YouTube కోసం మీ Google ఖాతాను ఉపయోగించండి

YouTubeకు సైన్ ఇన్ చేయడానికి మీకు Google ఖాతా అవసరం. అన్ని Google ప్రోడక్ట్‌లలో (Gmail, Blogger, Maps, YouTube, అలాగే అటువంటి మరిన్ని) Google ఖాతా పనిచేస్తుంది.

ఉపయోగించడాన్ని ప్రారంభించడం | YouTubeకు సైన్ ఇన్ చేయడం, YouTube ఛానెల్‌ను క్రియేట్ చేయడం ఎందుకు, ఎలా

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

మీరు ఇంతకు ముందు ఈ ప్రోడక్ట్‌లలో దేనికైనా సైన్ ఇన్ చేసి ఉంటే, మీకు ఇప్పటికే Google ఖాతా ఉన్నట్టే. సైన్ ఇన్ చేయడానికి, మీరు ఆ ప్రోడక్ట్‌ల కోసం ఉపయోగించిన ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి. ఉదాహరణకు, మీరు Gmail ఉపయోగిస్తే, అది మీ Gmail యూజర్‌నేమ్. మీకు Google ఖాతా లేకపోతే, మీరు YouTubeలో ఒక ఖాతాను క్రియేట్ చేయవచ్చు.

Google ఖాతాలు, YouTube గురించి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి:

  • మీరు మీ Google ఖాతాతో YouTubeకు సైన్ ఇన్ చేయండి. YouTubeకు సైన్ ఇన్ చేయడానికి, మీ Google ఖాతా ఇమెయిల్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. YouTubeకు సైన్ అప్ చేసిన తర్వాత, మరొక Google సర్వీస్‌లో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు YouTubeకు సైన్ ఇన్ చేయబడతారు.
  • మీ Google ఖాతాను తొలగించడం వలన మీ YouTube డేటా తొలగించబడుతుంది, అందులో అన్ని వీడియోలు, కామెంట్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లకు చెందిన డేటా ఉంటుంది. మీ Google ఖాతాను తొలగించే ముందు, మీరు YouTubeతో సహా అన్ని Google సర్వీస్‌లలో మీ డేటాను శాశ్వతంగా తొలగిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారించాలి.
కొన్ని పాత, ఉపయోగించని YouTube ఛానెల్స్ (మే 2009 కంటే ముందు క్రియేట్ చేయబడినవి) Google ఖాతాలో భాగం కాకపోవచ్చు. ఈ ఛానెల్స్‌ను ఉపయోగించడానికి ముందు వాటిని Google ఖాతాకు జోడించాల్సి రావచ్చు.

మీరు మీ Google ఖాతాతో YouTubeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు కింద పేర్కొన్న అనేక YouTube ఫీచర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు:

  • వీడియోలను లైక్ చేయడం
  • ఇష్టమైన వాటిని సేవ్ చేయడం
  • ఛానెల్స్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం
  • తర్వాత చూడండి
  • వీక్షణ హిస్టరీ
  • వీడియోలను రిపోర్ట్ చేయడం

మీరు చూసిన వీడియోలు, మీ సబ్‌స్క్రిప్షన్‌ల ఆధారంగా కూడా YouTube, వీడియో సిఫార్సులను వ్యక్తిగతీకరించగలదు.

అంతకు ముందు మీకు తగినంత వీక్షణ హిస్టరీ లేకపోతే, YouTube హోమ్ పేజీలోని సిఫార్సుల వంటి వీడియో సిఫార్సులను అందించడం కోసం మీ వీక్షణ హిస్టరీపై ఆధారపడే YouTube ఫీచర్‌లు తీసివేయబడతాయి.
 
మీరు ఛానెల్‌ను క్రియేట్ చేస్తే తప్ప, మీ యాక్టివిటీ YouTubeలో పబ్లిక్‌‌గా కనిపించదు. మీ యాక్టివిటీ పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటుంది. మీరు మీ స్వంత వీడియోలను అప్‌లోడ్ చేయాలనుకుంటే, వీడియోలపై కామెంట్ చేయాలనుకుంటే లేదా ప్లేలిస్ట్‌లను క్రియేట్ చేయాలనుకుంటే, మీరు ఎప్పుడైనా YouTube ఛానెల్‌ను క్రియేట్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6310495331675916115
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false