YouTube పార్ట్‌నర్ మేనేజర్ ఓవర్‌వ్యూ

మీ YouTube ఛానెల్ నుండి అత్యధిక ప్రయోజనాలు పొందడానికి YouTube పార్ట్‌నర్ మేనేజర్ టీమ్ మీకు సహాయపడుతుంది. మా ఆహ్వానం ద్వారా మాత్రమే చేరగల ప్రోగ్రామ్ క్రియేటర్‌లకు అనేక విధాలుగా సపోర్ట్ చేస్తుంది. వృద్ధి వ్యూహాలను నేర్చుకోవాలనుకుంటున్న క్రియేటర్‌లు, ఒకేరకమైన అభిరుచి కలిగిన క్రియేటర్‌లు, లేదా YouTubeలో విషయ పరిజ్ఞానం కలిగిన వారితో చాట్ చేయాలనుకునే వారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రయోజనం పొందుతారు.

పార్ట్‌నర్ మేనేజర్ అంటే ఏమిటి?

క్రియేటర్‌లు తమ సామర్థ్యాన్ని తెలుసుకొని పని చేయడంలో సహాయం అందించడం పార్ట్‌నర్ మేనేజర్ పని. పార్ట్‌నర్ మేనేజర్‌ను మీ స్వంత వ్యక్తిగత YouTube నిపుణులుగా పరిగణించవచ్చు.

YouTubeలో మీరు విజయం సాధించడానికి పార్ట్‌నర్ మేనేజర్ మీకు సహాయపడగల మార్గాల్లో ఇవి కొన్ని:

  • ప్రత్యేక వ్యక్తిగత సపోర్ట్: పార్ట్‌నర్ మేనేజర్‌లు ముఖాముఖిగా మీతో ప్రతి రోజు సమావేశమవుతారు. వ్యక్తిగత ఛానెల్ లక్ష్యాలు, ఛానెల్ ఆప్టిమైజేషన్ వ్యూహాలను రూపొందించడం, లేదా YouTube ఛానెల్‌ను విజయవంతంగా నడపడం ఎలా అన్న మీ సందేహాల గురించి మీరు మాట్లాడవచ్చు.
  • క్రియేటర్ ఈవెంట్‌లు, అలాగే వర్క్‌షాప్‌లకు ప్రత్యేక ఆహ్వానం: పార్ట్‌నర్ మేనేజర్‌తో మీరు YouTube స్పాన్సర్ చేసిన ఈవెంట్‌లు, అలాగే విజ్ఞాన వర్క్‌షాప్స్‌లో ఒకేరకమైన అభిరుచి కలిగిన క్రియేటర్‌లతో కనెక్ట్ అవడానికి ప్రస్తుత ఆహ్వానాలు మీకు అందవచ్చు.
  • మొదట కొత్త క్రియేటర్ ప్రోగ్రామ్‌లు, అలాగే అందించే సర్వీస్‌లను చూడండి: కొత్త YouTube ఫీచర్‌లకు యాక్సెస్ లేదా ప్రయోగాత్మక ట్రయల్ రన్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనడం వంటి కొత్త క్రియేటర్ ప్రోగ్రామ్‌ల గురించి తెలుసుకునే మొదటి వ్యక్తి అవ్వండి.

మా పార్ట్‌నర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అన్నది ఆహ్వానం ద్వారా మాత్రమే చేరగల, పరిమిత సమయ అవకాశం. మా అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే కొన్ని ఛానెల్స్‌కు మేము దాన్ని 6 నెలల కాలానికి అందిస్తాము. మీ ఛానెల్ సైజ్, ఛానెల్ యాక్టివిటీ, అలాగే YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు కట్టుబడి ఉండడమనే అంశాల ఆధారంగా మేము పార్ట్‌నర్ అర్హతను నిర్ణయిస్తాము. మరింత తెలుసుకోండి

పార్ట్‌నర్ మేనేజర్ ఉండడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి YouTube క్రియేటర్‌ల వెబ్‌సైట్‌లో మరింత తెలుసుకోండి.

