YouTube మొబైల్ యాప్‌నకు యాక్సెసిబిలిటీ

YouTube Android యాప్, Androidకు చెందిన యాక్సెసిబిలిటీ ఫీచర్‌లను సపోర్ట్ చేస్తుంది. TalkBackతో పాటు ప్రత్యేకమైన యాక్సెసిబిలిటీ ఫీచర్‌లతో చూపు లేని యూజర్‌లకు, దృష్టి లోపం ఉన్న యూజర్‌లకు Android యాక్సెసిబిలిటీ సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ సెట్టింగ్‌లను ఎలా ఆన్ చేయాలి అనే అంశంతో పాటు, మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి Android యాక్సెసిబిలిటీ సహాయ కేంద్రానికి వెళ్లండి.

 

ప్రారంభించడం
మీ Android యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లను మీరు ఆన్ చేసిన తర్వాత, TalkBack, 'తాకడం ద్వారా పరిశీలించడం' వంటి ఫీచర్‌లు YouTube యాప్‌లోని కంటెంట్‌ను, ఎలిమెంట్‌లను అన్వేషించడంలో మీకు సహాయపడగలవు. ఈ ఫీచర్‌ల గురించి మరింత సమాచారం కోసం, తాకడం ద్వారా పరిశీలించడం ఫీచర్ సూచనలను చూడండి.
యాప్‌ను అన్వేషించండి

యాప్‌లోని ప్రధాన ట్యాబ్‌లు, మొదటి ట్యాబ్, సబ్‌స్క్రిప్షన్‌లు, లైబ్రరీ. సబ్‌స్క్రిప్షన్‌ల ట్యాబ్‌ను చూడటానికి మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

  • మొదటి ట్యాబ్ , సిఫార్సు చేయబడిన వీడియోలను బ్రౌజ్ చేసే వీలు మీకు కల్పిస్తుంది.
  • సబ్‌స్క్రిప్షన్‌ల ట్యాబ్ , మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ఛానెల్స్‌లోని వీడియోలను కనుగొనే వీలు మీకు కల్పిస్తుంది.
  • లైబ్రరీ లో మీ వీక్షణ హిస్టరీ, అప్‌లోడ్‌లు, కొనుగోళ్లు, ప్లేలిస్ట్‌లు ఉంటాయి.

యాప్‌నకు ఎగువున ఉండే ప్రొఫైల్ ఫోటో  మీ సెట్టింగ్‌లకు, Google గోప్యతా పాలసీకి, సహాయానికి, ఇంకా సైన్ ఇన్‌కు మీకు యాక్సెస్‌ను అందిస్తుంది.

ఈ కింద అందించిన దశలను ఫాలో అయి, మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి:

  1. యాప్‌నకు ఎగువున, మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  2. సైన్ ఇన్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఈ కింద అందించిన దశలను ఫాలో అయి, మీ ఖాతా నుండి సైన్ అవుట్ చేయండి:

  1. యాప్‌నకు ఎగువున, మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి .
  2. సైన్ అవుట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
వీడియోలను, ప్లేలిస్ట్‌లను బ్రౌజ్ చేయండి

మొదటి ట్యాబ్ లోని, ప్లేలిస్ట్‌లలోని, లేదా ఏదైనా ఛానెల్‌లోని వీడియోలను స్క్రోల్ చేయడానికి ఒక వేలిని ఉపయోగించండి. మీరు స్క్రోల్ చేసేటప్పుడు, వీడియో పేరుతో పాటు లింక్ చేయబడిన మెటాడేటా మీకు వినిపిస్తుంది.

ఛానెల్స్: మీరు ఎంచుకున్న ఛానెల్‌లోని కంటెంట్‌ను బ్రౌజ్ చేయడానికి, సదరు ఛానెల్‌లోని మొదటి ట్యాబ్, వీడియోలు, ప్లేలిస్ట్‌ల ట్యాబ్‌లను ఉపయోగించండి.

వీడియోలు, ప్లేలిస్ట్‌ల కోసం సెర్చ్ చేయండి

'తాకడం ద్వారా పరిశీలించడం' ఫీచర్‌ను ఉపయోగించి ఏదైనా వీడియో కోసం సెర్చ్ చేయడానికి, స్క్రీన్ ఎగువ భాగాన్ని ట్యాప్ చేసి, 'సెర్చ్ చేయండి' బటన్‌ను కనుగొనండి. ఈ బటన్ "మరిన్ని ఆప్షన్‌ల" ఎలిమెంట్‌కు పక్కన ఉంటుంది.

