ఎక్కువ నిడివి ఉన్న వీడియోలలో మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను మేనేజ్ చేయండి

8 నిమిషాలు లేదా అంత కంటే నిడివి ఎక్కువ ఉన్న మానిటైజ్ చేసే వీడియోలలో, మీరు వీడియో మధ్యలో కూడా యాడ్‌లను ఆన్ చేయవచ్చు (వీటిని "మధ్యలో వచ్చే యాడ్‌లు" అంటారు).

వీక్షకుల అనుభవం, అలాగే మీ మానిటైజేషన్ సామర్థ్యం మధ్య బ్యాలెన్స్ ఉండటానికి, మధ్యలో వచ్చే యాడ్‌లు అనేవి, డిఫాల్ట్‌గా, మీ వీడియోలో సహజంగా అనిపించే బ్రేక్‌ల వద్ద వచ్చేలా ఆటోమేటిక్‌గా సెట్ చేయబడతాయి. కొత్త అప్‌లోడ్‌లకు ఆటోమేటిక్‌గా మధ్యలో వచ్చే యాడ్‌ల ఆప్షన్ ఆన్ చేసి ఉండకపోతే, మీరు వాటిని ఒక్కో వీడియోకు విడివిడిగా ఆన్ చేసుకోవచ్చు.

ఆటోమేటిక్‌గా జోడించబడే మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను క్రియేట్ చేయడానికి, ప్రివ్యూ చేయడానికి, ఇంకా ఎడిట్ చేయడానికి, లేదా వీడియోలలో మాన్యువల్‌గా మీకు నచ్చిన ప్రదేశాలలో యాడ్ బ్రేక్‌లను సెట్ చేయడానికి, యాడ్ బ్రేక్‌ల టూల్‌ను ఉపయోగించండి. మీ ఛానెల్-స్థాయి ఆటోమేటిక్ అప్‌లోడ్ సెట్టింగ్‌తో సంబంధం లేకుండా మీరు ఈ టూల్‌ను ఉపయోగించవచ్చు.

అర్హత ఉంటే, మీరు మీ లైవ్ స్ట్రీమ్‌ల కోసం మధ్యలో వచ్చే యాడ్‌లను కూడా ట్రిగ్గర్ చేయవచ్చు.

ఎక్కువ నిడివి ఉన్న వీడియోలలో మధ్యలో వచ్చే యాడ్స్‌ను ఉపయోగించడం

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

వీక్షకులు ఉపయోగించే పరికర రకాన్ని బట్టి, వారి యాడ్ అనుభవం కొంత మారవచ్చు.

  • కంప్యూటర్‌లో: మధ్యలో వచ్చే యాడ్‌కు ముందు 5 సెకన్ల కౌంట్‌డౌన్ కనిపిస్తుంది.
  • ఇతర ప్లాట్‌ఫామ్‌లలో: యాడ్ ఎప్పుడు చూపబడవచ్చు అనే దానిని సూచించడానికి, వీడియో ప్రోగ్రెస్ బార్‌లో పసుపు పచ్చ రంగు మార్కర్‌లు కనిపిస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు

నేను మధ్యలో వచ్చే యాడ్‌లను ఉపయోగించాలో లేదో నాకు ఎలా తెలుస్తుంది?

మధ్యలో వచ్చే యాడ్‌లను ఎక్కడ ఉంచితే అత్యుత్తమంగా ఉంటుందో YouTube ఆటోమేటిక్‌గా గుర్తించగలిగినప్పటికీ, సముచితం కాని పక్షంలో, మీరు మధ్యలో వచ్చే యాడ్‌లను ఆఫ్ చేయవచ్చు. ఉదాహరణకు, ధ్యానానికి సంబంధించిన వీడియోలకు, మధ్యలో వచ్చే యాడ్‌లు సముచితం కాకపోవచ్చు. అయినా కానీ మీరు వాటిని ఉపయోగించాలనుకుంటే, మీ కంటెంట్‌లో యాడ్‌ల కోసం సహజంగా అనిపించే ప్రదేశాలను గుర్తించడానికి, ఆటోమేటిక్‌గా జోడించబడే మధ్యలో వచ్చే యాడ్‌ల అప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము, దీని వలన వీక్షకులకు అంతరాయం లేని అనుభవాన్ని అందించవచ్చు.

ఆటోమేటిక్‌గా జోడించబడే మధ్యలో వచ్చే యాడ్‌లు ఎలా పని చేస్తాయి?

