YouTube Kidsలో అడ్వర్టయిజింగ్

YouTube Kids యాప్‌లో విక్రయించబడే అడ్వర్టయిజ్‌మెంట్‌లు అన్ని తప్పనిసరిగా దిగువ వివరించిన అదనపు అడ్వర్టయిజింగ్ పాలసీలతో పాటు YouTube యొక్క సాధారణ అడ్వర్టయిజింగ్ పాలసీలకు అనుగుణంగా ఉండాలి. YouTube Kids అడ్వర్టయిజింగ్ పాలసీలు కాలక్రమేణా అభివృద్ధి చెందవచ్చు. తాజా అప్‌డేట్‌లను చెక్ చేసుకోవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. YouTube Kids యాప్‌లో అందించబడాలంటే, అన్ని YouTube Kids పెయిడ్ యాడ్స్ తప్పనిసరిగా YouTube పాలసీ టీమ్ ద్వారా ముందుగా ఆమోదించబడాలి. అదనంగా, వర్తించే చట్టాలను, నిబంధనలను (ఏదైనా సంబంధిత స్వీయ నియంత్రణ లేదా పరిశ్రమ గైడ్‌లైన్స్‌తో సహా) కూడా అడ్వర్టయిజర్‌లు పాటించాలి. యాడ్ ఫార్మాట్ అవసరాల గురించి కింద మీరు మరింత చదవవచ్చు.

YouTube Kids లో పెయిడ్ యాడ్ అంటే ఏమిటి?

ఛార్జీ విధించబడని అనుభవాన్ని పొందడానికి, పరిమిత అడ్వర్టయిజింగ్‌తో యాడ్‌లు గల YouTube Kids చూడండి. మీరు యాప్‌లో YouTube వీడియోను ఎంచుకున్నప్పుడు, మీరు ఎంచుకున్న వీడియోకు ముందు- ఒక యాడ్ బంపర్, తర్వాత "యాడ్" నిరాకరణతో మార్క్ చేయబడిన ఒక వీడియో యాడ్ మీకు కనిపించవచ్చు. ఇవి పెయిడ్ అడ్వర్టయిజ్‌మెంట్‌లు ("పెయిడ్ యాడ్స్").

యూజర్‌లు వారి ఛానెల్‌లకు అప్‌లోడ్ చేసిన కంటెంట్ పెయిడ్ యాడ్స్‌గా పరిగణించబడదు. ఉదాహరణకు, రైళ్ల కోసం సెర్చ్ చేసినప్పుడు, యూజర్ ద్వారా లేదా టాయ్ రైలు కంపెనీ ద్వారా అప్‌లోడ్ చేయబడిన TV ప్రకటన కనిపించవచ్చు, అవి ఏవీ పెయిడ్ యాడ్స్ కావు. అదే విధంగా, మేము చాక్లెట్‌ల కోసం పెయిడ్ యాడ్స్‌ను అనుమతించకపోయినప్పటికీ, "చాక్లెట్" కోసం సెర్చ్ చేస్తే చాక్లెట్ ఫడ్జ్ తయారీలో యూజర్ అప్‌లోడ్ చేసిన వీడియో కనిపించవచ్చు.

యాడ్ ఫార్మాట్ అవసరాలు

  • ఫార్మాట్: ఈ సమయంలో మేము YouTube Kidsలోని ఇన్-స్ట్రీమ్ వీడియో యాడ్ ఫార్మాట్‌ను మాత్రమే అంగీకరిస్తాము.
  • గరిష్ఠ సమయ నిడివి: స్కిప్ చేయలేని వాటి కోసం 15-20 సెకన్ల నిడివి (వీక్షకుని నివాసం ఎక్కడ అనేదానిపై ఆధారపడి ఉంటుంది), స్కిప్ చేయగలిగే వాటి కోసం 60 సెకన్లు (మార్కెట్ ఆధారంగా పొడవు మారవచ్చు). ఇది పెయిడ్ యాడ్‌కు ముందు ప్లే అయ్యే 3 సెకన్ల యాడ్ బంపర్‌ని మినహాయిస్తుంది.
  • గమ్యస్థాన URLలు: గమ్యస్థాన URLలు, అవుట్‌బౌండ్ లింక్‌లు (కాల్-టు-యాక్షన్ ఓవర్‌లేలు, సమాచార కార్డ్‌లతో సహా) యాప్ నుండి డిజేబుల్ చేయడ్డాయి. YouTube Kids లోని యాడ్‌లు క్లిక్ చేయబడవు.
  • సైట్ అందించినవి: అన్ని పెయిడ్ యాడ్స్ తప్పనిసరిగా YouTube లో హోస్ట్ చేయాలి. థర్డ్-పార్టీ అందించే యాడ్‌లు నిషేధించబడ్డాయి.

