ఛానెల్స్‌కు ఆహ్వానం పంపేటప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి

ఈ ఫీచర్‌లు YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించే పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యాక్సెస్ పొందడానికి మీ YouTube పార్ట్‌నర్ మేనేజర్‌ను సంప్రదించండి.

ఛానెల్స్‌కు ఆహ్వానాలు పంపేటప్పుడు మీకు ఏదైనా ఎర్రర్ మెసేజ్ కనిపిస్తే, ఈ కింద పేర్కొన్న పరిష్కార ప్రక్రియ దశలను ట్రై చేయండి.

ఛానెల్ మరొక కంటెంట్ ఓనర్‌కు కేటాయించబడి ఉంది

ఉదాహరణకు, మీకు "ఈ యూజర్ ఇప్పటికే OWNER కంటెంట్ ఓనర్‌కు కేటాయించబడ్డారు: USERNAME" అనే మెసేజ్ కనిపిస్తే, ఆ యూజర్ ఇప్పటికే మరొక MCNతో లింక్ అయ్యున్నారని అర్థం.

ఆ యూజర్ మీ నెట్‌వర్క్‌లోకి ఆహ్వానించబడాలంటే, మొదట వారు ఛానెల్‌ను ఆ కంటెంట్ ఓనర్ నుండి అన్‌లింక్ చేయాల్సి ఉంటుంది.

ఛానెల్ ఒక ఇన్‌యాక్టివ్ కంటెంట్ ఓనర్‌కు కేటాయించబడి ఉంది

"ఈ యూజర్ ఇప్పటికే మరొక ఇన్‌యాక్టివ్ కంటెంట్ ఓనర్‌కు కేటాయించబడ్డారు, అనే మెసేజ్ మీకు కనిపిస్తే: అందుకు USERNAME" కంటెంట్ ఓనర్ ఇప్పటి దాకా తమ YouTube కోసం AdSense ఖాతాను అనుబంధించకపోవడం అనేది కారణం కావచ్చు.

ఆ యూజర్ మీ నెట్‌వర్క్‌లోకి ఆహ్వానించబడాలంటే, మొదట వారు ఛానెల్‌ను ఆ కంటెంట్ ఓనర్ నుండి అన్‌లింక్ చేయాల్సి ఉంటుంది.

ఇన్‌యాక్టివ్ కంటెంట్ ఓనర్‌లు YouTube కోసం AdSense ఖాతాను లింక్ చేయడానికి సూచనలను ఫాలో అయ్యి YouTube కోసం AdSense ఖాతాను యాక్టివేట్ చేసుకోవడం పూర్తి చేయవచ్చు.

యూజర్‌నేమ్‌కు సంబంధించిన సమస్యలు

మీకు ఈ కింద ఉన్న ఎర్రర్ మెసేజ్‌లలో ఏదైనా ఒకటి కనిపిస్తే, యూజర్‌కు సంబంధించిన యూజర్‌నేమ్‌లో ఏదో సమస్య ఉందని అర్థం, ఛానెల్‌ను మీ నెట్‌వర్క్‌లోకి ఆహ్వానించక ముందే ఆ సమస్యను పరిష్కరించవలసి ఉంటుంది:

  • "ఈ యూజర్‌నేమ్/బాహ్య ID చెల్లదు: USERNAME"
  • "ఈ యూజర్ ఇంకా YouTube ఛానెల్‌ను క్రియేట్ చేయలేదు, కాబట్టి వారిని లింక్ చేయడం సాధ్యపడదు: USERNAME"
  • "ఈ యూజర్ ఏ Google ఖాతాతోనూ అనుబంధించబడనందున, వారిని లింక్ చేయడం సాధ్యపడదు: USERNAME"

ఏదైనా యూజర్‌నేమ్, అసలైన యూజర్‌నేమ్‌తో మ్యాచ్ కాకపోతే, అది చెల్లనిదిగా పరిగణించబడుతుంది.

Google+ పేజీలు లేదా Google+ ప్రొఫైల్స్ ద్వారా క్రియేట్ చేయబడిన ఛానెల్స్‌కు సంప్రదాయ యూజర్‌నేమ్‌లు ఉండకపోవచ్చని, అవి "బాహ్య ID"ని ఉపయోగిస్తుంటాయని గుర్తుంచుకోండి, ఈ బాహ్య IDని, ఛానెల్‌కు వెళ్లి, URLలో "UC" తర్వాత ఉండే 15 అక్షరాలను కాపీ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

ఆహ్వానాలు ఇప్పటికే పంపబడ్డాయి

"ఈ యూజర్‌కు ఇప్పటికే మీరు ఆహ్వానం పంపారు: USERNAME" అనే మెసేజ్ మీకు కనిపిస్తే, మీరు ఆ ఛానెల్‌ను, వారి ఛానెల్ డ్యాష్‌బోర్డ్‌ను చెక్ చేసి, మీ ఆహ్వానాన్ని అంగీకరించమని అడగవచ్చు.

"ఈ యూజర్‌ను ఇప్పటికే మీరు మేనేజ్ చేస్తున్నారు: USERNAME" అనే మెసేజ్ మీకు కనిపిస్తే, ఆ ఛానెల్ ఇప్పటికే మీ కంటెంట్ మేనేజర్‌కు లింక్ అయ్యుందని అర్థం.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12660983077074858193
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false