ఆటోమేటిక్‌గా జోడించబడే మధ్యలో వచ్చే యాడ్‌ల లక్ష్యం, వీక్షకుల అనుభవం, అలాగే క్రియేటర్ ఆదాయ సామర్థ్యం మధ్య సమతుల్యత ఉండేలా చూడటం. YouTube అధునాతన మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ, పెద్ద సంఖ్యలోని వీడియోలను గమనించి, మధ్యలో వచ్చే యాడ్‌లను జోడించడానికి అత్యుత్తమ స్థానాన్ని గుర్తించడం ఎలాగో తెలుసుకుంటుంది. సహజమైన విజువల్ లేదా ఆడియో బ్రేక్‌ల వంటి అంశాలను అంచనా వేయడం ద్వారా ఈ పనిని చేయడం జరుగుతుంది. మాన్యువల్‌గా జోడించబడే మధ్యలో వచ్చే యాడ్‌ల కన్నా, ఆటోమేటిక్‌గా జోడించబడే మధ్యలో వచ్చే యాడ్‌ల వలన, వీక్షకులకు రెండు రెట్లు తక్కువ అంతరాయం కలుగుతోందని యూజర్ స్టడీలు సూచిస్తున్నాయి.

మధ్యలో వచ్చే యాడ్‌ల వలన వీక్షకులకు చికాకు కలగదా?

కొందరు వీక్షకులకు మధ్యలో వచ్చే యాడ్‌లు, ఇబ్బందికరంగా లేదా అంతరాయం కలిగించే విధంగా అనిపించవచ్చు. కానీ, వీక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, వీడియోలో యాడ్ ప్లేస్‌మెంట్ ఎక్కడ ఉంటే వీక్షకులకు అత్యంత తక్కువగా అంతరాయం కలిగే అవకాశం ఉందో అంచనా వేసే పనిని మేము చూసుకుంటాము. మా ప్లాట్‌ఫామ్‌లో వీక్షకుల, అడ్వర్టయిజర్‌ల, అలాగే క్రియేటర్‌ల అవసరాల మధ్య సమతుల్యత పాటించడానికి మేము కృషి చేస్తున్నాము.

నేను ఇప్పటికీ ఆటోమేటిక్‌గా జోడించబడే మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను సర్దుబాటు చేయగలనా?

చేయవచ్చు. ఆటోమేటిక్‌గా జోడించబడే మధ్యలో వచ్చే యాడ్‌ల ఆప్షన్‌ను ఆన్ చేసినప్పుడు, మీరు ఏదైనా వీడియోకు సంబంధించిన మానిటైజేషన్ సెట్టింగ్‌లకు వెళ్లి, యాడ్ బ్రేక్ స్థానాలను మాన్యువల్‌గా మార్చవచ్చు.

YouTube Studioలో యాడ్ బ్రేక్‌లను మేనేజ్ చేయడం

వీక్షణా అనుభవాన్ని, అలాగే యాడ్‌లను ప్రదర్శించే అవకాశాన్ని, మధ్యలో వచ్చే యాడ్ ప్లేస్‌మెంట్ ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లు, వీడియోలో అంతరాయం కలిగించే స్థానాలలో మాన్యువల్‌గా జోడించబడితే, మా యాడ్ సిస్టమ్ తక్కువ యాడ్‌లను అందించవచ్చు.

మధ్యలో వచ్చే యాడ్‌లను వీడియోలో 2 మార్గాల్లో జోడించవచ్చు:
  • ఆటోమేటిక్ యాడ్ బ్రేక్‌లు: మీరు వీడియోలో ఆటోమేటిక్‌గా మధ్యలో వచ్చే యాడ్‌ల ఆప్షన్‌ను అన్ చేసుకోవచ్చు, అంటే అత్యుత్తమమైన యాడ్ ప్లేస్‌మెంట్, అలాగే ఫ్రీక్వెన్సీని మేము గుర్తించి, తద్వారా వీక్షకులకు మరింత సమతుల్యతతో కూడిన అనుభవాన్ని అందిస్తాము.
  • మాన్యువల్ యాడ్ బ్రేక్‌లు: మీరు యాడ్ బ్రేక్‌లను మాన్యువల్‌గా జోడించాలనుకుంటే, అత్యుత్తమ ఫలితాల కోసం యాడ్ బ్రేక్‌లను సహజమైన విరామాల వద్ద జోడించండి. మధ్యలో వచ్చే యాడ్‌లను, అంతరాయం కలిగించే స్థానాలలో జోడించకండి, ఉదాహరణకు, మాటల మధ్యలో లేదా యాక్షన్ మధ్యలో జోడించకండి. మీ కంటెంట్‌లో సహజమైన యాడ్ బ్రేక్‌లు ఉండేలా మీరు క్రియేట్ చేసినప్పుడు, మీకు కావలసినప్పుడు యాడ్‌లు ప్రదర్శించబడేలా చూసుకోవడానికి మాన్యువల్ యాడ్ బ్రేక్‌లను ఉపయోగించవచ్చు.