యాడ్ టార్గెటింగ్, డేటా సేకరణ

  • మేము YouTube Kids లో ఆసక్తి ఆధారిత అడ్వర్టయిజింగ్‌ను నిషేధిస్తాము.
  • రీమార్కెటింగ్ లేదా ఇతర ట్రాకింగ్ పిక్సెల్స్‌తో ఉన్న పెయిడ్ యాడ్స్ నిషేధించబడ్డాయి.

పరిమితం చేయబడిన ప్రోడక్ట్ కేటగిరీలు

కింది ప్రోడక్ట్‌ల కోసం పెయిడ్ యాడ్స్ YouTube Kidsలో నిషేధించబడ్డాయి.

వయోపరిమితి అవసరమైన మీడియా కంటెంట్

13 ఏళ్లలోపు యూజర్‌లకు చూపించడానికి వివాదాస్పదంగా ఉండే మీడియా నిషేధించబడింది. MPAA ద్వారా ‘PG’ కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న సినిమాల అడ్వర్టయిజ్‌మెంట్‌లు, TV పేరెంటల్ గైడ్‌లైన్స్ ద్వారా ‘G’ కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న టెలివిజన్ షోలు ఉదాహరణలు.

అందం, ఫిట్‌నెస్

బాహ్య వ్యక్తిగత సంరక్షణ, ఫిట్‌నెస్, వ్యాయామం, బరువు తగ్గడం, ఆహారం, పోషణకు సంబంధించిన ప్రోడక్ట్‌లు నిషేధించబడ్డాయి.

డేటింగ్ లేదా రిలేషన్‌షిప్

డేటింగ్ సైట్‌లు, ఫ్యామిలీ కౌన్సెలింగ్, వైవాహిక లేదా విడాకుల సర్వీస్‌లకు పెయిడ్ యాడ్స్ నిషేధించబడ్డాయి.

ఆహారం, పానీయాలు

పోషకాహార కంటెంట్‌తో సంబంధం లేకుండా తినదగిన ఆహారం, పానీయాలకు సంబంధించిన ప్రోడక్ట్‌లు నిషేధించబడ్డాయి.

అక్రమమైన, నిషిద్ధ ప్రోడక్ట్‌లు

నిషేధిత కంటెంట్, నియంత్రించబడే కంటెంట్‌తో సహా పిల్లలకు అడ్వర్టయిజ్ చేయడానికి నియంత్రించబడే లేదా చట్టవిరుద్ధమైన ప్రోడక్ట్‌లు నిషేధించబడ్డాయి. ఇది పిల్లలకు భద్రతా ప్రమాదాలను కలిగించే ప్రోడక్ట్‌లను కూడా కలిగి ఉంటుంది.

ఆన్‌లైన్ లేదా వర్చువల్ కమ్యూనిటీలు

సభ్యులు ప్రధానంగా ఇంటర్నెట్‌లో ఇంటరాక్ట్ అయ్యే వర్చువల్ కమ్యూనిటీలకు సంబంధించిన ప్లాట్‌ఫామ్‌లు, సర్వీస్‌లు నిషేధించబడ్డాయి.

రాజకీయ యాడ్‌లు

రాజకీయ అభ్యర్థులు లేదా వారి పాలసీ స్థానాలు, రాజకీయ పార్టీలు, నిధుల సేకరణ లేదా రాజకీయ కార్యాచరణ కమిటీలు లేదా వారి ఎజెండాల గురించి సమాచారం సహా ఏదైనా రాజకీయ పెయిడ్ యాడ్స్ నిషేధించబడ్డాయి.

మతసంబంధ యాడ్‌లు

అన్ని రకాల మతసంబంధ పెయిడ్ యాడ్స్ నిషేధించబడ్డాయి.

