YouTubeలో అప్‌లోడ్‌లలోని ఆడియో లేదా వీడియో సమస్యలను పరిష్కరించండి

మీరు చేసిన అప్‌లోడ్‌లో మీకు ఆడియో లేదా వీడియో సమస్యలు ఎదురవుతుంటే, వాటిని పరిష్కరించడానికి ఈ పరిష్కార ప్రక్రియ దశలను ట్రై చేయండి.

ఆడియో సమస్యలు

ఆడియో, అలాగే వీడియో సింక్ అవ్వడం లేదు

మీ ఆడియో ట్రాక్ వ్యవధి ఎంత ఉందో, వీడియో ట్రాక్ వ్యవధి కూడా అంతే ఉందని నిర్ధారించుకోండి. మీ వీడియో కన్నా మీ ఆడియో ట్రాక్ చిన్నగా గానీ లేదా పెద్దగా గానీ ఉంటే, మీ ఆడియో, అలాగే వీడియో సరిగ్గా సింక్ అవ్వకపోవచ్చు.

మీ ఆడియో, వీడియో ట్రాక్‌లను ఎడిట్ చేయడానికి, మీ కంటెంట్‌ను YouTubeలోకి అప్‌లోడ్ చేయడానికి ముందు, ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి.

ఆడియో కంప్యూటర్‌లో ప్లే అవుతోంది, కానీ మొబైల్ పరికరంలో ప్లే అవ్వడం లేదు

మీ వీడియో సౌండ్, కంప్యూటర్‌లో సరిగ్గా ప్లే అవుతూ ఉండి, మొబైల్ పరికరంలో సరిగ్గా ప్లే అవ్వకపోతున్నట్లయితే, అందుకు మీ ఆడియోకు సంబంధించిన మోనో అనుకూలత సరిగ్గా లేకపోవడం కారణం కావచ్చు.
ఎక్కువగా వీడియోలలో స్టీరియో ఆడియో ఉంటుంది, అంటే ఎడమ స్పీకర్, అలాగే కుడి స్పీకర్ రెండింటికీ ఆడియో ఉంటుంది (హెడ్‌ఫోన్స్ మాదిరిగా). చాలా మొబైల్ పరికరాలలో ఒకటే స్పీకర్ ఉంటుంది. మీ మొబైల్ పరికరం స్టీరియో ఆడియోను ప్లే చేసేటప్పుడు, మీ వీడియోను ప్లే చేయడానికి ముందు, అది ఆ ఆడియోను మోనో (ఒకటే స్పీకర్) ఆడియోగా మార్చాల్సి ఉంటుంది.
మీ వీడియోలోని ఆడియోకు "మోనో అనుకూలత" సరిగ్గా లేకపోతే, మోనో ఆడియోగా మార్చే ప్రాసెస్ వల్ల ఆడియో క్వాలిటీ తగ్గిపోవచ్చు లేదా ఆడియో మ్యూట్ కావచ్చు. ఎక్కువగా ఈ సమస్య, ఒకే వీడియోలో అనేక ఆడియో రికార్డింగ్‌లను ఉపయోగించినప్పుడు ఎదురవుతూ ఉంటుంది.
మీ ఆడియో "ఫేజ్‌లో" ఉందని నిర్ధారించుకోండి.
ఇతర ఆడియో లేదా వీడియో సమస్యలు

మీ వీడియో సెట్టింగ్‌లను ఎడిట్ చేయడం ద్వారా సాధారణ ఆడియో, ఇంకా వీడియో సమస్యలను పరిష్కరించవచ్చు. మీ వీడియో సెట్టింగ్‌లను రివ్యూ చేసి, మార్చడానికి:

వీడియోను ఒక వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్‌లో తెరవండి

మీ ప్రాసెస్ చేయని వీడియోను తెరవడానికి, కంప్యూటర్‌లో వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించండి. మీ వీడియోను మీరు మొబైల్ పరికరంలో రికార్డ్ చేసినట్లయితే, ఒక మొబైల్ ఎడిటింగ్ యాప్‌ను ఉపయోగించి మీరు ఆ వీడియోను తెరవవచ్చు.

వీడియో సెట్టింగ్‌లను వెరిఫై చేయండి

మీ వీడియో ఎడిటర్‌లో, మీ వీడియో సెట్టింగ్‌లు, మా సిఫార్సు చేయబడిన అప్‌లోడ్ సెట్టింగ్‌లకు మ్యాచ్ అవుతున్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి.

వీడియో సెట్టింగ్‌లు:
  • కుదింపు రకం: H.264
  • ఫ్రేమ్ రేట్: 24, 25, 30, 48, 50, 60 FPS రేట్‌లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సాధారణంగా అంత ఎక్కువగా ఉపయోగించబడని 23.98, 29.97, ఇంకా 59.94 వంటి ఇతర ఫ్రేమ్ రేట్‌లు కూడా ఆమోదయోగ్యమైనవే.
  • డేటా రేట్: ఆటోమేటిక్
  • కీలక ఫ్రేమ్‌లు: ఆటోమేటిక్
  • ఫ్రేమ్‌ల క్రమాన్ని మార్చడం: ఎంపిక తీసివేయబడింది
ఆడియో/సౌండ్ సెట్టింగ్‌లు:
  • ఫార్మాట్: AAC-LC
  • బిట్ రేట్: 128 Kbps - 256 Kbps
  • శాంపిల్ రేట్: 44100 లేదా 48000
ఇతర సెట్టింగ్‌లు:
  • సైజ్: వీడియో ఒరిజినల్ సైజ్‌ను ఎంచుకోండి

సేవ్ చేసి, ఎగుమతి చేయండి

వీడియోలో సిఫార్సు చేయబడిన సెట్టింగ్‌లను వర్తింపజేసిన తర్వాత, వీడియోను YouTubeలోకి మళ్లీ అప్‌లోడ్ చేయండి.