  1. సెర్చ్ బటన్‌ను డబుల్-ట్యాప్ చేసి, "ఎడిట్ బాక్స్"కు మీ సెర్చ్‌ను జోడించండి.
  2. సెర్చ్ ఫలితాలను బ్రౌజ్ చేయడానికి, 'తాకడం ద్వారా పరిశీలించడం' ఫీచర్‌ను ఉపయోగించండి.
వీడియోలను ప్లే చేయండి, కంట్రోల్ చేయండి

ప్లే చేయడానికి మీరు వీడియోను కనుగొన్న తర్వాత, ప్లేబ్యాక్‌ను ప్రారంభించడానికి డబుల్-ట్యాప్ చేయండి. ప్లేయర్ కంట్రోల్స్‌ను తెరవడానికి, స్క్రీన్ ఎగువ భాగంలో ఉండే "ప్లేయర్"ను డబుల్-ట్యాప్ చేయండి.

ప్లేయర్ కంట్రోల్స్, ఆప్షన్‌లు

పాజ్ చేయడం: వీడియోను పాజ్ చేయడానికి, "వీడియోను పాజ్ చేయండి" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.

వీడియోను మినిమైజ్ చేయడం: ప్లేబ్యాక్ సమయంలో వీడియోను మినిమైజ్ చేయడానికి "మినిమైజ్ చేయండి" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి. వీడియో మినిమైజ్ అయి ఉన్నప్పుడు, అది ప్లే అవుతూనే ఉంటుంది, మీరు బ్రౌజ్ చేయడం లేదా సెర్చ్ చేయడం కొనసాగించవచ్చు.  

మినిమైజ్ చేయబడిన వీడియోను విస్మరించడం: మినిమైజ్ చేయబడిన వీడియో ప్లేయర్‌ను విస్మరించడానికి, కుడి వైపున ఉండే "మినీ-ప్లేయర్‌ను మూసివేయండి" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.

మినిమైజ్ చేయబడిన వీడియోను విస్తరించడం: మినిమైజ్ చేయబడిన వీడియో ప్లేయర్‌ను విస్తరించడానికి, "ప్లేయర్" బటన్‌ను డబుల్-ట్యాప్ చేసి, రెండు వేళ్లను ఉపయోగించి పైకి స్వైప్ చేయండి.

ప్లేలిస్ట్‌కు జోడించడం: "ఈ ప్లేలిస్ట్‌కు వీడియోను సేవ్ చేయండి" అలర్ట్‌ను తెరవడానికి, "ప్లేలిస్ట్‌కు వీడియోను సేవ్ చేయండి" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి. ప్లేలిస్ట్‌ను ఎంచుకోవడానికి, 'తాకడం ద్వారా పరిశీలించడం' ఫీచర్‌ను ఉపయోగించండి. ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయడానికి, "కొత్త ప్లేలిస్ట్" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.

  • మీ ప్లేలిస్ట్‌కు పేరు పెట్టడానికి, "టైటిల్ - ఎడిట్ బాక్స్" ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • మీ ప్లేలిస్ట్‌ను ప్రైవేట్‌కు, పబ్లిక్‌కు, లేదా అన్‌లిస్టెడ్‌కు సెట్ చేయడానికి, "డ్రాప్-డౌన్ లిస్ట్ - ప్రైవేట్" ఆప్షన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.

మరిన్ని ఆప్షన్‌లు: ఈ ఆప్షన్‌లను కనుగొనడానికి, ఎగువ కుడి వైపున ఉండే "మరిన్ని ఆప్షన్‌ల" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.

  • వీడియో క్వాలిటీని మార్చడం: "క్వాలిటీ" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  • వీడియోను రిపోర్ట్ చేయడం: "రిపోర్ట్ చేయండి" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  • క్యాప్షన్‌లు: "క్యాప్షన్‌ల" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.

వీడియో దిగువున, మీకు ఈ కింద పేర్కొన్న సమాచారం లేదా ఫీచర్‌లు కనిపిస్తాయి:

  • వీడియో వివరణ, మెటాడేటా.
  • లైక్, డిస్‌లైక్ బటన్‌లు.
  • ఛానెల్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి బటన్.
  • వీడియో సూచనలు.
  • కామెంట్‌ను జోడించడానికి ఒక ఆప్షన్.
  • వీడియో గురించి కామెంట్‌లు.
అప్‌లోడ్‌లు

మీ YouTube వీడియో అప్‌లోడ్‌లకు వెళ్లడానికి, లైబ్రరీ ని తెరిచి మీ వీడియోల ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ ఛానెల్‌కు మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలను స్క్రోల్ చేయడానికి ఒక వేలిని ఉపయోగించండి.