వీడియో గేమ్‌లు

వీడియో గేమ్ కన్సోల్, కంప్యూటర్, లేదా సెల్ ఫోన్ లేదా టాబ్లెట్ వంటి మరొక ఎలక్ట్రానిక్ పరికరంలో ప్లే చేయబడే ఎలక్ట్రానిక్ వీడియో గేమ్‌లు (సంబంధిత యాక్సెసరీలు) నిషేధించబడ్డాయి, ఈ గేమ్ యొక్క పరిశ్రమ రేటింగ్ 12 సంవత్సరాలు లేదా దాని కంటే తక్కువ వయసు ఉన్న ప్రేక్షకులకు సరిపోదు. ఉదాహరణకు, IARC ప్రకారం ESRB E10+, PEGI 7, లేదా ఏదైనా సమానమైన స్థానిక పరిశ్రమ రేటింగ్ వరకు అనుమతించబడతాయి. పజిల్స్, వర్క్‌షీట్‌లు, గణిత సమస్యలు, భాషా అభ్యాస వ్యాయామాలు వంటి ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కంటెంట్‌తో యాప్‌లు లేదా వెబ్ కంటెంట్ అనుమతించబడతాయి.

నిషేధించబడిన కంటెంట్ గైడ్‌లైన్స్

కింది కంటెంట్‌లో ఏదైనా ఫీచర్ లేదా ప్రమోట్ చేసే పెయిడ్ యాడ్స్ ఖచ్చితంగా నిషేధించబడ్డాయి.

పెద్దవారి కోసం ఉద్దేశించిన, లైంగిక కంటెంట్

ప్రేక్షకులలో పెద్దవారి కోసం ఉద్దేశించిన లైంగిక, పెద్దలు మాత్రమే చూడగలిగిన కంటెంట్, 13 ఏళ్లలోపు యూజర్‌లకు తగినది కాదు.

బ్రాండింగ్

పెయిడ్ యాడ్స్ అడ్వర్టయిజర్, మరియు/లేదా వీడియోలో మార్కెట్ చేయబడిని ప్రోడక్ట్ ద్వారా స్పష్టంగా బ్రాండ్ చేయబడాలి. ఇది యాడ్ అని, సాధారణ YouTube కంటెంట్ కాదని యూజర్‌కి తెలిసేలా పెయిడ్ యాడ్ అనేది విలక్షణంగా ఉండాలి.

పోటీలు

పోటీలు లేదా స్వీప్‌స్టేక్స్ అనేవి ప్రవేశించడానికి ఉచితం అయినప్పటికీ అవి ప్రమోషన్‌లు.

హానికరమైన కంటెంట్

13 ఏళ్లలోపు యూజర్‌లకు ప్రమాదకరమైన, అనుచితమైన కంటెంట్ లేదా సాధారణంగా పెద్దల పర్యవేక్షణ అవసరం అయ్యే కంటెంట్.

కొనుగోలుకు ప్రేరణ

ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను కొనుగోలు చేయడానికి పిల్లలను ప్రేరేపించే, లేదా తల్లిదండ్రులను లేదా ఇతరులను ఆ ఐటెమ్ కొనమని కోరే ప్రమోషన్లు లేదా కంటెంట్.

తప్పుదారి పట్టించే, ఖచ్చితంగా లేని క్లెయిమ్‌లు
  • చిన్నారులను తప్పుదోవ పట్టించేలా, మోసపూరితమైన మరియు/లేదా ఆధారాలు లేని క్లెయిమ్‌లను చేసేలా పెయిడ్ యాడ్స్ ఉండకూడదు. అన్ని క్లెయిమ్‌లు, వాదనలు వీడియోలోనే నిరూపించబడాలి.
  • ప్రోడక్ట్ మీ సోషల్ స్టేటస్‌ను మెరుగుపరుస్తుందని పెయిడ్ యాడ్స్ సూచించలేవు.
  • పని చేయని ఫీచర్‌లు గానీ లేదా పని చేయని లేదా కావలసిన చోట చర్యను పూర్తి చేయలేని కాల్-టు-యాక్షన్‌లు గానీ పెయిడ్ యాడ్స్‌లో చేర్చబడవు.
హింసాత్మక కంటెంట్

ప్రేక్షకులలో పెద్దవారి కోసం ఉద్దేశించిన హింసాత్మకమైన అలాగే స్పష్టంగా చూపే కంటెంట్ అనేది 13 ఏళ్ల లోపు యూజర్‌లకు తగినది కాదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13614050245946748346
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false