YouTubeలో సినిమాలను ముందే ఆర్డర్ చేసుకోండి

 

గమనిక: YouTube Android యాప్‌లో కొనుగోలు చేసే లేదా అద్దెకు తీసుకునే కొన్ని సినిమాలు, టీవీ షోలకు Google Play ద్వారా బిల్లు విధించబడుతుంది. ఇది ధరపై ప్రభావం చూపదు, కొనుగోలుకు సంబంధించి ఎక్కడ నుండి బిల్ చేయబడుతుందో అనే దానిపై మాత్రమే ప్రభావం చూపుతుంది. ఇటీవలి ఛార్జీలను చూడటానికి, అలాగే మీకు ఎలా బిల్ చేయబడుతుందో చెక్ చేయడానికి మీరు pay.google.com లింక్‌కు వెళ్లవచ్చు. Google Play కొనుగోలుకు సంబంధించిన రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, ఇక్కడ వివరించిన దశలను ఫాలో అవ్వండి.

మీరు YouTubeలో కొన్ని సినిమాలను ముందస్తుగా ఆర్డర్ చేసుకొని, అవి అందుబాటులోకి రాగానే, నేరుగా మీ ఖాతాలోకి డెలివరీ అయ్యేలా చేసుకోవచ్చు.

సినిమాను ముందస్తుగా ఆర్డర్ చేయడం

YouTubeలో ముందస్తుగా ఆర్డర్ చేయడం కోసం ఐటెమ్ అందుబాటులో ఉన్నప్పుడు, దాని వీక్షణ పేజీలో ముందస్తు ఆర్డర్ బటన్ ప్రదర్శించబడుతుంది. ఐటెమ్ చూడటానికి అందుబాటులో ఉండే వరకు ముందస్తు ఆర్డర్‌ల కోసం మీకు ఛార్జీ విధించబడదు.

  1. మీ కంప్యూటర్‌లో, YouTubeను తెరవండి.
  2. మీరు ముందస్తుగా ఆర్డర్ చేయాలనుకుంటున్న ఐటెమ్ కోసం సెర్చ్ చేయండి.
  3. ముందస్తుగా ఆర్డర్ చేయడాన్ని ఎంచుకోండి.
  4. మీ ఆర్డర్‌ను పూర్తి చేయండి.

మీ ముందస్తు ఆర్డర్ పూర్తయినప్పుడు, అలాగే ఐటెమ్ అందుబాటులో ఉన్నప్పుడు మేము మీకు ఈమెయిల్‌ను పంపుతాము.

మీ పేమెంట్ తిరస్కరించబడితే, ముందస్తు ఆర్డర్ రద్దు చేయబడవచ్చు. మీరు మీ Google ఖాతాలో మీ పేమెంట్ వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత మళ్లీ ముందస్తు ఆర్డర్ చేయవచ్చు.

ముందస్తు ఆర్డర్‌ను రద్దు చేయండి

మీరు వద్దు అనుకునే ముందస్తు ఆర్డర్‌ను, అది డెలివరీ కానంత వరకు మీరు దాన్ని రద్దు చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, మీ కొనుగోళ్లు & మెంబర్‌షిప్‌లకు వెళ్లండి. 
  2. మీరు రద్దు చేయాలనుకుంటున్న ముందస్తు ఆర్డర్‌ను కనుగొనండి.
  3. 3 చుక్కల మెనూ > ముందస్తు ఆర్డర్‌ను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ ఆర్డర్‌ను రద్దు చేసిన తర్వాత మీకు రద్దు ఈమెయిల్ వస్తుంది.

గమనిక: ముందే ఆర్డర్ చేసుకొనే సదుపాయం, స్మార్ట్ టీవీలలో ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6553455130927097291
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false