ఆటోమేటిక్ ప్లేస్‌మెంట్

మీరు ఏదైనా ఒక వీడియోకు మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను ఆటోమేటిక్‌గా సెట్ చేయవచ్చు:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. ఏదైనా ఒక వీడియోను ఎంచుకుని, ఆపై మానిటైజేషన్ ను ఎంచుకోండి.
  4. మీరు ఇప్పటికీ వీడియోకు మానిటైజేషన్‌ను ఆన్ చేయకపోతే, ఆన్ చేయండి.
  5. “వీడియో మధ్యలో యాడ్‌లను డిస్‌ప్లే చేయకండి (మధ్యలో వచ్చే యాడ్)” ఆప్షన్‌కు పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.

మాన్యువల్‌గా జోడించడం

మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను మీరు మాన్యువల్‌గా జోడించవచ్చు:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. ఏదైనా ఒక వీడియోను ఎంచుకుని, ఆపై మానిటైజేషన్   ను  ఎంచుకోండి
  4. మీరు ఇప్పటికీ వీడియోకు మానిటైజేషన్‌ను ఆన్ చేయకపోతే, ఆన్ చేయండి.
  5. “వీడియో మధ్యలో యాడ్‌లను డిస్‌ప్లే చేయకండి (మధ్యలో వచ్చే యాడ్)” ఆప్షన్‌కు పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
  6. ప్లేస్‌మెంట్‌ను రివ్యూ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • యాడ్ బ్రేక్‌ను జోడించడం:   యాడ్ బ్రేక్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. యాడ్ ప్రారంభ సమయాన్ని ఎంటర్ చేయండి, లేదా వర్టికల్ బార్‌ను మీకు కావలసిన సమయం వద్దకు లాగండి.
    • యాడ్ బ్రేక్‌ను తొలగించడం: యాడ్ బ్రేక్‌కు పక్కన ఉన్న తొలగించండి ని క్లిక్ చేయండి.
  7. ఎగువ కుడి వైపున, కొనసాగించండిని క్లిక్ చేసి, ఆపై సేవ్ చేయండిని క్లిక్ చేయండి.

కొత్త వీడియోను అప్‌లోడ్ చేసేటప్పుడు యాడ్ బ్రేక్‌లను జోడించడం

మీరు కొత్త వీడియోను అప్‌లోడ్ చేసేటప్పుడు యాడ్ బ్రేక్‌లను జోడించవచ్చు: 

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. 8 లేదా అంత కన్నా ఎక్కువ నిమిషాల నిడివి ఉన్న వీడియోను అప్‌లోడ్ చేయండి.
  3. "మానిటైజేషన్" ట్యాబ్‌లో, మానిటైజేషన్‌ను ఆన్ చేయండి.
  4. “వీడియో మధ్యలో యాడ్‌లను డిస్‌ప్లే చేయకండి (మధ్యలో వచ్చే యాడ్)” ఆప్షన్‌కు పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
  5. మీ వీడియోను ప్రాసెస్ చేసిన తర్వాత, ప్లేస్‌మెంట్‌ను రివ్యూ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • యాడ్ బ్రేక్‌ను జోడించడం:  యాడ్ బ్రేక్  అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. యాడ్ ప్రారంభ సమయాన్ని ఎంటర్ చేయండి, లేదా వర్టికల్ బార్‌ను మీకు కావలసిన సమయం వద్దకు లాగండి.
    • యాడ్ బ్రేక్‌ను తొలగించడం: యాడ్ బ్రేక్ పక్కన ఉన్న తొలగించండి ని క్లిక్ చేయండి.
  6. దిగువ కుడి వైపున ఉన్న తర్వాత అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. అప్‌లోడ్ ఫ్లోను పూర్తి చేయండి.

వీడియోను ఎడిట్ చేసేటప్పుడు యాడ్ బ్రేక్‌లను జోడించండి

మీరు వీడియోను ఎడిట్ చేస్తున్నప్పుడు, యాడ్ బ్రేక్‌లను కూడా జోడించవచ్చు: 

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపు మెనూలో, ఎడిటర్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5.   యాడ్ బ్రేక్‌లకు పక్కన ఉన్న ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • మాన్యువల్‌గా జోడించడం కోసం యాడ్ బ్రేక్ ఆప్షన్‌ను క్లిక్ చేసి, యాడ్ ప్రారంభ సమయాన్ని ఎంటర్ చేయండి లేదా కావలసిన సమయానికి వర్టికల్ బార్‌ను లాగండి. 
    • ఆటోమేటిక్‌గా జోడించడం కోసం: ఆటోమేటిక్‌గా జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • యాడ్ బ్రేక్‌ను తొలగించడం: యాడ్ బ్రేక్ పక్కన ఉన్న తొలగించండి  ని  క్లిక్ చేయండి.
  6. యాడ్ బ్రేక్‌ను తొలగించడం కోసం, యాడ్ బ్రేక్ పక్కన ఉన్న తొలగించండి ని క్లిక్ చేయండి.
  7. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మధ్యలో వచ్చే యాడ్ ప్లేస్‌మెంట్ ప్రివ్యూను చూడండి, మార్చండి

మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌ల ప్లేస్‌మెంట్ ప్రివ్యూను మీరు చూడవచ్చు, మార్చవచ్చు.