వీడియో సమస్యలు

కొత్త వీడియోను అధిక క్వాలిటీలలో (4K, 1080p) ప్లే చేయడం సాధ్యపడటం లేదు

మీరు ఒక వీడియోను అప్‌లోడ్ చేసినప్పుడు, ముందుగా అది తక్కువ క్వాలిటీలో ప్రాసెస్ చేయబడుతుంది. అప్‌లోడ్ ప్రాసెస్‌ను వేగంగా పూర్తి చేయడంలో ఈ ప్రాసెస్ మీకు సహాయపడుతుంది. 4K లేదా 1080p వంటి అధిక క్వాలిటీలకు ప్రాసెస్ అవ్వడానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు, అనేక గంటల పాటు మీ వీడియోలో అధిక క్వాలిటీలను మిస్ అయినట్లు అనిపించవచ్చు.

మీ కొత్త అప్‌లోడ్‌లు అన్ని క్వాలిటీలలో అందుబాటులో ఉండాలని మీరు అనుకుంటున్నట్లయితే, ముందు మీ వీడియోను అన్‌లిస్టెడ్‌గా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. అన్ని క్వాలిటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, మీ వీడియోను మీరు పబ్లిక్‌గా సెట్ చేయవచ్చు. కొత్త అప్‌లోడ్‌లకు సంబంధించిన వీడియో క్వాలిటీ గురించి మరింత తెలుసుకోండి.

గమనిక:ప్లాట్‌ఫామ్ పరిమితుల కారణంగా, 4K వంటి అధిక క్వాలిటీలు, నిర్దిష్ట పరికరాలలో లేదా బ్రౌజర్‌లలో అందుబాటులో ఉండకపోవచ్చు.

రంగులు సరిగ్గా ప్రదర్శించబడటం లేదు

రంగులు సరైన విధంగా ప్రదర్శించబడకపోతే, మీ వీడియో బదిలీ లక్షణాలు, కలర్ ప్రైమరీలు, ఇంకా కలర్ మ్యాట్రిక్స్ కోఎఫీషియంట్ మెటాడేటా, మీ వీడియో మాస్టర్ చేయబడిన విధానానికి మ్యాచ్ అవుతున్నాయని నిర్ధారించుకోండి.

ఇప్పటికీ రంగులు సరిగ్గా రెండర్ అవ్వకపోతే, అందుకు కారణం మీ బ్రౌజర్ లేదా పరికరం కావచ్చు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, మీ ఒరిజినల్ వీడియోను, అలాగే మీరు YouTubeలో చేసిన అప్‌లోడ్‌ను ఇతర బ్రౌజర్‌లలో పరీక్షించండి.

ఇతర ఆడియో లేదా వీడియో సమస్యలు

మీ వీడియో సెట్టింగ్‌లను ఎడిట్ చేయడం ద్వారా సాధారణ ఆడియో, ఇంకా వీడియో సమస్యలను పరిష్కరించవచ్చు. మీ వీడియో సెట్టింగ్‌లను రివ్యూ చేసి, మార్చడానికి:

వీడియోను ఒక వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్‌లో తెరవండి

మీ ప్రాసెస్ చేయని వీడియోను తెరవడానికి, కంప్యూటర్‌లో వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించండి. మీ వీడియోను మీరు మొబైల్ పరికరంలో రికార్డ్ చేసినట్లయితే, ఒక మొబైల్ ఎడిటింగ్ యాప్‌ను ఉపయోగించి మీరు ఆ వీడియోను తెరవవచ్చు.

వీడియో సెట్టింగ్‌లను వెరిఫై చేయండి

మీ వీడియో ఎడిటర్‌లో, మీ వీడియో సెట్టింగ్‌లు, మా సిఫార్సు చేయబడిన అప్‌లోడ్ సెట్టింగ్‌లకు మ్యాచ్ అవుతున్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి.

వీడియో సెట్టింగ్‌లు:
  • కుదింపు రకం: H.264
  • ఫ్రేమ్ రేట్: 24, 25, 30, 48, 50, 60 FPS రేట్‌లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సాధారణంగా అంత ఎక్కువగా ఉపయోగించబడని 23.98, 29.97, ఇంకా 59.94 వంటి ఇతర ఫ్రేమ్ రేట్‌లు కూడా ఆమోదయోగ్యమైనవే.
  • డేటా రేట్: ఆటోమేటిక్
  • కీలక ఫ్రేమ్‌లు: ఆటోమేటిక్
  • ఫ్రేమ్‌ల క్రమాన్ని మార్చడం: ఎంపిక తీసివేయబడింది
ఆడియో/సౌండ్ సెట్టింగ్‌లు:
  • ఫార్మాట్: AAC-LC
  • బిట్ రేట్: 128 Kbps - 256 Kbps
  • శాంపిల్ రేట్: 44100 లేదా 48000
ఇతర సెట్టింగ్‌లు:
  • సైజ్: వీడియో ఒరిజినల్ సైజ్‌ను ఎంచుకోండి

సేవ్ చేసి, ఎగుమతి చేయండి

వీడియోలో సిఫార్సు చేయబడిన సెట్టింగ్‌లను వర్తింపజేసిన తర్వాత, వీడియోను YouTubeలోకి మళ్లీ అప్‌లోడ్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9644834887151978101
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false