హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ప్లేలిస్ట్‌లను, వీడియోలను కనుగొనండి

హ్యాష్‌ట్యాగ్‌లు అనేవి కీవర్డ్‌లు, వీటి ముందు # చిహ్నం ఉంటుంది. మీ కంటెంట్‌కు ఏ హ్యాష్‌ట్యాగ్ అయితే ఉందో, YouTube, ఇంకా YouTube Musicలో అదే హ్యాష్‌ట్యాగ్ గల ఇతర వీడియోలు లేదా ప్లేలిస్ట్‌లు ఉన్నప్పుడు, వాటితో మీ కంటెంట్ సులభంగా కనెక్ట్ అయ్యే వీలు హ్యాష్‌ట్యాగ్‌లు కల్పిస్తాయి. వీక్షకులు, ఇంకా లిజనర్స్ సెర్చ్ చేస్తున్నప్పుడు వారికి సంబంధిత కంటెంట్‌ను కనుగొనడంలో కూడా హ్యాష్‌ట్యాగ్‌లు సహాయపడతాయి.

మీ YouTube వీడియోలకు లేదా YouTube Music ప్లేలిస్ట్‌కు హ్యాష్‌ట్యాగ్‌లను జోడించండి

మీరు వీడియోను అప్‌లోడ్ చేసినప్పుడు, లేదా YouTubeలో షార్ట్‌ను రికార్డ్ చేసినప్పుడు, లేదా YouTube Musicలో ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేసినప్పుడు, హ్యాష్‌ట్యాగ్‌లను మీరు టైటిల్‌కు, ఇంకా వివరణకు జోడించవచ్చు.

YouTubeలో మీ వీడియోకు హ్యాష్‌ట్యాగ్‌ను జోడించడానికి:

  1. టైటిల్ లేదా వివరణలో # చిహ్నాన్ని ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ వీడియోకు మీరు అనుబంధించాలనుకుంటున్న టాపిక్ లేదా కీవర్డ్‌ను ఎంటర్ చేయడం ప్రారంభించండి. మీ ఇన్‌పుట్ ఆధారంగా మా సిస్టమ్ జనాదరణ పొందిన హ్యాష్‌ట్యాగ్‌లను సూచిస్తుంది.
  2. సిఫార్సు చేయబడిన హ్యాష్‌ట్యాగ్‌ను ఎంచుకుని అదే హ్యాష్‌ట్యాగ్ గల ఇతర వీడియోలతో పాటు మీ వీడియోను ప్రమోట్ చేయండి లేదా మీ కంటెంట్‌కు తగిన హ్యాష్‌ట్యాగ్‌ను కనుగొనడానికి మీరే సొంతంగా ఒక హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేయండి.

వీడియో వివరణకు మీరు జోడించే అన్ని హ్యాష్‌ట్యాగ్‌లలో, అత్యంత ఆకర్షణీయంగా పరిగణించబడే గరిష్ఠంగా మూడు హ్యాష్‌ట్యాగ్‌లు మీ వీడియో టైటిల్‌తో కనిపిస్తాయి. మీ హ్యాష్‌ట్యాగ్‌లు ఇప్పటికీ వీడియో వివరణలో కనిపిస్తాయి, మీ వీడియోలు ఇప్పటికీ సెర్చ్ ఫలితాలలో కనిపిస్తాయి. టైటిల్, ఇంకా వివరణలో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లు, అదే హ్యాష్‌ట్యాగ్ గల ఇతర వీడియోలు ఉండే ఫలితాల పేజీకి లింక్ చేస్తాయి.

YouTube Musicలో మీ ప్లేలిస్ట్‌కు హ్యాష్‌ట్యాగ్‌ను జోడించడానికి:

  1. లైబ్రరీ ఆ తర్వాత ప్లేలిస్ట్‌లు ఆప్షన్‌లను ఎంచుకోండి.
  2. మీరు క్రియేట్ చేసిన ఏ ప్లేలిస్ట్‌ను అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో, ఆ ప్లేలిస్ట్‌ను కనుగొనండి.
  3. మీ ప్లేలిస్ట్ టైటిల్‌ను మార్చడానికి, లేదా వివరణను జోడించడానికి మరిన్ని ఆ తర్వాత ఎడిట్ చేయండి  ఆప్షన్‌లను ఎంచుకోండి.
  4. ప్లేలిస్ట్ టైటిల్‌లో లేదా వివరణలో # చిహ్నాన్ని ఎంటర్ చేయండి.