YouTube పార్ట్‌నర్‌షిప్‌ల టీమ్ FAQలు

పార్ట్‌నర్ మేనేజర్‌ను ఎవరు పొందవచ్చు?
మా పార్ట్‌నర్ మేనేజర్ ప్రోగ్రామ్‌లో ప్రస్తుతం ఆహ్వానం ద్వారా మాత్రమే చేరవచ్చు.
సాధారణంగా మేము ఈ ఛానెల్స్‌తో కలిసి పని చేస్తాము:
  • పార్ట్‌నర్ మేనేజర్‌లు అందుబాటులో ఉన్న దేశాలు, ప్రాంతాల్లో ఉన్నవి
  • YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగమై ఉన్నవి
  • అభివృద్ధి సాధించే అవకాశం ఉన్నవి
  • కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లు ఏమీ లేనివి
  • ఒకటి కంటే ఎక్కువ పరిష్కరించని కాపీరైట్ స్ట్రయిక్‌ కలిగి లేనివి
  • మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ గైడ్‌లైన్స్‌కు కట్టుబడి ఉన్నవి
ఏయే దేశాలు, అలాగే ప్రాంతాలు పార్ట్‌నర్ మేనేజర్ ప్రోగ్రామ్‌కు అర్హత కలిగి ఉన్నాయి?
మీరు ఈ కింద పేర్కొన్న దేశాలు, ప్రాంతాల్లో ఉంటే, మీకు పార్ట్‌నర్ మేనేజర్ కోసం అర్హత ఉండవచ్చు:
  • అర్జెంటీనా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • బహ్రెయిన్
  • బెలారస్
  • బెల్జియం
  • బ్రెజిల్
  • కెనడా
  • చైనా
  • డెన్మార్క్
  • ఈజిప్ట్
  • ఫిన్లాండ్
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • హాంకాంగ్
  • ఐస్‌లాండ్
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • ఇరాన్
  • ఇరాక్
  • ఐర్లాండ్
  • ఇటలీ
  • జపాన్
  • జోర్డాన్
  • కజకిస్థాన్
  • కొరియా
  • కువైట్
  • లెబనాన్
  • మెక్సికో
  • మొరాకో
  • న్యూజిలాండ్
  • నార్వే
  • ఒమన్
  • ఫిలిప్పీన్స్
  • పోలండ్
  • పోర్చుగల్
  • రష్యా
  • సౌదీ అరేబియా
  • స్పెయిన్
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • థాయ్‌లాండ్
  • నెదర్లాండ్స్
  • టర్కీ
  • ఉక్రెయిన్
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్
  • వియత్నాం
  • యెమెన్
పార్ట్‌నర్ మేనేజర్ కోసం ఏమైనా ఖర్చు అవుతుందా?
లేదు, పార్ట్‌నర్ మేనేజర్ కలిగి ఉండేందుకు మీకు ఎలాంటి ఖర్చు కాదు.
నేను MCNతో (మల్టీ ఛానెల్ నెట్‌వర్క్) అనుబంధంగా ఉన్నాను, అయినా కూడా నేను సైన్ అప్ చేయవచ్చా?
అవును, MCNతో అనుబంధంగా ఉన్న క్రియేటర్‌లకు కూడా పార్ట్‌నర్ మేనేజర్‌ను కేటాయించడం జరుగుతుంది.
నాకు అర్హత లేనట్టు తెలుసుకున్నాను. నేను ఏం చేయాలి?
మీ ఛానెల్‌ను అభివృద్ధి చేసుకునేందుకు, మీ కమ్యూనిటీని బిల్డ్ చేసుకునేందుకు, ఇంకా మరెన్నింటినో చేయడానికి మీరు ఉపయోగించగలిగే రిసోర్స్‌లు ఇంకా చాలా ఉన్నాయి! మీ కోసం అందుబాటులో ఉన్న వాటిని చూడటానికి క్రియేటర్ హబ్‌ను అన్వేషించడం మర్చిపోవద్దు.
నేను స్వీకరించే ఈమెయిల్స్ YouTube నుండే వస్తున్నాయని నేను ఎలా తెలుసుకోగలను?
మీ ఛానెల్ గురించి మిమ్మల్ని అనేక మంది సంప్రదిస్తుంటారని మాకు తెలుసు. ఈమెయిల్ YouTube టీమ్ నుండే వచ్చిందని మీరు ఇలా నిర్ధారించుకోవచ్చు:
  • ఈమెయిల్ డొమైన్‌ను చెక్ చేయండి: ఈమెయిల్ @google.com, @youtube.com, లేదా @partnerships.withyoutube.com ఈమెయిల్ అడ్రస్‌ నుండి వచ్చిందని నిర్ధారించుకోండి. YouTube లేదా Google నుండి అంటూ క్లెయిమ్ చేస్తూ ఇతర ఏ డొమైన్‌ల నుండి అయినా వచ్చిన ఈమెయిల్స్ నకిలీవి అయ్యే అవకాశముంది.
  • లింక్‌లను చెక్ చేయండి: ఈమెయిల్‌లో చేర్చిన లింక్‌లు లేదా ఫారమ్‌ల URL youtube.com, withgoogle.com, withyoutube.com, youtube.secure.force.com, లేదా youtube.force.comతో ముగుస్తున్నట్టు నిర్ధారించుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7623888568165596724
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false