కూపన్ కోడ్‌ను రిడీమ్ చేసుకోండి

YouTube కూపన్ కోడ్ అనేది ఒక క్రెడిట్, దీన్ని ఏదైనా సినిమాను లేదా టీవీ షోను అద్దెకు తీసుకోవడానికి గానీ లేదా కొనుగోలు చేయడానికి గానీ ఉపయోగించవచ్చు. కూపన్ కోడ్‌లను, ఉద్దేశించబడిన ప్రయోజనం కోసం మాత్రమే రిడీమ్ చేయగలరు. ఉదాహరణకు, మీరు సినిమాను అద్దెకు తీసుకోవడానికి సంబంధించిన కూపన్ కోడ్‌ను అందుకుంటే, దానిని టీవీ షో కొనుగోలుకు క్రెడిట్‌గా వర్తింపజేయడానికి సాధ్యం కాదు.

మీరు కంప్యూటర్‌లో గానీ లేదా ఎంపిక చేయబడిన కొన్ని మొబైల్ పరికరాలను ఉపయోగించి గానీ కూపన్ కోడ్‌ను రిడీమ్ చేసుకోవచ్చు.

కంప్యూటర్‌లో కూపన్ కోడ్‌ను రిడీమ్ చేసుకోవడానికి:

  1. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న లేదా అద్దెకు తీసుకోవాలనుకుంటున్న సినిమా లేదా టీవీ షో కోసం సినిమాలు & షోల పేజీకి వెళ్లండి లేదా YouTubeలో సెర్చ్ చేయండి.
  2. కొనుగోలు లేదా అద్దె ధరను డిస్‌ప్లే చేసే బటన్‌ను క్లిక్ చేయండి.
  3. సినిమా లేదా టీవీ షో పోస్టర్ కింద ప్రమోషనల్ కోడ్‌ను ఎంటర్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకుని, మీరు అందుకున్న కోడ్‌ను టైప్ చేయండి.
  4. మీకు నచ్చిన కొనుగోలు లేదా అద్దె ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మీ సినిమా అద్దె ధర లేదా కొనుగోలు ధర డిస్కౌంట్ మొత్తం ఆధారంగా అప్‌డేట్ చేయబడిన ధరతో డిస్‌ప్లే చేయబడుతుంది. కానీ, ఖర్చు లేకుండా సినిమా లేదా టీవీ షోను రిడీమ్ చేసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే పేమెంట్ పద్ధతిని ఎంచుకోవాలి. మీరు ప్రాధాన్యమిచ్చే పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుని, కొనుగోలు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ YouTube కూపన్ కోడ్‌ను రిడీమ్ చేసుకోవడంలో మీకు సమస్యలు ఉంటే, సహాయం కోసం కింది చిట్కాలను ఫాలో అవ్వడానికి ట్రై చేయండి లేదా మమ్మల్ని సంప్రదించండి.

కూపన్ కోడ్‌లకు సంబంధించిన సాధారణ పరిష్కార ప్రక్రియ చిట్కాలు:

  • మీరు సరైన ఫీల్డ్‌లో కూపన్ కోడ్‌ను ఎంటర్ చేశారని వెరిఫై చేయండి. YouTube కూపన్ కోడ్‌లు 'Google Play గిఫ్ట్ కార్డ్ లేదా ప్రోమో కోడ్‌ను రిడీమ్ చేయండి' ఫీల్డ్‌లో పని చేయవు.
  • మీరు కోడ్‌ను సరిగ్గా ఎంటర్ చేశారని నిర్ధారించుకోండి. కోడ్‌లో అప్పర్-కేస్ లేదా లోయర్-కేస్ అక్షరాలను శ్రద్ధగా చెక్ చేయండి.
  • మీరు కూపన్ కోడ్‌ను ఉద్దేశించిన ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. ఉదాహరణకు, సినిమా లేదా టీవీ షోను ఖర్చు లేకుండా అద్దెకు తీసుకోవడానికి సంబంధించి మీరు కూపన్ కోడ్‌ను అందుకొని ఉంటే, వేరొక రకమైన కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి దీనిని ఉపయోగించలేరు.
  • మీ కూపన్ కోడ్ ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందని ధృవీకరించుకోండి:
    • గడువు ముగింపు తేదీని చెక్ చేయండి: కొన్ని కూపన్ కోడ్‌లను సెట్ చేసిన తేదీ కంటే ముందే ఉపయోగించాలి. మీ వద్ద 'పరిమిత కాలానికి మాత్రమే' అని మార్క్ చేసిన కోడ్ ఉంటే, గడువు ముగింపు తేదీ కూపన్ కోడ్‌లో లేదా మీరు అందుకున్న ఈమెయిల్‌లో సూచించబడుతుంది.
    • కూపన్ కోడ్‌ను ఇప్పటికే ఉపయోగించారా అని చెక్ చేయండి. ఒకసారి కోడ్‌ను ఉపయోగించిన తర్వాత, అదే కోడ్‌ను ఉపయోగించి మీరు ఖర్చు లేకుండా మరొక సినిమా లేదా టీవీ ప్రోగ్రామ్‌ను పొందలేరు.
  • మీ సినిమా లేదా టీవీ షోకు చెందిన డిస్కౌంట్‌ను వర్తింపజేసిన కొనుగోలు లేదా అద్దెకు సంబంధించిన ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి కొనుగోలుపై క్లిక్ చేసే ముందు మీరు చెల్లుబాటు అయ్యే పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకున్నారో, లేదో వెరిఫై చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16538164877343474550
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false