ప్లేలిస్ట్ టైటిల్‌కు లేదా వివరణకు సేవ్ అయ్యాక, హ్యాష్‌ట్యాగ్‌లు, క్లిక్ చేయదగిన లింక్స్ లాగా పని చేస్తాయి. టైటిల్, ఇంకా వివరణలో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లు, అదే హ్యాష్‌ట్యాగ్ గల ఇతర వీడియోలు, ఇంకా ప్లేలిస్ట్‌లు ఉండే ఫలితాల పేజీకి లింక్ చేస్తాయి.

సిఫార్సు చేయబడిన హ్యాష్‌ట్యాగ్‌లు:

మీరు షార్ట్‌కు టెక్స్ట్‌ను జోడించి, హ్యాష్‌ట్యాగ్‌ను జోడించడం ప్రారంభించినప్పుడు, ఈ కంటెంట్‌కు సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లను వర్తింపజేయడంలో మీకు సహాయపడే సూచనలు కనిపిస్తాయి. గత కంటెంట్ అప్‌లోడ్‌లకు సంబంధించిన, అలాగే కొన్ని దేశాలలో ఏదైనా ఎంటర్ చేసిన టెక్స్ట్ సంబంధిత సూచనల వంటి విభిన్న సిగ్నల్స్ ఆధారంగా ఈ హ్యాష్‌ట్యాగ్‌లను సిఫార్సు చేయడం జరుగుతుంది.

గతంలో ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్ సూచనల పక్కన గడియారం చిహ్నం ఉంటుంది, ఇది మీరు గతంలో వీటిని ఉపయోగించారని చూపుతుంది.

హ్యాష్‌ట్యాగ్ వినియోగ పాలసీలు

YouTubeకు అప్‌లోడ్ చేయబడే వీడియోల లాగానే, హ్యాష్‌ట్యాగ్‌లు కూడా తప్పనిసరిగా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండాలి. మా పాలసీలను ఉల్లంఘించే హ్యాష్‌ట్యాగ్‌లు మీ కంటెంట్ కింద చూపబడవు, వాటిని తీసివేసే అవకాశం ఉంది. హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించేటప్పుడు ఈ కింద ఉన్న పాలసీలను ఫాలో అయ్యేలా చూసుకోండి:

  • స్పేస్‌లు ఉండకూడదు: హ్యాష్‌ట్యాగ్‌లలో ఎటువంటి స్పేస్‌లు ఉండకూడదు. ఒకవేళ మీరు హ్యాష్‌ట్యాగ్‌లో రెండు పదాలను ఉంచాలనుకుంటే, మీరు వాటిని కలపవచ్చు (#TwoWords, #twowords).
  • మరీ ఎక్కువ ట్యాగ్‌లను జోడించడం: ఒకే వీడియోలో లేదా ఒకే ప్లేలిస్ట్‌లో మరీ ఎక్కువ ట్యాగ్‌లను జోడించకండి. మీరు ఎన్ని ఎక్కువ ట్యాగ్‌లను జోడిస్తే, సెర్చ్ చేసే వీక్షకులకు లేదా లిజనర్స్‌కు ప్రదర్శించబడే కంటెంట్ అంత తక్కువ సందర్భోచితంగా ఉంటుంది. ఏదైనా వీడియోలో లేదా ప్లేలిస్ట్‌లో, హ్యాష్‌ట్యాగ్‌లు 60 కంటే ఎక్కువ ఉంటే, మేము ఆ కంటెంట్‌కు ఉన్న ప్రతి హ్యాష్‌ట్యాగ్‌ను విస్మరిస్తాము. మరీ ఎక్కువ ట్యాగ్‌లను జోడిస్తే, మీ అప్‌లోడ్‌లు లేదా సెర్చ్ నుండి మీ వీడియోను తీసివేసే అవకాశం ఉంది.
  • తప్పుదోవ పట్టించే కంటెంట్: వీడియోకు లేదా ప్లేలిస్ట్‌కు నేరుగా సంబంధం లేని హ్యాష్‌ట్యాగ్‌లను జోడించకండి. తప్పుదోవ పట్టించే లేదా సంబంధం లేని హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తే, మీ వీడియోను లేదా ప్లేలిస్ట్‌ను తీసివేసే అవకాశం ఉంది. మా తప్పుదోవ పట్టించే మెటాడేటా పాలసీల గురించి మరింత తెలుసుకోండి.
  • పీడించడం: ఒక వ్యక్తిని లేదా గ్రూప్‌ను పీడించడం, అవమానించడం, భయపెట్టడం, వారి సమాచారాన్ని బహిర్గతం చేయడం, లేదా బెదిరించే ఉద్దేశంతో హ్యాష్‌ట్యాగ్‌ను జోడించకండి. ఈ పాలసీని ఉల్లంఘిస్తే, మీ వీడియోను లేదా ప్లేలిస్ట్‌ను తీసివేసే అవకాశం ఉంది. మా పీడించడం, అలాగే సైబర్ బెదిరింపునకు సంబంధించిన పాలసీల గురించి మరింత తెలుసుకోండి.
  • విద్వేషాలు పెంచే కంటెంట్: వ్యక్తులు లేదా గ్రూప్‌లపై హింసను లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే హ్యాష్‌ట్యాగ్‌లు వేటినీ జోడించకండి. జాతివివక్షతను, లింగ వివక్షను, లేదా ఇతర అసభ్య పదజాలాన్ని కలిగిన హ్యాష్‌ట్యాగ్‌లను జోడించకండి. ఈ పాలసీని ఉల్లంఘిస్తే, మీ వీడియోను లేదా ప్లేలిస్ట్‌ను తీసివేసే అవకాశం ఉంది. మా విద్వేషాలు పెంచే కంటెంట్‌కు సంబంధించిన పాలసీ గురించి మరింత తెలుసుకోండి.
  • లైంగిక కంటెంట్: లైంగికపరమైన హ్యాష్‌ట్యాగ్‌లను లేదా అందరికీ తగని విధంగా ఉండే హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తే, మీ వీడియోను లేదా ప్లేలిస్ట్‌ను తీసివేసే అవకాశం ఉంది. ఒకవేళ వీడియో ఉద్దేశం లైంగికంగా ప్రేరేపించడం అయితే, దాన్ని YouTubeలో అనుమతించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మా లైంగిక కంటెంట్ పాలసీ గురించి మరింత తెలుసుకోండి.
  • అసభ్యకరమైన భాష: మీ హ్యాష్‌ట్యాగ్‌లలో అసభ్య పదజాలాన్ని లేదా అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించడం వలన, మీ వీడియో లేదా ప్లేలిస్ట్‌పై వయోపరిమితి విధించవచ్చు లేదా వాటిని తీసివేయవచ్చు.
  • హ్యాష్‌ట్యాగ్‌లు లేనివి: హ్యాష్‌ట్యాగ్‌లను జోడించడానికి అనుమతి ఉన్నప్పటికీ, వివరణలో సాధారణంగా ఉండే వివరణాత్మక ట్యాగ్‌లను లేదా రిపీట్ అయ్యే వాక్యాలను జోడించడం (ఇప్పటికీ) నిషేధించబడింది. మీరు ఈ పాలసీని ఉల్లంఘిస్తే, మీ వీడియోను లేదా ప్లేలిస్ట్‌ను తీసివేసే అవకాశం ఉంది లేదా వాటిపై జరిమానా విధించవచ్చు. మా తప్పుదోవ పట్టించే మెటాడేటా పాలసీల గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13578894614264966518
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false