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. ఏదైనా ఒక వీడియోను ఎంచుకుని, ఆపై మానిటైజేషన్‌ను ఎంచుకోండి.
  4. "వీడియో మధ్యలో యాడ్‌లను డిస్‌ప్లే చేయండి (మధ్యలో వచ్చే యాడ్)" దిగువున ఉన్న ప్లేస్‌మెంట్‌ను రివ్యూ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. వీడియో ప్లేయర్‌లో ప్లే చేయండి ని ఎంచుకోండి.
  6. వీడియోలోని నిర్దిష్ట భాగానికి చేరుకోవడానికి కర్సర్‌ను లాగండి.

ఒక నిర్దిష్ట వీడియోకు సంబంధించిన మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను మేనేజ్ చేయండి

ఒక్కొక్క వీడియోకు సంబంధించిన మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను మీరు ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు:

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, వీడియోలు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఏదైనా ఒక వీడియోను ఎంచుకుని, ఆపై మానిటైజేషన్‌ను ఎంచుకోండి.
  4. “వీడియో మధ్యలో యాడ్‌లను డిస్‌ప్లే చేయండి (మధ్యలో వచ్చే యాడ్)” అనే ఆప్షన్‌కు పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకొని మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి. ఆన్ చేసినప్పుడు, మధ్యలో వచ్చే యాడ్‌లు ఆటోమేటిక్‌గా జోడించబడతాయి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

పలు వీడియోలకు సంబంధించి, మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను మేనేజ్ చేయడం

పలు వీడియోలకు సంబంధించిన మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను మీరు ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు:
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. పలు వీడియోలను ఎంచుకుని, ఆపై ఎడిట్ మెనూలో "యాడ్ సెట్టింగ్‌ల" ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. “వీడియో మధ్యలో యాడ్‌లను డిస్‌ప్లే చేయండి (మధ్యలో వచ్చే యాడ్)” ఆప్షన్‌ను ఎంచుకొని మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి. ఆన్ చేసినప్పుడు, మధ్యలో వచ్చే యాడ్‌లు ఆటోమేటిక్‌గా జోడించబడతాయి.
  5. యాడ్ బ్రేక్‌లు లేని వీడియోలను మాత్రమే అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా లేదా ఇప్పటికే ఉన్న యాడ్ బ్రేక్‌లు వేటిని అయినా రీప్లేస్ చేయాలనుకుంటున్నారా అనే దానిని ఎంచుకోండి.
  6. వీడియోలను అప్‌డేట్ చేయండిని ఎంచుకొని, ఈ మార్పును నిర్ధారించడానికి డిస్‌ప్లే చేసిన దశలను ఫాలో అవ్వండి.
  7. వీడియోలను అప్‌డేట్ చేయండిని ఎంచుకోవడం ద్వారా ఈ మార్పును పూర్తి చేయండి.

మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లకు సంబంధించి, ఛానెల్ ఆటోమేటిక్ అప్‌లోడ్ సెట్టింగ్‌ను మార్చడం

భవిష్యత్తులోని అప్‌లోడ్‌లలో మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను ఫీచర్ చేయడం కోసం మీ ఛానెల్‌కు సంబంధించిన ఆటోమేటిక్ అప్‌లోడ్ సెట్టింగ్‌లను మార్చవచ్చు. కావాలంటే, మీరు ఈ సెట్టింగ్‌ను ఆఫ్ కూడా చేయవచ్చు:
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఆటోమేటిక్ అప్‌లోడ్ సెట్టింగ్‌లు ఆ తర్వాత మానిటైజేషన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. “వీడియో మధ్యలో యాడ్‌లను డిస్‌ప్లే చేయండి (మధ్యలో వచ్చే యాడ్)” అనే ఆప్షన్‌కు పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకొని మధ్యలో వచ్చే యాడ్ బ్రేక్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి. ఆన్ చేసినప్పుడు, మధ్యలో వచ్చే యాడ్‌లు ఆటోమేటిక్‌గా జోడించబడతాయి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8410541686873849529
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false