాథమిక సమాచారాన్ని ఎడిట్ చేయండి

మీ బిజినెస్ లేదా బ్రాండ్ గురించిన ప్రాథమిక సమాచారాన్ని మీరు జోడించవచ్చు, మార్చవచ్చు, లేదా తీసివేయవచ్చు. మీరు చేసే మార్పులు Google సర్వీస్‌లంతటా అమలులోకి వస్తాయి.

  1. మీ కంప్యూటర్‌లో, Chrome లేదా Safari వంటి వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సంబంధించిన బ్రాండ్ ఖాతాల విభాగానికి వెళ్లండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
  4. ఖాతా సమాచారాన్ని ఎడిట్ చేయిని ట్యాప్ చేయండి.
  5. మీరు మార్చాలనుకుంటున్న విభాగంలో, ఎడిట్ చేయి ఎడిట్ని ట్యాప్ చేయండి.
    • ఆప్షనల్: కింద కుడి వైపున, సమాచారాన్ని జోడించు Add infoను మీరు కనుగొనవచ్చు. మీ ఖాతాకు మరింత సమాచారాన్ని జోడించడానికి మీరు దాన్ని ట్యాప్ చేయవచ్చు.
  6. మీకు కావలసిన సమాచారాన్ని జోడించండి, మార్చండి లేదా తీసివేయండి.

ఏ సమాచారం షేర్ అవుతుందో అనే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోండి.

ఖాతాను ఎవరు మేనేజ్ చేస్తారో అనే దాన్ని మార్చండి

మీ వద్ద బ్రాండ్ ఖాతా ఉన్నట్లయితే, దానిని మేనేజ్ చేయడంలో సహాయపడడానికి మీరు వ్యక్తులను జోడించవచ్చు. ఆ ఖాతాపై ప్రతి వ్యక్తి ఎంత కంట్రోల్‌ను కలిగి ఉండాలో అనే దాన్ని మీరు నిర్ణయించవచ్చు.

ఖాతాకు కొత్త మేనేజర్‌లను ఎలా జోడించాలో తెలుసుకోండి.

మీరు ఇమెయిల్‌లను ఎప్పుడు అందుకోవాలో ఎంచుకోండి
  1. మీ కంప్యూటర్‌లో, Chrome లేదా Safari వంటి వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సంబంధించిన బ్రాండ్ ఖాతాల విభాగానికి వెళ్లండి.
  3. ఇమెయిల్ ప్రాధాన్యతలను ట్యాప్ చేయండి.
  4. మీ ఖాతాల గురించి మీకు ఎప్పుడు నోటిఫై చేయాలో మార్చండి. మీరు చేసే మార్పులు ఆటోమేటిక్‌గా సేవ్ చేయబడతాయి.

బ్రాండ్ ఖాతాను తొలగించండి లేదా రీస్టోర్ చేయండి

మీరు ఓనర్ అయితేనే, మీరు బ్రాండ్ ఖాతాను తొలగించగలరు. మీరు ఖాతాను తొలగిస్తే, అన్ని Google సర్వీస్‌లలో ఉన్న దాని మొత్తం కంటెంట్ తీసివేయబడుతుంది.

ముఖ్యమైనది: మీరు ఖాతాలను తొలగించడానికి లేదా రీస్టోర్ చేయడానికి ముందు మీరు 7 రోజుల పాటు ఖాతా ఓనర్‌గా ఉండాలి. ఓనర్‌గా మీరు 7 రోజుల కన్నా తక్కువ ఉంటే, మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది.

ఖాతాను తొలగించండి

Important: If your Brand Account is linked to a Google My Business account, you can’t delete it. However, if the Google My Business listing is deleted, it will delete any Brand Accounts that are connected to it.

  1. మీ కంప్యూటర్‌లో, Chrome లేదా Safari వంటి వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సంబంధించిన బ్రాండ్ ఖాతాల విభాగానికి వెళ్లండి.
  3. మీరు తొలగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
  4. ఖాతాను తొలగించును ట్యాప్ చేయండి.
  5. మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  6. సమాచారాన్ని జాగ్రత్తగా చదివి, నియమాలకు అంగీకరించండి.
  7. ఖాతాను తొలగించును ట్యాప్ చేయండి.
ఖాతాను రీస్టోర్ చేయండి

మీరు ఇటీవల మీ ఖాతాను తొలగించినట్లయితే, మీరు దాన్ని రికవర్ చేసుకోవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Chrome లేదా Safari వంటి వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సంబంధించిన బ్రాండ్ ఖాతాల విభాగానికి వెళ్లండి.
  3. తొలగించబడిన ఖాతాలను ట్యాప్ చేయండి.
  4. మీరు రీస్టోర్ చేయాలనుకుంటున్న ఖాతాకు పక్కన, ఈ బ్రాండ్ ఖాతాను రీస్టోర్ చేయి Restore this Brand Accountని ట్యాప్ చేయండి. రీస్టోర్ చేయబడిన ఖాతా మీ బ్రాండ్ ఖాతాల జాబితాలో కనిపిస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9971681177414743380
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false