వీడియోను అప్‌లోడ్ చేయండి

  1. స్క్రీన్‌కు దిగువున, "క్రియేట్ చేయండి" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  2. స్క్రీన్‌కు ఎగువున, "లైవ్ స్ట్రీమ్‌ను ప్రారంభించండి"కి పక్కన ఉండే, "వీడియోను అప్‌లోడ్ చేయండి" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  3. అప్‌లోడ్ చేసేందుకు వీడియోను కనుగొనడానికి, మీ పరికరంలోని ఫోటో గ్యాలరీలో స్క్రోల్ చేయండి. ఏదైనా వీడియోను ఎంచుకోవడానికి డబుల్-ట్యాప్ చేయండి.
  4. "టైటిల్‌ను క్రియేట్ చేయండి" ఎడిట్ బాక్స్‌లో మీ వీడియోకు టైటిల్‌ను ఎంటర్ చేయండి.
  5. "వివరణను జోడించండి" ఎడిట్ బాక్స్‌లో వీడియోకు వివరణను ఎంటర్ చేయండి.
  6. "గోప్యత" డ్రాప్-డౌన్ లిస్ట్ నుండి ఒక గోప్యతా స్థాయిని (ప్రైవేట్, అన్‌లిస్టెడ్, లేదా పబ్లిక్) ఎంచుకోండి.
  7. స్క్రీన్‌కు ఎగువ కుడి మూలన, "తర్వాత" ఆప్షన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  8. స్క్రీన్ మధ్య భాగంలో, సదరు వీడియో "పిల్లల కోసం రూపొందించబడిందా, లేదా" అనే దానికి సంబంధించి, తగిన ఆప్షన్‌ను ఎంచుకోండి.
  9. స్క్రీన్‌కు ఎగువ కుడి మూలన, "అప్‌లోడ్ చేయండి" ఆప్షన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.

వీడియోను ఎడిట్ చేయండి

వీడియో టైటిల్‌ను, వివరణను లేదా గోప్యతా సెట్టింగ్‌లను ఎడిట్ చేయడానికి:

  1. మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలను స్క్రోల్ చేయడానికి రెండు వేళ్లను ఉపయోగించండి.
  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోకు పక్కన ఉండే "చర్యల మెనూ" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  3. వీడియోకు చెందిన "అలర్ట్" బాక్స్‌లోని "ఎడిట్ చేయండి" ఆప్షన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  4. టైటిల్ లేదా వివరణ ఎడిట్ బాక్స్‌లను, లేదా "గోప్యత" డ్రాప్-డౌన్ లిస్ట్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  5. మీరు ఎడిట్ చేయడం పూర్తి అయ్యాక, ఎగువ కుడి మూలన ఉండే "సేవ్ చేయండి" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.

వీడియోను తొలగించండి

మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలలో ఒక దాన్ని తొలగించడానికి:

  1. మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలను స్క్రోల్ చేయడానికి రెండు వేళ్లను ఉపయోగించండి.
  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోకు పక్కన ఉండే "చర్యల మెనూ" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  3. వీడియోకు చెందిన "అలర్ట్" బాక్స్‌లోని "తొలగించండి" ఆప్షన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.
  4. "ఈ వీడియోను తొలగించండి" అని అడిగినప్పుడు, కుడి వైపున ఉండే "తొలగించండి" బటన్‌ను డబుల్-ట్యాప్ చేయండి.

యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌ను ఆన్/ఆఫ్ చేయండి

మీకు వీడియో ప్లేయర్‌లో X చిహ్నం కనిపిస్తున్నట్లయితే, మీ పరికరంలో యాక్సెసిబిలిటీ సెట్టింగ్ ఆన్‌లో ఉందని అర్థం. మీ Android పరికరంలో కానీ లేదా YouTube యాప్‌లో కానీ ఈ యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌ను మీరు ఆఫ్ చేయవచ్చు.
మీ Android పరికరంలో:
  1. మీ Android పరికరంలోని సెట్టింగ్‌లు కు వెళ్లండి .
  2. యాక్సెసిబిలిటీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సంబంధిత యాక్సెసిబిలిటీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. ఆఫ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ YouTube యాప్‌లో:

  1. యాప్‌నకు ఎగువున, మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి .
  2. సెట్టింగ్‌లు ను ఎంచుకోండి .
  3. యాక్సెసిబిలిటీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు Android పరికర స్థాయి సెట్టింగ్‌ను ఓవర్‌రైడ్ చేయాలనుకుంటే, "యాక్సెసిబిలిటీ ప్లేయర్"ను ఆఫ్ చేయండి.
  5. X సెకన్ల తర్వాత ఆటోమేటిక్‌గా వీడియో ప్లేయర్ కంట్రోల్స్ దాగేలా, మీరు టైమర్‌ను కూడా సెట్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17247249569479934663
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false